2-9-2025 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“భర్గుఁ డుండని క్షేత్రము వారణాసి”
(లేదా...)
“శివుఁడు లేఁడనె వారణాసియె జీవుఁడా యిటు రాకుమా”
(బ్రహ్మశ్రీ వద్దిపర్తి వారి కాశీ శతావధానంలో కవిశ్రీ సత్తిబాబు గారి సమస్య)
తరళము:శివుని నెమ్మనమందు భక్తిగ చింతనమ్మును సేయకన్శివమునొందుట దుర్లభమ్మని చెప్పినన్ వినవేలనోశివుఁడు లేఁడనె వారణాసియె జీవుఁడా యిటు రాకుమాభవుని దర్శనభాగ్యమబ్బదు పాపకర్ములకిచ్చటన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తేటగీతిఆస్తికుండైన వానికి హరుడు గలఁడుసృష్టినంతటగనవచ్చు శివుని యునికి!నమ్మలేనట్టి మూర్ఖులౌ నాస్తికులకుభర్గుఁ డుండని క్షేత్రము వారణాసి!తరళముశివుని పాదములంటి పుణ్యము చేకొనంగను స్వచ్ఛమైభవము బాపెడు పుణ్యతీర్థము గంగ! హానికరమ్మనన్వివిధరూప రసాయనమ్ముల వెంటదెచ్చెడు వారికైశివుఁడు లేఁడనె వారణాసియె జీవుఁడా యిటు రాకుమా!
తరళము.భవుడు పర్వతరాజపుత్త్రిని పార్వతిం ప్రణయంబుగా కువలయంబుగ నల్లరంగున కోమలీవన కిన్క దే వి వడి స్వామిని వీడి పోవగ విశ్వనాథుడు సాగగన్ శివుడు లేడనె వారణాసియె, జీవుడా యిటు రాకుమా !
మీ పూరణ బాగున్నది. అభినందనలు."పార్వతిం బ్రణయంబుగా" అనండి.
శివుని తిరముగ నిలుపక చిత్తమందునెన్ని పూజలు సల్పిన నేమి ఫలముభవుని గాంచఁగ నేగిన భక్తిలేకభర్గుఁ డుండని క్షేత్రము వారణాసి
గురువు నడిగె శిష్యుడొకండు హరుడు కలడెవారణాశిలోన గురువు బదులు పలికె భూరిపై నమ్మకము లేని వారల కిదిభర్గుఁ డుండని క్షేత్రము, వారణాసి.శివము గోరుచు విశ్వనాథుని క్షేత్రమంచును జేరుచున్ భువన పావని యందు మున్గుటె పుణ్యమంచని మూర్ఖులై వివిధ రీతుల కల్మషమ్ముల వెంట దెచ్చెడు వారికైశివుఁడు లేఁడనె వారణాసియె జీవుఁడా యిటు రాకుమా.
