10, మార్చి 2026, మంగళవారం

సమస్య - 5404

11-3-2026 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నీరు చాలక దీపమ్ము లారిపోయె”
(లేదా...)
“నీరము లేక దీపములు నిల్చి వెలుంగక యారెఁ జూడుమా”
(ఆకాశవాణి వారి సమస్య)

16 కామెంట్‌లు:

  1. గీ. ఆనకట్టన బంధించి వాననీరు
    అందజేసిరి విద్యుత్తునందరకును
    కరువుదినపు వర్షాభావ కారణమున
    నీరు చాలక దీపమ్ము లారిపోయె

    రిప్లయితొలగించండి
  2. తేటగీతి
    అవసరమునకు సరిపడు నంతమేర
    లేక యుత్పత్తి నేడు పరిశ్రమలవె
    చిత్తు! యిండ్ల కును జలవిద్యుత్తమర్చు
    నీరు చాలక, దీపమ్ము లారిపోయె!

    ఉత్పలమాల
    మేరలు లేని వాడకము మేదిని నుండగ నేడు విద్యుదా
    ధార పరిశ్రమల్, గృహములన్నియు కోతకు నెంచుచుండగన్
    భూరిగ బొగ్గు, గాలియును మూలమునైన, జలాశయమ్ములన్
    నీరము లేక దీపములు నిల్చి వెలుంగక యారెఁ జూడుమా!

    రిప్లయితొలగించండి
  3. ఎండ భగభగ లాడుచు మండు చుండ ,
    పైరులెండిపోవునుగద వదలినట్టి
    నీరు చాలక ; దీపమ్ము లారిపోయె
    దగిన పరిమాణమంతటి తైలమిడక

    రిప్లయితొలగించండి


  4. మొక్కలెండెనేల తెలుపు? పూజ చేయు
    పాళ మందు తైల మదియే వత్తి కంద
    కున్న జరుగు ఫలంబేమి టన్న చెప్పె
    నీరు చాలక, దీపమ్ము లారిపోయె.


    కూరిమి తోడ ప్రేక్షకులు కోరిన వెంటనె యింద్రజాలికుం
    డోరిమి తో ప్రదర్శనము నొక్కటి నిచ్చెడి వేళ యాతడే
    నీరును తైలమున్ గలిపి నేరుపు గా వెలిగించు వేళ నా
    నీరము లేక దీపములు నిల్చి వెలుంగక యారెఁ జూడుమా.

    రిప్లయితొలగించండి
  5. సారవంతమయిన కడు చక్కనిదగు
    నేలమీద పుట్టి పెరిగెనా లతికలు
    కన్నుల యెదుటఁ వేసవి కాలమందు
    నీరు చాలక దీపమ్ము లారిపోయె

    సారము గల్గినట్టిదగు చక్కని నేలను బుట్టి చెచ్చెరన్
    దీరుగ వృద్ధిచెందినవి దివ్యమనోహర రూపునన్ లతల్
    మారినకాలమందు పరిమారినవా యని వీక్షసేయగా
    నీరము లేక దీపములు నిల్చి వెలుంగక యారెఁ జూడుమా

    [దీపములు = లతలు; వెలుగు = శోభిల్లు]

    రిప్లయితొలగించండి
  6. తే.గీ:గ్రీష్మమే రాగ నెండలు రెచ్చి పోవ
    నింకె నదులలో నీరమ్ము, లింత వరకు
    విద్యుదుత్పత్తి సాగగా వెలుగు లిచ్చు
    నీరు చాలక దీపమ్ము లారిపోయె

    రిప్లయితొలగించండి
  7. ఉ;తీ రగు వాన లేక కడు తీవ్రత నెండ దహింప రైతుకున్
    భారము కాగ సేద్యమును, వాహినులన్ జలముల్ కనిష్ఠతన్
    జేర కరెంటు కోత లయి, చేవ నొసంగెడు మూలశక్తి యౌ
    నీరము లేక దీపములు నిల్చి వెలుంగక యారెఁ జూడుమా”

