31, జులై 2025, గురువారం

సమస్య - 5199

1-8-2025 (శుక్రవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“వ్రతధర్మంబుగ మదిరనుఁ ద్రాగుట మేలౌ”

(లేదా...)

“వ్రతధర్మంబుగ నామిషాశన సురాపానంబులం జేయుమా”

21 కామెంట్‌లు:

  1. కందం
    కృతకము సాత్వికమైనన్
    సతతము నాహారమునకు శాకములొప్పున్
    కుతుకల్ గోయగ సాగెడు
    వ్రతధర్మంబుగ మదిరనుఁ ద్రాగుట మేలౌ!

    మత్తేభవిక్రీడితము
    కృతకమ్మన్నది నిర్ణయించు తినుటల్ గీతాప్రబోధమ్ముగన్
    క్రతువుల్ జేసెడి వారలొప్పునది శాకాహారమే యోగ్యమై
    కుతుకల్ గోసెడు రాజసానఁ గదులన్ గ్రూరాత్ముఁడై సాగెడున్
    వ్రతధర్మంబుగ నామిషాశన సురాపానంబులం జేయుమా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సవరించిన కందం

      కందం
      కృతకము సాత్త్వికమైనన్
      సతతము నాహారమునకు శాకములొప్పున్
      కుతుకల్ గోయగ సాగెడు
      వ్రతధర్మంబుగ మదిరనుఁ ద్రాగుట మేలౌ!

      తొలగించండి

  2. అతివా యిష్టం బది నా
    సతి నాతోకలిసి నాటు సారను గ్రోలన్
    ప్రతిదిన మికనీవు పతి
    వ్రత ధర్మంబుగ మదిరనుఁ ద్రాగుట మేలౌ.


    సతి ధర్మమ్ము నెఱుంగగా వలయునో శంపాంగి నేచెప్పెదన్
    పతి మాటన్ జవదాట కూడదుకదా ప్రాణేశుడే సర్వమౌ
    యతివా! చెప్పెడి నాదు మాటలవియే యాలింప మేలౌ పతి
    వ్రత ధర్మంబుగ నామిషాశన సురాపానంబులం జేయుమా.

    రిప్లయితొలగించండి
  3. పితరుడు జెప్పిన విధమున 
    పతియే సతికి పరమమను భావన యుండన్
    సతతమతని తోడన పతి
    వ్రతధర్మంబుగ మదిరనుఁ ద్రాగుట మేలౌ”

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పతివ్రత' అన్నపుడు 'తి' గురువై గణభంగం. "తోడ పతి । వ్రత..." అనండి.

      తొలగించండి
  4. మ.
    పతయాళు ప్రతిమాన శోణ తర తత్పంచాస్య రక్తంబు నా
    దితిజానీకము సేరెఁ బాత్రలను బుత్తెంపంగ రావే మృగా
    క్షి ! తమోవేళలు వచ్చె వంటగదిలో క్షిప్రంబుగా వేగమై
    వ్రతధర్మంబుగ నాశిషాశన సురాపానంబులం జేయుమా !

    రిప్లయితొలగించండి
  5. జతకూడుఁ జెలిమి కత్తియ
    ప్రతిరోజు లభించుచుండు లంచా లికపై
    కుతిదీరన్ గుడుచుటయౌ
    వ్రతధర్మంబుగ మదిరనుఁ ద్రాగుట మేలౌ

    ప్రతిరోజున్ నిను జేరవత్తురుగదా లంచాల ముంచెత్తగా
    జతకూడున్ గద సాకినీకు విధిగా సాయంత్రమిచ్చోటనే
    కుతిదీరన్ గబళించునట్టి వ్రతమే కొంగ్రొత్తదై యుండగా
    వ్రతధర్మంబుగ నామిషాశన సురాపానంబులం జేయుమా

    రిప్లయితొలగించండి
  6. క్రతువౌనప్పుడుఁజిత్తశాంతిగదరాఁగాంచంగ దైవంబులన్
    శ్రుతిసూక్తంబులె మద్యపానమనగా స్తోత్రంబుఁదోయంబునై
    మతిదీరంగను రాగఁదాళములతోమార్తాండ దేజంబుతో
    వ్రతధర్మంబుగ నామిషాశన సురాపానంబులం జేయుమా
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  7. కం:అతిగా త్రాగము మన,మీ
    గతి మిత్రులు కోరు చుండ కాదన గలమా?
    మితముగ త్రాగుము ,స్నేహ
    వ్రతధర్మంబుగ మదిరనుఁ ద్రాగుట మేలౌ”
    (పార్టీలలో ఇది సహజం.మన మేమీ తాగుబోతులం కాదు.మిత్రులు అడుగుతున్నారు కాబట్టి కాస్త తీసుకుందాం అన్నట్టు.)