భక్త జనులను కరుణించు పరమ శివుడుసతము కార్యనిమగ్నుడు సత్యమిదియెపుణ్యులకు వరములొసగఁ బోయినపుడుభర్గుఁ డుండని క్షేత్రము వారణాసిశివశివా! కరుణించుమాయని జీవుడే తపియించగాభవుడు చేరగ పోయినాడట భక్తునొక్కనిఁ బ్రోవగాశివుఁడు లేఁడనె వారణాసియె జీవుఁడా యిటు రాకుమాభువన మందున నెక్కడైనను పూజ నీకిడు మోక్షమే
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
ఆంధ్ర నాట తి రుమలన నజగుడె , మరిభర్గుఁ డుండని క్షేత్రము ; వారణాసిఉత్తరమున నుండ , నచట యుగ్రు డుండు ! ఎవరెచట వెలసిరనుచు నెరుగ నగును
తే॥ భక్తి హీనుఁడొకఁడచట భవము మీదనాశ తోడ మ్రొక్కఁగ లవలేశ మంతఫలముఁ గలుగలేదని యెంచి పలికె నిటులభర్గుఁ డుండని క్షేత్రము వారణాసితరళముభవము మీదనె మోహముంచుచు భక్తి హీనత తోడుతన్ధవునిఁ గొల్చుచుఁ జేయి చాచఁగ దక్క లేదనిఁ దల్చుచున్భవుని వేడగ నెంచ మ్రోగెను ప్రస్ఫుటమ్ముగ నిట్టులన్”శివుఁడు లేడనె వారణాసియె జీవుఁడా యిటు రాకుమా”(నిజభక్తి లేకుంటే శివుడు లేడని యండి)
గుడులు గోపురము లు జూచు కుతు క మొ దవ యాత్ర లొ న రింత్రు కొందరు చిత్ర ముగను వెడలి చేరియు గమనించి వెదికి నంత భర్గు డు o డని క్షేత్ర ము వార ణా సి
ఓం నమశ్శంభవే యని యోం నమశ్శివాయ యని మ్రొక్కు చుందురు భక్తు లెల్లనవని వీక్షింప నిత్య పూజాది హీనభర్గుఁ డుండని క్షేత్రము వారణాసి చెవులఁ జొన్పకు మిట్టి వాక్కులు చెల్ల వెన్నఁడు రాకు విష్ణు విట లేడనె ద్వారకా పురి చూడఁ బంక్తి రథాత్మ సంభవుఁడు లేఁడనె భద్ర శైలమె భక్తుఁడా యిటు రాకుమా శివుఁడు లేఁడనె వారణాసియె జీవుఁడా యిటు రాకుమా
పిచ్చికూతలు గూసెను బిచ్చివాడుభర్గుఁ డుండని క్షేత్రము వారణాసి”యనుచు, సత్యదూరమదియ యార్య! వినుము వారణాసియె భర్గుని వాసవమ్ము
తే.గీ:నిత్యమున్ భక్త జనుల తో నిండి యుండి,వేద మంత్రఘోషల గల్గి, విమల గాంగజలపు టభిషేకముల వీడి క్షణము గూడభర్గుఁ డుండని క్షేత్రము వారణాసి”
శివుఁడు లేఁడనె వారణాసియె జీవుఁడా యిటు రాకుమా”భవుని వాసము వారణాసియె వద్దు సందియమార్యుఁడా!భవపు బంధముఁద్రెంచి మాకిక భవ్యజీవితమీయుమాభువన మందున వాసిఁగాంచెడు పుణ్యజీవన మిచ్చుచున్
సమస్య:”శివుఁడు లేడనె వారణాసియె జీవుఁడా యిటు రాకుమా”తరళము:1 అవనియందున మోక్షమందగ కాశి మిన్నని చెప్పిరే భవభయంబుల దీర్చు నీశుడు భక్తి నమ్మిక జూచునే సవపు దేవర గంగ వీడియు సాగె కల్కి పదంబుతో ”శివుఁడు లేడనె వారణాసియె జీవుఁడా యిటు రాకుమా”2 భవపు నిచ్ఛలు వీడ సాధ్యమ భర్గు చింతన లేనిచో శివుని నామము దీర్చులే చిరు చింతయున్నను తథ్యమే భవుడు మెచ్చని హంగులచ్చట బాధవెట్టగ గంగయే ”శివుఁడు లేడనె వారణాసియె జీవుఁడా యిటు రాకుమా”
3..కవులగుంపులు కాశికేగగ వాణి కన్నుల పండువే అవల గోష్ఠుల సంబరంబున యాదిభిక్షువె వీడెనే భవుని మెచ్చెను బ్రాహ్మియే తన సంతు సందడి హెచ్చగన్ ”శివుఁడు లేడనె వారణాసియె జీవుఁడా యిటు రాకుమా”(వద్దిపర్తివారి అవధాన సమస్య)
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.ఉర్విపై నెంత వెదకిన నుండబోదుభర్గుఁ డుండని క్షేత్రము; వారణాసియందు గంగలో స్నానము నాచరించికొండయల్లుని సేవించ కోరుకొంద్రు.
