మొక్కలెండెనేల తెలుపు? పూజ చేయు పాళ మందు తైల మదియే వత్తి కంద కున్న జరుగు ఫలంబేమి టన్న చెప్పె నీరు చాలక, దీపమ్ము లారిపోయె.
కూరిమి తోడ ప్రేక్షకులు కోరిన వెంటనె యింద్రజాలికుం డోరిమి తో ప్రదర్శనము నొక్కటి నిచ్చెడి వేళ యాతడే నీరును తైలమున్ గలిపి నేరుపు గా వెలిగించు వేళ నా నీరము లేక దీపములు నిల్చి వెలుంగక యారెఁ జూడుమా.
గీ. ఆనకట్టన బంధించి వాననీరు
రిప్లయితొలగించండిఅందజేసిరి విద్యుత్తునందరకును
కరువుదినపు వర్షాభావ కారణమున
నీరు చాలక దీపమ్ము లారిపోయె
తేటగీతి
రిప్లయితొలగించండిఅవసరమునకు సరిపడు నంతమేర
లేక యుత్పత్తి నేడు పరిశ్రమలవె
చిత్తు! యిండ్ల కును జలవిద్యుత్తమర్చు
నీరు చాలక, దీపమ్ము లారిపోయె!
ఉత్పలమాల
మేరలు లేని వాడకము మేదిని నుండగ నేడు విద్యుదా
ధార పరిశ్రమల్, గృహములన్నియు కోతకు నెంచుచుండగన్
భూరిగ బొగ్గు, గాలియును మూలమునైన, జలాశయమ్ములన్
నీరము లేక దీపములు నిల్చి వెలుంగక యారెఁ జూడుమా!
ఎండ భగభగ లాడుచు మండు చుండ ,
రిప్లయితొలగించండిపైరులెండిపోవునుగద వదలినట్టి
నీరు చాలక ; దీపమ్ము లారిపోయె
దగిన పరిమాణమంతటి తైలమిడక
రిప్లయితొలగించండిమొక్కలెండెనేల తెలుపు? పూజ చేయు
పాళ మందు తైల మదియే వత్తి కంద
కున్న జరుగు ఫలంబేమి టన్న చెప్పె
నీరు చాలక, దీపమ్ము లారిపోయె.
కూరిమి తోడ ప్రేక్షకులు కోరిన వెంటనె యింద్రజాలికుం
డోరిమి తో ప్రదర్శనము నొక్కటి నిచ్చెడి వేళ యాతడే
నీరును తైలమున్ గలిపి నేరుపు గా వెలిగించు వేళ నా
నీరము లేక దీపములు నిల్చి వెలుంగక యారెఁ జూడుమా.
సారవంతమయిన కడు చక్కనిదగు
రిప్లయితొలగించండినేలమీద పుట్టి పెరిగెనా లతికలు
కన్నుల యెదుటఁ వేసవి కాలమందు
నీరు చాలక దీపమ్ము లారిపోయె
సారము గల్గినట్టిదగు చక్కని నేలను బుట్టి చెచ్చెరన్
దీరుగ వృద్ధిచెందినవి దివ్యమనోహర రూపునన్ లతల్
మారినకాలమందు పరిమారినవా యని వీక్షసేయగా
నీరము లేక దీపములు నిల్చి వెలుంగక యారెఁ జూడుమా
[దీపములు = లతలు; వెలుగు = శోభిల్లు]
తే.గీ:గ్రీష్మమే రాగ నెండలు రెచ్చి పోవ
రిప్లయితొలగించండినింకె నదులలో నీరమ్ము, లింత వరకు
విద్యుదుత్పత్తి సాగగా వెలుగు లిచ్చు
నీరు చాలక దీపమ్ము లారిపోయె
ఉ;తీ రగు వాన లేక కడు తీవ్రత నెండ దహింప రైతుకున్
రిప్లయితొలగించండిభారము కాగ సేద్యమును, వాహినులన్ జలముల్ కనిష్ఠతన్
జేర కరెంటు కోత లయి, చేవ నొసంగెడు మూలశక్తి యౌ
నీరము లేక దీపములు నిల్చి వెలుంగక యారెఁ జూడుమా”
