చం:"అలుగుటయే యెఱుంగని మహామహితాత్ముఁ డనంగఁ " గంసుఁడే యలిగెనె నీ పయిన్ కుజను లైన నరేంద్రులు,కౌరవాళియున్ దలచరె నిన్ను వైరిగ జనార్దన!" యంచు హసించి కృష్ణు డీ "యలుకలు సృష్టి ధర్మ" మనె ,యాత్రత లేకయె ధర్మసూను తోన్. (అలుగుటయే యెరుంగని మహామహితాత్ము డైన ధర్మ రాజు" నీకు కంసుడొక్కడే శత్రువా? అనేకరాజులు,కౌరవులు అంతా శత్రువులే అనగా కృష్ణుడు ఏ మాత్రం ఆత్రత లేక నవ్వి ఇదంత సృష్టిధర్మమే అన్నాడు.)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిదేవకి సుతుని వలననె దేహయాత్ర
రిప్లయితొలగించండియగు నతనికని వినిపించె నాకసమున ,
వెంటనే కడతేర్చక విడుచుట గన
కనలుట యనంగఁ దెలియదు కంసునకును
తేటగీతి
రిప్లయితొలగించండిదేవకీ వసుదేవుల తేరుమీద
ప్రీతిఁగొనువేళలో నశరీరవాణి,
యల్లుడష్టముండు నిను గూల్చనెడుదాక
కనలుట యనంగఁ దెలియదు కంసునకును!
చంపకమాల
తలపుల చెల్లి బావలను దంపతు లన్ గనిమోదమందుచున్
నెలవుకు చేర్చ తేరుపయి నిబ్బరమందుననేగువేళలో
వెలువడి దివ్యవాణి వినిపించెడుదాక గతించు వార్తయే
యలుగుటయే యెఱుంగని మహామహితాత్ముఁ డనంగఁ గంసుఁడే!
పలుకులలోన శాంతము స్వభావమునందున నెమ్మి ధర్మజుం
రిప్లయితొలగించండిడలుగుటయే యెఱుంగని మహామహితాత్ముఁ డనంగఁ, గంసుఁడే
యడలి స్వసేయుచేత తన యంతము గల్గునటంచెరింగి కొం
దలమున దేవకీ సతికి తానొనరించెను పుత్రశోకమున్
రిప్లయితొలగించండిపుట్టినదిన వేడుకటంచు మూర్ఖు డొకడు
కల్లుపాకలో సేవించి కలయము నట
మిత్తరులతోనిటుల చెప్పె మత్తు లోన
కనలుట యనంగఁ దెలియదు కంసునకును.
పలికిన దెవ్వరందుగల వాస్తవమెంత? యెఱుంగ కుండ నా
పలుకుల విశ్వసించి వరవర్ణిని నామె ప్రతి గ్రహీత ద్రె
క్కలిగొనజూచినట్టి గడెకారి యతండు నిజమ్ము
తెల్పుమా
అలుగుటయే యెఱుంగని మహామహితాత్ముఁ డనంగఁ గంసుఁడే?
ఘోరముగ విననగు నశరీరవాణి
రిప్లయితొలగించండిపలుకులే తన చెవులలోఁ బడక ముందు
చెంగ లించిన దనురక్తి చెల్లెలుపయి
కనలుట యనంగఁ దెలియదు కంసునకును
కలదనురక్తి చెల్లిపయిఁ కంసనృపాలుని చిత్తమందునన్
వలనగు ప్రాణనాధునిగ వచ్చెను చెల్లికి వాసుదేవుడే
విలసిత దివ్యవాణి తన వీనులఁ జేరకముందు చెల్లిపై
నలుగుటయే యెఱుంగని మహామహితాత్ముఁ డనంగఁ గంసుఁడే
తే.గీ:బావ పైనను, జెల్లెలి పైన నెపుడు
రిప్లయితొలగించండికనలుట యనంగఁ దెలియదు కంసునకును”
వాని విధి యేమొ ఆకాశవాణిని విని
చెల్లెలిని బావనున్ బట్టి చెరను బెట్టె
చం:తెలియగ లేక వింత తన దీనత తో వసుదేవు డిట్లనెన్-
రిప్లయితొలగించండికల వలె నుండె దేవకి! వికారపు చేష్టల జేయ కంసు డీ
యలుకకు దివ్యవా క్కనెడు నగ్గియె హేతువు లే! గతమ్ములో
నలుగుటయే యెఱుంగని మహామహితాత్ముఁ డనంగఁ గంసుఁడే”
(కంసుడు కోపమందలేదు కేవలము ముప్పు తప్పే ఉపాయము నాలోచించాడు అని అండి)
రిప్లయితొలగించండితే॥ తెలియ మృత్యు రహస్యముఁ దెలివిఁ గనుచు
ముప్పు తప్పు యోచనఁ జేసె ముందు చూపు
తోడ నింతియె గద తాను తొణఁకడాయె
కనులుట యనంగఁ దెలియదు కంసునకును
చం॥ తెలియఁగ సోదరీ మణికి దేహజుఁడష్టమ గర్భమందునన్
వెలయఁగఁ దన్ను త్రుంచునని భీతిలకుండగ యోచనా ధృతిన్
దలచెను ముప్పుతప్పటకుఁ ద్రచ్చుచు నావిధి నింతియే గదా
అలుగటయే యెఱుంగని మహా మహితాత్ముఁడనంగఁ గంసుఁడే!
