కం:గాడ్సండ్ బ్రామిన్స్ హ్యాడ్ బ్రాట్ బ్యాడ్ సిస్టంస్ వై హి రోట్ ది భారత్? సీ.ఆర్ డిడ్ సం డేంజర్,ద్యాన్ హిం గాడ్సేయె మహాత్ముఁ డనెను ఘనుఁ డన్నదొరై. (అన్నాదురై ఇంగ్లీష్ లో మంచి పండితుడు.అతనికి బ్రాహ్మణుల పట్ల,వైదిక దేవతల పట్ల ద్వేషం.సి.ఆర్ అంటే రాజాజీ. ఆయన భారతం రాసాడు.అది పెద్ద ప్రమాదం.రాజాజీ కంటే గాడ్సే నయం అన్నాడు. )
గాడ్సేది హైంద వ మతము
రిప్లయితొలగించండిగాడ్సేకు సరిపడకుండె గాంధీ తలపుల్
గాడ్సే గాంధీని దునుమ ,
గాడ్సేయె మహాత్ముఁ డనెను ఘనుఁ డన్నదొరై
రిప్లయితొలగించండిగాడ్సే గాడ్సే యనుచును
గాడ్సే నామమ్ము జనులు గణుతింపగ నా
గాడ్సె యన మూర్ఖు డిట్లనె
గాడ్సేయె మహాత్ముఁ డనెను ఘనుఁ డన్నదొరై.
గాడ్సే యన్న నెవండొ వాడిచట నే కాలంబు నందుండె నా
గాడ్సే చేసిన దేమిటో యదియె దుష్కార్యమ్మొ సత్కార్య మో
గాడ్సే గాంధిని జంపె నంచెఱు గకన్ గాలోడితుండిట్ల నెన్
గాడ్సే కన్న మహాత్ముఁ డెవ్వఁడని వ్యాఖ్యానించె నన్నాదొరై.
గాడ్సే ఘనుడని దెల్పుచు
రిప్లయితొలగించండిగాడ్సే నంకించువారు గనవత్తురిటన్
గాడ్సే కై బొంకెనొకడు
'గాడ్సేయె మహాత్ముఁ డనెను ఘనుఁ డన్నదొరై'
గాడ్సే దేశము కోసమీవిధముగా గాంధీని నిర్జించెనా?
గాడ్సే తర్కముఁ దెల్పువారు ఘనులా? గాంధీని ద్వేషింతురా?
గాడ్సే చంపెను గొప్పనేత ననగా కాదన్న వాడిట్లనెన్
'గాడ్సే కన్న మహాత్ముఁ డెవ్వఁడని వ్యాఖ్యానించె నన్నాదొరై'
[ కన్న = చూచిన ]
గాడ్సే హింసా వాదిగ
రిప్లయితొలగించండిగాడ్సే బలి గొ నె మహాత్ము గాంధీ యసువు ల్
గాడ్సే ని పొగడె నె ట్టుల
గాడ్సే యె మహాత్ము డనుచు ఘను డ న్న దొ రై?
-
రిప్లయితొలగించండిబుడతడనుకొన్న కొమరుడు
గడగడ వాగె సభలోన !గాడ్సేయె మహా
త్ముఁ డనెను; ఘనుఁ డన్నదొరై
పొడ, స్టాలినుడేను గాంచె పో నతని కెడన్ !
జిలేబి
గాడ్సే మతఛాందసుడే
రిప్లయితొలగించండిగాడ్సే హతమార్చెను మన గాంధీ నౌరా
గాడ్సే క్రౌర్యము దెలిసియు
గాడ్సేయె మహాత్ముఁ డనెను ఘనుఁ డన్నదొరై
గాడ్సే గాంధిమహాత్ముఁజంపెనుగదా క్రౌర్యంబు జూపించుచున్
రిప్లయితొలగించండిగాడ్సేనెట్టుల జూతువో ఘనునిగా కాదొక్కొ దుర్మార్గుఁడే!
