24, ఆగస్టు 2022, బుధవారం

సమస్య - 4172

25-8-2022 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“లయకారుఁడు సేయ సృష్టి లావణ్యంబౌ”
(లేదా...)
“లయకారుం డొనరింప సృష్టినిఁ గడున్ లావణ్యయుక్తం బగున్”

39 కామెంట్‌లు:

 1. 07382563308. భమిడిపాటి కాళిదాసు.
  కం.
  కరమున మధుపాత్రను గొని,
  హరి నామము దల్చి కృష్ణ యమపాశంబై!
  ధరమురియగ కీచక నీ
  మరణమ్మును గోరి వచ్చె మానిని గంటే!!

  రిప్లయితొలగించండి
 2. ±917382563308. భమిడిపాటి కాళిదాసు.
  భరువుని గూర్చి ఘోరముగ భక్తి తపంబును చేయ భస్మునిన్,
  కరణను జూచితానొసగ కాంక్షిత కాంక్షను కాలకాలునిన్,
  వరఫల మెంచిచూతునని వంచన సేయగ బూన రక్కసున్,
  మరణము గోరివచ్చినది మానిని చూడగ ముచ్చటాయెరా!!

  రిప్లయితొలగించండి
 3. లయకారుఁడు సేయ సృష్టి లావణ్యంబౌ
  లయమును సృష్టియు మనుపను లయకారునిదే
  విలయము బాగుల నాయనె
  సలిపెడు సామర్ధ్య యుతుఁడు సైయని యందున్

  రిప్లయితొలగించండి

 4. నయనాయుధుడన నెవ్వడు?
  నియతిగ శలుడేమి జేసె? నెలయల్లుండౌ
  యయుగశరు రూపమెటులన?
  లయకారుఁడు, సేయ సృష్టి, లావణ్యంబౌ.

  రిప్లయితొలగించండి
 5. లయమగు లోకము లన్నియు
  లాయకారుడు సేయ :సృష్టి లావణ్యంబౌ
  నియతిగ జీవించి జనులు
  దయ గల వారుగ మెలగఁగ ధారుణి యందున్

  రిప్లయితొలగించండి
 6. మ.

  వియమంబబ్జజుడే సహస్రకవచున్ స్వేదంబుచే నిల్పగన్
  భయమున్ బొంది శివుండు విష్ణు శరణున్ వాంఛల్ నరుండబ్బగన్
  *"లయకారుం డొనరింప సృష్టినిఁ గడున్ లావణ్యయుక్తం బగున్”*
  దయతోఁ బద్మ పురాణమందు గల వృత్తాంతంబు నిర్మాణమున్.

  రిప్లయితొలగించండి
 7. లయకారుం డొనరింప సృష్టినిఁ గడున్ లావణ్యయుక్తం బగున్
  లయకారుండదె వప్పగించెఁ గద వాలాయంబు గాబ్రహ్మకున్
  లయముంజేయుట శంభుడున్ మనుప యాలక్ష్మీశుగా నాఙ్ఞలన్
  సులభంజేయఁగఁ బంపకాలటులు భాసోమాన వ్యక్తంబుగా.

  రిప్లయితొలగించండి

 8. లయకారుండెవడన్న నీశ్వరుడె సర్వార్థంబు లందింపడే
  ప్రియభక్తాళిని బ్రోచువాడెకదరా భీష్ముండతండేకదా
  దయతో స్కందుని రక్షకోసమనుచున్ తా కృత్తికాలోకమున్
  లయకారుం డొనరింప సృష్టినిఁ గడున్ లావణ్యయుక్తం బగున్.

  రిప్లయితొలగించండి
 9. నయముండదెందు లోనను
  లయకారుఁడు సేయ ; సృష్టి లావణ్యంబౌ
  చెయిదము లన్నిట , దప్పక
  నియమము పాటిం చు చుండు నేర్పర చేతన్

  రిప్లయితొలగించండి
 10. కందము
  అయయో!జగముల నాశము
  *లయకారుఁడు సేయ;సృష్టి లావణ్యంబౌ
  రయమున సేయగ బ్రహ్మయె
  జయమగు స్థితి కల్గఁజేయు చక్రధరుండే.

