13-6-2026 (శనివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“నారి నారి నడుమ రాముఁ డౌర నలిగె”(లేదా...)“నారికి నారికిన్ నడుమ నల్గెడివాఁడన రామచంద్రుఁడౌ”
తేటగీతిరామపట్టాభిషేకము రమ్యమనుచుకైక రంజిల్ల మంధరకాలుమోపిభరతుని వరింప పట్టమ్ము వాదుసలుపనారి నారి నడుమ రాముఁ డౌర నలిగె!ఉత్పలమాలభూరిగ సంబరాల్ గనుచు ముచ్చటఁజెందెడు కైకఁ గాంచుచున్దారుణమెంచి మంధరయె దావము పాలొనరించి రామునిన్దీరుచ రాజుగన్ భరతు దిక్కును జూపెడు వాదమందునన్నారికి నారికిన్ నడుమ నల్గెడివాఁడన రామచంద్రుఁడౌ!
తన విలాతిని నారిగ తలచు చుండ ,మైథిలి వివాహమాడిన మరొక నారి ,నారి నారి నడుమ రాముఁ డౌర నలిగె సతులి రువురి కోరికలను చక్కబెట్ట
మంధర పలుకు కుటిలపు మాటలు విని రాజు కాకుండ రాముని రమణి కైక యడ్డు కొనుచు నతనిని తా నడవి కంపనారి నారి నడుమ రాముఁ డౌర నలిగె.నేరుపు కాడు రాముడని నేతను జీసెడి పాళమందు నన్ వారిజ నేత్రులిర్వు రట పన్నిన కుట్రకు ధర్మ మూర్తియే భీరుక మేగె నంచొక వివేకియె తా వచి యించె నిట్టులన్ నారికి నారికిన్ నడుమ నల్గెడివాఁడన రామచంద్రుఁడౌ.
నారిఁ బిగియింపగా విల్లు నాడు విరిగినారి జానకి వరియించె వీరుడనుచునారి సవరించుచున్ లంక నాథునడచెనారి నారి నడుమ రాముఁ డౌర నలిగెనారిఁ బిగింపగా విరిగెనా ధనువే రఘువీరుడెత్తినన్ నారి లభించె రామునకు నాడు మహీజ వరించినంతటన్నారిని సంతరించి గద నాశమొనర్చెను లంకనాథునిన్ నారికి నారికిన్ నడుమ నల్గెడివాఁడన రామచంద్రుఁడౌ
తేటగీతి
రిప్లయితొలగించండిరామపట్టాభిషేకము రమ్యమనుచు
కైక రంజిల్ల మంధరకాలుమోపి
భరతుని వరింప పట్టమ్ము వాదుసలుప
నారి నారి నడుమ రాముఁ డౌర నలిగె!
ఉత్పలమాల
భూరిగ సంబరాల్ గనుచు ముచ్చటఁజెందెడు కైకఁ గాంచుచున్
దారుణమెంచి మంధరయె దావము పాలొనరించి రామునిన్
దీరుచ రాజుగన్ భరతు దిక్కును జూపెడు వాదమందునన్
నారికి నారికిన్ నడుమ నల్గెడివాఁడన రామచంద్రుఁడౌ!
తన విలాతిని నారిగ తలచు చుండ ,
రిప్లయితొలగించండిమైథిలి వివాహమాడిన మరొక నారి ,
నారి నారి నడుమ రాముఁ డౌర నలిగె
సతులి రువురి కోరికలను చక్కబెట్ట
రిప్లయితొలగించండిమంధర పలుకు కుటిలపు మాటలు విని
రాజు కాకుండ రాముని రమణి కైక
యడ్డు కొనుచు నతనిని తా నడవి కంప
నారి నారి నడుమ రాముఁ డౌర నలిగె.
నేరుపు కాడు రాముడని నేతను జీసెడి పాళమందు నన్
వారిజ నేత్రులిర్వు రట పన్నిన కుట్రకు ధర్మ మూర్తియే
భీరుక మేగె నంచొక వివేకియె తా వచి యించె నిట్టులన్
నారికి నారికిన్ నడుమ నల్గెడివాఁడన రామచంద్రుఁడౌ.
నారిఁ బిగియింపగా విల్లు నాడు విరిగి
రిప్లయితొలగించండినారి జానకి వరియించె వీరుడనుచు
నారి సవరించుచున్ లంక నాథునడచె
నారి నారి నడుమ రాముఁ డౌర నలిగె
నారిఁ బిగింపగా విరిగెనా ధనువే రఘువీరుడెత్తినన్
నారి లభించె రామునకు నాడు మహీజ వరించినంతటన్
నారిని సంతరించి గద నాశమొనర్చెను లంకనాథునిన్
నారికి నారికిన్ నడుమ నల్గెడివాఁడన రామచంద్రుఁడౌ