చ.
రిప్లయితొలగించండిపొలుపుల యిక్కగాఁ దనరు ఫుల్ల శుభాంబుజ లోచనం గనం
బలుకగఁ బూని వచ్చెనొక బంటు క్షితీశుని యాజ్ఞ కల్గి యో
వలపు తలోదరిన్ విరియ వాసిగఁ దీయగఁ జెప్పెనిట్లు దా
"నలుగుటయే యెఱుంగని మహామహితాత్మడనంగఁ గంసుడే !"
సోద రియు బావ లను జాల సొంపు మీర
రిప్లయితొలగించండినాద రించుచు నుండిన సోదరుండు
కన లుట యనంగ దెలి యదు :: కంసునకును
ప్రాణ భయమున గోపించి ప్రజ్వ రిల్లె
చం:"అలుగుటయే యెఱుంగని మహామహితాత్ముఁ డనంగఁ " గంసుఁడే
రిప్లయితొలగించండియలిగెనె నీ పయిన్ కుజను లైన నరేంద్రులు,కౌరవాళియున్
దలచరె నిన్ను వైరిగ జనార్దన!" యంచు హసించి కృష్ణు డీ
"యలుకలు సృష్టి ధర్మ" మనె ,యాత్రత లేకయె ధర్మసూను తోన్.
(అలుగుటయే యెరుంగని మహామహితాత్ము డైన ధర్మ రాజు" నీకు కంసుడొక్కడే శత్రువా? అనేకరాజులు,కౌరవులు అంతా శత్రువులే అనగా కృష్ణుడు ఏ మాత్రం ఆత్రత లేక నవ్వి ఇదంత సృష్టిధర్మమే అన్నాడు.)
సమస్య:
రిప్లయితొలగించండిఅలుగుటయే యెరుంగని మహామహితాత్ముడనంగ ,గంసుడే
చం మా :
అలుగుటయే యెరుంగని మహామహితాత్ముడనంగ గంసుడే,
పలికిన మాయ బల్కులను పాపమనెంచక చారకంబునన్
తొలిమలి బిడ్డలం విడక తొయ్యలి యష్టమ సంతు జంపునన్
కలిగిన ప్రాణభీతి భళి కంసుడు మర్చెను తోడబుట్టువన్
ఔగ్ర సేనుం డల నిరంత రోగ్ర దుష్ట
రిప్లయితొలగించండిగుణ గణ సమేత శిశు గణ కోపనుండు
కాల దేశోచితము లగు వేళ లెఱిఁగి
కనలుట యనంగఁ దెలియదు కంసునకును
అలుగుటయే యెఱుంగని మహామహితాత్ముఁ డనంగఁ జెల్లు నా
సలలిత ధర్మ రాజున కజాత విరోధికి నుర్వి సంతత
జ్వలిత మనో వికార యుత చండ త రాధమ శాసనుం డహో
యలుగుటయే యెఱుంగని మహామహితాత్ముఁ డనంగఁ గంసుఁడే
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
ప్రేమ చూపించుచుండె చెల్లెలును,బావ
పైన, నంతలో నాకాశవాణి పలుక
నతని మరణ వార్తను వినునంత వరకు
కనలుట యనంగఁ దెలియదు కంసునకును.