27-7-2026 (సోమవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అంధుం బరిమార్చె జనకునల్లుఁడు గరుణన్”
(లేదా...)
“అంధుని సంహరించెఁ గరుణార్ద్రమనస్కుఁడు రాముఁ డయ్యెడన్”
(న.చ. సాహిత్ అర్ధశతావధానంలో ఆరవల్లి శ్రీదేవి గారి సమస్య)
బంధించెను పుడమి సుతనుబంధకుఁడగు రావణుండు బలవంతముగాసంధించి బాణమును గర్వాంధుం బరిమార్చెను రఘురాముఁడు గరుణన్
స్కందుని పితను భజించుచు గంధము నొందు కతన దన గాదిలి సీతన్ బంధించి యుంచెనని యాఅంధుం బరిమార్చెను రఘురాముఁడు గరుణన్
కంధిని దాటుచు కప్పుర గంధిని బ్రోవంగ నెంచి కపి వాహినితో నంధక రిపు భక్తుని కా మాంధుం బరిమార్చె జనకునల్లుఁడు గరుణన్.కంధిని దాటి లంక జని కాంతను గాంచిన వాయు పుత్రుడే సంధి విచేష్టయే చెడెను సంగర మయ్యదె మేలనంగ గ ర్వాంధుని యంతు చూడగను వానర వాహిని తోడ సాగి కా మాంధుని సంహరించెఁ గరుణార్ద్రమనస్కుఁడు రాముఁ డయ్యెడన్.
బంధించెను పుడమి సుతను
రిప్లయితొలగించండిబంధకుఁడగు రావణుండు బలవంతముగా
సంధించి బాణమును గ
ర్వాంధుం బరిమార్చెను రఘురాముఁడు గరుణన్
స్కందుని పితను భజించుచు
రిప్లయితొలగించండిగంధము నొందు కతన దన గాదిలి సీతన్
బంధించి యుంచెనని యా
అంధుం బరిమార్చెను రఘురాముఁడు గరుణన్
రిప్లయితొలగించండికంధిని దాటుచు కప్పుర
గంధిని బ్రోవంగ నెంచి కపి వాహినితో
నంధక రిపు భక్తుని కా
మాంధుం బరిమార్చె జనకునల్లుఁడు గరుణన్.
కంధిని దాటి లంక జని కాంతను గాంచిన వాయు పుత్రుడే
సంధి విచేష్టయే చెడెను సంగర మయ్యదె మేలనంగ గ
ర్వాంధుని యంతు చూడగను వానర వాహిని తోడ సాగి కా
మాంధుని సంహరించెఁ గరుణార్ద్రమనస్కుఁడు రాముఁ డయ్యెడన్.