6-6-2026 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ప్రణయమునఁ దోఁచె సుందర ప్రణవఘోష”
(లేదా...)
“ప్రణయము నందుఁ దోఁచెఁ బ్రణవం బదిగో మకరాంక రేఖయై”
(బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)
తేటగీతిధ్యాన యోగాది క్రియలతో తన్మయమునసాధకుఁడు పరిపూర్ణత సంతరించసలుపు జీవాత్మ పరమాత్మ సంగమంపుప్రణయమునఁ దోఁచె సుందర ప్రణవఘోషచంపకమాలతృణముగ నెంచి చింతలను దేజమునింపెడి యోగమందునన్క్షణమున గాల్చి సాధకుడు జ్ఞానిగ జేసెడు ధ్యానమందునన్మణితమనంగ జీవ పరమాత్మలు సల్పెడు సంగమంబునౌప్రణయము నందుఁ దోఁచెఁ బ్రణవం బదిగో మకరాంక రేఖయై
వింత యొకటి జరిగినది , వినర తంబి !నిత్య మలవాటయిన రీతి నేడు జేయ , ప్రణయమునఁ దోఁచె సుందర ప్రణవఘోష ,దీని భావమేమి టనగ దెలియ కుండె
ప్రణయి కై వర్తమానము పంపి తానుక్షణమొక యుగమై రుక్మిణీకాంత వేచె ప్రణుతమనుచు పఠింతురు భక్తులెల్లప్రణయమునఁ దోఁచె సుందర ప్రణవఘోషప్రణుతము రుక్మిణీ ప్రణయ భాజిత మంచు పఠింత్రు భక్తులేక్షణమొక యుగ్మమే ననుచు కన్యక రుక్మిణి వేచి చూచె నాప్రణయనమే మనోహరము రమ్యత చొప్పడు రుక్మిణీ కథన్ బ్రణయము నందుఁ దోఁచెఁ బ్రణవం బదిగో మకరాంక రేఖయై
తేటగీతి
రిప్లయితొలగించండిధ్యాన యోగాది క్రియలతో తన్మయమున
సాధకుఁడు పరిపూర్ణత సంతరించ
సలుపు జీవాత్మ పరమాత్మ సంగమంపు
ప్రణయమునఁ దోఁచె సుందర ప్రణవఘోష
చంపకమాల
తృణముగ నెంచి చింతలను దేజమునింపెడి యోగమందునన్
క్షణమున గాల్చి సాధకుడు జ్ఞానిగ జేసెడు ధ్యానమందునన్
మణితమనంగ జీవ పరమాత్మలు సల్పెడు సంగమంబునౌ
ప్రణయము నందుఁ దోఁచెఁ బ్రణవం బదిగో మకరాంక రేఖయై
వింత యొకటి జరిగినది , వినర తంబి !
రిప్లయితొలగించండినిత్య మలవాటయిన రీతి నేడు జేయ ,
ప్రణయమునఁ దోఁచె సుందర ప్రణవఘోష ,
దీని భావమేమి టనగ దెలియ కుండె
ప్రణయి కై వర్తమానము పంపి తాను
రిప్లయితొలగించండిక్షణమొక యుగమై రుక్మిణీకాంత వేచె
ప్రణుతమనుచు పఠింతురు భక్తులెల్ల
ప్రణయమునఁ దోఁచె సుందర ప్రణవఘోష
ప్రణుతము రుక్మిణీ ప్రణయ భాజిత మంచు పఠింత్రు భక్తులే
క్షణమొక యుగ్మమే ననుచు కన్యక రుక్మిణి వేచి చూచె నా
ప్రణయనమే మనోహరము రమ్యత చొప్పడు రుక్మిణీ కథన్
బ్రణయము నందుఁ దోఁచెఁ బ్రణవం బదిగో మకరాంక రేఖయై