తరళము:
రిప్లయితొలగించండిశివుని నెమ్మనమందు భక్తిగ చింతనమ్మును సేయకన్
శివమునొందుట దుర్లభమ్మని చెప్పినన్ వినవేలనో
శివుఁడు లేఁడనె వారణాసియె జీవుఁడా యిటు రాకుమా
భవుని దర్శనభాగ్యమబ్బదు పాపకర్ములకిచ్చటన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితేటగీతి
తొలగించండిఆస్తికుండైన వానికి హరుడు గలఁడు
సృష్టినంతటగనవచ్చు శివుని యునికి!
నమ్మలేనట్టి మూర్ఖులౌ నాస్తికులకు
భర్గుఁ డుండని క్షేత్రము వారణాసి!
తరళము
శివుని పాదములంటి పుణ్యము చేకొనంగను స్వచ్ఛమై
భవము బాపెడు పుణ్యతీర్థము గంగ! హానికరమ్మనన్
వివిధరూప రసాయనమ్ముల వెంటదెచ్చెడు వారికై
శివుఁడు లేఁడనె వారణాసియె జీవుఁడా యిటు రాకుమా!
తరళము.
రిప్లయితొలగించండిభవుడు పర్వతరాజపుత్త్రిని పార్వతిం ప్రణయంబుగా
కువలయంబుగ నల్లరంగున కోమలీవన కిన్క దే
వి వడి స్వామిని వీడి పోవగ విశ్వనాథుడు సాగగన్
శివుడు లేడనె వారణాసియె, జీవుడా యిటు రాకుమా !
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"పార్వతిం బ్రణయంబుగా" అనండి.
శివుని తిరముగ నిలుపక చిత్తమందు
రిప్లయితొలగించండినెన్ని పూజలు సల్పిన నేమి ఫలము
భవుని గాంచఁగ నేగిన భక్తిలేక
భర్గుఁ డుండని క్షేత్రము వారణాసి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిగురువు నడిగె శిష్యుడొకండు హరుడు కలడె
వారణాశిలోన గురువు బదులు పలికె
భూరిపై నమ్మకము లేని వారల కిది
భర్గుఁ డుండని క్షేత్రము, వారణాసి.
శివము గోరుచు విశ్వనాథుని క్షేత్రమంచును జేరుచున్
భువన పావని యందు మున్గుటె పుణ్యమంచని మూర్ఖులై
వివిధ రీతుల కల్మషమ్ముల వెంట దెచ్చెడు వారికై
శివుఁడు లేఁడనె వారణాసియె జీవుఁడా యిటు రాకుమా.
భక్త జనులను కరుణించు పరమ శివుడు
రిప్లయితొలగించండిసతము కార్యనిమగ్నుడు సత్యమిదియె
పుణ్యులకు వరములొసగఁ బోయినపుడు
భర్గుఁ డుండని క్షేత్రము వారణాసి
శివశివా! కరుణించుమాయని జీవుడే తపియించగా
భవుడు చేరగ పోయినాడట భక్తునొక్కనిఁ బ్రోవగా
శివుఁడు లేఁడనె వారణాసియె జీవుఁడా యిటు రాకుమా
భువన మందున నెక్కడైనను పూజ నీకిడు మోక్షమే
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిఆంధ్ర నాట తి రుమలన నజగుడె , మరి
రిప్లయితొలగించండిభర్గుఁ డుండని క్షేత్రము ; వారణాసి
ఉత్తరమున నుండ , నచట యుగ్రు డుండు !
