26-3-2026 (గురువారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“కరిగిన నెయిఁ గాఁచినంత గడ్డలు గట్టున్”(లేదా...)“కరిగిన నేయి నిప్పుపయిఁ గాఁచిన గడ్డలు గట్టు నద్దిరా”
పరిమళము గవియు నెల్లెడకరిగిన నెయిఁ గాఁచినంత ; గడ్డలు గట్టున్చిరుకాలము జలువ నలుప ,చురుకుదనపు ఫ లితమిదియ చోద్యమె గదరా!
కందంతెరచి చరవాణిఁ దెరపైమురిసితి కృత్రిమపు మేధ పొదిగిన చిత్రాల్కరమంటి వేడ సాధువుకరిగిన నెయిఁ గాఁచినంత గడ్డలు గట్టున్చంపకమాలమురిసితి కుంభమేళఁ జని పూనుచు వింతలఁ జూప సాధువుల్పరవశమొందితిన్ మిగుల వాస్తవ రీతికి భిన్నమై కనన్బెరుగును పిండుచున్ ఘృతము పేరినదందగ శీతలమ్ముకున్గరిగిన నేయి నిప్పుపయిఁ గాఁచిన గడ్డలు గట్టు నద్దిరా!
మరుగుచు నుండిన జలమున వరి పిండిని వేసి పిదప వాసిగ నుప్పున్ బరిమితి మించక వేయుచు కరిగిన నెయిఁ , గాఁచినంత గడ్డలు గట్టున్.తరుణిని వంట నేర్పుమని దారిక కోరిన యంత తల్లియే పిరిమిని చెప్పెనిట్లు వరి పిండిని పోపును చేసి కొన్న డబ్బురమున వేసి కోమలము పొచ్చెము స్వాదువు కంచు వేయుచున్ గరిగిన నేయి, నిప్పుపయిఁ గాఁచిన గడ్డలు గట్టు నద్దిరా.
పెరిగిరి దుర్నీతిపరులువిరివిగ కృత్రిమపదార్థ విక్రయపరులైపరికించినపుడు విదితముకరిగిన నెయిఁ గాఁచినంత గడ్డలు గట్టున్పెరిగిరి విశ్వకద్రువులు స్వేచ్ఛగ చేసిరి కృత్రిమంబుగాసరియగు నెయ్యిగా భ్రమసి ౘక్కఁగ నమ్మెడి రీతినొద్దికన్ విరివిగ విక్రయించిరిట వింతపదార్ధము నెయ్యిపేరిటన్గరిగిన నేయి నిప్పుపయిఁ గాఁచిన గడ్డలు గట్టు నద్దిరా
సమస్యా పూరణలుడా బల్లూరి ఉమాదేవి సరియగు పప్పుచారుపయి చక్కగ వేసెడిదేదనంగనాకరకరలాడుచుండుగదకమ్మగయప్పడమెల్లవేళలన్క్షరమునుశీతపేటికను చల్లదనంబునుకోరియుంచగన్*“కరిగిన నేయి నిప్పుపయిఁ గాఁచిన గడ్డలు గట్టు నద్దిరా”*పరిమళమునిండునింటను*“కరిగిన నెయిఁ గాఁచినంత, గడ్డలు గట్టున్”*విరిగిన పాలని నెరుగకమరిగించినచో ,తెలియుము మదిలో నెపుడున్
కం:బరబర త్రిప్పక రవ్వను కరిగిన నెయిఁ, గాఁచినంత గడ్డలు గట్టున్మరిగించ నీట సరియా?సరిగా నుప్మాను జేయు సరళి నెరుగవే!(నెయ్యి,రవ్వ నీళ్లలో పోసి తిప్పితే చాలా?దాన్ని తిప్పక పోతే గడ్డ కడుతుంది. )
చం:పరిమళ మిచ్చుచుండు, మరి పప్పున గల్ప రుచించు, చక్కగాకరిగిన నేయి నిప్పుపయిఁ గాఁచిన, గడ్డలు గట్టు నద్దిరా!బిరమున వేడి చేయకయె వీడిన నియ్యది శీతకాల మౌ త్వరగనె నేయి పేరుకొను దానిని గాచుము పేరుకొన్నచోన్
కం॥ విరివిగ నన్య పదార్థముఁబరఁగ రుచియు రంగుఁ గలుపఁ బరిపరి నేయిన్సరకు పరీక్షకు నిలువకఁగరిగిన నెయిఁ గాఁచి నంత గడ్డలు గట్టున్చం॥ విరివిగ రంగు వాసనకు వేరు పదార్థము లెన్నొ కల్పఁగన్మరిమరి హెచ్చుగా మితిని మాన్యులు వీడి ఘృతమ్ము నందునన్సరకు పరీక్షఁ జేయుటకు శాస్త్ర విధమ్ముఁ బ్రయోగ శాలలోఁగరగిన నేయి నిప్పుపయిఁ గాఁచిన గడ్డలు గట్టు నద్దిరా
-సరిపోదు వేడిమి ! చలి విపరీత మచ్చట జిలేబి పయనము వలదాపురి! రష్యాదేశమ్మునకరిగిన నెయిఁ గాఁచినంత గడ్డలు గట్టున్!
