23-8-2022 (మంగళవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“సింహమే తల్లి సతి తేలు చేప సఖుఁడు”(లేదా...)“సింహము తల్లి తేలు సతి చేఁపలు మిత్రులు పీత చెల్లెలౌ”
ఉ.మేలిపసిండి మించు మిసిమింగల రాజనరేంద్రు దొడ్డయి ల్లాలిలనెండమావి సుఖలాలస యంచును మావిపండు,స ద్బాలకునొందఁగుంకుమము,భారపయోధరశోభనాంగియై యా లికుచంబుఁగోసితినె నాపతిదేవుడు మోదమందగన్. (నిండుచూలాలైన రాజనరేంద్రుని పట్టమహిషి రత్నాంగి ప్రాణేశుడు ముదమొందునట్లు పండువంటి బిడ్డ పుట్టుటకు వేవిళ్ళను తీర్చుకొను సన్నివేశము. ) ....చంద్రమౌళి రామారావు, బాపట్ల.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
జింక రూపమందునగల చిత్రరేఖగర్భమందున జనియించె నర్భకుడగుఋష్యశృంగునకు కనగ రిక్తమందు సింహమే తల్లి సతి తేలు చేప సఖుఁడు.
భూత దయ గల వానికి పుడమి నుండు సింహమే తల్లి సతి తేలు చేప సఖుఁడు క్రూర మృగములు సహితము గోరుఁ బ్రేమ ముక్తి గలుగును దయయెడ రక్తి కలుగ
తేటగీతిజాతకపు కుండలిని జూసి చర్చ జేసితెలియ జేసె జోస్యుండంత తెగువ తోడ ,యింటి పెద్దతో వినుమునె, యింటిలోనసింహమే తల్లి, సతి తేలు, చేప సఖుఁడు.ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటర్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
క్రూర మృగములు. వసియించు కూడి యుండియాశ్ర మంబున. నొకటి యై యాడు చుండునట్టి వాటిని కాంచగా తట్టు మనకుసింహమే తల్లి సతి తేలు చేప సఖుడు
సింహబలుండటంచు నొక చిత్రము తీసెను దర్శకుండు నర్సింహుడు దానిలో శిశువు రిక్తము నందున పెర్గుచుండగా సింహము సాకగా నడవి జీవులు ప్రేమను పంచ వానికిన్ సింహము తల్లి తేలు సతి చేఁపలు మిత్రులు పీత చెల్లెలౌ.
పదుగురెరిగిన జ్యోతిష పండితుండువార ఫలములు ప్రకటించి వాసికెక్కిరాశి చక్రపు గుర్తుల రసికు డనెనుసింహమే తల్లి సతి తేలు చేప సఖుఁడు
సింహళ దేశ మంత్రియగు షీయబు ఖానులె వింతఁ దోచు నాసింహళ దేశ ప్రాంతమున జిక్కటి సానువు లందు వాసమౌ సింహము లాదిగాఁగలుఁగు సీమను జూచిఁ దలంచె నిట్లుగా సింహము తల్లి తేలు సతి చేఁపలు మిత్రులు పీత చెల్లెలౌ .
తేటగీతిగాత్రదానము సేయఁగ కబురు సేయదర్శకునకైన వారలు తరలి రాగనీతిచంద్రిక పాత్రల రీతిఁ బంచసింహమే తల్లి సతి తేలు చేప సఖుఁడుఉత్పలమాలఅంహము కోర గాత్రముల నందరుఁ గూడిరి సొంతవారలైవంహపు నీతిచంద్రికను పాత్రల నైజము నెంచి విజ్ఞుఁడైరంహమె పంచ దర్శకుడు రాజిల కంఠము లొప్పునట్లుగన్సింహము తల్లి, తేలు సతి, చేఁపలు మిత్రులు, పీత చెల్లెలౌ!అంహము : దానమువంహము : ప్రకాశమురంహము : వేగము
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తేటగీతివ్రాసె జ్యోతిష్కుఁడొక్కఁడు వారఫలముకొన్ని రాశులఁగూర్చియు గొప్పగాను*సింహమే తల్లి,సతి తేలు, చేప సఖుఁడు*మకరమే యక్కయౌ కన్య మరదలనుచు.
