31, ఆగస్టు 2022, బుధవారం

సమస్య - 4178

1-9-2022 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పుంస్త్వమ్మును వీడి బ్రహ్మ పొలతిగ మారెన్”
(లేదా...)
“పుంస్త్వాకారము బ్రహ్మ కింపొదవమిన్ బూనెన్ గదా స్త్రీత్వమున్”

19 కామెంట్‌లు:


  1. పుంస్త్వంబనగ మగతనము
    పుంస్త్వంబన పౌరుషమ్ము మోఱకుడా హే
    పుంస్త్వాకారుడ యెప్పుడు
    పుంస్త్వమ్మును వీడి బ్రహ్మ పొలతిగ మారెన్?

    రిప్లయితొలగించండి
  2. పుంస్త్వము పుంస్త్వంబనుచున్
    పుంస్త్వంబుకొరకు తపించు పురుషుని మనమున్
    పుంస్త్వము లేకుండ నెఱుగ
    పుంస్త్వమ్మును వీడి బ్రహ్మ పొలతిగ మారెన్

    రిప్లయితొలగించండి
  3. 1.మోహినగా మారిన హరి గురించి సహచర దేవతలు బ్రహ్మతో చెపుతూ...

    కందం
    పుంస్త్వమ్మును గలవాడై
    పుంస్త్వము ననసురుల మాయఁ బుచ్చగలేనన్
    పుంస్త్వమున నుత్తముడు హరి
    పుంస్త్వమ్మును వీడి బ్రహ్మ! పొలతిగ మారెన్

    2. బ్రహ్మ : విష్ణువు

    శార్దూలవిక్రీడితము
    పుంస్త్వాకారునిగన్ గృపాళువనఁగా పోరాడె దైత్యాళితోన్
    బుంస్త్వాకారిగ రాక్షసాధములకున్ మోసమ్మసాధ్యమ్మనన్
    బుంస్త్వాకారులకుత్తముండు సుధనే పొందంగ నా దేవతల్
    పుంస్త్వాకారము బ్రహ్మ కింపొదవమిన్ బూనెన్ గదా స్త్రీత్వమున్

    రిప్లయితొలగించండి

  4. పుంస్త్వంబన్నను పౌరుషంబనికదా పూజ్యుండ్రు వాచించిరే
    పుంస్త్వాకారము వీడి యర్జునుడు క్లీబుండయ్యె సత్యమ్మె హే
    పుంస్త్వాకారము లోనయున్న పురుషా మూర్ఖుండవా? యెప్పుడా
    పుంస్త్వాకారము బ్రహ్మ కింపొదవమిన్ బూనెన్ గదా స్త్రీత్వమున్?

    రిప్లయితొలగించండి
  5. కందము
    పుంస్త్వంబన మగతనమౌ
    పుంస్త్వాకృతి కాళిదాసు భోజుని సభలో
    పుంస్త్వముఁజూపియు పిదపన్
    పుంస్త్వమ్మును వీడి; బ్రహ్మపొలతిగ మారెన్

    రిప్లయితొలగించండి
  6. పుంస్త్వమ్మధికము గాదని,
    పుంస్త్వాకారులు లలితను బూజించుటకై
    పుంస్త్వముఁ బాయ హరి హరుల్,
    పుంస్త్వమ్మును వీడి బ్రహ్మ పొలతిగ మారెన్.

    రిప్లయితొలగించండి
  7. పుంస్త్వముగని భారతి యా
    పుంస్త్వముకు చిరాకు పడుచు మొరటని పలుకన్
    పుస్త్వము కొరగానిదనుచు
    పుంస్త్వమ్మును వీడి బ్రహ్మ పొలతిగ మారెన్

    రిప్లయితొలగించండి
  8. పుంస్త్వమ్మనగను నెఱుగుము
    పుంస్త్వమ్మన,మగతనంబు పురుషుల కుండున్
    పుంస్త్వమ్ము గలుగ మాయను
    బుంస్త్వమ్మును వీడి బ్రహ్మ పొలతిగ మారెన్

    రిప్లయితొలగించండి
  9. పుంస్త్వము కలిగిన వారలె
    పుంస్త్వము తో సంతు బొంది మురియు చునుండన్
    పుంస్త్వము వలదని యెప్పుడు
    పుంస్త్వమ్మును వీడి బ్రహ్మ పొలతి గమారెన్?