ఎవరెచట వెలసిరనుచు నెరుగ నగును
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితే॥ భక్తి హీనుఁడొకఁడచట భవము మీద
రిప్లయితొలగించండినాశ తోడ మ్రొక్కఁగ లవలేశ మంత
ఫలముఁ గలుగలేదని యెంచి పలికె నిటుల
భర్గుఁ డుండని క్షేత్రము వారణాసి
తరళము
భవము మీదనె మోహముంచుచు భక్తి హీనత తోడుతన్
ధవునిఁ గొల్చుచుఁ జేయి చాచఁగ దక్క లేదనిఁ దల్చుచున్
భవుని వేడగ నెంచ మ్రోగెను ప్రస్ఫుటమ్ముగ నిట్టులన్
”శివుఁడు లేడనె వారణాసియె జీవుఁడా యిటు రాకుమా”
(నిజభక్తి లేకుంటే శివుడు లేడని యండి)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగుడులు గోపురము లు జూచు కుతు క మొ దవ
తొలగించండియాత్ర లొ న రింత్రు కొందరు చిత్ర ముగను
వెడలి చేరియు గమనించి వెదికి నంత
భర్గు డు o డని క్షేత్ర ము వార ణా సి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఓం నమశ్శంభవే యని యోం నమశ్శి
రిప్లయితొలగించండివాయ యని మ్రొక్కు చుందురు భక్తు లెల్ల
నవని వీక్షింప నిత్య పూజాది హీన
భర్గుఁ డుండని క్షేత్రము వారణాసి
చెవులఁ జొన్పకు మిట్టి వాక్కులు చెల్ల వెన్నఁడు రాకు వి
ష్ణు విట లేడనె ద్వారకా పురి చూడఁ బంక్తి రథాత్మ సం
భవుఁడు లేఁడనె భద్ర శైలమె భక్తుఁడా యిటు రాకుమా
శివుఁడు లేఁడనె వారణాసియె జీవుఁడా యిటు రాకుమా
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపిచ్చికూతలు గూసెను బిచ్చివాడు
రిప్లయితొలగించండిభర్గుఁ డుండని క్షేత్రము వారణాసి”
యనుచు, సత్యదూరమదియ యార్య! వినుము
వారణాసియె భర్గుని వాసవమ్ము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితే.గీ:నిత్యమున్ భక్త జనుల తో నిండి యుండి,
రిప్లయితొలగించండివేద మంత్రఘోషల గల్గి, విమల గాంగ
జలపు టభిషేకముల వీడి క్షణము గూడ
భర్గుఁ డుండని క్షేత్రము వారణాసి”
శివుఁడు లేఁడనె వారణాసియె జీవుఁడా యిటు రాకుమా”
రిప్లయితొలగించండిభవుని వాసము వారణాసియె వద్దు సందియమార్యుఁడా!
భవపు బంధముఁద్రెంచి మాకిక భవ్యజీవితమీయుమా
భువన మందున వాసిఁగాంచెడు పుణ్యజీవన మిచ్చుచున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసమస్య:
రిప్లయితొలగించండి”శివుఁడు లేడనె వారణాసియె జీవుఁడా యిటు రాకుమా”
తరళము:
1 అవనియందున మోక్షమందగ కాశి మిన్నని చెప్పిరే
భవభయంబుల దీర్చు నీశుడు భక్తి నమ్మిక జూచునే
సవపు దేవర గంగ వీడియు సాగె కల్కి పదంబుతో
”శివుఁడు లేడనె వారణాసియె జీవుఁడా యిటు రాకుమా”
2 భవపు నిచ్ఛలు వీడ సాధ్యమ భర్గు చింతన లేనిచో
శివుని నామము దీర్చులే చిరు చింతయున్నను తథ్యమే
భవుడు మెచ్చని హంగులచ్చట బాధవెట్టగ గంగయే
”శివుఁడు లేడనె వారణాసియె జీవుఁడా యిటు రాకుమా”
3..కవులగుంపులు కాశికేగగ వాణి కన్నుల పండువే
రిప్లయితొలగించండిఅవల గోష్ఠుల సంబరంబున యాదిభిక్షువె వీడెనే
భవుని మెచ్చెను బ్రాహ్మియే తన సంతు సందడి హెచ్చగన్
”శివుఁడు లేడనె వారణాసియె జీవుఁడా యిటు రాకుమా”
(వద్దిపర్తివారి అవధాన సమస్య)
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
ఉర్విపై నెంత వెదకిన నుండబోదు
భర్గుఁ డుండని క్షేత్రము; వారణాసి
యందు గంగలో స్నానము నాచరించి
కొండయల్లుని సేవించ కోరుకొంద్రు.