నిన్నటి కలలో కనిపించ , నివ్వెరపడివింత గొలుపు జంతువు గూర్చి వినబరచుచుజీవశాస్త్ర విదునడుగ చెప్పె నిటులసింహమే తల్లి సతి తేలు చేప సఖుఁడు
ఉత్పలమాలసింహపురంబునందున ప్రసిద్ధినిఁగాంచిన జ్యోతిషుండ హో!సింహమె యాదిగాగలుగు శ్రేష్ఠతరంబగు రాశులెన్నగా*సింహము తల్లి,తేలు సతి,చేపలు మిత్రులు,పీత చెల్లెలౌఓంహనుమా!ధనుస్సు పిత,యొద్దిక కన్యయె యక్కయౌననెన్.
తల్లి గయ్యాళి కలిగించు తల్లడములుభార్య పైచేయి సాధింప పాకులాడుమేలు సలహాలనీయడు మిత్రుడైనసింహమే తల్లి సతి తేలు చేప సఖుఁడు
సింహమువోలె పెత్తనము చేయగజూచును తల్లి గీమునన్సంహితమట్లు కొండెములు సల్పుచునుండును కోడలత్తపైసింహపురంబు వీడి తన చెల్లెలు చేరెను పుట్టినింటికిన్సింహము తల్లి తేలు సతి చేఁపలు మిత్రులు పీత చెల్లెలౌ
మునుల యాశ్రమ మందున ముదముతోడవైర మనుమాటయేలేక ప్రాణులెల్లతిరుగు చుండునెల్లపుడును తీరుగ గనసింహమే తల్లి సతితేలు చేప సఖుడు
ఉ.*“సింహము తల్లి తేలు సతి చేఁపలు మిత్రులు పీత చెల్లెలౌ”*సంహిత, నాయకుండు దయ స్వల్పమునైనను లేనివానిగాసంహరణల్ దురాక్రమణ సాయుధ కృత్యము రాజకీయమున్సంహతలంబు గూర్చుచును సజ్జనులందరు నేడ్చువారలే... డా.. అయ్యలసోమయాజుల సుబ్బారావు.
విష్ణు మాయ నిక్కమ్ముగ విశ్వ మెల్ల ధర ఋణానుబంధమ్ములు తనరు చుండు జనకుఁ డెవ్వఁడు పరికింప జాతుఁ డెవఁడుసింహమే తల్లి సతి తేలు చేప సఖుఁడుబృంహిత సన్నిభమ్ముగను బెద్దగఁ జాటిన రిత్త తల్పఁగానంహతు లౌను దథ్యముగ నారయఁ జుట్టరికమ్ము లెల్లనున్ రంహతి వచ్చి పోవుదురు రాగము లేల ధరాతలమ్మునన్ సింహము తల్లి తేలు సతి చేఁపలు మిత్రులు పీత చెల్లెలౌ
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
పిల్ల సింహములకునెల్ల విశ్వ మందుతండ్రి వృశ్చికమునకును తగిన యట్టి సతతము జలమునందున సంచరించు సింహమే తల్లి,సతి తేలు చేపసఖుడు
తె,గీ.!జన్మజన్మల కర్మల సంచితమునకల్గెనీజన్మ, ప్రారబ్ధ కర్మ ఫలమునన్ కలుగ వచ్చు వేరు జన్మముల మనకుసింహమే తల్లి, సతి తేలు చేప సఖుడుకాకరమురళీధర్ - కాముధ
ఉ.మేలిపసిండి మించు మిసిమింగల రాజనరేంద్రు దొడ్డయి
రిప్లయితొలగించండిల్లాలిలనెండమావి సుఖలాలస యంచును మావిపండు,స ద్బాలకునొందఁగుంకుమము,భారపయోధరశోభనాంగియై
యా లికుచంబుఁగోసితినె నాపతిదేవుడు మోదమందగన్.