    రిప్లయితొలగించండి
  8. కం॥ క్రతువులు సేయుచు గతమున
    సతతము జంతు బలి మదిరఁ జవిగొను కతనన్
    హితమని, బలికిరి యిటులను
    వ్రత ధర్మంబుగ మదిరనుఁ ద్రావుట మేలౌ

    మ॥ క్రతువుల్ సేయుచుఁ బ్రాఁత కాలమునఁ బెక్కండ్రావిధిన్ బ్రాణులన్
    సతతమ్మున్ బలి చేయు చుండిరి గదా సామాన్యమేనంచు నా
    తతిలోఁ బల్కినఁ బల్కియండఁ దగునే తర్కించఁగా నిట్టులన్
    వ్రతధర్మంబుగ నామిషాశన సురాపానంబులం జేయుమా

    తతి సమయము
    గతములో అమ్మ గుడులలో జంతుబలి మామూలేనండి. తూగోజి లోని గండి పోచమ్మతల్లి గుడిలో ఇప్పుడూ జరుగుతున్నది. అంతే కాకుండా చిక్కబళాపురం - అనంతపురం
    జిల్లాలలో కొందరు ఎల్లమ్మ సాగు అనే క్రతువులో కల్లు ముంతలలో తెచ్చి పూజ చేస్తారండి. చాలవరకు ఇప్పుడు తగ్గియుండవచ్చునండి. చిన్నతనములో చూసినదే! ఈరెండింటిని కలిపి వ్రాసాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కం॥ 3 వ పాదము హితమని పలికిరి అండి పొరపాటున బలికిరి అని సరళము వ్రాసాను

      తొలగించండి
  9. మ:స్తుతశౌర్యుండవు మద్రదేశనృపతీ!శోభించె నా సేన స
    న్నుత మౌ నీదగు మైత్రి చే గెలుతు మంచున్ ధైర్యమున్ వచ్చె నీ
    మతికిన్ నచ్చగ నీ సుయోధనుడు సన్మానించు నో సూనృత
    వ్రత!ధర్మంబుగ నామిషాశన సురాపానంబులం జేయుమా!
    (నకులసహదేవుల మేనమామ ఐన శల్యుణ్ని ఉపాయం గా తన వైపు త్రిప్పుకొన్నాడు దుర్యోధనుడు. ఆ సందర్భం లో అతిథి మర్యాదల తో అతడు పలికిన మాటలు.)

    రిప్లయితొలగించండి
  10. వ్రతములు దీక్షలు బూజలు
    ప్రతి యొక్కరు జేయు చుంద్రు పరి శుద్ధ ము గాన్
    గతి సె డ సల్పు దు రె ట్టు ల
    వ్రత ధర్మ మ్ము గ మధిర ము త్రాగుట మే లౌ?

    రిప్లయితొలగించండి
  11. పతియే దైవము నాతికిఁ
    బతి వాక్య మలంఘ్య మనెడు పడతికి మఱి సం
    తత నిజ చిత్తేశాను
    వ్రత ధర్మంబుగ మదిరనుఁ ద్రాగుట మేలౌ


    కుత లావాసముఁ గోర యక్షవర! యక్షోనాథ సందిష్ట సు
    వ్రత ధర్మంబుగ సోమపానమును సంరంభంబునం జేయుమా
    కుతలప్రాప్తముఁ గోరితే నసుర! రక్షోనాథ సందిష్ట దు
    ర్వ్రత ధర్మంబుగ నామిషాశన సురాపానంబులం జేయుమా

    [కుతలము = 1. భూమి, 2. అథోలోకములలో నొకటి]

    రిప్లయితొలగించండి

  12. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    సతతము జాతర లందున
    హితమని జీవాలను బలి యిడు చుండన్
    మితముగ శ్రమజీవు లచట
    వ్రత ధర్మంబుగ మదిరనుఁ ద్రాగుట మేలౌ.

    రిప్లయితొలగించండి