22-6-2026 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నల్లులున్నట్టి మంచమే నయము సుమ్ము”
(లేదా...)
“మత్కుణపూర్ణతల్పమె సుమా సుఖనిద్ర నొసంగు నెప్పుడున్”
పగలు శ్రమియించి యలసితి పడక జేరి నిదుర బోయెద మన్నను నీదు గోల యవశ మయ్యెను కాదుటే యంత కన్న నల్లులున్నట్టి మంచమే నయము సుమ్ము.చిత్కళ గొంతునీ విధిని చించుకు గేకలు వేయబోకు మా సత్కృప జూపి నీవికను శాంతి వహింపుమ, చెప్పె నెప్పుడో సత్కవి వాగు వారలట సన్నిధి నుండుట కంటె కాంచగా మత్కుణపూర్ణతల్పమె సుమా సుఖనిద్ర నొసంగు నెప్పుడున్
కవుల సభకు రేపటి ఉషఃకాలమునకె కవుల జాబితా నక్షర క్రమపు రీతి కూర్చుట కొరకై నిదుర రాకుండుటకయినల్లులున్నట్టి మంచమే నయము సుమ్ము”
నల్ల వేల్పుకే తప్పదు నల్లిబాధతల్ల డిల్లుట పరిపాటి దైవమయినకల్ల లేర్చికూర్చిన కవి కల్పనయగు'నల్లులున్నట్టి మంచమే నయము సుమ్ము'ఉత్కలికాసమగ్రమగు యోచనలే కవికిన్ సమస్యలౌమత్కుణపూర్ణతల్పమును మచ్చరికించని వారలుందురేసత్కవి సంప్రహాసమున సల్పిన కల్పన కాకపోవునే'మత్కుణపూర్ణతల్పమె సుమా సుఖనిద్ర నొసంగు నెప్పుడున్'
రిప్లయితొలగించండిపగలు శ్రమియించి యలసితి పడక జేరి
నిదుర బోయెద మన్నను నీదు గోల
యవశ మయ్యెను కాదుటే యంత కన్న
నల్లులున్నట్టి మంచమే నయము సుమ్ము.
చిత్కళ గొంతునీ విధిని చించుకు గేకలు వేయబోకు మా
సత్కృప జూపి నీవికను శాంతి వహింపుమ, చెప్పె నెప్పుడో
సత్కవి వాగు వారలట సన్నిధి నుండుట కంటె కాంచగా
మత్కుణపూర్ణతల్పమె సుమా సుఖనిద్ర నొసంగు నెప్పుడున్
కవుల సభకు రేపటి ఉషఃకాలమునకె
రిప్లయితొలగించండికవుల జాబితా నక్షర క్రమపు రీతి
కూర్చుట కొరకై నిదుర రాకుండుటకయి
నల్లులున్నట్టి మంచమే నయము సుమ్ము”
నల్ల వేల్పుకే తప్పదు నల్లిబాధ
రిప్లయితొలగించండితల్ల డిల్లుట పరిపాటి దైవమయిన
కల్ల లేర్చికూర్చిన కవి కల్పనయగు
'నల్లులున్నట్టి మంచమే నయము సుమ్ము'
ఉత్కలికాసమగ్రమగు యోచనలే కవికిన్ సమస్యలౌ
మత్కుణపూర్ణతల్పమును మచ్చరికించని వారలుందురే
సత్కవి సంప్రహాసమున సల్పిన కల్పన కాకపోవునే
'మత్కుణపూర్ణతల్పమె సుమా సుఖనిద్ర నొసంగు నెప్పుడున్'