(నిండుచూలాలైన రాజనరేంద్రుని పట్టమహిషి రత్నాంగి ప్రాణేశుడు ముదమొందునట్లు పండువంటి బిడ్డ పుట్టుటకు వేవిళ్ళను తీర్చుకొను సన్నివేశము. )
....చంద్రమౌళి రామారావు, బాపట్ల.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిజింక రూపమందునగల చిత్రరేఖ
గర్భమందున జనియించె నర్భకుడగు
ఋష్యశృంగునకు కనగ రిక్తమందు
సింహమే తల్లి సతి తేలు చేప సఖుఁడు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభూత దయ గల వానికి పుడమి నుండు
రిప్లయితొలగించండిసింహమే తల్లి సతి తేలు చేప సఖుఁడు
క్రూర మృగములు సహితము గోరుఁ బ్రేమ
ముక్తి గలుగును దయయెడ రక్తి కలుగ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితేటగీతి
రిప్లయితొలగించండిజాతకపు కుండలిని జూసి చర్చ జేసి
తెలియ జేసె జోస్యుండంత తెగువ తోడ ,
యింటి పెద్దతో వినుమునె, యింటిలోన
సింహమే తల్లి, సతి తేలు, చేప సఖుఁడు.
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిక్రూర మృగములు. వసియించు కూడి యుండి
రిప్లయితొలగించండియాశ్ర మంబున. నొకటి యై యాడు చుండు
నట్టి వాటిని కాంచగా తట్టు మనకు
సింహమే తల్లి సతి తేలు చేప సఖుడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసింహబలుండటంచు నొక చిత్రము తీసెను దర్శకుండు న
రిప్లయితొలగించండిర్సింహుడు దానిలో శిశువు రిక్తము నందున పెర్గుచుండగా
సింహము సాకగా నడవి జీవులు ప్రేమను పంచ వానికిన్
సింహము తల్లి తేలు సతి చేఁపలు మిత్రులు పీత చెల్లెలౌ.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపదుగురెరిగిన జ్యోతిష పండితుండు
రిప్లయితొలగించండివార ఫలములు ప్రకటించి వాసికెక్కి
రాశి చక్రపు గుర్తుల రసికు డనెను
సింహమే తల్లి సతి తేలు చేప సఖుఁడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసింహళ దేశ మంత్రియగు షీయబు ఖానులె వింతఁ దోచు నా
రిప్లయితొలగించండిసింహళ దేశ ప్రాంతమున జిక్కటి సానువు లందు వాసమౌ
సింహము లాదిగాఁగలుఁగు సీమను జూచిఁ దలంచె నిట్లుగా
సింహము తల్లి తేలు సతి చేఁపలు మిత్రులు పీత చెల్లెలౌ .
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితేటగీతి
రిప్లయితొలగించండిగాత్రదానము సేయఁగ కబురు సేయ
దర్శకునకైన వారలు తరలి రాగ
నీతిచంద్రిక పాత్రల రీతిఁ బంచ
సింహమే తల్లి సతి తేలు చేప సఖుఁడు
ఉత్పలమాల
అంహము కోర గాత్రముల నందరుఁ గూడిరి సొంతవారలై
వంహపు నీతిచంద్రికను పాత్రల నైజము నెంచి విజ్ఞుఁడై
రంహమె పంచ దర్శకుడు రాజిల కంఠము లొప్పునట్లుగన్
సింహము తల్లి, తేలు సతి, చేఁపలు మిత్రులు, పీత చెల్లెలౌ!
