31-8-2022 (బుధవారం)కవిమిత్రులారా,నాలుగు పాదాలలో యతి స్థానంలో వరుసగా 'వి - నా - య - క' అక్షరాలను న్యస్తం చేస్తూతేటగీతిలో కాని, ఉత్పలమాలలో కానివినాయక స్తుతి చేయండి.
ప్రీతి గా నిన్ను పూజించ, (వి)ఘ్న ములను.నమ్మకముగ చేతువు గదా (నా)శనంబు,నార్తిగా వేడ వెతలు మా(య)మ్ము చేసికాచు చుందువు మమ్ములన్ (క)లిమి నిడుచు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
వేద లేఖకు డైనట్టి విష్ణుమూర్తినాగభూషణఁదనయుడునాట్యమూర్తిహంస వాహినిఁదోడుగయలరుమూర్తికాణిపాకమునందునకనగమూర్తికొరుప్రోలు రాధాకృష్ణ రావు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
శ్రీ గణరాయ (వి)ఘ్నములు సేసియుదూరము సత్వరంబునన్బాగొనరించ రమ్ము మము భవ్య వి(నా)యక మాదుగేహమున్జాగొనరించ బోకుమ(య) సన్నుతిజేతుము భక్తితోడ నీయాగమనంబు మాకధి(క) యబ్బురమిచ్చును పార్వతీ సుతా!
పద్యం బాగుంది. కాని న్యస్తాక్షరాలు యతిస్థానంలో ఉండాలి కదా?
వేడు కొందుము తొలగింప విఘ్న ములనునష్టముల బాపగా దగు నాయకుo డవగుచు మా కోర్కె మన్నించి యవని యందుకలుగు బాధల బో ద్రోలు కరుణ తోడ
వేగపరిహరించుచునుండు "వి"ఘ్నములనునందమునుగూర్చుచుండువి,'నా"యకుండుహస్తివదనుడై సతమభ"య"మునొసగుచుకరమునెత్తిదీవించి తా కరుణజూపు
విషపు మేతరి పుత్రుడా విమలచరితనాదు మొరలనాలింపు వినాయకా యటంచు ప్రార్థింతు తీర్చు మా యక్కఱలునుకలిమి నొసగుచు బాపుమా కలతలెల్ల విఘ్న నాయకుడ వనుచు విశ్వ జనులునమ్మి కొలతురుగద విఘ్ననాథ జనులనాదరింపగ రావయ్య యవని తలముకలత లన్ బాప నొసగుమా కలిమి నంటి.వేదన బాపు వాడతడు విశ్వమనోహర సుందరాంగుడే నాదుమొరాలకించు సురనాథుడతండని నమ్మితిన్ సదాయా దహనాంబకున్ సుతుడె యక్కర దీర్చెడు వాడటంచునే గాదిలితోడవాని పదకంజము జేరితి భూరిభక్తితో.
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ఉ.వీరుడ వీవు బాలుడవు విశ్వపునాథుని నడ్డగించగన్నారద బోధ నేర్చిన వినాయక మూర్తివి విఘ్నరాజువేఆరు ముఖాల్ మహౌజసుడు యవ్వన గండుడు తమ్ముడే కదాకారణభూతమై వరద ! కన్నులఁ గప్పుకొనంగ శీఘ్రమున్..................................కన్నులఁగప్పుకొను = కంటికి రెప్పవలెఁ గాచియుండు.క్రియాస్వరూప మణిదీపిక (విశ్వనాథ, ఆం.ప్ర.సా.అ.) 1962 దే.స.క్రి.
