12-6-2026 (శుక్రవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“చారుం గనినంతఁ గలిగె సంతాపమ్మే”(లేదా...)“చారుం గాంచితి నా మనమ్మున నిరాశానిస్పృహల్ నిండఁగన్”
దారుణ దారిద్ర్యముతోతీరము లేనట్టి నావ తీరుగనెపుఁడున్దారెరుగక తిరిగెడు సంచారుం గనినంతఁ గలిగె సంతాపమ్మే
పార్వతితో చెలికత్తె రూపంలో వచ్చిన శివయ్య:కందంభూరిగ జటలం, గళమునబోరప్రాకుడు ధరించు ముక్కంటికహోదారవె? మరుభూమిని సంచారుం గనినంతఁ గలిగె సంతాపమ్మే!శార్దూలవిక్రీడితముగౌరీ! జూటము బూదిపూతలను ముక్కంటిన్ గళంబందునన్బోరప్రాకుడు, నెద్దు వాహనముగన్, ముష్టెంచగన్ బుఱ్ఱెలోనేరీతిన్ సతి కాగ కోరితివొకో! ఈశున్ శ్మశానంపు సంచారుం గాంచితి నా మనమ్మున నిరాశానిస్పృహల్ నిండఁగన్!
దారాపుత్రుల దైన్యముం గనఁగ సంతాపంబు పెంపారగాదారిందెన్నును గానరాక భృతికిన్ దారిద్ర్యమే తోడుగాతీరంబుం గనరాని నావ పగిదిన్ దేశంబులంబట్టు సంచారుం గాంచితి నా మనమ్మున నిరాశానిస్పృహల్ నిండఁగన్
ఊరును చరించి వచ్చినచారుం గనినంతఁ గలిగె సంతాపమ్మ .ఏరు మిడికెనని యనగా ,బోరున యేడ్చె పురజనులు ముప్పును దలచన్
-నోరూరెడు వంటల తిననీ రోగము క్షౌద్రమేహమే తడ కట్టంగా రోజులతరబడి యీచారుం గనినంత కలిగె సంతాపమ్మే
-https://youtube.com/shorts/R4EX0QHTmrY?is=5Ewtkom0MX6xvRv5
ధీరుడు దిగ్విజయముతోశ్రీరంగని విగ్రహమును చేగొననటుపైనా రంగని వలచిన నాంచారుం గనినంతఁ గలిగె సంతాపమ్మేవీరుండొక్కడు రంగనాథ ప్రతిమన్ పేరాసతో తోడ్కొనన్దీరై శోభిలు నట్టి విగ్రహమునే దృష్టించి వాంఛించు నాం చారుం గాంచితి నా మనమ్మున నిరాశానిస్పృహల్ నిండఁగన్శ్రీరంగంబును వీడకుండె మనసే చిత్రాతి చిత్రంబుగా
కం: కూరిమి గల్గియు నా యెడ తీరని దుఃఖమ్ము పైకి దెలుపక మరి యెవ్వారినొ పెండ్లాడిన నాంచారుం గనినంతఁ గలిగె సంతాపమ్మే
శా॥ నేరమ్ముల్ తన వ్యాపకమ్మని యటుల్ నిత్యంబు దుర్మార్గుఁడై ధారాళంబుగఁ జేయుచుండి తనదౌ దాష్టీకమేపారఁగా వీరుండంచుఁ దలంచు దుర్గుణుని నిర్వేదించ నయ్యో దురాచారుం గాంచితి నా మనమ్మున నిరాశా నిస్పృహల్ నిండఁగన్నిర్వేదించు దుఃఖపడు
శా:ఊరిన్ జేరెద నేడు భోజనము నో రూరించగా, పప్పుకై,యూరన్ జేసిన మిర్చియున్, మురియు నో రూరంగ బజ్జీలు,సాంబారున్ జేయుమటన్న భార్య పొదుపున్ బాటించ నా చప్పనౌచారుం గాంచితి నా మనమ్మున నిరాశానిస్పృహల్ నిండఁగన్”
