5-6-2026 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఉమ శంకరుఁ డయ్యె శూలి యుమగా మారెన్”
(లేదా...)
“పార్వతి యయ్యె శంకరుఁడు పార్వతి శంకరుఁ డయ్యెఁ జయ్యనన్”
(బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)
కందంకమనీయంపు పగటి వేషమర్ధనారీశ్వరునిగఁ జక్కగఁ బరదానిముషమొకవైపుఁ గప్పగనుమ శంకరుఁ డయ్యె శూలి యుమగా మారెన్ఉత్పలమాలపర్వపు వేళలన్ బగలు వాసిగ వేషము వేసి నేర్పుతోసర్వ పురాణ గాథల ప్రజాళికి బంచెడు సంప్రదాయమైశర్వుని మోమునన్ సగము శాంకరిఁ జూపెడు వల్వ త్రిప్పుటన్బార్వతి యయ్యె శంకరుఁడు పార్వతి శంకరుఁ డయ్యెఁ జయ్యనన్
ప్రమథాధిపతి వివాహపు తమియగు కథనంత వినిన దరిమిల యడుగన్ తెమలుచు పల్కినది వినగఉమ శంకరుఁ డయ్యె శూలి యుమగా మారెన్
నిమిషము లాయెను యుగములు భ్రమరాలకపు చలనమున ప్రకృతి సొగపులందమలిన శృంగారమ్మున ఉమ శంకరుఁ డయ్యె శూలి యుమగా మారెన్
హిమగిరి తనయకు తనదేహములో సగమిచ్చి యుండె హైముండు నెఱిన్తమరిటుల పలుకఁ దగునాఉమ శంకరుఁ డయ్యె శూలి యుమగా మారెన్పార్వతి దేహమున్ శివుని బంధము లొక్కటిగా దృశించవాసర్వ జగత్తుకున్ దెలియు శాంభవి సాంబున కర్ధ భాగమేకర్వరియున్ శివుండనుచు కబ్బపునేతరి వేరు సేయగాపార్వతి యయ్యె శంకరుఁడు పార్వతి శంకరుఁ డయ్యెఁ జయ్యనన్
కందం
రిప్లయితొలగించండికమనీయంపు పగటి వే
షమర్ధనారీశ్వరునిగఁ జక్కగఁ బరదా
నిముషమొకవైపుఁ గప్పగ
నుమ శంకరుఁ డయ్యె శూలి యుమగా మారెన్
ఉత్పలమాల
పర్వపు వేళలన్ బగలు వాసిగ వేషము వేసి నేర్పుతో
సర్వ పురాణ గాథల ప్రజాళికి బంచెడు సంప్రదాయమై
శర్వుని మోమునన్ సగము శాంకరిఁ జూపెడు వల్వ త్రిప్పుటన్
బార్వతి యయ్యె శంకరుఁడు పార్వతి శంకరుఁ డయ్యెఁ జయ్యనన్
ప్రమథాధిపతి వివాహపు
రిప్లయితొలగించండితమియగు కథనంత వినిన దరిమిల యడుగన్
తెమలుచు పల్కినది వినగ
ఉమ శంకరుఁ డయ్యె శూలి యుమగా మారెన్
రిప్లయితొలగించండినిమిషము లాయెను యుగములు
భ్రమరాలకపు చలనమున ప్రకృతి సొగపులం
దమలిన శృంగారమ్మున
ఉమ శంకరుఁ డయ్యె శూలి యుమగా మారెన్
హిమగిరి తనయకు తనదే
రిప్లయితొలగించండిహములో సగమిచ్చి యుండె హైముండు నెఱిన్
తమరిటుల పలుకఁ దగునా
ఉమ శంకరుఁ డయ్యె శూలి యుమగా మారెన్
పార్వతి దేహమున్ శివుని బంధము లొక్కటిగా దృశించవా
సర్వ జగత్తుకున్ దెలియు శాంభవి సాంబున కర్ధ భాగమే
కర్వరియున్ శివుండనుచు కబ్బపునేతరి వేరు సేయగా
పార్వతి యయ్యె శంకరుఁడు పార్వతి శంకరుఁ డయ్యెఁ జయ్యనన్