25, మార్చి 2026, బుధవారం

సమస్య - 5419

26-3-2026 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కరిగిన నెయిఁ గాఁచినంత గడ్డలు గట్టున్”
(లేదా...)
“కరిగిన నేయి నిప్పుపయిఁ గాఁచిన గడ్డలు గట్టు నద్దిరా”

18 కామెంట్‌లు:

  1. పరిమళము గవియు నెల్లెడ
    కరిగిన నెయిఁ గాఁచినంత ; గడ్డలు గట్టున్
    చిరుకాలము జలువ నలుప ,
    చురుకుదనపు ఫ లితమిదియ చోద్యమె గదరా!

    రిప్లయితొలగించండి
  2. కందం
    తెరచి చరవాణిఁ దెరపై
    మురిసితి కృత్రిమపు మేధ పొదిగిన చిత్రాల్
    కరమంటి వేడ సాధువు
    కరిగిన నెయిఁ గాఁచినంత గడ్డలు గట్టున్

    చంపకమాల
    మురిసితి కుంభమేళఁ జని పూనుచు వింతలఁ జూప సాధువుల్
    పరవశమొందితిన్ మిగుల వాస్తవ రీతికి భిన్నమై కనన్
    బెరుగును పిండుచున్ ఘృతము పేరినదందగ శీతలమ్ముకున్
    గరిగిన నేయి నిప్పుపయిఁ గాఁచిన గడ్డలు గట్టు నద్దిరా!

    రిప్లయితొలగించండి

  3. మరుగుచు నుండిన జలమున
    వరి పిండిని వేసి పిదప వాసిగ నుప్పున్
    బరిమితి మించక వేయుచు
    కరిగిన నెయిఁ , గాఁచినంత గడ్డలు గట్టున్.


    తరుణిని వంట నేర్పుమని దారిక కోరిన యంత తల్లియే
    పిరిమిని చెప్పెనిట్లు వరి పిండిని పోపును చేసి కొన్న డ
    బ్బురమున వేసి కోమలము పొచ్చెము స్వాదువు కంచు వేయుచున్
    గరిగిన నేయి, నిప్పుపయిఁ గాఁచిన గడ్డలు గట్టు నద్దిరా.

    రిప్లయితొలగించండి
  4. పెరిగిరి దుర్నీతిపరులు
    విరివిగ కృత్రిమపదార్థ విక్రయపరులై
    పరికించినపుడు విదితము
    కరిగిన నెయిఁ గాఁచినంత గడ్డలు గట్టున్

    పెరిగిరి విశ్వకద్రువులు స్వేచ్ఛగ చేసిరి కృత్రిమంబుగా
    సరియగు నెయ్యిగా భ్రమసి ౘక్కఁగ నమ్మెడి రీతినొద్దికన్
    విరివిగ విక్రయించిరిట వింతపదార్ధము నెయ్యిపేరిటన్
    గరిగిన నేయి నిప్పుపయిఁ గాఁచిన గడ్డలు గట్టు నద్దిరా

    రిప్లయితొలగించండి
  5. సమస్యా పూరణలు
    డా బల్లూరి ఉమాదేవి
    సరియగు పప్పుచారుపయి చక్కగ వేసెడిదేదనంగనా
    కరకరలాడుచుండుగదకమ్మగయప్పడమెల్లవేళలన్
    క్షరమునుశీతపేటికను చల్లదనంబునుకోరియుంచగన్
    *“కరిగిన నేయి నిప్పుపయిఁ గాఁచిన గడ్డలు గట్టు నద్దిరా”*

    పరిమళమునిండునింటను
    *“కరిగిన నెయిఁ గాఁచినంత, గడ్డలు గట్టున్”*
    విరిగిన పాలని నెరుగక
    మరిగించినచో ,తెలియుము మదిలో నెపుడున్


    రిప్లయితొలగించండి
  6. కం:బరబర త్రిప్పక రవ్వను
    కరిగిన నెయిఁ, గాఁచినంత గడ్డలు గట్టున్
    మరిగించ నీట సరియా?
    సరిగా నుప్మాను జేయు సరళి నెరుగవే!
    (నెయ్యి,రవ్వ నీళ్లలో పోసి తిప్పితే చాలా?దాన్ని తిప్పక పోతే గడ్డ కడుతుంది. )

    రిప్లయితొలగించండి
  7. చం:పరిమళ మిచ్చుచుండు, మరి పప్పున గల్ప రుచించు, చక్కగా
    కరిగిన నేయి నిప్పుపయిఁ గాఁచిన, గడ్డలు గట్టు నద్దిరా!
    బిరమున వేడి చేయకయె వీడిన నియ్యది శీతకాల మౌ
    త్వరగనె నేయి పేరుకొను దానిని గాచుము పేరుకొన్నచోన్

