12, జూన్ 2026, శుక్రవారం

సమస్య - 5496

13-6-2026 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నారి నారి నడుమ రాముఁ డౌర నలిగె”
(లేదా...)
“నారికి నారికిన్ నడుమ నల్గెడివాఁడన రామచంద్రుఁడౌ”

4 కామెంట్‌లు:

  1. తేటగీతి
    రామపట్టాభిషేకము రమ్యమనుచు
    కైక రంజిల్ల మంధరకాలుమోపి
    భరతుని వరింప పట్టమ్ము వాదుసలుప
    నారి నారి నడుమ రాముఁ డౌర నలిగె!

    ఉత్పలమాల
    భూరిగ సంబరాల్ గనుచు ముచ్చటఁజెందెడు కైకఁ గాంచుచున్
    దారుణమెంచి మంధరయె దావము పాలొనరించి రామునిన్
    దీరుచ రాజుగన్ భరతు దిక్కును జూపెడు వాదమందునన్
    నారికి నారికిన్ నడుమ నల్గెడివాఁడన రామచంద్రుఁడౌ!

    రిప్లయితొలగించండి
  2. తన విలాతిని నారిగ తలచు చుండ ,
    మైథిలి వివాహమాడిన మరొక నారి ,
    నారి నారి నడుమ రాముఁ డౌర నలిగె
    సతులి రువురి కోరికలను చక్కబెట్ట

    రిప్లయితొలగించండి

  3. మంధర పలుకు కుటిలపు మాటలు విని
    రాజు కాకుండ రాముని రమణి కైక
    యడ్డు కొనుచు నతనిని తా నడవి కంప
    నారి నారి నడుమ రాముఁ డౌర నలిగె.


    నేరుపు కాడు రాముడని నేతను జీసెడి పాళమందు నన్
    వారిజ నేత్రులిర్వు రట పన్నిన కుట్రకు ధర్మ మూర్తియే
    భీరుక మేగె నంచొక వివేకియె తా వచి యించె నిట్టులన్
    నారికి నారికిన్ నడుమ నల్గెడివాఁడన రామచంద్రుఁడౌ.

    రిప్లయితొలగించండి
  4. నారిఁ బిగియింపగా విల్లు నాడు విరిగి
    నారి జానకి వరియించె వీరుడనుచు
    నారి సవరించుచున్ లంక నాథునడచె
    నారి నారి నడుమ రాముఁ డౌర నలిగె

    నారిఁ బిగింపగా విరిగెనా ధనువే రఘువీరుడెత్తినన్
    నారి లభించె రామునకు నాడు మహీజ వరించినంతటన్
    నారిని సంతరించి గద నాశమొనర్చెను లంకనాథునిన్
    నారికి నారికిన్ నడుమ నల్గెడివాఁడన రామచంద్రుఁడౌ

    రిప్లయితొలగించండి