    రిప్లయితొలగించండి
  8. నీరమె యింధనమ్ము కరణిం బనిచేయును వెల్గు నింపగన్
    ధారుణియందు విద్యుతును తద్దయు నుద్గతి సల్ప, నక్కటా
    దారుణ క్షామమేర్పడఁగ దర్దురముల్గనరాక నింగిలో
    నీరము లేక దీపములు నిల్చి వెలుంగక యారెఁ జూడుమా

    రిప్లయితొలగించండి
  9. తే॥ నీరె యొసఁగు విద్యుచ్ఛక్తి నిశ్చలముగ
    కాంతి దీపముల కిడఁగఁ గఱవు నెగయ
    వర్షపాతముఁ దక్కువై వాహినులను
    నీరు చాలక దీపమ్ము లారిపోయె

    ఉ॥ నీరము జాలు వారనటు నిత్యము యంత్రము లాడుచుండఁగన్
    గోరిన శక్తి విచ్చుఁ గద గొప్పగ దీపము లెల్ల వెల్గఁగన్
    ధారుణి వర్షపాత సమతాళము క్షీణము గాఁగ జ్యానిలో
    నీరము లేక దీపములు నిల్చి వెలుంగక యారెఁ జూడుమా

    సమతాళము హెచ్చుతగ్గులు లేకుండా సరియైన విధముగా నున్నది జ్యాని నది

    హైడ్రో ఎలక్ట్రిసిటీ నేను వ్రాసినా, థర్మల్ న్యూక్లియర్ ఎలక్ట్రిసిటీ కి కూడ నీటి లభ్యత అత్యవసరముండి

    రిప్లయితొలగించండి
  10. వరుణ దేవుడు జూపని కరుణ వలన
    నెండె ను జలా శ యము లన్ని యిపుడు జూడ
    కొఱ వడిన విద్యు దు త్ప త్తి కొఱకు తగిన
    నీరు చాలక దీపమ్ము లారి పోయె

    రిప్లయితొలగించండి
  11. వెలుఁగ వలె నఖండమ్ముగ నిలయ మందు
    దీప పంక్తులు నిత్యమ్ము భూప వర్య
    తెమ్ము శీఘ్రమ్ము శుద్ధ తైలమ్ము, వలదు
    నీరు, చాలక దీపమ్ము లాఱిపోయె


    తోరము దుఃఖ దాయకము తూర్ణము తే వలె నింక నూనెనే
    సార విచారమే కలుగ సజ్జన పంక్తికి మందిరమ్ములో
    నారయ దివ్య పాదపచ యాభము లక్కట తైల రాశి నా
    నీరము లేక దీపములు నిల్చి వెలుంగక యాఱెఁ జూడుమా

    రిప్లయితొలగించండి
  12. జలముతోడ విద్యుచ్ఛక్తి సంతరింప
    వెలుగు రేఖల వెదజల్లు పుడమి పైన
    క్షామమేర్పడి వానలు కానరాక
    నీరు చాలక దీపమ్ము లారిపోయె

    రిప్లయితొలగించండి
  13. పంట పొలములు పూర్తిగాఁబండిపోయె
    నీరు చాలక,దీపమ్ము లారిపోయయెఁ
    బెద్ద గాలులు వీచుచుఁ బిడుగు పడఁగ
    నెపుఁడు వచ్చునో దీపాలు సెప్పలేము

    రిప్లయితొలగించండి
  14. సారము గల్గియున్ బుడమి సాలుల వెంబడి గట్టియాయెనే
    నీరములేక,దీపములు నిల్చివెలుంగకయారెఁజూడుమా
    జోరుగ వర్షముల్ గురియ చూరులనుండియు ధారకారగాఁ
    దోరపు చెమ్మయుండుటన దూలము ప్రక్కన తీగలూడగన్

    రిప్లయితొలగించండి

  15. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    ఎండ కాలము వృక్షమ్ము లెండిపోయె
    నీరు చాలక; దీపమ్ము లారిపోయె
    తైలమున్ లేక ప్రమిదలో తగిన రీతి
    కొన్ని బలమైన గాలికి కొండనెక్కె.

    రిప్లయితొలగించండి
  16. పెంచితిని పూలవనమును ప్రీతి తోడ
    కన్నులకు విందు చేయుచు కాని పించి
    వెలుగు పంచి ముదము గూర్చు విరులు నేడు
    నీరు చాలక దీపము లారిపోయె.

    రిప్లయితొలగించండి