  మత్తేభము
  అయయో!లోకములెల్ల నొక్కపరిగా నంతంబయే రీతిగన్
  *లయకారుండొనరింప;సృష్టిని గడున్ లావణ్యయుక్తంబుగన్ *
  రయముంజేయడె తమ్మిచూలి,యటుపై రక్షింపగాఁబూనడే
  దయతో విష్ణువు,నా త్రిమూర్తుల సదా ధ్యానించరే భక్తితోన్.

  రిప్లయితొలగించండి
 11. నయమగు తాండవ నృత్యము
  లయకారుఁడు సేయ, సృష్టి లావణ్యంబౌ
  నియమానుసారముగ వి
  శ్వయోని సౌందర్య దృష్టి సారింపంగన్

  రిప్లయితొలగించండి
 12. అయబెట్లుండును లోక
  త్రయముల పాలించువాడు దయగలవాడున్
  నయనానందముగా కువ
  లయకారుఁడు సేయ సృష్టి లావణ్యంబౌ

  రిప్లయితొలగించండి
 13. శంకరాభరణం సమస్య:“లయకారుఁడు సేయ సృష్టి లావణ్యంబౌ”
  పూరణ:
  నయమున నలువయె సృజనము
  అయ గా పోషణ భరమును నా విష్ణుండే
  పయనము చివరన నిహనము
  లయకారుఁడు సేయ సృష్టి లావణ్యంబౌ
  కడయింటికృష్ణమూర్తి...గోవా..25-8-22

  రిప్లయితొలగించండి
 14. ప్రియముగ జీవులనెల్లర
  దయతో రక్షించును హరి, తనకృత్యంబౌ
  లయమొనరించుట నిరతము
  లయకారుఁడు సేయ సృష్టి లావణ్యంబౌ

  రిప్లయితొలగించండి
 15. లయబద్ధముగా నాట్యము
  లయకారుఁడు సేయ, సృష్టి లావణ్యంబౌ”
  నియమానుసారముగవిధి
  స్వయముగ యొనరించుచుండజగములవెల్లన్
  రిప్లయితొలగించండి
 16. మరొక పూరణ

  నయముగ భక్తులనెల్లను
  దయతో రక్షించగ హరి ధరణీతలమున్
  లయకార్యంబును క్రమముగ
  లయకారుఁడు సేయ, సృష్టి లావణ్యంబౌ”  రిప్లయితొలగించండి
 17. కందం
  నియతిన్ దనకా సృష్టి
  క్రియ సహకారమ్మొసంగు ప్రియసతిఁ గమలా
  లయుడెంచి, తమికొనఁగఁ బా
  లయకారుఁడు, సేయ సృష్టి లావణ్యంబౌ!

  మత్తేభవిక్రీడితము
  నియతిన్ దోడొకరుండ మేలనుచుఁ దా నేర్పెంచి సృష్టిక్రియన్
  నయమౌ నైపుణి రంగరించి యరవిందాక్షిన్ బ్రవాళాధరన్
  ప్రియమారన్ సతిఁగాగొనన్ నలువయే, వీక్షింప శ్రీశుండు పా
  లయకారుం డొ, నరింప సృష్టినిఁ గడున్ లావణ్యయుక్తం బగున్!

