24-3-2026 (మంగళవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“వీణాధరీ దుర్గ విభవమ్ము లిమ్ము”(లేదా...)“వరవీణామృదుపాణివై వరలు శర్వాణీ సిరుల్ గూర్చుమా”
ద్విపదవాణివై యొకచోట వాసిగా వెలసిరాణివై పరమేశు ప్రాణసఖివనరాణకెక్కితివె కొల్హాపురి రమగవీణాధరీ! దుర్గ! విభవమ్ము లిమ్ముమత్తేభవిక్రీడితముస్థిరకీర్తిన్ గని బ్రోచితే జనని కాశ్మీరమ్మునన్ వాణివై!వర విశ్వేశ్వర తీర్థమందు మము గావంగన్ విశాలాక్షివైకురువన్ సంపద లక్ష్మివై మిగులగన్ గొల్హాపురంబందునన్వరవీణామృదుపాణివై వరలు శర్వాణీ !సిరుల్ గూర్చుమా!
మ.స్థిర హృత్పీఠమునందు నీదు రుచిమత్సిందూర యుక్తాంఘ్రులం గరమౌ పూనికతోడి నిల్పెదను నీకై వేచి సద్బుద్ధికై వరవీణామృదుపాణివై వరలు శర్వాణీ, సిరుల్ గూర్చుమా ధర నారాయణపత్నివౌచు సకలాధారంబు నీవే చుడీ !
ప్రాణ భాస్వంతపు వశవీవు నా పు రాణ పురుషునకు ప్రాణ సఖి రమ పాణిని పొత్తమున్ వాసిగ దాల్చు వీణాధరీ, దుర్గ, విభవమ్ము లిమ్ము.హరి డెందమ్మున నుందువో శివుని దేహార్ధంబునన్ నిల్తువో యరవిందాసను నాననమ్ము వగు విద్యాదేవివో నీవు మా మొర లాలింపగ రమ్ము వేగమున నంభోజాక్షి ధ్యానింతు నే వరవీణామృదుపాణివై వరలు శర్వాణీ సిరుల్ గూర్చుమా.
వాణివి నీవని వచియింతురమ్మప్రాణ రక్షవు నీవు భ్రామరివమ్మ క్షోణిపై వెలసిన గోమిని వమ్మ వీణాధరీ దుర్గ విభవమ్ము లిమ్ముగిరిపై నీగుడిఁ జేరి కొల్తుముగదా క్షేమంకరీ! శాంభవీ!మరినీరూపము రోజుకొక్కటనుచున్ మాతంగి నిన్ దీర్చగాపరమానందము గల్గజేయు దసరా భక్తాళి నేత్రాలకేవరవీణామృదుపాణివై వరలు శర్వాణీ సిరుల్ గూర్చుమా[విజయవాడ దుర్గ గుడిలో దసరా వేడుకల్లో అమ్మవారి అలంకారములు రోజు కొక్క రీతిని జేయుట విదితమే]
ద్విపద
రిప్లయితొలగించండివాణివై యొకచోట వాసిగా వెలసి
రాణివై పరమేశు ప్రాణసఖివన
రాణకెక్కితివె కొల్హాపురి రమగ
వీణాధరీ! దుర్గ! విభవమ్ము లిమ్ము
మత్తేభవిక్రీడితము
స్థిరకీర్తిన్ గని బ్రోచితే జనని కాశ్మీరమ్మునన్ వాణివై!
వర విశ్వేశ్వర తీర్థమందు మము గావంగన్ విశాలాక్షివై
కురువన్ సంపద లక్ష్మివై మిగులగన్ గొల్హాపురంబందునన్
వరవీణామృదుపాణివై వరలు శర్వాణీ !సిరుల్ గూర్చుమా!
మ.
రిప్లయితొలగించండిస్థిర హృత్పీఠమునందు నీదు రుచిమత్సిందూర యుక్తాంఘ్రులం
గరమౌ పూనికతోడి నిల్పెదను నీకై వేచి సద్బుద్ధికై
వరవీణామృదుపాణివై వరలు శర్వాణీ, సిరుల్ గూర్చుమా
ధర నారాయణపత్నివౌచు సకలాధారంబు నీవే చుడీ !
రిప్లయితొలగించండిప్రాణ భాస్వంతపు వశవీవు నా పు
రాణ పురుషునకు ప్రాణ సఖి రమ
పాణిని పొత్తమున్ వాసిగ దాల్చు
వీణాధరీ, దుర్గ, విభవమ్ము లిమ్ము.
హరి డెందమ్మున నుందువో శివుని దేహార్ధంబునన్ నిల్తువో
యరవిందాసను నాననమ్ము వగు విద్యాదేవివో నీవు మా
మొర లాలింపగ రమ్ము వేగమున నంభోజాక్షి ధ్యానింతు నే
వరవీణామృదుపాణివై వరలు శర్వాణీ సిరుల్ గూర్చుమా.
వాణివి నీవని వచియింతురమ్మ
రిప్లయితొలగించండిప్రాణ రక్షవు నీవు భ్రామరివమ్మ
క్షోణిపై వెలసిన గోమిని వమ్మ
వీణాధరీ దుర్గ విభవమ్ము లిమ్ము
గిరిపై నీగుడిఁ జేరి కొల్తుముగదా క్షేమంకరీ! శాంభవీ!
మరినీరూపము రోజుకొక్కటనుచున్ మాతంగి నిన్ దీర్చగా
పరమానందము గల్గజేయు దసరా భక్తాళి నేత్రాలకే
వరవీణామృదుపాణివై వరలు శర్వాణీ సిరుల్ గూర్చుమా
[విజయవాడ దుర్గ గుడిలో దసరా వేడుకల్లో అమ్మవారి అలంకారములు రోజు కొక్క రీతిని జేయుట విదితమే]