ఏమాయెన్ బో ఈ కొలువు వైభవము !కవీశ్వరులా వాత్సాపు మూతబెట్టి వెబ్ లోనికి రండి మీ పూరణలు శాశ్వతము గా రాబోవు తరానికి ఉపయోగ పడేలా !వాత్సాపు కూపము నుండి బయటపడుడీ వచ్చెను వాత్సాపు; కవులువెచ్చించిరి సమయమందు; వెలవెల బోయెన్ఖచ్చితము శంకరుల బ్లాగిచ్చట !మూతపడునో నొకింత హరిమలోన్?
ఇఁకఁ బిమ్మటేమి వాకిలిఁ బ్రకటింపుఁడు వలదని వలపత్రము వెలయన్ సుకవి గణ చోదనంబై వికసింప శివాభరణము విశ్వము నందున్ [పిమ్మటేమి వాకిలి = Whatsapp, వలపత్రము = Blog (web log)]
కరమగు రుచులను బెంచునుకరగిన నెయి :: గాచి నంత గడ్డలు కట్టున్ విరిగిన పాలవి మిగులన్ జరజర వేడికిని పొంగు చోద్యము గాగన్
నాలుగవ పాదంలో చుర చుర అనిసవరణ చేయడమైనది
ధరలో నెల్ల రెఱింగన పరమార్థం బిది మదిఁ గలవరపడ నేలా తరుణీ వాడక యున్నం గరిగిన నెయిఁ గాఁచి నంత గడ్డలు గట్టున్ పెరుఁగును బోయఁగాఁ దగును బిఱ్ఱుగ గడ్డలు కట్ట నింపుగాఁ బరులను బిల్వఁ గుడ్పునకు వడ్డన వేళల లోనఁ బూర్తిగాఁ గరఁగిన నేయి వోసిన సుఖమ్ముగ నుండును సుంత మాత్రమే కరిగిన నేయి నిప్పు పయిఁ గాఁచిన గడ్డలు గట్టు నద్దిరా [కట్టు = రెండవ యర్థము నిరోధించు]
పెరిగెను మోసము లెల్లెడవిరివిగ కలితీలు విపణిఁ బెరిగెను, కలుపన్గరదపు రసాయనమ్ములకరిగిన నెయిఁ గాఁచినంత గడ్డలు గట్టున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
పెరిగెను మోసమెల్లెడల విచ్చలుగా జనజీవనమ్మునన్గరదమువంటి దుర్మరణ కారకమైన రసాయనమ్ములన్విరివిగ జేర్చుచుండిరి వివేకవిహీనులు, కల్తియైనదౌకరిగిన నేయి నిప్పుపయిఁ గాఁచిన గడ్డలు గట్టు నద్దిరా
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.పరిమళము ఘుమ ఘుమ మనునుకరిగిన నెయిఁ గాచినంత; గడ్డలు గట్టున్విరిగిన పాలని తెలియక మరల మరల మంట మీద మరిగించంగన్.
పరిమళము గవియు నెల్లెడ
రిప్లయితొలగించండికరిగిన నెయిఁ గాఁచినంత ; గడ్డలు గట్టున్
చిరుకాలము జలువ నలుప ,
చురుకుదనపు ఫ లితమిదియ చోద్యమె గదరా!
