12, మార్చి 2026, గురువారం

సమస్య - 5406

13-3-2026 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఇల్లరికమునందుఁ గలుఁగు నెన్నొ సుఖంబుల్”
(లేదా...)
“ఇల్లరికంబునందుఁగల దెంతయొ సౌఖ్య మటండ్రు పండితుల్”

4 కామెంట్‌లు:

  1. కల్ల యనరాదిది నిజమె ,
    యిల్లాలు దనయిలు విడక నెలమిని బొందన్
    చెల్లును కోరికలన్నియు
    నిల్లరికమునందుఁ గలుఁగు నెన్నొ సుఖంబుల్”

    రిప్లయితొలగించండి

  2. తల్లిని దండ్రిని వీడుచు
    ముల్లె లభించునని భూరి మోదము తోడన్
    హల్లోహలము వలదనిన
    నిల్లరికమునందుఁ గలుఁగు నెన్నొ సుఖంబుల్.


    తల్లిని దండ్రినిన్ విడిచి దాసుని గానుపరాయి కొంపలో
    నల్లుని గౌరవమ్మదియె యందక పోయిన నేమి భూరిగా
    ముల్లెలభించునంచు కడు మోదముతో విడ స్వాభి మానమే
    యిల్లరికంబునందుఁగల దెంతయొ సౌఖ్య మటండ్రు పండితుల్.

    రిప్లయితొలగించండి
  3. పెల్లుగ కష్టమొందకనె పిండము జక్కగ సాగదీ యగన్
    చల్లగ మామసంపదను సాపడు చుండనొప్పీ , కో
    కొల్లల కావ్యక ల్పనము గూర్చుచు నుండుట వీలుగల్గు నీ
    యిల్లరికంబునందుఁగల దెంతయొ సౌఖ్య మటండ్రు పండితుల్”

    రిప్లయితొలగించండి