    రిప్లయితొలగించండి
  8. కం॥ విరివిగ నన్య పదార్థముఁ
    బరఁగ రుచియు రంగుఁ గలుపఁ బరిపరి నేయిన్
    సరకు పరీక్షకు నిలువకఁ
    గరిగిన నెయిఁ గాఁచి నంత గడ్డలు గట్టున్

    చం॥ విరివిగ రంగు వాసనకు వేరు పదార్థము లెన్నొ కల్పఁగన్
    మరిమరి హెచ్చుగా మితిని మాన్యులు వీడి ఘృతమ్ము నందునన్
    సరకు పరీక్షఁ జేయుటకు శాస్త్ర విధమ్ముఁ బ్రయోగ శాలలోఁ
    గరగిన నేయి నిప్పుపయిఁ గాఁచిన గడ్డలు గట్టు నద్దిరా

    రిప్లయితొలగించండి
  9. -
    సరిపోదు వేడిమి ! చలి వి
    పరీత మచ్చట జిలేబి పయనము వలదా
    పురి! రష్యాదేశమ్మున
    కరిగిన నెయిఁ గాఁచినంత గడ్డలు గట్టున్!




    రిప్లయితొలగించండి
  10. ఏమాయెన్ బో ఈ కొలువు‌ వైభవము !

    కవీశ్వరులా వాత్సాపు మూతబెట్టి వెబ్ లోనికి రండి మీ పూరణలు శాశ్వతము గా రాబోవు‌ తరానికి ఉపయోగ పడేలా !

    వాత్సాపు కూపము నుండి బయటపడుడీ

    వచ్చెను వాత్సాపు; కవులు
    వెచ్చించిరి సమయమందు; వెలవెల బోయెన్
    ఖచ్చితము శంకరుల బ్లా
    గిచ్చట !మూతపడునో నొకింత హరిమలోన్‌?




    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇఁకఁ బిమ్మటేమి వాకిలిఁ
      బ్రకటింపుఁడు వలదని వలపత్రము వెలయన్
      సుకవి గణ చోదనంబై
      వికసింప శివాభరణము విశ్వము నందున్

      [పిమ్మటేమి వాకిలి = Whatsapp, వలపత్రము = Blog (web log)]

      తొలగించండి
  11. కరమగు రుచులను బెంచును
    కరగిన నెయి :: గాచి నంత గడ్డలు కట్టున్
    విరిగిన పాలవి మిగులన్
    జరజర వేడికిని పొంగు చోద్యము గాగన్

    రిప్లయితొలగించండి
  12. ధరలో నెల్ల రెఱింగన
    పరమార్థం బిది మదిఁ గలవరపడ నేలా
    తరుణీ వాడక యున్నం
    గరిగిన నెయిఁ గాఁచి నంత గడ్డలు గట్టున్


    పెరుఁగును బోయఁగాఁ దగును బిఱ్ఱుగ గడ్డలు కట్ట నింపుగాఁ
    బరులను బిల్వఁ గుడ్పునకు వడ్డన వేళల లోనఁ బూర్తిగాఁ
    గరఁగిన నేయి వోసిన సుఖమ్ముగ నుండును సుంత మాత్రమే
    కరిగిన నేయి నిప్పు పయిఁ గాఁచిన గడ్డలు గట్టు నద్దిరా

    [కట్టు = రెండవ యర్థము నిరోధించు]

    రిప్లయితొలగించండి
  13. పెరిగెను మోసము లెల్లెడ
    విరివిగ కలితీలు విపణిఁ బెరిగెను, కలుపన్
    గరదపు రసాయనమ్ముల
    కరిగిన నెయిఁ గాఁచినంత గడ్డలు గట్టున్

    రిప్లయితొలగించండి
  14. పెరిగెను మోసమెల్లెడల విచ్చలుగా జనజీవనమ్మునన్
    గరదమువంటి దుర్మరణ కారకమైన రసాయనమ్ములన్
    విరివిగ జేర్చుచుండిరి వివేకవిహీనులు, కల్తియైనదౌ
    కరిగిన నేయి నిప్పుపయిఁ గాఁచిన గడ్డలు గట్టు నద్దిరా

    రిప్లయితొలగించండి

  15. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    పరిమళము ఘుమ ఘుమ మనును
    కరిగిన నెయిఁ గాచినంత; గడ్డలు గట్టున్
    విరిగిన పాలని తెలియక
    మరల మరల మంట మీద మరిగించంగన్.

    రిప్లయితొలగించండి