12-3-2026 (గురువారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“తలిదండ్రుల పెండ్లిఁ గనఁగఁ దరలిరి పుత్రుల్”(లేదా...)“వచ్చిరి తల్లిదండ్రుల వివాహముఁ జూడఁగ పుత్రులెల్లరున్”
అలరెడు భక్తిగ పితరులు విలసిత మగు రీతి గాగ వేడుక మీరన్ సలిపె డు గుడికి వినాయక తలి దండ్రుల పెండ్లి గనగ దరలిరి పుత్రుల్
కందంసలుప మనువు సీతారాముల మాతాపితరులనుచుఁ బూనఁగ, వేదిన్వెలయగ శ్రీరామనవమిఁదలిదండ్రుల పెండ్లిఁ గనఁగఁ దరలిరి పుత్రుల్ఉత్పలమాలపచ్చని పందిరిన్ మలచి పాప వినాశను రామచంద్రునిన్విచ్చిన పద్మనేత్రముల వేడ్కను పంచెడు జానకీ సతిన్మెచ్చియుఁ గన్నవారిగను మిన్నగ జేయఁగఁ బూనినంతటన్వచ్చిరి తల్లిదండ్రుల వివాహముఁ జూడఁగ పుత్రులెల్లరున్
మలయమ్మకు శివునకు కో వెలలో నాడంబరమున పెండ్లి యటంచున్ దలవగ గణపతి స్కందుడు తలిదండ్రుల పెండ్లిఁ గనఁగఁ దరలిరి పుత్రుల్.పచ్చని తోరణమ్ములట వాసిగ గట్టిరి దేవళములో చిచ్చర కంటి గౌరులకు జేయ వివాహము భక్త కోటియే హెచ్చుగ రాగ స్కందుడు గణేశ్వరులిర్వురు గాంచ నెంచుచున్ వచ్చిరి, తల్లిదండ్రుల వివాహముఁ జూడఁగ పుత్రులెల్లరున్.
నెలవీడునందు గుడిలో్ఎలమిగ దమ తల్లితండ్రులిమ్ముగ జేయున్అలవాటయిన కుశలవులతలిదండ్రుల పెండ్లిఁ గనఁగఁ దరలిరి పుత్రుల్
అలరెడు భక్తిగ పితరులు
రిప్లయితొలగించండివిలసిత మగు రీతి గాగ వేడుక మీరన్
సలిపె డు గుడికి వినాయక
తలి దండ్రుల పెండ్లి గనగ దరలిరి పుత్రుల్
కందం
రిప్లయితొలగించండిసలుప మనువు సీతారా
ముల మాతాపితరులనుచుఁ బూనఁగ, వేదిన్
వెలయగ శ్రీరామనవమిఁ
దలిదండ్రుల పెండ్లిఁ గనఁగఁ దరలిరి పుత్రుల్
ఉత్పలమాల
పచ్చని పందిరిన్ మలచి పాప వినాశను రామచంద్రునిన్
విచ్చిన పద్మనేత్రముల వేడ్కను పంచెడు జానకీ సతిన్
మెచ్చియుఁ గన్నవారిగను మిన్నగ జేయఁగఁ బూనినంతటన్
వచ్చిరి తల్లిదండ్రుల వివాహముఁ జూడఁగ పుత్రులెల్లరున్
రిప్లయితొలగించండిమలయమ్మకు శివునకు కో
వెలలో నాడంబరమున పెండ్లి యటంచున్
దలవగ గణపతి స్కందుడు
తలిదండ్రుల పెండ్లిఁ గనఁగఁ దరలిరి పుత్రుల్.
పచ్చని తోరణమ్ములట వాసిగ గట్టిరి దేవళములో
చిచ్చర కంటి గౌరులకు జేయ వివాహము భక్త కోటియే
హెచ్చుగ రాగ స్కందుడు గణేశ్వరులిర్వురు గాంచ నెంచుచున్
వచ్చిరి, తల్లిదండ్రుల వివాహముఁ జూడఁగ పుత్రులెల్లరున్.
నెలవీడునందు గుడిలో్
రిప్లయితొలగించండిఎలమిగ దమ తల్లితండ్రులిమ్ముగ జేయున్
అలవాటయిన కుశలవుల
తలిదండ్రుల పెండ్లిఁ గనఁగఁ దరలిరి పుత్రుల్