ఉ॥ భావన మీర రామ కథ భవ్యతఁ దెల్ప విదేశమందునన్ ఠీవిగ విన్న వారలటు టిప్పణి పూర్తిగ మర్చి పోయినన్ ధీవరులౌచుఁ బల్కిరిటు తీరుగ ధైర్యముఁ గాంచి యుద్ధతిన్ రావణు మస్తకంబును దురంబున లక్ష్మణుఁ డుత్తరించెరా!
మరొక పూరణ (రాత్రి నాకు గుర్తు రాలేదండి నాగచంద్రుడు 11వ శతాబ్దం కన్నడ జైనకవి. ఆయన వ్రాసిన పంప రామాయణముగా ప్రసిద్ధి గాంచిన కావ్యంలో రావణుని లక్ష్మణుడు చంపుతాడు. నాగచంద్ర కు అభినవ పంప అని బిరుదు ఉన్నందున పంప రామాయణం గా వినుతికెక్కింది. పంప కన్నడ ఆదికవి 10వ శతాబ్దం)
ఉ॥ భావము మార్చి యెంతగనొ వ్రాసెను జైనమతంపు స్ఫూర్తితో భావనఁ జేసి యూహలకుఁ బ్రాభవ మొప్పఁగ రూపు దిద్దుచున్ జేవగ నాగచంద్రుఁడిటు చెప్పుచు రాముని గాథ వింతగా రావణు మస్తకంబును దురంబున లక్ష్మణుఁ డుత్తరించెరా
కందం
రిప్లయితొలగించండికావలసిన పాదమ్మిది
' రావణి తల లక్ష్మణుండు రణమునఁ దునిమెన్'
కావించితిట్లు శిష్యా!
"రావణు దల లక్ష్మణుండు రణమునఁ దునిమెన్"
ఉత్పలమాల
చేవను గల్గి యుద్ధమున జిక్కిన వెంటనె, శాపపీడితున్
రావణి మస్తకంబును దురంబున లక్ష్మణుఁ డుత్తరించెరా!
సేవనమేమిచేసితివొ శిష్య! కరంబన దొర్లె తప్పిటుల్
“రావణు మస్తకంబును దురంబున లక్ష్మణుఁ డుత్తరించెరా! ”
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిఆవహ మున సౌమిత్రియె
రావణి గడతేర్చె నంచు ప్రాజ్ఞుడు చెప్పన్
భావిని లిఖించె నిట్టుల
రావణు దల లక్ష్మణుండు రణమునఁ దునిమెన్.
కోవెల లోన నర్చకుడు కోమలి కోరగ చెప్పె లక్ష్మణుం
డావహమందు రావణిని యంతమొనర్చెనటంచు, నైన నా
భావిని వ్రాసె నిట్టులుపపాతమునన్ దన పొత్తమం దునన్
రావణు మస్తకంబును దురంబున లక్ష్మణుఁ డుత్తరించెరా.
*(రావణి=ఇంద్రజిత్తు)*
రావణు జంపినదెవరని
రిప్లయితొలగించండిఆ వడుగని దరికి బిలచి యడిగిన తోడన్
ఏ వెరపు లేక నుడివెను
"రావణు దల లక్ష్మణుండు రణమునఁ దునిమెన్
రావణ తనూభవుండగు
రిప్లయితొలగించండిరావణి సురపతినిగెలిచి రాణించె గదా
తా వధియింతునని జగ
ద్రావణు దల లక్ష్మణుండు రణమునఁ దునిమెన్
రావణ నందయంతుడగు రాక్షస వీరుడు మేఘనాధుడే
తా విభుధేంద్రునిన్ గెలువ దక్కెను సంశ్రవమింద్రజిత్తుగా
రావణపుత్రు డింద్రజిని రాక్షస మాయలమారినిన్ జగ
ద్రావణు మస్తకంబును దురంబున లక్ష్మణుఁ డుత్తరించెరా
[ జగద్రావణుడు = లోకాన్ని వణికించువాడు ]
ఉ॥ భావన మీర రామ కథ భవ్యతఁ దెల్ప విదేశమందునన్
రిప్లయితొలగించండిఠీవిగ విన్న వారలటు టిప్పణి పూర్తిగ మర్చి పోయినన్
ధీవరులౌచుఁ బల్కిరిటు తీరుగ ధైర్యముఁ గాంచి యుద్ధతిన్
రావణు మస్తకంబును దురంబున లక్ష్మణుఁ డుత్తరించెరా!
మరొక పూరణ
(రాత్రి నాకు గుర్తు రాలేదండి నాగచంద్రుడు 11వ శతాబ్దం కన్నడ జైనకవి. ఆయన వ్రాసిన పంప రామాయణముగా ప్రసిద్ధి గాంచిన కావ్యంలో రావణుని లక్ష్మణుడు చంపుతాడు. నాగచంద్ర కు అభినవ పంప అని బిరుదు ఉన్నందున పంప రామాయణం గా వినుతికెక్కింది. పంప కన్నడ ఆదికవి 10వ శతాబ్దం)
ఉ॥ భావము మార్చి యెంతగనొ వ్రాసెను జైనమతంపు స్ఫూర్తితో
భావనఁ జేసి యూహలకుఁ బ్రాభవ మొప్పఁగ రూపు దిద్దుచున్
జేవగ నాగచంద్రుఁడిటు చెప్పుచు రాముని గాథ వింతగా
రావణు మస్తకంబును దురంబున లక్ష్మణుఁ డుత్తరించెరా
రావణు దల దీ సి రెవరు?
రిప్లయితొలగించండికావలె సరియగు జవాబు గడగడ జెపు మా
లేవక నిట్టుల జెప్పెను
" రావణు దల లక్ష్మణుండు రణమున దునిమెన్ "
భావి జయ సూచికమ్మన
రిప్లయితొలగించండివేవేగ .విభీషణుండు వివరింపంగన్
దేవ నికాయప్రభు వి
ద్రావణు తల లక్ష్మణుండు రణమునఁ దునిమెన్
కావఁగ వానరధ్వజినిఁ గావఁగ నన్నను రాజధర్మముం
జేవ యెలర్ప నగ్రజు విశేష దయామహిమాన్వితుండునై
దైవము నెంచి యింద్రజితు, దక్షిణ బాహు విహీను జేయఁగా
రావణు, మస్తకంబును దురంబున లక్ష్మణుఁ డుత్తరించెరా