  రిప్లయితొలగించండి
 18. నయగారపు నగజ సుతుని
  దయలేకయె సంహరించి తదనంతరమున్
  ప్రియమార కుంజరముఖుని
  లయకారుడు సేయసృష్టి లావణ్యంబౌ

  వ్యయమైనట్టి ప్రపంచమున్ మరల నవ్యాజంపు బ్రేమమ్మునన్
  నయగారంబున సృష్టిజేసె నరునిన్ నారీమణిన్
  జంటగా
  హయమున్ సింహము నేన్గులన్ మృగములన్
  హంసాదులన్ పక్షులన్
  స్వయమున్ దానెయె తండ్రియై జనని శ్రీశర్వాణి సాహాయమున్
  లయకారుం డొనరింప సృష్టిని గడున్ లావణ్యయుక్తం బగున్

  రిప్లయితొలగించండి
 19. ప్రియ జనకుఁడు శ్రీనాథుఁ డ
  భయప్రదుఁ డొసంగ మహిమ ప్రావీణ్యముతో
  నియతి నలువ, సమయింపఁగ
  లయకారుఁడు, సేయ సృష్టి లావణ్యంబౌ


  ప్రియ మారంగ సురక్షణం బొసఁగు నా విష్ణుండు లోకవ్రజ
  క్షయకారుండు శివుండు ముక్తి నిడు బ్రచ్ఛన్నుండునై చక్కఁగన్
  దయ వీక్షించి ధరా చ రాచర సమస్త ప్రాణి నిత్యస్థి రా
  లయ కారుం డొనరింప సృష్టినిఁ గడున్ లావణ్య యుక్తం బగున్

  రిప్లయితొలగించండి
 20. ప్రియమున్ కూర్చుచు గౌరి గంగలకు నావిశ్వేశ్వ రుండౌ గదా
  నియతిన్చేయుచు నుండుగా నలువతానీ విశ్వమం దెల్లరన్
  దయతో భక్తజనాళినెల్ల గనుచా దామోద రుండుండగా.
  *లయకారుండొ,నరింప సృష్టిని గడున్ లావణ్య యుక్తంబగున్*

  రిప్లయితొలగించండి
 21. +917382563308. భమిడిపాటి కాళిదాసు.
  కం.
  వ్రాయుచు కర్మఫలంబుల
  పూయుచు సుఖశాంతులవని పుణ్యాత్ములకున్!
  డాయుచు తన భక్తాళుల,
  లయకారుడు సేయు సృష్టి లావణ్యంబౌ!!

  రిప్లయితొలగించండి

 22. +917382563308. భమిడిపాటి కాళిదాసు.

  క్రియయున్ గర్తయు కర్మలెవ్వరనినన్ కేదార నాథుండెగా,
  నయమున్ పెంపును నాశనంబు లెనగా నాగాంతకున్ లీలలే!
  జయహానంబులు సత్ఫలంబులవనిన్ సర్వేశు సత్క్రీడలే,
  లయకారుండొనరింప సృష్టిని గఁడున్ లావణ్య యుక్తంబుగన్!!

  రిప్లయితొలగించండి
 23. భయ భీతిన్ సహజంబుగా గలుగులే బాధల్ భువీబుట్టుకన్
  పయనంబే జరుగున్ సదా నొసట యా పద్మోద్భవున్ రేఖలన్
  నయగారంబున పద్ధతిన్ హరియు నీ-నా లేక పోషించులే
  ప్రియమారంగను మూడుమూర్తులు బహున్ బ్రీతిన్ గనంగా పరన్
  లయకారుండొనరింప, సృష్టినిఁ గడున్ లావణ్యయుక్తంబగున్!!

  రిప్లయితొలగించండి
 24. +917382563308. భమిడిపాటి కాళిదాసు.
  కం.
  నవవరుడా వధువునుగని,
  జవరాలా! రమ్మిటంచు సైగను సేయన్!
  శివశివ తెలవారెనుగద,
  రవి కనువిప్పెడి తఱినిటు రమ్మన దగునా!!

  రిప్లయితొలగించండి
 25. +917382563308. భమిడిపాటి కాళిదాసు.

  శశిధరుడా విధాతయును సాచియు నచ్యుతు డెల్ల వేల్పులున్!
  వశులుగనుండి గాచెగద బాలకుఁ గశ్యపు నందనాత్మజున్!
  నశము శరీరమంచతడు నమ్మెను శ్రీహరి పాదపద్మముల్!
  శిశువు కరంబునం గలవు చిత్రముగా శతకోటి యేనుగుల్!!

  రిప్లయితొలగించండి