30, సెప్టెంబర్ 2021, గురువారం

సమస్య - 3858

1-10-2021 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వనమున సంతాన మందువాఁడె సుఖించున్”
(లేదా...)
“వనమున సంతతిం బడయువానికిఁ గల్గును సౌఖ్యముల్ గడున్”

70 కామెంట్‌లు:


 1. ధనమెంత యున్న నేమిర?
  తనువున చేవయె యుడిగిన తరుణము నందున్
  గనువారులేని తరి, యౌ
  వనమున సంతానమందు వాడె సుఖించున్.

  రిప్లయితొలగించండి
 2. మనమున స్వఛ్చత గల్గియు
  జనహిత మగు కార్యములకు సహకారముతో
  ఘనుడై నుతు లందియు బా
  వనమున సంతానమందు వాడె సుఖించున్

  రిప్లయితొలగించండి
 3. సమస్య :

  వనమున సంతతిం బడయు
  వానికి గల్గును సౌఖ్యముల్ గడున్

  ( యౌవనం లోనే సంతానం కలిగితే ఎన్ని
  ఉపయోగాలో ! )

  చంపకమాల
  ...................

  వనజదళాయతాక్షి యగు
  భార్యకు పెంచుట మోద మిచ్చెడున్ ;
  ఘనముగ విద్యలన్ మిగుల
  గణ్యుల జేయగవచ్చు శీఘ్రమే ;
  మనుమలతోడ నెంతయును
  మాలిమి మీర మెలంగ వచ్చు ; యౌ
  వనమున సంతతిం బడయు
  వానికి గల్గును సౌఖ్యముల్ గడున్ .

  రిప్లయితొలగించండి

 4. ధనమది యెంతయున్న పరితాపము నందిన వేళ ప్రేమతో
  ననునయ వాక్యముల్ పలుకెడాప్తులు చెంతన లేనిచో ప్రతా
  పనమను మాటసత్యమది, వాసుర మందున గాంచినంత యౌ
  వనమున సంతతిన్ బడయు వానికిఁ గల్గును సౌఖ్యముల్ గడున్.

  రిప్లయితొలగించండి
 5. కనగాసత్యంబైనది
  తనువునుతత్కాలమంచుతనియకమదిలో
  కనగనుసాధనపరమము
  వనమునసంతానమందువాడెసుఖించున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'సాధనపరమము'?

   తొలగించండి
  2. పరమము-పరంధామము
   సాధన-సాధించుట
   పరంధామమునుసాధించుటకైవనముననివసించి
   సద్గతియనుసంతానమునుపోందవలెగదా

   తొలగించండి
 6. వినయవివేకసమపదలవిజ్ఞులునత్రిమహర్షిదంపతుల్
  అనయముదత్తుబోందిరటనాగతిరాగమువీడగామదిన్
  పనిగోనిపుణ్యభావనలఁబాయకభక్తినరణ్యమందునన్
  వనమునసంతిన్బడయువానికిగల్గునుసౌఖ్యముల్గనన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   టైపు దోషాలున్నవి. 'సమస్యలో 'వనమున' అని ఉన్నది కదా... మీరు 'అరణ్యమందునన్' అంటే పునరుక్తి కదా?

   తొలగించండి
  2. పనిగోనిపుణ్యభావనలఁబాయకభక్తిపరమాత్మన్గనన్

   తొలగించండి
 7. క్రొవ్విడి వెంకట రాజారావు:

  తనువును బిగువున నుంచుచు
  ననువగు నుత్తేజ మొసగి నడరి వెలుగుచున్
  ననయము ఘనమై చను యౌ
  వనమున సంతానమందు వాడె సుఖించున్.

  రిప్లయితొలగించండి
 8. తనువునొసంగిన పితరుల
  ఋణమును దీర్చుట యనునది రీతిగదెల్పన్
  మనమున ధార్మికమగు భా
  వనమున సంతానమందు వాడె సుఖించున్

  తనువు నొసంగినట్టి తనతాతలు తండ్రులు సద్గతుల్ గనన్
  ఋణమును దీర్చగాను తగురీతిని శాస్త్రవిధాన మెంచుచున్
  అనువగు పత్నితోడ మనమందున వంశము పెంపుజేయు భా
  వనమున సంతతిం బడయు వానికి గల్గును సౌఖ్యముల్ గడున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. అనవిని "నిను జంపునతడు
   ననుజకు కొమరునిగబుట్టు" నడలుచు చెఱలో
   నునుచిన, సతితో పరిదే
   వనమున సంతానమందు వాడె సుఖించున్

   తొలగించండి
  3. ధన్యాస్మి గురువర్యా! నమోనమః!🙏🙏🙏

   తొలగించండి
 9. క్రొవ్విడి వెంకట రాజారావు:

  తనువును బిగువున నుంచుచు
  ననువగు నుత్తేజ మొసగి నడరి వెలుగు తీ
  రనయము ఘనమై చను యౌ
  వనమున సంతానమందు వాడె సుఖించున్.