    రిప్లయితొలగించండి
  10. పుంస్త్వమె సరిపడ బ్రహ్మకు
    పుంస్త్వంబొక్కటియు నెట్లు పుత్రుల బడసెన్
    పుంస్త్వము కూడగ మనమున
    పుంస్త్వమ్మును వీడి బ్రహ్మ పొలతిగ మారెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మొదటి పాదాన్ని క్రింది విధంగా కూడా మార్చవచ్చు.

      పుంస్త్వమె సరిపడ తనకును

      తొలగించండి
  11. పుంస్త్వంబున్ మఱి స్త్రీత్వమున్ జగతిలోభూషించు దైవాంశలై
    పుంస్త్వాకారమునన్ జనించి యజుఁడే ఫుల్లాబ్జమందున్ బళీ!
    పుంస్త్వ స్త్రీత్వ నపుంసకత్వముల నీభూమిన్
    సృజించెన్,కళల్
    పుంస్త్వాకారము బ్రహ్మకింపొదవిమిన్ బూనెన్ గదా!స్త్రీత్వమున్.

    రిప్లయితొలగించండి
  12. పుంస్త్వము మనుజుల నైజము
    పుంస్త్వము స్త్రీత్వము పొసగునె పూజితులకిలన్
    పుంస్త్వమ్మొక లక్షణముగ
    పుంస్త్వమ్మును వీడి బ్రహ్మ పొలతిగ మారెన్

    రిప్లయితొలగించండి
  13. పుంస్త్వాకారము బ్రహ్మ కింపొదవమిన్ బూనెన్ గదా స్త్రీత్వమున్
    బుంస్త్వాకారముఁ జూడ ముచ్చట గదా బొందంగ నెవ్వారికిన్
    బుంస్త్వాకారము వీడు మానవుఁడుఁదాఁ
    బోటండు గానయ్యెడిన్
    బుంస్త్వాకారమె మేలు సూడగ ధరన్ మోహంబు నొందంగ గా

    రిప్లయితొలగించండి
  14. పుంస్త్వంబన పురుషాకృతి
    పుంస్త్వంబే బ్రహ్మ విష్ణు పురహరుల గనన్
    పుంస్త్వము నైజంబౌనెట
    పుంస్త్వమ్మును వీడి బ్రహ్మ పొలతిగ మారెన్

    రిప్లయితొలగించండి
  15. పుంస్త్వమున కీ డగు గిర ల
    పుంస్త్వ బృహన్నలకుఁ జెప్పె ముగుదల కడఁ గా
    బుంస్త్వము బయల్పడ నతఁడు
    పుంస్త్వమ్మును వీడి బ్రహ్మ! పొలఁతిగ మారెన్

    పుంస్త్వస్త్రీత్వము లెంచఁ దుల్యము లగుం బో సృష్టి కార్యార్థమై
    పుంస్త్వధ్వంసపు శాప మీయ సతికై ముక్కంటి రాజన్ని జా
    పుంస్త్వంబం దిలఁ జక్క సూనుఁ గనియెం బో సూర్య వంశస్థుఁడే
    పుంస్త్వాకారము బ్రహ్మ కిం పొదవమిం, బూనెం గదా స్త్రీత్వమున్

    [బ్రహ్మ = ఈశ్వరుఁడు]

    రిప్లయితొలగించండి
  16. పుంస్త్వంబనపౌరుషమే
    పుంస్త్వంబతివలకునుండుపుడమిని యనుచున్
    పుంస్త్వుండగువాడే యా
    పుంస్త్వమ్మును వీడి బ్రహ్మ పొలతిగ మారెన్

    రిప్లయితొలగించండి