17-6-2026 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వేలకొలఁది సమస్యలు విసుగు రాదు”
(లేదా...)
“వేల సమస్య లిచ్చినను వేసరిలం గవిమిత్రు లొప్పరే”
పూరణ సలుపుట కొరకు పుడుకు నట్టివేలకొలఁది సమస్యలు ! ; విసుగు రాదుకవుల కేలన ! కాలము గడుపుటకయియదియె యుత్తమమగు మార్గమనుచుదలచ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తేటగీతిశంకరాభరణ సమూహమంకురించిమార్గనిర్దేశమొసఁగెడు మాన్యగురులుకందివంశ చంద్రులు నిత్యమందిరాగవేలకొలఁది సమస్యలు విసుగు రాదు!ఉత్పలమాలతేలిక చేసి మర్మముల తీరును దెల్పుచు శిష్యకోటికిన్లీలగ పద్యముల్ మెరయు రీతిని నేరుపు కందిశంకరుల్మేలుగ 'శంకరాభరణ' మేటి సమూహము నడ్పుచుండగన్వేల సమస్య లిచ్చినను వేసరిలం గవిమిత్రు లొప్పరే!
శంకరాభరణసమూహ సత్కవులనుకందిశంకరయ్యగురువుగారునెపుడుప్రోత్సహింతురు చక్కని బోధజేసివేలకొలది సమస్యలు విసుగు రాదుచాలవుచాలవాకవికి సర్వవిభిన్నములైన ప్రశ్నలున్మేలగుమంచిముత్యమునుమించినశిల్పములైవెలుంగులేనేలకునింగికైనఘన నిచ్చెనవేయుసమర్థుడాతడేవేలసమస్యలిచ్చినను వేసరిలంగవిమిత్రులొప్పరే
మోజు గల కవుల కొరకు రోజు కొక స మస్య నిచ్చి కవివరుల మనసు దోచు శంకరా భరణమ్మున చక్క నైన వేలకొలఁది సమస్యలు విసుగు రాదు.చాల వవెన్ని వ్రాసినను సత్కవు లెల్లరు పాటవమ్ము తో మేలగు పద్య రాజములు మిక్కుట మందున వ్రాయ నేమిరా హాళిగ మారి వారికది వ్యాపక మయ్యె సమూహ మందునన్ వేల సమస్య లిచ్చినను వేసరిలం గవిమిత్రు లొప్పరే.
కాలము వెళ్ళఁబుచ్చుటకుఁ గల్పనఁ జేసితి నొక్క బ్లాగునున్వాలుగ శంకరాభరణ వైఖరి గాఁగ దినమ్ముఁ దప్పకేహేలగ నిచ్చుచుంటిఁ గద యెన్నియొ పూరణలన్ లిఖింతురేవేలసమస్య లిచ్చినను వేసరిలం గవిమిత్రు లొప్పరే.
వేలకొలఁది సమస్యల వెంటఁబడఁగరయమునఁ దొలఁగునుగద కూర్పరి బడలిక ప్రాశ్నికుండకుఁ సంతృప్తి ప్రాప్తమగునువేలకొలఁది సమస్యలు విసుగు రాదువేల కొలంది ప్రశ్నలిడ వేసట దవ్వగు కావ్యకర్తకున్లోలుపుడైన కూర్పరికి లొంగుసమస్యలు హాయిగూర్చగామేలగు తత్పరత్వమిడు మెండుగ సౌఖ్యము ప్రాశ్నికుండకున్వేల సమస్య లిచ్చినను వేసరిలం గవిమిత్రు లొప్పరే
పూరణ సలుపుట కొరకు పుడుకు నట్టి
రిప్లయితొలగించండివేలకొలఁది సమస్యలు ! ; విసుగు రాదు
కవుల కేలన ! కాలము గడుపుటకయి
యదియె యుత్తమమగు మార్గమనుచుదలచ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితేటగీతి
రిప్లయితొలగించండిశంకరాభరణ సమూహమంకురించి
మార్గనిర్దేశమొసఁగెడు మాన్యగురులు
కందివంశ చంద్రులు నిత్యమందిరాగ
వేలకొలఁది సమస్యలు విసుగు రాదు!
ఉత్పలమాల
తేలిక చేసి మర్మముల తీరును దెల్పుచు శిష్యకోటికిన్
లీలగ పద్యముల్ మెరయు రీతిని నేరుపు కందిశంకరుల్
మేలుగ 'శంకరాభరణ' మేటి సమూహము నడ్పుచుండగన్
వేల సమస్య లిచ్చినను వేసరిలం గవిమిత్రు లొప్పరే!
శంకరాభరణసమూహ సత్కవులను
రిప్లయితొలగించండికందిశంకరయ్యగురువుగారునెపుడు
ప్రోత్సహింతురు చక్కని బోధజేసి
వేలకొలది సమస్యలు విసుగు రాదు
చాలవుచాలవాకవికి సర్వవిభిన్నములైన ప్రశ్నలున్
మేలగుమంచిముత్యమునుమించినశిల్పములైవెలుంగులే
నేలకునింగికైనఘన నిచ్చెనవేయుసమర్థుడాతడే
వేలసమస్యలిచ్చినను వేసరిలంగవిమిత్రులొప్పరే
రిప్లయితొలగించండిమోజు గల కవుల కొరకు రోజు కొక స
మస్య నిచ్చి కవివరుల మనసు దోచు
శంకరా భరణమ్మున చక్క నైన
వేలకొలఁది సమస్యలు విసుగు రాదు.
చాల వవెన్ని వ్రాసినను సత్కవు లెల్లరు పాటవమ్ము తో
మేలగు పద్య రాజములు మిక్కుట మందున వ్రాయ నేమిరా
హాళిగ మారి వారికది వ్యాపక మయ్యె సమూహ మందునన్
వేల సమస్య లిచ్చినను వేసరిలం గవిమిత్రు లొప్పరే.
కాలము వెళ్ళఁబుచ్చుటకుఁ గల్పనఁ జేసితి నొక్క బ్లాగునున్
రిప్లయితొలగించండివాలుగ శంకరాభరణ వైఖరి గాఁగ దినమ్ముఁ దప్పకే
హేలగ నిచ్చుచుంటిఁ గద యెన్నియొ పూరణలన్ లిఖింతురే
వేలసమస్య లిచ్చినను వేసరిలం గవిమిత్రు లొప్పరే.
వేలకొలఁది సమస్యల వెంటఁబడఁగ
రిప్లయితొలగించండిరయమునఁ దొలఁగునుగద కూర్పరి బడలిక
ప్రాశ్నికుండకుఁ సంతృప్తి ప్రాప్తమగును
వేలకొలఁది సమస్యలు విసుగు రాదు
వేల కొలంది ప్రశ్నలిడ వేసట దవ్వగు కావ్యకర్తకున్
లోలుపుడైన కూర్పరికి లొంగుసమస్యలు హాయిగూర్చగా
మేలగు తత్పరత్వమిడు మెండుగ సౌఖ్యము ప్రాశ్నికుండకున్
వేల సమస్య లిచ్చినను వేసరిలం గవిమిత్రు లొప్పరే