11, జూన్ 2026, గురువారం

సమస్య - 5495

12-6-2026 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చారుం గనినంతఁ గలిగె సంతాపమ్మే”
(లేదా...)
“చారుం గాంచితి నా మనమ్మున నిరాశానిస్పృహల్ నిండఁగన్”

16 కామెంట్‌లు:

  1. దారుణ దారిద్ర్యముతో
    తీరము లేనట్టి నావ తీరుగనెపుఁడున్
    దారెరుగక తిరిగెడు సం
    చారుం గనినంతఁ గలిగె సంతాపమ్మే

    రిప్లయితొలగించండి
  2. పార్వతితో చెలికత్తె రూపంలో వచ్చిన శివయ్య:

    కందం
    భూరిగ జటలం, గళమున
    బోరప్రాకుడు ధరించు ముక్కంటికహో
    దారవె? మరుభూమిని సం
    చారుం గనినంతఁ గలిగె సంతాపమ్మే!

    శార్దూలవిక్రీడితము
    గౌరీ! జూటము బూదిపూతలను ముక్కంటిన్ గళంబందునన్
    బోరప్రాకుడు, నెద్దు వాహనముగన్, ముష్టెంచగన్ బుఱ్ఱెలో
    నేరీతిన్ సతి కాగ కోరితివొకో! ఈశున్ శ్మశానంపు సం
    చారుం గాంచితి నా మనమ్మున నిరాశానిస్పృహల్ నిండఁగన్!

    రిప్లయితొలగించండి
  3. దారాపుత్రుల దైన్యముం గనఁగ సంతాపంబు పెంపారగా
    దారిందెన్నును గానరాక భృతికిన్ దారిద్ర్యమే తోడుగా
    తీరంబుం గనరాని నావ పగిదిన్ దేశంబులంబట్టు సం
    చారుం గాంచితి నా మనమ్మున నిరాశానిస్పృహల్ నిండఁగన్

    రిప్లయితొలగించండి
  4. ఊరును చరించి వచ్చిన
    చారుం గనినంతఁ గలిగె సంతాపమ్మ .
    ఏరు మిడికెనని యనగా ,
    బోరున యేడ్చె పురజనులు ముప్పును దలచన్

    రిప్లయితొలగించండి
  5. -

    నోరూరెడు వంటల తిన
    నీ రోగము క్షౌద్రమేహమే తడ కట్టం
    గా రోజులతరబడి యీ
    చారుం గనినంత కలిగె సంతాపమ్మే

    రిప్లయితొలగించండి
  6. ధీరుడు దిగ్విజయముతో
    శ్రీరంగని విగ్రహమును చేగొననటుపై
    నా రంగని వలచిన నాం
    చారుం గనినంతఁ గలిగె సంతాపమ్మే

    వీరుండొక్కడు రంగనాథ ప్రతిమన్ పేరాసతో తోడ్కొనన్
    దీరై శోభిలు నట్టి విగ్రహమునే దృష్టించి వాంఛించు నాం
    చారుం గాంచితి నా మనమ్మున నిరాశానిస్పృహల్ నిండఁగన్
    శ్రీరంగంబును వీడకుండె మనసే చిత్రాతి చిత్రంబుగా

    రిప్లయితొలగించండి
  7. కం: కూరిమి గల్గియు నా యెడ
    తీరని దుఃఖమ్ము పైకి దెలుపక మరి యె
    వ్వారినొ పెండ్లాడిన నాం
    చారుం గనినంతఁ గలిగె సంతాపమ్మే

    రిప్లయితొలగించండి
  8. శా॥ నేరమ్ముల్ తన వ్యాపకమ్మని యటుల్ నిత్యంబు దుర్మార్గుఁడై
    ధారాళంబుగఁ జేయుచుండి తనదౌ దాష్టీకమేపారఁగా
    వీరుండంచుఁ దలంచు దుర్గుణుని నిర్వేదించ నయ్యో దురా
    చారుం గాంచితి నా మనమ్మున నిరాశా నిస్పృహల్ నిండఁగన్

    నిర్వేదించు దుఃఖపడు

    రిప్లయితొలగించండి
  9. శా:ఊరిన్ జేరెద నేడు భోజనము నో రూరించగా, పప్పుకై,
    యూరన్ జేసిన మిర్చియున్, మురియు నో రూరంగ బజ్జీలు,సాం
    బారున్ జేయుమటన్న భార్య పొదుపున్ బాటించ నా చప్పనౌ
    చారుం గాంచితి నా మనమ్మున నిరాశానిస్పృహల్ నిండఁగన్”

    రిప్లయితొలగించండి
  10. సమస్య : చారుం గనినంతఁ గలిగె సంతాపమ్మే

    గారెలు బూరెలు మోరులు
    తీరుగదిని పారణమున తేన్చినవాడై
    తీరగయాకలి, కమ్మని
    చారుం గనినంతఁ గలిగె సంతాపమ్మే

    రిప్లయితొలగించండి
  11. (3)కం:వీరి మతద్వేషము నాం
    చారు పయిన్ జూపి తు రక చాణ యెటుల శ్రీ
    వారికి బ్రియమన? సతి నాం
    చారుం గనినంతఁ గలిగె సంతాపమ్మే”
    (ఈ మధ్యన కొందరు పాతకథల నన్నిటినీ తిరగదోడి అనవసర మైన మతద్వేషాలు పెంచుతున్నారు.బీబీ నాంచారు ముస్లిం.ఆమెకి, వెంకటేశ్వర స్వామికి ఏమి సంబంధం? అంటూ రాద్ధాంతం చేస్తుంటే బీబీ నాంచారును చూసి జాలి కల్గింది. )




    రిప్లయితొలగించండి
  12. కోరిన రీతిగ తనయుడు
    పేరిమి ప్రఖ్యా తీ నొంది విల సిల్లు న నన్
    చేరియు దుష్టుల ను దురా
    చారు o గని నంత గలి గె సంతాప మ్మే

    రిప్లయితొలగించండి
  13. చేరెన్ నా గృహమందు ప్రాణసమయై చెన్నైన రూపమ్ముతో
    తీరైనట్టి విధానమందు పనినుత్తేజమ్ము జూపించి సం
    సారమ్మున్ నడిపించుచున్ దనువు నిస్సారమ్ముగా మార నాం
    చారుం గాంచితి నా మనమ్మున నిరాశా నిస్పృహల్ నిండగన్

    రిప్లయితొలగించండి
  14. ఔరా రాజ తిరస్కృతు
    దారుణ దారిద్ర్య మందుఁ దపియించెడు నా
    ఘోరావస్థస్థితు నా
    చారుం గని నంతఁ గలిగె సంతాపమ్మే


    లేరే యన్యులు దేశ పాలకులు గాలింపంగ నా దేశ మం
    దౌరా యీతఁ డొకండు దక్క మఱి దేశాధ్యక్ష పీఠార్హులే
    క్రూరాంతఃకరణుం గృపా రహితు నుగ్రున్ ఘోర ధూర్తున్ దు రా
    చారుం గాంచితి నా మనమ్మున నిరాశా నిస్పృహల్ నిండఁగన్

    రిప్లయితొలగించండి
  15. సారెకు సారెకు దెలిపిన
    దూరముగా నుండుమంచు దుష్టులకెపుడున్
    చేరిపుడు చెడెగద, దురా
    చారుంగనినంత గలిగె సంతాపంబున్

    రిప్లయితొలగించండి