గాడ్సే చేసిన పాపకృత్యమును సత్కార్యమ్ముగా నెంచుచున్
గాడ్సే కన్న మహాత్ముఁ డెవ్వఁడని వ్యాఖ్యానించె నన్నాదొరై
శా॥ హడ్సన్ వాహిని ప్రాంత వాసులటు లాహ్లాదమ్ముఁ గాంక్షించుచున్
రిప్లయితొలగించండిగాడ్సే గొప్పయటంచుఁ దెల్పుటకు సంకల్పించి తప్పైననున్
లిడ్సన్ సత్రమునందుఁ గూర్చిరఁట వల్లించంగ నీరీతిగన్
గాడ్సే కన్న మహాత్ముఁ డెవ్వఁడని వాఖ్యానించె నన్నాదొరై
హడ్సన్ రివర్ న్యూయార్క్ వద్ద ఉంటుందండి
హడ్సన్ బే కెనడాలో
లిడ్సన్ యిన్ ఫిలిప్పైన్స్ అట
ఇన్ కు తెలుగు పదము సత్రము.
(ఇలాంటి సమస్య ఇచ్చినపుడు అవధాని పృచ్ఛకుడు ఇద్దరి పూరణ యిస్తే చాలా ఉపయుక్తమండి)
కం:గాడ్సండ్ బ్రామిన్స్ హ్యాడ్ బ్రాట్
రిప్లయితొలగించండిబ్యాడ్ సిస్టంస్ వై హి రోట్ ది భారత్? సీ.ఆర్
డిడ్ సం డేంజర్,ద్యాన్ హిం
గాడ్సేయె మహాత్ముఁ డనెను ఘనుఁ డన్నదొరై.
(అన్నాదురై ఇంగ్లీష్ లో మంచి పండితుడు.అతనికి బ్రాహ్మణుల పట్ల,వైదిక దేవతల పట్ల ద్వేషం.సి.ఆర్ అంటే రాజాజీ. ఆయన భారతం రాసాడు.అది పెద్ద ప్రమాదం.రాజాజీ కంటే గాడ్సే నయం అన్నాడు. )
శా:"గాడ్సున్, వైష్ణవమున్ ధరించి తిరిగెన్ గాంధీయు సంస్కర్తయే ?
రిప్లయితొలగించండిగూడ్సున్ బోలెడు మందరీతి యదియే గొప్పైనదా యేమి? యా
గాడ్సున్ నమ్మిన యట్టి హిందువయి తా కాల్చెన్ మతోన్మాదియై
గాడ్సే, కన్న! మహాత్ముఁ డెవ్వఁ" డని వ్యాఖ్యానించె నన్నాదొరై
(ఆ గాంధీ దేవుళ్కని,వైష్ణవాన్ని పట్టుకొని సంస్కరణ ఏం చేసాడు.అది గూడ్సు నడక.పోనీ గాడ్సే కూడా ఆ గాడ్స్ నే నమ్మాడు కదా! అతనే గాంధీని కాల్చేసాడు.వీళ్లలో ఎవరు మహాత్ముడు? "కన్నా" అనేది సంబోధన. )
నిడ్సుల్ వెట్టకు గాడ్సే
రిప్లయితొలగించండిగీడ్సే యని కపట రీతి గిర లిబ్భంగిన్
బుడ్సై పోదువు నరుఁడా
గాడ్సేయె మహాత్ముఁ డనెను ఘనుఁ డన్నదొరై
[నిడ్సు = నిడుసు , పెద్ద ధ్వని; బుడ్సు = బుడుసు, సన్నము]
తొడ్సుల్ లేని విధమ్ము వాక్కు లన సంతోషమ్ము వాటిల్లునే
గడ్సుల్ గాక పరుల్ వచింతురె యిటుల్ కాఠిన్య వాక్యమ్ములే
యడ్సుం జల్లఁగ నేల నేత పయి నన్యాయమ్ముగా నివ్విధిన్
గాడ్సే కన్న మహాత్ముఁ డెవ్వఁడని వ్యాఖ్యానించె నన్నాదొరై
[తొడ్సు = తొడుసు, సంబంధము; గడ్సు = గడుసు; అడ్సు = అడుసు]