కందం
రిప్లయితొలగించండితెరచి చరవాణిఁ దెరపై
మురిసితి కృత్రిమపు మేధ పొదిగిన చిత్రాల్
కరమంటి వేడ సాధువు
కరిగిన నెయిఁ గాఁచినంత గడ్డలు గట్టున్
చంపకమాల
మురిసితి కుంభమేళఁ జని పూనుచు వింతలఁ జూప సాధువుల్
పరవశమొందితిన్ మిగుల వాస్తవ రీతికి భిన్నమై కనన్
బెరుగును పిండుచున్ ఘృతము పేరినదందగ శీతలమ్ముకున్
గరిగిన నేయి నిప్పుపయిఁ గాఁచిన గడ్డలు గట్టు నద్దిరా!
రిప్లయితొలగించండిమరుగుచు నుండిన జలమున
వరి పిండిని వేసి పిదప వాసిగ నుప్పున్
బరిమితి మించక వేయుచు
కరిగిన నెయిఁ , గాఁచినంత గడ్డలు గట్టున్.
తరుణిని వంట నేర్పుమని దారిక కోరిన యంత తల్లియే
పిరిమిని చెప్పెనిట్లు వరి పిండిని పోపును చేసి కొన్న డ
బ్బురమున వేసి కోమలము పొచ్చెము స్వాదువు కంచు వేయుచున్
గరిగిన నేయి, నిప్పుపయిఁ గాఁచిన గడ్డలు గట్టు నద్దిరా.
పెరిగిరి దుర్నీతిపరులు
రిప్లయితొలగించండివిరివిగ కృత్రిమపదార్థ విక్రయపరులై
పరికించినపుడు విదితము
కరిగిన నెయిఁ గాఁచినంత గడ్డలు గట్టున్
పెరిగిరి విశ్వకద్రువులు స్వేచ్ఛగ చేసిరి కృత్రిమంబుగా
సరియగు నెయ్యిగా భ్రమసి ౘక్కఁగ నమ్మెడి రీతినొద్దికన్
విరివిగ విక్రయించిరిట వింతపదార్ధము నెయ్యిపేరిటన్
గరిగిన నేయి నిప్పుపయిఁ గాఁచిన గడ్డలు గట్టు నద్దిరా
సమస్యా పూరణలు
రిప్లయితొలగించండిడా బల్లూరి ఉమాదేవి
సరియగు పప్పుచారుపయి చక్కగ వేసెడిదేదనంగనా
కరకరలాడుచుండుగదకమ్మగయప్పడమెల్లవేళలన్
క్షరమునుశీతపేటికను చల్లదనంబునుకోరియుంచగన్
*“కరిగిన నేయి నిప్పుపయిఁ గాఁచిన గడ్డలు గట్టు నద్దిరా”*
పరిమళమునిండునింటను
*“కరిగిన నెయిఁ గాఁచినంత, గడ్డలు గట్టున్”*
విరిగిన పాలని నెరుగక
మరిగించినచో ,తెలియుము మదిలో నెపుడున్
కం:బరబర త్రిప్పక రవ్వను
రిప్లయితొలగించండికరిగిన నెయిఁ, గాఁచినంత గడ్డలు గట్టున్
మరిగించ నీట సరియా?
సరిగా నుప్మాను జేయు సరళి నెరుగవే!
(నెయ్యి,రవ్వ నీళ్లలో పోసి తిప్పితే చాలా?దాన్ని తిప్పక పోతే గడ్డ కడుతుంది. )
చం:పరిమళ మిచ్చుచుండు, మరి పప్పున గల్ప రుచించు, చక్కగా
రిప్లయితొలగించండికరిగిన నేయి నిప్పుపయిఁ గాఁచిన, గడ్డలు గట్టు నద్దిరా!
