2-9-2025 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“భర్గుఁ డుండని క్షేత్రము వారణాసి”
(లేదా...)
“శివుఁడు లేఁడనె వారణాసియె జీవుఁడా యిటు రాకుమా”
(బ్రహ్మశ్రీ వద్దిపర్తి వారి కాశీ శతావధానంలో కవిశ్రీ సత్తిబాబు గారి సమస్య)
తరళము:శివుని నెమ్మనమందు భక్తిగ చింతనమ్మును సేయకన్శివమునొందుట దుర్లభమ్మని చెప్పినన్ వినవేలనోశివుఁడు లేఁడనె వారణాసియె జీవుఁడా యిటు రాకుమాభవుని దర్శనభాగ్యమబ్బదు పాపకర్ములకిచ్చటన్
తేటగీతిఆస్తికత్వము నమ్మిన, హరుడు గలఁడుసృష్టినంతటగనవచ్చు శివుని యునికి!నమ్మలేనట్టి మూర్ఖులౌ నాస్తికులకుభర్గుఁ డుండని క్షేత్రము వారణాసి!తరళముశివుని పాదములంటి పుణ్యము చేకొనంగను స్వచ్ఛమైభవము బాపెడు పుణ్యతీర్థము గంగ! హానికరమ్మనన్వివిధమైన రసాయనమ్ముల వెంటదెచ్చెడు వారికైశివుఁడు లేఁడనె వారణాసియె జీవుఁడా యిటు రాకుమా!
తరళము.భవుడు పర్వతరాజపుత్త్రిని పార్వతిం ప్రణయంబుగా కువలయంబుగ నల్లరంగున కోమలీవన కిన్క దే వి వడి స్వామిని వీడి పోవగ విశ్వనాథుడు సాగగన్ శివుడు లేడనె వారణాసియె, జీవుడా యిటు రాకుమా !
శివుని తిరముగ నిలుపక చిత్తమందునెన్ని పూజలు సల్పిన నేమి ఫలముభవుని గాంచఁగ నేగిన భక్తిలేకభర్గుఁ డుండని క్షేత్రము వారణాసి
గురువు నడిగె శిష్యుడొకండు హరుడు కలడెవారణాశిలోన గురువు బదులు పలికె భూరిపై నమ్మకము లేని వారల కిదిభర్గుఁ డుండని క్షేత్రము, వారణాసి.శివము గోరుచు విశ్వనాథుని క్షేత్రమంచును జేరుచున్ భువన పావని యందు మున్గుటె పుణ్యమంచని మూర్ఖులై వివిధ రీతుల కల్మషమ్ముల వెంట దెచ్చెడు వారికైశివుఁడు లేఁడనె వారణాసియె జీవుఁడా యిటు రాకుమా.
భక్త జనులను కరుణించు పరమ శివుడుసతము కార్యనిమగ్నుడు సత్యమిదియెపుణ్యులకు వరములొసగఁ బోయినపుడుభర్గుఁ డుండని క్షేత్రము వారణాసిశివశివా! కరుణించుమాయని జీవుడే తపియించగాభవుడు చేరగ పోయినాడట భక్తునొక్కనిఁ బ్రోవగాశివుఁడు లేఁడనె వారణాసియె జీవుఁడా యిటు రాకుమాభువన మందున నెక్కడైనను పూజ నీకిడు మోక్షమే
ఆంధ్ర నాట తి రుమలన నజగుడె , మరిభర్గుఁ డుండని క్షేత్రము ; వారణాసిఉత్తరమున నుండ , నచట యుగ్రు డుండు ! ఎవరెచట వెలసిరనుచు నెరుగ నగును
తరళము:
రిప్లయితొలగించండిశివుని నెమ్మనమందు భక్తిగ చింతనమ్మును సేయకన్
శివమునొందుట దుర్లభమ్మని చెప్పినన్ వినవేలనో
శివుఁడు లేఁడనె వారణాసియె జీవుఁడా యిటు రాకుమా
భవుని దర్శనభాగ్యమబ్బదు పాపకర్ములకిచ్చటన్
తేటగీతి
రిప్లయితొలగించండిఆస్తికత్వము నమ్మిన, హరుడు గలఁడు
సృష్టినంతటగనవచ్చు శివుని యునికి!
నమ్మలేనట్టి మూర్ఖులౌ నాస్తికులకు
భర్గుఁ డుండని క్షేత్రము వారణాసి!
తరళము
శివుని పాదములంటి పుణ్యము చేకొనంగను స్వచ్ఛమై
భవము బాపెడు పుణ్యతీర్థము గంగ! హానికరమ్మనన్
వివిధమైన రసాయనమ్ముల వెంటదెచ్చెడు వారికై
శివుఁడు లేఁడనె వారణాసియె జీవుఁడా యిటు రాకుమా!
తరళము.
రిప్లయితొలగించండిభవుడు పర్వతరాజపుత్త్రిని పార్వతిం ప్రణయంబుగా
కువలయంబుగ నల్లరంగున కోమలీవన కిన్క దే
వి వడి స్వామిని వీడి పోవగ విశ్వనాథుడు సాగగన్
శివుడు లేడనె వారణాసియె, జీవుడా యిటు రాకుమా !
శివుని తిరముగ నిలుపక చిత్తమందు
రిప్లయితొలగించండినెన్ని పూజలు సల్పిన నేమి ఫలము
భవుని గాంచఁగ నేగిన భక్తిలేక
భర్గుఁ డుండని క్షేత్రము వారణాసి
రిప్లయితొలగించండిగురువు నడిగె శిష్యుడొకండు హరుడు కలడె
వారణాశిలోన గురువు బదులు పలికె
భూరిపై నమ్మకము లేని వారల కిది
భర్గుఁ డుండని క్షేత్రము, వారణాసి.
శివము గోరుచు విశ్వనాథుని క్షేత్రమంచును జేరుచున్
భువన పావని యందు మున్గుటె పుణ్యమంచని మూర్ఖులై
వివిధ రీతుల కల్మషమ్ముల వెంట దెచ్చెడు వారికై
శివుఁడు లేఁడనె వారణాసియె జీవుఁడా యిటు రాకుమా.
భక్త జనులను కరుణించు పరమ శివుడు
రిప్లయితొలగించండిసతము కార్యనిమగ్నుడు సత్యమిదియె
పుణ్యులకు వరములొసగఁ బోయినపుడు
భర్గుఁ డుండని క్షేత్రము వారణాసి
శివశివా! కరుణించుమాయని జీవుడే తపియించగా
భవుడు చేరగ పోయినాడట భక్తునొక్కనిఁ బ్రోవగా
శివుఁడు లేఁడనె వారణాసియె జీవుఁడా యిటు రాకుమా
భువన మందున నెక్కడైనను పూజ నీకిడు మోక్షమే
ఆంధ్ర నాట తి రుమలన నజగుడె , మరి
రిప్లయితొలగించండిభర్గుఁ డుండని క్షేత్రము ; వారణాసి
ఉత్తరమున నుండ , నచట యుగ్రు డుండు !
ఎవరెచట వెలసిరనుచు నెరుగ నగును