అంహము : దానము
వంహము : ప్రకాశము
రంహము : వేగము
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండితేటగీతి
రిప్లయితొలగించండివ్రాసె జ్యోతిష్కుఁడొక్కఁడు వారఫలము
కొన్ని రాశులఁగూర్చియు గొప్పగాను
*సింహమే తల్లి,సతి తేలు, చేప సఖుఁడు*
మకరమే యక్కయౌ కన్య మరదలనుచు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినిన్నటి కలలో కనిపించ , నివ్వెరపడి
రిప్లయితొలగించండివింత గొలుపు జంతువు గూర్చి వినబరచుచు
జీవశాస్త్ర విదునడుగ చెప్పె నిటుల
సింహమే తల్లి సతి తేలు చేప సఖుఁడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఉత్పలమాల
రిప్లయితొలగించండిసింహపురంబునందున ప్రసిద్ధినిఁగాంచిన జ్యోతిషుండ హో!
సింహమె యాదిగాగలుగు శ్రేష్ఠతరంబగు రాశులెన్నగా
*సింహము తల్లి,తేలు సతి,చేపలు మిత్రులు,పీత చెల్లెలౌ
ఓంహనుమా!ధనుస్సు పిత,యొద్దిక కన్యయె యక్కయౌననెన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితల్లి గయ్యాళి కలిగించు తల్లడములు
రిప్లయితొలగించండిభార్య పైచేయి సాధింప పాకులాడు
మేలు సలహాలనీయడు మిత్రుడైన
సింహమే తల్లి సతి తేలు చేప సఖుఁడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసింహమువోలె పెత్తనము చేయగజూచును తల్లి గీమునన్
రిప్లయితొలగించండిసంహితమట్లు కొండెములు సల్పుచునుండును కోడలత్తపై
సింహపురంబు వీడి తన చెల్లెలు చేరెను పుట్టినింటికిన్
సింహము తల్లి తేలు సతి చేఁపలు మిత్రులు పీత చెల్లెలౌ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమునుల యాశ్రమ మందున ముదముతోడ
రిప్లయితొలగించండివైర మనుమాటయేలేక ప్రాణులెల్ల
తిరుగు చుండునెల్లపుడును తీరుగ గన
సింహమే తల్లి సతితేలు చేప సఖుడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఉ.
రిప్లయితొలగించండి*“సింహము తల్లి తేలు సతి చేఁపలు మిత్రులు పీత చెల్లెలౌ”*
సంహిత, నాయకుండు దయ స్వల్పమునైనను లేనివానిగా
సంహరణల్ దురాక్రమణ సాయుధ కృత్యము రాజకీయమున్
సంహతలంబు గూర్చుచును సజ్జనులందరు నేడ్చువారలే.
.. డా.. అయ్యలసోమయాజుల సుబ్బారావు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివిష్ణు మాయ నిక్కమ్ముగ విశ్వ మెల్ల
రిప్లయితొలగించండిధర ఋణానుబంధమ్ములు తనరు చుండు
జనకుఁ డెవ్వఁడు పరికింప జాతుఁ డెవఁడు
సింహమే తల్లి సతి తేలు చేప సఖుఁడు
బృంహిత సన్నిభమ్ముగను బెద్దగఁ జాటిన రిత్త తల్పఁగా
నంహతు లౌను దథ్యముగ నారయఁ జుట్టరికమ్ము లెల్లనున్
రంహతి వచ్చి పోవుదురు రాగము లేల ధరాతలమ్మునన్
సింహము తల్లి తేలు సతి చేఁపలు మిత్రులు పీత చెల్లెలౌ
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిపిల్ల సింహములకునెల్ల విశ్వ మందు
రిప్లయితొలగించండితండ్రి వృశ్చికమునకును తగిన యట్టి
సతతము జలమునందున సంచరించు
సింహమే తల్లి,సతి తేలు చేపసఖుడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితె,గీ.!
రిప్లయితొలగించండిజన్మజన్మల కర్మల సంచితమున
కల్గెనీజన్మ, ప్రారబ్ధ కర్మ ఫలము
నన్ కలుగ వచ్చు వేరు జన్మముల మనకు
సింహమే తల్లి, సతి తేలు చేప సఖుడు
కాకరమురళీధర్ - కాముధ