విఘ్నములనెల్ల తొలగించు విఘ్నరాజనగజ తనయ వినాయక నామధేయయాతనల దీర్చు దైవమా యమున పుత్రకలతలను బాపు మాపైన కరుణజూపు
వేడెద నిను కరుణ జూప ‘వి’ఘ్న రాజ ,నాయన దెలిపె నిను గణ ‘నా’యకునిగ ,ఆది వందితుడవు గద ‘య’వనిపైనగడనమంతను దీవించు ‘క’లసియుండగడనము = సమూహము
వినతు లీయగ వచ్చుదు విఘ్న నాధ! నన్ను ఁ బ్రోవుము శివగణ నాయకుండ! హస్తి ముఖముతో సతమభ యమిడి,నాదుకలతలను బాపి నిరతము కలిమి నిమ్ము
తేటగీతివేడ్క పూజింతు గణనాథ!'వి'ఘ్ననాథ!ధీయు,ధైర్యమ్ము నిమ్ము వి'నా'యకుండ!నిగమ సంస్తుత!హేరంబ!'య'గజ తనయ!స్కంద పూర్వజ!కావుమా 'క'రుణ తోడ.ఉత్పలమాల వేద పురాణ సంస్తుత!ప/వి/త్ర!ఘనాఘ లవిత్ర!దేవ!వి ఘ్నాధిప!శూర్పకర్ణ!గణ/నా/యక!మోదకఖాద!వీర!బ్ర హ్మాది సురార్చితా!ఘన జ/య/మ్ము నొసంగెడు దొడ్డదేవరా!కాదనకుండఁబ్రోవుమయ!/క/ల్ములొసంగుచు నెల్లవేళలన్.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
వేడెదనేకదంత నిను విఘ్న నివారణఁ గోరి భక్తి నేనాడును వీడ నీ స్మరణ నా గతి నీవెగ విఘ్న నాయకాయాడుచు పాడుచున్ జనుల యక్కర దీర్చెడి దొడ్డ దేవరాకాఁడగొనెన్ మనంబునను కన్నులకింపగు నీదు మూర్తియే!
వేడ నిను ముందుగ తొలగు *వి* ఘ్నము లిలనగజ ప్రియపుత్ర వినుమయ్య *నా* దు మనవినాకలన్ని పాపుము వినా *య* క! గణపతి! కలుగ జేయుము సౌఖ్యము *క* నికరించి
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ఉత్పలమాలవేదములందరున్ జదువ విజ్ఞులు గారని వాటి సారమున్దాదగ భారతంబనెడు నాణ్యమునౌ నితిహాసమందునన్హ్లాదము గూర్చ వ్యాసుడొక యజ్ఞపు రీతిగ వ్రాసిపెట్టితేకాదని మిమ్ము, గెల్వఁగల కర్ములెవారొకొ విఘ్ననాయకా!
తేటగీతివేద విజ్ఞాని వ్యాసుండు వినయమొప్పనమ్మి భారతమున్ చెప్ప నాయకాగ్ర!యశముగాంచఁగ వ్రాసితె యజ్ఞమట్లుకావ రాగదె మమ్మట్లు కరటివదన!
విజ్ఞుడవాదిపూజ్యుడవవిఘ్నమొనర్చరవిఘ్నరాశినేనజ్ఞుడప్రాజ్ఞువీవుగణనాయకనమ్మితివక్రతుండదోషాజ్ఞతసైపవయ్యవిజయంబిడగొల్వరెవేల్పులెల్లలోకజ్ఞులుసర్వదార్చనలకామితసిద్ధులబుద్ధినొందరే
వేడిన నిన్నునిత్యమును విఘ్నములన్ దరిచేరనీక పోనాడెదవీవు ప్రేమము వినాయక! నమ్మి కరమ్ము భక్తి నేనాడెద నీదు నామము, ప్రయత్నము వీడక, దున్న క్షేత్రమున్కాడిని బూన్చి యెద్దులకు, కన్గొన వచ్చెద నిన్ను ముందుగా
వీనుల విందు నీచరిత విఘ్నవినాయక విశ్వవందితా!నాయెడ జూపుమీ కరుణ నాగవిభూషణు నందయంత నీయానతి మీరి చేరవట యడ్డములేపని చేయనెంచినన్!కానశుభంబులొంద నిను కర్మల కాద్యుడ వేడుకొందురే!!
భమిడిపాటి కాళిదాసు.. అనకాపల్లి.వేడు జగములు నిన్ముందు విఘ్న హారి,నరులు వేల్పులు గొల్తురనాధినాథ!ఆఖువాహన గణపతి యనుచు నీకుకరములను మోడ్చి మొక్కెద కరుణజూపు!!
విఘ్నములఁ దొలఁగింపుమ విఘ్ననాథనా మది స్మరింతు నయ్య వినాయక! సుర! యనవరతము మమ్మిల సదయ గను మయ్యకష్టములను బాపి వినాయక సతతమ్ముపీన నిజోద రేభ ముఖ విఘ్న వినాశన ముఖ్య కార్య లగ్నా నత సర్వ దేవ సుర నాథ నరవ్రజ సుందరప్రసన్నానన కిన్న రాసుర వియచ్చర పూజిత హృష్ట మానసా గాన సుధా రసస్రవ వికత్థన కోటి నుతింతు విఘ్నహా
తేటగీతివక్రతుండ మహాకాయ విక్ర మించినాదు మొరవిని గావుము ,నాగ సూత్రయజన ముధరించి న గణనాయక కొలిచెదగజముఖ వదనా నతులివే కరుణ జూపు.ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటరు.