సమస్య : చారుం గనినంతఁ గలిగె సంతాపమ్మేగారెలు బూరెలు మోరులుతీరుగదిని పారణమున తేన్చినవాడైతీరగయాకలి, కమ్మని చారుం గనినంతఁ గలిగె సంతాపమ్మే
(3)కం:వీరి మతద్వేషము నాంచారు పయిన్ జూపి తు రక చాణ యెటుల శ్రీవారికి బ్రియమన? సతి నాంచారుం గనినంతఁ గలిగె సంతాపమ్మే”(ఈ మధ్యన కొందరు పాతకథల నన్నిటినీ తిరగదోడి అనవసర మైన మతద్వేషాలు పెంచుతున్నారు.బీబీ నాంచారు ముస్లిం.ఆమెకి, వెంకటేశ్వర స్వామికి ఏమి సంబంధం? అంటూ రాద్ధాంతం చేస్తుంటే బీబీ నాంచారును చూసి జాలి కల్గింది. )
కోరిన రీతిగ తనయుడు పేరిమి ప్రఖ్యా తీ నొంది విల సిల్లు న నన్ చేరియు దుష్టుల ను దురా చారు o గని నంత గలి గె సంతాప మ్మే
చేరెన్ నా గృహమందు ప్రాణసమయై చెన్నైన రూపమ్ముతో తీరైనట్టి విధానమందు పనినుత్తేజమ్ము జూపించి సంసారమ్మున్ నడిపించుచున్ దనువు నిస్సారమ్ముగా మార నాంచారుం గాంచితి నా మనమ్మున నిరాశా నిస్పృహల్ నిండగన్
ఔరా రాజ తిరస్కృతు దారుణ దారిద్ర్య మందుఁ దపియించెడు నా ఘోరావస్థస్థితు నాచారుం గని నంతఁ గలిగె సంతాపమ్మే లేరే యన్యులు దేశ పాలకులు గాలింపంగ నా దేశ మం దౌరా యీతఁ డొకండు దక్క మఱి దేశాధ్యక్ష పీఠార్హులే క్రూరాంతఃకరణుం గృపా రహితు నుగ్రున్ ఘోర ధూర్తున్ దు రాచారుం గాంచితి నా మనమ్మున నిరాశా నిస్పృహల్ నిండఁగన్
సారెకు సారెకు దెలిపినదూరముగా నుండుమంచు దుష్టులకెపుడున్చేరిపుడు చెడెగద, దురాచారుంగనినంత గలిగె సంతాపంబున్
దారుణ దారిద్ర్యముతో
రిప్లయితొలగించండితీరము లేనట్టి నావ తీరుగనెపుఁడున్
దారెరుగక తిరిగెడు సం
చారుం గనినంతఁ గలిగె సంతాపమ్మే
పార్వతితో చెలికత్తె రూపంలో వచ్చిన శివయ్య:
రిప్లయితొలగించండికందం
భూరిగ జటలం, గళమున
బోరప్రాకుడు ధరించు ముక్కంటికహో
దారవె? మరుభూమిని సం
చారుం గనినంతఁ గలిగె సంతాపమ్మే!
శార్దూలవిక్రీడితము
గౌరీ! జూటము బూదిపూతలను ముక్కంటిన్ గళంబందునన్
బోరప్రాకుడు, నెద్దు వాహనముగన్, ముష్టెంచగన్ బుఱ్ఱెలో
నేరీతిన్ సతి కాగ కోరితివొకో! ఈశున్ శ్మశానంపు సం
చారుం గాంచితి నా మనమ్మున నిరాశానిస్పృహల్ నిండఁగన్!
దారాపుత్రుల దైన్యముం గనఁగ సంతాపంబు పెంపారగా
రిప్లయితొలగించండిదారిందెన్నును గానరాక భృతికిన్ దారిద్ర్యమే తోడుగా
తీరంబుం గనరాని నావ పగిదిన్ దేశంబులంబట్టు సం
చారుం గాంచితి నా మనమ్మున నిరాశానిస్పృహల్ నిండఁగన్
ఊరును చరించి వచ్చిన
రిప్లయితొలగించండిచారుం గనినంతఁ గలిగె సంతాపమ్మ .