బిరమున వేడి చేయకయె వీడిన నియ్యది శీతకాల మౌ
త్వరగనె నేయి పేరుకొను దానిని గాచుము పేరుకొన్నచోన్
కం॥ విరివిగ నన్య పదార్థముఁ
రిప్లయితొలగించండిబరఁగ రుచియు రంగుఁ గలుపఁ బరిపరి నేయిన్
సరకు పరీక్షకు నిలువకఁ
గరిగిన నెయిఁ గాఁచి నంత గడ్డలు గట్టున్
చం॥ విరివిగ రంగు వాసనకు వేరు పదార్థము లెన్నొ కల్పఁగన్
మరిమరి హెచ్చుగా మితిని మాన్యులు వీడి ఘృతమ్ము నందునన్
సరకు పరీక్షఁ జేయుటకు శాస్త్ర విధమ్ముఁ బ్రయోగ శాలలోఁ
గరగిన నేయి నిప్పుపయిఁ గాఁచిన గడ్డలు గట్టు నద్దిరా
-
రిప్లయితొలగించండిసరిపోదు వేడిమి ! చలి వి
పరీత మచ్చట జిలేబి పయనము వలదా
పురి! రష్యాదేశమ్మున
కరిగిన నెయిఁ గాఁచినంత గడ్డలు గట్టున్!
ఏమాయెన్ బో ఈ కొలువు వైభవము !
రిప్లయితొలగించండికవీశ్వరులా వాత్సాపు మూతబెట్టి వెబ్ లోనికి రండి మీ పూరణలు శాశ్వతము గా రాబోవు తరానికి ఉపయోగ పడేలా !
వాత్సాపు కూపము నుండి బయటపడుడీ
వచ్చెను వాత్సాపు; కవులు
వెచ్చించిరి సమయమందు; వెలవెల బోయెన్
ఖచ్చితము శంకరుల బ్లా
గిచ్చట !మూతపడునో నొకింత హరిమలోన్?
ఇఁకఁ బిమ్మటేమి వాకిలిఁ
తొలగించండిబ్రకటింపుఁడు వలదని వలపత్రము వెలయన్
సుకవి గణ చోదనంబై
వికసింప శివాభరణము విశ్వము నందున్
[పిమ్మటేమి వాకిలి = Whatsapp, వలపత్రము = Blog (web log)]
కరమగు రుచులను బెంచును
రిప్లయితొలగించండికరగిన నెయి :: గాచి నంత గడ్డలు కట్టున్
విరిగిన పాలవి మిగులన్
జరజర వేడికిని పొంగు చోద్యము గాగన్
నాలుగవ పాదంలో చుర చుర అనిసవరణ చేయడమైనది
తొలగించండిధరలో నెల్ల రెఱింగన
రిప్లయితొలగించండిపరమార్థం బిది మదిఁ గలవరపడ నేలా
తరుణీ వాడక యున్నం
గరిగిన నెయిఁ గాఁచి నంత గడ్డలు గట్టున్
పెరుఁగును బోయఁగాఁ దగును బిఱ్ఱుగ గడ్డలు కట్ట నింపుగాఁ
బరులను బిల్వఁ గుడ్పునకు వడ్డన వేళల లోనఁ బూర్తిగాఁ
గరఁగిన నేయి వోసిన సుఖమ్ముగ నుండును సుంత మాత్రమే
కరిగిన నేయి నిప్పు పయిఁ గాఁచిన గడ్డలు గట్టు నద్దిరా
[కట్టు = రెండవ యర్థము నిరోధించు]
పెరిగెను మోసము లెల్లెడ
రిప్లయితొలగించండివిరివిగ కలితీలు విపణిఁ బెరిగెను, కలుపన్
గరదపు రసాయనమ్ముల
కరిగిన నెయిఁ గాఁచినంత గడ్డలు గట్టున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపెరిగెను మోసమెల్లెడల విచ్చలుగా జనజీవనమ్మునన్
రిప్లయితొలగించండిగరదమువంటి దుర్మరణ కారకమైన రసాయనమ్ములన్
విరివిగ జేర్చుచుండిరి వివేకవిహీనులు, కల్తియైనదౌ
కరిగిన నేయి నిప్పుపయిఁ గాఁచిన గడ్డలు గట్టు నద్దిరా
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
పరిమళము ఘుమ ఘుమ మనును
కరిగిన నెయిఁ గాచినంత; గడ్డలు గట్టున్
విరిగిన పాలని తెలియక
మరల మరల మంట మీద మరిగించంగన్.