26, ఆగస్టు 2022, శుక్రవారం

సమస్య - 4174

27-8-2022 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శిశువు కరమున శతకోటి చేరెఁ గరులు”
(లేదా...)
“శిశువు కరంబునం గలవు చిత్రముగా శతకోటి యేనుఁగుల్”

21 కామెంట్‌లు:

 1. "బిడ్డ హస్తమున"కు వేరు పేరు తెలుపు

  "వంద కోట్లు చేరె"కు వేరు పదము పలుకు

  మేదియొ సమమగు పదము యేనుగులకు,

  శిశువు కరమున,శతకోటి చేరె,గరులు

  రిప్లయితొలగించండి
 2. సూక్ష్మ రూపపు గజముల సుందరముగ
  దిద్ది తీర్చిన బొమ్మల దెచ్చి యొసగ
  శిశువు గరమున శత కోటి చేరె గరులు
  వింత గను గాంచి రందరు వేడ్క మీర

  రిప్లయితొలగించండి
 3. కాగితము మీద శతకోటి గజముబోలుఁ
  జిత్ర ములు గీచి యీయగ శిశువు దాని
  భద్రముగఁబట్టు కొనగను భామ లనిరి
  శిశువు కరమున శతకోటి చేరెఁ గరులు

  రిప్లయితొలగించండి
 4. చం.

  నిశితము బాలబాలికల నేరుపు పల్కులు శాస్త్రవిద్యలన్
  విశదముగా విహాయసపు వీధి బరాగపు ఖండ సంఖ్య నా
  *“శిశువు, కరంబునం గలవు చిత్రముగా శతకోటి, యేనుఁగుల్”*
  పశువులలో బలీయముగ పైబడు వన్యమృగంబులే భువిన్.

  ............................ ...........
  పరాగము = ధూళి
  కరము = కిరణము

  రిప్లయితొలగించండి
 5. రావణాసురునితో విభీషణుడు:

  తేటగీతి
  కూడె రామచంద్రుని పిచ్చి 'కోతు' లనకు
  మందు 'గజబల' సంపన్ను లధికులన్న!
  ధర్మమూర్తిగ రామయ్యఁ దలఁపఁ గాడు
  శిశువు, కరమున శతకోటి చేరెఁ 'గరులు'

  చంపకమాల
  వశమయి రామమూర్తికడ 'వానర సేనల'నంతముండగన్
  గుశలము వీడి వారలను గోతులటంచు గణించబోకుమా!
  దశముఖ! వారలెంచగ 'మదావళ శూరులు', గాడె రాముడున్
  శిశువు, కరంబునం గలవు చిత్రముగా శతకోటి 'యేనుఁగుల్'!

  రిప్లయితొలగించండి
 6. పుట్టుక సమయమందున పొసగె , చంటి
  శిశువు కరమున శతకోటి చేరెఁ గరులు ,
  పెద్దవాడయి జనమందు వెలుగు ననుచు
  జోసి యా పసికందుని జూసి తెలిపె

  కరి = నిదర్శనము

  రిప్లయితొలగించండి

 7. విడువక కురియు వానకు విశ్వమెల్ల
  జలనిధిగ మార కృష్ణుడు జనులఁ గావ
  తాను గోవర్ధనమునెత్త తలచి రెల్ల
  శిశువు కరమున శతకోటి చేరెఁ గరులు


  దశశత నేత్రుడే యలిగి దండిగ వానల కానతివ్వగా
  వసుధయె సంద్రమయ్యె జన వాహిని బాధను గాంచి తీర్చగా
  కుశలుడు నందనందనుడె కొండఁ గరంబు నెత్త దల్చిరే
  శిశువు కరంబునం గలవు చిత్రముగా శతకోటి యేనుఁగుల్.