  రిప్లయితొలగించండి
 10. జి. ప్రభాకర శాస్త్రి గారి పూరణ.....

  దినమును రాత్రియున్ దవిలి దిక్కులు దోచక కానమ్మునన్
  కనులను మూసి విప్పుచును గాభర నొందుచు కన్నె గాంచగన్
  పనియును పాట వీడుచును ప్రక్కను జేరుచు కౌగిలించగన్
  వనమున సంతతిం బడయువానికిఁ గల్గును సౌఖ్యముల్ గడున్

  రిప్లయితొలగించండి
 11. మనలోకొందరు వ్యక్తులు
  మునుమున్ను వివాహమాడి బుట్టింతురు నం
  దనులన్ యోచించగ యౌ
  వనమున సంతాన మందువాఁడె సుఖించున్

  రిప్లయితొలగించండి
 12. ధన మెంత కలిగిన , బతుకు
  కొన యందున సాయమిడగ కొమరుడయిననున్
  తనయయయిన గావలె , జీ
  వనమున సంతాన మందువాఁడె సుఖించున్

  రిప్లయితొలగించండి
 13. కని ప్రతిరూపములను, జీ
  వనమున సంతాన మందువాఁడె సుఖించున్
  తన సంతు మేలు ముదిమిని
  జనులెవ్వరు రారు క్లేశ చయములు తీర్చన్

  రిప్లయితొలగించండి
 14. చం:

  అనుదిన మెల్ల వేళలను హాయిని గొల్పెడు పిల్ల గాలులున్
  మనసున నెమ్మదించు తమ మట్టుకు తా విహరింప వేడుకన్
  మనుగడ సాగ నెంచ నట మానుము మల్లెలు తొంగిలించనై
  వనమున సంతతిన్ బడయు వానికి గల్గును సౌఖ్యముల్ గడున్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 15. కందం
  మనువై దాల్చుచు గర్భము
  నినవంశోత్తమ తిలకుని నింపగు గాథల్
  విననొప్పు నాలి సహజీ
  వనమున సంతాన మందువాఁడె సుఖించున్

  చంపకమాల
  మనువున నొద్దికౌ సతియె మానసవీణను మీటి గర్భమున్
  దనరుచు దాల్చి నిత్యమును తారకరాముని బాలకృష్ణులన్
  మనమున నింపు గాథలను మైమరువన్ దగ నాలకించు జీ
  వనమున సంతతిం బడయువానికిఁ గల్గును సౌఖ్యముల్ గడున్

  రిప్లయితొలగించండి
 16. తనువున జవసత్వముడిగి
  కనులకు పొరలడ్డుపడిన కాలమునందున్
  కనిఫలమేమి సుతుని జ
  వ్వనమున సంతాన మందువాఁడె సుఖించున్

  రిప్లయితొలగించండి
 17. చంపకమాల:
  ఘనమగు భారతావనికి గౌరవమిచ్చు వ్యవస్థ లందు పే
  ర్కొనదగు గొప్పనైన యను కూల వివాహము జీవితాంతమున్
  పెనగొని వీడకుండు.సతి ప్రేమను బాయక స్వగృహత్తపో
  “వనమున సంతతిం బడయువానికిఁ గల్గును సౌఖ్యముల్ గడున్”
  --కటకం వేంకటరామశర్మ.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'స్వగృహ' అన్నపుడు స్వ లఘువే. అందువల్ల గణభంగం. సవరించండి.

   తొలగించండి
  2. ధన్యవాదమలార్యా 🙏.
   మీ సూచనననుసరించి సరిచేసిన.
   చంపకమాల:
   ఘనమగు భారతావనికి గౌరవమిచ్చు వ్యవస్థ లందు పే
   ర్కొనదగు గొప్పనైన యను కూల వివాహము జీవితాంతమున్
   పెనగొని వీడకుండు.సతి ప్రేమను బాయకయే గృహ త్తపో
   “వనమున సంతతిం బడయువానికిఁ గల్గును సౌఖ్యముల్ గడున్”
   --కటకం వేంకటరామశర్మ.

   తొలగించండి
 18. మునుముందటి తరుణంబున
  పొనరగ నెఱుఁగమి నెఱిఁగినపో పురుష ప్రయో
  జనమొనరగ కృతవిధి భా
  వనమున సంతాన మందువాఁడె సుఖించున్

  ( పొనరు: సంభవించు; ఎఱుఁగమి : తెలియమి/ అవిద్య;  పురుష ప్రయోజనము : ధర్మ-అర్థ-కామ మోక్షములు)

  రిప్లయితొలగించండి
 19. మనువది యేల నాకను కుమారుని జేరుచు పల్కె తల్లియే
  కనుమిది బంధుజాలమిల కడ్పున బుట్టిన వారి సాటిరా
  రనునుడి వాస్తవమ్మని మహాత్ములు నాడె వచించిరంట యౌ
  వనమున సంతతిన్ బడయు వానికిఁ గల్గును సౌఖ్యముల్ గడున్.