వేడుచునంటి నేడునిను విఘ్న వినాశకలోకనాధ యేనాడును నీతి భాహ్యమగు కార్యముజేయుట నేనెరుంగ నేనాడిన మాట తప్ప మరి యన్యులకెప్పుడు సేయ ద్రోహమున్కౌడిసుమంతలేదు నను కల్మషకంఠునిపుత్ర ప్రోచుమా!
వేగమె చూపి నీ కృపను విఘ్నము లన్ని హరించి వేయగా నా గురుదేవుడంచు నిను నా యెద గొల్చెద విఘ్ననాయకా ఆగక నాదు కైత యొక యజ్ఞము వోలె సతమ్ము సాగగా కాగితమున్ కలమ్ము గొని కమ్మగ నే రచియింప బ్రోవుమా !
విఘ్నహర్త వినుము నాదు విన్నపంబునాశమొనరించుమఘమిమ్ము నాకు బుద్ధియశమునిడు నీదు కృప గల్గు యత్న సిద్ధికరివదన గొల్తు నీ పద కమలములను
వేగమెచూపుమా దయను విఘ్నములెల్లయుబాపుచున్ సదానాగురి నిశ్చయించుచును నామది లోకొలు వుండరమ్మయాయాగకనొక్కచోటచనుయత్నముచేసెదవెన్నుదన్నుగాకాగడవోలెనుండిననుకమ్మగ కావుముజాగుచే యకన్
ప్రీతి గా నిన్ను పూజించ, (వి)ఘ్న ములను.
రిప్లయితొలగించండినమ్మకముగ చేతువు గదా (నా)శనంబు,
నార్తిగా వేడ వెతలు మా(య)మ్ము చేసి
కాచు చుందువు మమ్ములన్ (క)లిమి నిడుచు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివేద లేఖకు డైనట్టి విష్ణుమూర్తి
రిప్లయితొలగించండినాగభూషణఁదనయుడునాట్యమూర్తి
హంస వాహినిఁదోడుగయలరుమూర్తి
కాణిపాకమునందునకనగమూర్తి
కొరుప్రోలు రాధాకృష్ణ రావు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశ్రీ గణరాయ (వి)ఘ్నములు సేసియు
రిప్లయితొలగించండిదూరము సత్వరంబునన్
బాగొనరించ రమ్ము మము భవ్య
వి(నా)యక మాదుగేహమున్
జాగొనరించ బోకుమ(య) సన్నుతి
జేతుము భక్తితోడ నీ
యాగమనంబు మాకధి(క) యబ్బుర
మిచ్చును పార్వతీ సుతా!
పద్యం బాగుంది. కాని న్యస్తాక్షరాలు యతిస్థానంలో ఉండాలి కదా?
తొలగించండివేడు కొందుము తొలగింప విఘ్న ములను
రిప్లయితొలగించండినష్టముల బాపగా దగు నాయకుo డ
వగుచు మా కోర్కె మన్నించి యవని యందు
కలుగు బాధల బో ద్రోలు కరుణ తోడ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివేగపరిహరించుచునుండు "వి"ఘ్నములను
రిప్లయితొలగించండినందమునుగూర్చుచుండువి,'నా"యకుండు
హస్తివదనుడై సతమభ"య"మునొసగుచు
కరమునెత్తిదీవించి తా కరుణజూపు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండివిషపు మేతరి పుత్రుడా విమలచరిత
నాదు మొరలనాలింపు వినాయకా య
టంచు ప్రార్థింతు తీర్చు మా యక్కఱలును
కలిమి నొసగుచు బాపుమా కలతలెల్ల
విఘ్న నాయకుడ వనుచు విశ్వ జనులు
నమ్మి కొలతురుగద విఘ్ననాథ జనుల
నాదరింపగ రావయ్య యవని తలము
కలత లన్ బాప నొసగుమా కలిమి నంటి.