నీరమె యింధనమ్ము కరణిం బనిచేయును వెల్గు నింపగన్
రిప్లయితొలగించండిధారుణియందు విద్యుతును తద్దయు నుద్గతి సల్ప, నక్కటా
దారుణ క్షామమేర్పడఁగ దర్దురముల్గనరాక నింగిలో
నీరము లేక దీపములు నిల్చి వెలుంగక యారెఁ జూడుమా
తే॥ నీరె యొసఁగు విద్యుచ్ఛక్తి నిశ్చలముగ
రిప్లయితొలగించండికాంతి దీపముల కిడఁగఁ గఱవు నెగయ
వర్షపాతముఁ దక్కువై వాహినులను
నీరు చాలక దీపమ్ము లారిపోయె
ఉ॥ నీరము జాలు వారనటు నిత్యము యంత్రము లాడుచుండఁగన్
గోరిన శక్తి విచ్చుఁ గద గొప్పగ దీపము లెల్ల వెల్గఁగన్
ధారుణి వర్షపాత సమతాళము క్షీణము గాఁగ జ్యానిలో
నీరము లేక దీపములు నిల్చి వెలుంగక యారెఁ జూడుమా
సమతాళము హెచ్చుతగ్గులు లేకుండా సరియైన విధముగా నున్నది జ్యాని నది
హైడ్రో ఎలక్ట్రిసిటీ నేను వ్రాసినా, థర్మల్ న్యూక్లియర్ ఎలక్ట్రిసిటీ కి కూడ నీటి లభ్యత అత్యవసరముండి
వరుణ దేవుడు జూపని కరుణ వలన
రిప్లయితొలగించండినెండె ను జలా శ యము లన్ని యిపుడు జూడ
కొఱ వడిన విద్యు దు త్ప త్తి కొఱకు తగిన
నీరు చాలక దీపమ్ము లారి పోయె
వెలుఁగ వలె నఖండమ్ముగ నిలయ మందు
రిప్లయితొలగించండిదీప పంక్తులు నిత్యమ్ము భూప వర్య
తెమ్ము శీఘ్రమ్ము శుద్ధ తైలమ్ము, వలదు
నీరు, చాలక దీపమ్ము లాఱిపోయె
తోరము దుఃఖ దాయకము తూర్ణము తే వలె నింక నూనెనే
సార విచారమే కలుగ సజ్జన పంక్తికి మందిరమ్ములో
నారయ దివ్య పాదపచ యాభము లక్కట తైల రాశి నా
నీరము లేక దీపములు నిల్చి వెలుంగక యాఱెఁ జూడుమా
జలముతోడ విద్యుచ్ఛక్తి సంతరింప
రిప్లయితొలగించండివెలుగు రేఖల వెదజల్లు పుడమి పైన
క్షామమేర్పడి వానలు కానరాక
నీరు చాలక దీపమ్ము లారిపోయె
పంట పొలములు పూర్తిగాఁబండిపోయె
రిప్లయితొలగించండినీరు చాలక,దీపమ్ము లారిపోయయెఁ
బెద్ద గాలులు వీచుచుఁ బిడుగు పడఁగ
నెపుఁడు వచ్చునో దీపాలు సెప్పలేము
సారము గల్గియున్ బుడమి సాలుల వెంబడి గట్టియాయెనే
రిప్లయితొలగించండినీరములేక,దీపములు నిల్చివెలుంగకయారెఁజూడుమా
జోరుగ వర్షముల్ గురియ చూరులనుండియు ధారకారగాఁ
దోరపు చెమ్మయుండుటన దూలము ప్రక్కన తీగలూడగన్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
ఎండ కాలము వృక్షమ్ము లెండిపోయె
నీరు చాలక; దీపమ్ము లారిపోయె
తైలమున్ లేక ప్రమిదలో తగిన రీతి
కొన్ని బలమైన గాలికి కొండనెక్కె.
పెంచితిని పూలవనమును ప్రీతి తోడ
రిప్లయితొలగించండికన్నులకు విందు చేయుచు కాని పించి
వెలుగు పంచి ముదము గూర్చు విరులు నేడు
నీరు చాలక దీపము లారిపోయె.