  రిప్లయితొలగించండి
 20. అనయము దేవదేవునికి నర్చనఁ జేయుచుఁ జిత్తశుద్ధితో,
  కనుగొని మంచివంగడపుఁ గాంత వివాహము నాడి యిచ్చతో,
  ధనమును కూడబెట్టుకొని, తద్దయు ప్రీతిఁ బవిత్రమైన జీ
  వనమున సంతతిం బడయువానికిఁ గల్గును సౌఖ్యముల్ గడున్

  రిప్లయితొలగించండి
 21. అనువుగ ప్రేమతో మెలగు నంగననాలిగ సంగ్రహించి జీ
  వనమున తల్లిదండ్రులకు భక్తి సమన్వితసేవ జేయుచున్
  ఘనతర ధర్మకామ్యములఖండ గతిన్ చెలువొందునట్లు యౌ
  వనమున సంతతిం బడయువానికిఁ గల్గును సౌఖ్యముల్ గడున్

  రిప్లయితొలగించండి
 22. మన నిజ వంశోద్ధారకుఁ
  గనుమయ, కైకొనుము నింకఁ గరుణావార్ధీ!
  ఘన యశమున్ బొందుము, జీ
  వనమున సంతాన మందువాఁడె సుఖించున్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కైకొనుము+ఇంక = కైకొనుమింక' అవుతుంది. నుగాగమం రాదు.

   తొలగించండి
 23. వినుమీ సత్యము శశి!యౌ
  వనమున సంతానమందువాడె సుఖించున్
  గనుకనె తొందర పడుమని
  యనునయముగ జెప్పుచుంటి నర్ధంబౌగదె?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   నాల్గవ పాదం చివర గణభంగం. సవరించండి.

   తొలగించండి
 24. అనయము చావు పుట్టుకలు నాగక
  సాగెడు జీవయానమం
  దొనరగ నుప్పతిల్లు గద తోరపు ప్రేమ
  ము ప్రాణ కోటికిన్
  కనుగొని యోగ్య కన్నియను సకాలము
  నందున పెండ్లి యాడి యౌ
  వనమున సంతతింబడయు వానికి
  గల్గను సౌఖ్యముల్ గడున్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
   "యోగ్య కన్యను సకాలమునందున..." అనండి. లేకుంటే గణభంగం.

   తొలగించండి
 25. అనుకూల సుతులఁ బడయుట
  మనుజ పురాకృత సుకృత మమానుషమే సే
  కొని యాలిని స్వీయ సుకృత
  వనమున సంతాన మందు వాఁడె సుఖించున్

  (వనము = సమూహము )


  ఘనముగ నేర్చి విద్యలను గార్య సమర్ధతఁ బొంది నైపుణ
  మ్మును దగ వృద్ధి సేసికొని పొందఁగ వృత్తిని నాయ వంతుఁడై
  వనితకు నింక మర్త్యునకుఁ బన్నుగ ముప్పది లోపు నిండు యౌ
  వనమున సంతతిం బడయు వానికిఁ గల్గును సౌఖ్యముల్ గడున్

  రిప్లయితొలగించండి
 26. వినుమిది నిక్కపుంబలుకు వీనులవిందగు సుమ్ము శర్మ!యౌ
  వనమున సంతతింబడయు వానికి గల్గును సౌఖ్యముల్ గడున్
  గనుకనె వేగిరంబుగను గన్యను,సద్గుణశీలి,నమ్రతన్
  జనునది గానిపించగను సంతసమొప్పగ బెండ్లియాడుమా

  రిప్లయితొలగించండి
 27. కందం
  ధనముండిన సంతానము
  ను నిదానముగ బడయంగ నోర్చ దగున్, కా
  దనిన, తెలివి గల్గిన య
  వ్వనమున సంతానమందు వాడె సుఖించున్
  ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
  ఉండవల్లి సెంటర్

  రిప్లయితొలగించండి
 28. అనువగు చోటు జీవులకు, హాయిగ వన్య మృగంబులన్నియున్
  మను తమదైన బాణిని సమాగమమౌచు తరించు స్వేచ్ఛగా
  కన పెను పన్ను భారములు కత్తెర కోతలు ఖర్చులేనిదౌ
  వనమున సంతతిం బడయువానికిఁ గల్గును సౌఖ్యముల్ గడున్

  రిప్లయితొలగించండి
 29. జనకజ బాలలిర్వురకు జన్మమొసంగెనదెట్టి సీమయో
  వినుమిల దుర్గతుల్ దొలగి విస్తృతమౌ గన వంశమేరికిన్
  జనహిత కార్యముల్ నెరపు సత్పురుషుండు గడించునేమియో
  వనమున; సంతతిం బడయువానికిఁ; గల్గును సౌఖ్యముల్ గడున్

  రిప్లయితొలగించండి