వేదన బాపు వాడతడు విశ్వమనోహర సుందరాంగుడే
నాదుమొరాలకించు సురనాథుడతండని నమ్మితిన్ సదా
యా దహనాంబకున్ సుతుడె యక్కర దీర్చెడు వాడటంచునే
గాదిలితోడవాని పదకంజము జేరితి భూరిభక్తితో.
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిఉ.
రిప్లయితొలగించండివీరుడ వీవు బాలుడవు విశ్వపునాథుని నడ్డగించగన్
నారద బోధ నేర్చిన వినాయక మూర్తివి విఘ్నరాజువే
ఆరు ముఖాల్ మహౌజసుడు యవ్వన గండుడు తమ్ముడే కదా
కారణభూతమై వరద ! కన్నులఁ గప్పుకొనంగ శీఘ్రమున్.
.................................
కన్నులఁగప్పుకొను = కంటికి రెప్పవలెఁ గాచియుండు.
క్రియాస్వరూప మణిదీపిక (విశ్వనాథ, ఆం.ప్ర.సా.అ.) 1962
దే.స.క్రి.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివిఘ్నములనెల్ల తొలగించు విఘ్నరాజ
రిప్లయితొలగించండినగజ తనయ వినాయక నామధేయ
యాతనల దీర్చు దైవమా యమున పుత్ర
కలతలను బాపు మాపైన కరుణజూపు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివేడెద నిను కరుణ జూప ‘వి’ఘ్న రాజ ,
రిప్లయితొలగించండినాయన దెలిపె నిను గణ ‘నా’యకునిగ ,
ఆది వందితుడవు గద ‘య’వనిపైన
గడనమంతను దీవించు ‘క’లసియుండ
గడనము = సమూహము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివినతు లీయగ వచ్చుదు విఘ్న నాధ!
రిప్లయితొలగించండినన్ను ఁ బ్రోవుము శివగణ నాయకుండ!
హస్తి ముఖముతో సతమభ యమిడి,నాదు
కలతలను బాపి నిరతము కలిమి నిమ్ము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితేటగీతి
రిప్లయితొలగించండివేడ్క పూజింతు గణనాథ!'వి'ఘ్ననాథ!
ధీయు,ధైర్యమ్ము నిమ్ము వి'నా'యకుండ!
నిగమ సంస్తుత!హేరంబ!'య'గజ తనయ!
స్కంద పూర్వజ!కావుమా 'క'రుణ తోడ.
ఉత్పలమాల
వేద పురాణ సంస్తుత!ప/వి/త్ర!ఘనాఘ లవిత్ర!దేవ!వి
ఘ్నాధిప!శూర్పకర్ణ!గణ/నా/యక!మోదకఖాద!వీర!బ్ర
హ్మాది సురార్చితా!ఘన జ/య/మ్ము నొసంగెడు దొడ్డదేవరా!
కాదనకుండఁబ్రోవుమయ!/క/ల్ములొసంగుచు నెల్లవేళలన్.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండివేడెదనేకదంత నిను విఘ్న నివారణఁ గోరి భక్తి నే
రిప్లయితొలగించండినాడును వీడ నీ స్మరణ నా గతి నీవెగ విఘ్న నాయకా
యాడుచు పాడుచున్ జనుల యక్కర దీర్చెడి దొడ్డ దేవరా
కాఁడగొనెన్ మనంబునను కన్నులకింపగు నీదు మూర్తియే!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివేడ నిను ముందుగ తొలగు *వి* ఘ్నము లిల
రిప్లయితొలగించండినగజ ప్రియపుత్ర వినుమయ్య *నా* దు మనవి
నాకలన్ని పాపుము వినా *య* క! గణపతి!
కలుగ జేయుము సౌఖ్యము *క* నికరించి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిఉత్పలమాల
తొలగించండివేదములందరున్ జదువ విజ్ఞులు గారని వాటి సారమున్
దాదగ భారతంబనెడు నాణ్యమునౌ నితిహాసమందునన్
హ్లాదము గూర్చ వ్యాసుడొక యజ్ఞపు రీతిగ వ్రాసిపెట్టితే
కాదని మిమ్ము, గెల్వఁగల కర్ములెవారొకొ
విఘ్ననాయకా!
తేటగీతి
తొలగించండివేద విజ్ఞాని వ్యాసుండు వినయమొప్ప
నమ్మి భారతమున్ చెప్ప నాయకాగ్ర!
యశముగాంచఁగ వ్రాసితె యజ్ఞమట్లు
కావ రాగదె మమ్మట్లు కరటివదన!