  రిప్లయితొలగించండి
 8. తేటగీతి
  వజ్రి కురిపించ వాన వ్రేపల్లె మీద
  గిరియు నెత్తె గోప*శిశువు కరమున;శత
  కోటి చేరెఁగరులు,*వర గోతతులును
  గోపకాళియు ముదముతో కుశలముగను.

  రిప్లయితొలగించండి
 9. అశనముమాను బాలికను నారడి వెట్టక యాట బొమ్మగా
  శిశువును బోలినట్లుగను జిత్రము లెక్కకు వంద కోట్లుగా
  విశదపు టేనుగుంబలెను వేసిన గాగిత మీయ బాలకున్
  శిశువు కరంబునం గలవు చిత్రముగా శతకోటి యేనుఁగుల్.

  రిప్లయితొలగించండి
 10. చంపకమాల
  అశనమునన్ విషంబిడియె నద్రులనుండియుఁద్రోసి,తండ్రియే
  కశములఁగొట్ట జేసెగద!కాంతులనీనెడు పద్మరేఖలే
  *శిశువు కరంబునంగలవు, చిత్రముగా శతకోటి యేనుగుల్ *
  వశమయిపోయె వానికిని బాపురె!యాతని భక్తి మెచ్చమే.

  రిప్లయితొలగించండి
 11. చం.రవి కనుపట్టగాఁగలవరంబునధ్యానమొనర్చుచుండఁగ్రూ
  రవిటుడ!రాకురా!మధుపరాజ! తపస్వినినేచఁదప్ఫురా!
  రవిజునివోలె మాదృశకులాంగననీగతిఁగల్వఁజేరి కై
  రవి కనువిప్పుచున్న తఱి రమ్మనిపిల్చుట యుక్తమౌనొకో?
  (సూర్యాస్తమయానంతరమును తనను వేధించుచు రమ్మని పిలుచుచున్న విటభ్రమరమును చూచి పద్మినీజాతిది యగు పద్మమిట్లనుచున్నది.)
  ....చంద్రమౌళి రామారావు,బాపట్ల.

  రిప్లయితొలగించండి
 12. సూక్ష్మ మైనట్టి క్రిములవి చూడ చూడ
  శిశువు కరమున శతకోటి చేరెఁ, గరులు
  కావవి కరులబోలెడు జీవరాశి
  గాని సూక్ష్మదర్శనితోడ గాంచ వలయు

  రిప్లయితొలగించండి
 13. పశులని యందురే జదువఁ వ్రాయఁగలేని జనాళి నీ భువిన్
  దిశల జయింప సాధ్యముగ ధీమతి నేర్చిన విద్యతోడుతన్
  శశి రవి చంద్రికా సమపు జక్కని విజ్ఞత దోడ వెల్గు నా “
  శిశువు కరంబునం గలవు చిత్రముగా శతకోటి యేనుఁగుల్”
  నిశి దరి రాక వెల్గులను నింపెడి విద్దెల మావటీడుగన్

  రిప్లయితొలగించండి
 14. ఆటవెలది


  మందర గిరిపైన నందగోపాలుని
  మధుర మురళి గానమందు, పలికె
  కలరవములు *శిశువు కరమున శతకోటి
  చేరెఁ గరులు* వాని చెలువముగను

  రిప్లయితొలగించండి
 15. కాన నాంతరమ్మున వేగ కదలు చుండఁ
  బడఁగ నేలపైఁ దడఁబడి బాధతోడఁ
  గుముల నెత్తి తొండమ్మును గుంజర వర
  శిశువు కరమున శతకోటి చేరెఁ గరులు


  విశదముగాఁ గరాబ్జముల వృద్ధి నొసంగ నిరంతరమ్మునున్
  శశి నిభ వక్త్ర బాలునకు సంపద లింపుగఁ గల్గఁ జేయఁగా
  భృశముగ వెల్గు చున్న యవి రేఖలు కుంజర సన్నిభమ్ములై
  శిశువు కరంబునం గలవు చిత్రముగా శతకోటి యేనుఁగుల్

  రిప్లయితొలగించండి