ఏరు మిడికెనని యనగా ,
బోరున యేడ్చె పురజనులు ముప్పును దలచన్
-
రిప్లయితొలగించండినోరూరెడు వంటల తిన
నీ రోగము క్షౌద్రమేహమే తడ కట్టం
గా రోజులతరబడి యీ
చారుం గనినంత కలిగె సంతాపమ్మే
-
రిప్లయితొలగించండిhttps://youtube.com/shorts/R4EX0QHTmrY?is=5Ewtkom0MX6xvRv5
ధీరుడు దిగ్విజయముతో
రిప్లయితొలగించండిశ్రీరంగని విగ్రహమును చేగొననటుపై
నా రంగని వలచిన నాం
చారుం గనినంతఁ గలిగె సంతాపమ్మే
వీరుండొక్కడు రంగనాథ ప్రతిమన్ పేరాసతో తోడ్కొనన్
దీరై శోభిలు నట్టి విగ్రహమునే దృష్టించి వాంఛించు నాం
చారుం గాంచితి నా మనమ్మున నిరాశానిస్పృహల్ నిండఁగన్
శ్రీరంగంబును వీడకుండె మనసే చిత్రాతి చిత్రంబుగా
కం: కూరిమి గల్గియు నా యెడ
రిప్లయితొలగించండితీరని దుఃఖమ్ము పైకి దెలుపక మరి యె
వ్వారినొ పెండ్లాడిన నాం
చారుం గనినంతఁ గలిగె సంతాపమ్మే
శా॥ నేరమ్ముల్ తన వ్యాపకమ్మని యటుల్ నిత్యంబు దుర్మార్గుఁడై
రిప్లయితొలగించండిధారాళంబుగఁ జేయుచుండి తనదౌ దాష్టీకమేపారఁగా
వీరుండంచుఁ దలంచు దుర్గుణుని నిర్వేదించ నయ్యో దురా
చారుం గాంచితి నా మనమ్మున నిరాశా నిస్పృహల్ నిండఁగన్
నిర్వేదించు దుఃఖపడు
శా:ఊరిన్ జేరెద నేడు భోజనము నో రూరించగా, పప్పుకై,
రిప్లయితొలగించండియూరన్ జేసిన మిర్చియున్, మురియు నో రూరంగ బజ్జీలు,సాం
బారున్ జేయుమటన్న భార్య పొదుపున్ బాటించ నా చప్పనౌ
చారుం గాంచితి నా మనమ్మున నిరాశానిస్పృహల్ నిండఁగన్”
సమస్య : చారుం గనినంతఁ గలిగె సంతాపమ్మే
రిప్లయితొలగించండిగారెలు బూరెలు మోరులు
తీరుగదిని పారణమున తేన్చినవాడై
తీరగయాకలి, కమ్మని
చారుం గనినంతఁ గలిగె సంతాపమ్మే
(3)కం:వీరి మతద్వేషము నాం
రిప్లయితొలగించండిచారు పయిన్ జూపి తు రక చాణ యెటుల శ్రీ
వారికి బ్రియమన? సతి నాం
చారుం గనినంతఁ గలిగె సంతాపమ్మే”
(ఈ మధ్యన కొందరు పాతకథల నన్నిటినీ తిరగదోడి అనవసర మైన మతద్వేషాలు పెంచుతున్నారు.బీబీ నాంచారు ముస్లిం.ఆమెకి, వెంకటేశ్వర స్వామికి ఏమి సంబంధం? అంటూ రాద్ధాంతం చేస్తుంటే బీబీ నాంచారును చూసి జాలి కల్గింది. )
కోరిన రీతిగ తనయుడు
రిప్లయితొలగించండిపేరిమి ప్రఖ్యా తీ నొంది విల సిల్లు న నన్
చేరియు దుష్టుల ను దురా
చారు o గని నంత గలి గె సంతాప మ్మే
చేరెన్ నా గృహమందు ప్రాణసమయై చెన్నైన రూపమ్ముతో
రిప్లయితొలగించండితీరైనట్టి విధానమందు పనినుత్తేజమ్ము జూపించి సం
సారమ్మున్ నడిపించుచున్ దనువు నిస్సారమ్ముగా మార నాం
చారుం గాంచితి నా మనమ్మున నిరాశా నిస్పృహల్ నిండగన్
ఔరా రాజ తిరస్కృతు
రిప్లయితొలగించండిదారుణ దారిద్ర్య మందుఁ దపియించెడు నా
ఘోరావస్థస్థితు నా
చారుం గని నంతఁ గలిగె సంతాపమ్మే
లేరే యన్యులు దేశ పాలకులు గాలింపంగ నా దేశ మం
దౌరా యీతఁ డొకండు దక్క మఱి దేశాధ్యక్ష పీఠార్హులే
క్రూరాంతఃకరణుం గృపా రహితు నుగ్రున్ ఘోర ధూర్తున్ దు రా
చారుం గాంచితి నా మనమ్మున నిరాశా నిస్పృహల్ నిండఁగన్
సారెకు సారెకు దెలిపిన
రిప్లయితొలగించండిదూరముగా నుండుమంచు దుష్టులకెపుడున్
చేరిపుడు చెడెగద, దురా
చారుంగనినంత గలిగె సంతాపంబున్