విజ్ఞుడవాదిపూజ్యుడవవిఘ్నమొనర్చరవిఘ్నరాశినే
రిప్లయితొలగించండినజ్ఞుడప్రాజ్ఞువీవుగణనాయకనమ్మితివక్రతుండదో
షాజ్ఞతసైపవయ్యవిజయంబిడగొల్వరెవేల్పులెల్లలో
కజ్ఞులుసర్వదార్చనలకామితసిద్ధులబుద్ధినొందరే
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివేడిన నిన్నునిత్యమును విఘ్నములన్ దరిచేరనీక పో
రిప్లయితొలగించండినాడెదవీవు ప్రేమము వినాయక! నమ్మి కరమ్ము భక్తి నే
నాడెద నీదు నామము, ప్రయత్నము వీడక, దున్న క్షేత్రమున్
కాడిని బూన్చి యెద్దులకు, కన్గొన వచ్చెద నిన్ను ముందుగా
రిప్లయితొలగించండివీనుల విందు నీచరిత విఘ్నవినాయక విశ్వవందితా!
నాయెడ జూపుమీ కరుణ నాగవిభూషణు నందయంత నీ
యానతి మీరి చేరవట యడ్డములేపని చేయనెంచినన్!
కానశుభంబులొంద నిను కర్మల కాద్యుడ వేడుకొందురే!!
భమిడిపాటి కాళిదాసు.. అనకాపల్లి.
రిప్లయితొలగించండివేడు జగములు నిన్ముందు విఘ్న హారి,
నరులు వేల్పులు గొల్తురనాధినాథ!
ఆఖువాహన గణపతి యనుచు నీకు
కరములను మోడ్చి మొక్కెద కరుణజూపు!!
విఘ్నములఁ దొలఁగింపుమ విఘ్ననాథ
రిప్లయితొలగించండినా మది స్మరింతు నయ్య వినాయక! సుర!
యనవరతము మమ్మిల సదయ గను మయ్య
కష్టములను బాపి వినాయక సతతమ్ము
పీన నిజోద రేభ ముఖ విఘ్న వినాశన ముఖ్య కార్య ల
గ్నా నత సర్వ దేవ సుర నాథ నరవ్రజ సుందరప్రస
న్నానన కిన్న రాసుర వియచ్చర పూజిత హృష్ట మానసా
గాన సుధా రసస్రవ వికత్థన కోటి నుతింతు విఘ్నహా
తేటగీతి
రిప్లయితొలగించండివక్రతుండ మహాకాయ విక్ర మించి
నాదు మొరవిని గావుము ,నాగ సూత్ర
యజన ముధరించి న గణనాయక కొలిచెద
గజముఖ వదనా నతులివే కరుణ జూపు.
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటరు.
వేడుచునంటి నేడునిను విఘ్న వినాశక
రిప్లయితొలగించండిలోకనాధ యే
నాడును నీతి భాహ్యమగు కార్యము
జేయుట నేనెరుంగ నే
నాడిన మాట తప్ప మరి యన్యుల
కెప్పుడు సేయ ద్రోహమున్
కౌడిసుమంతలేదు నను కల్మషకంఠుని
పుత్ర ప్రోచుమా!
వేగమె చూపి నీ కృపను విఘ్నము లన్ని హరించి వేయగా
రిప్లయితొలగించండినా గురుదేవుడంచు నిను నా యెద గొల్చెద విఘ్ననాయకా
ఆగక నాదు కైత యొక యజ్ఞము వోలె సతమ్ము సాగగా
కాగితమున్ కలమ్ము గొని కమ్మగ నే రచియింప బ్రోవుమా !
విఘ్నహర్త వినుము నాదు విన్నపంబు
రిప్లయితొలగించండినాశమొనరించుమఘమిమ్ము నాకు బుద్ధి
యశమునిడు నీదు కృప గల్గు యత్న సిద్ధి
కరివదన గొల్తు నీ పద కమలములను
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివేగమెచూపుమా దయను విఘ్నములెల్లయుబాపుచున్ సదా
రిప్లయితొలగించండినాగురి నిశ్చయించుచును నామది లోకొలు వుండరమ్మయా
యాగకనొక్కచోటచనుయత్నముచేసెదవెన్నుదన్నుగా
కాగడవోలెనుండిననుకమ్మగ కావుముజాగుచే యకన్