28-7-2026 (మంగళవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఉన్మత్తుండైన నృపతి యుద్దండుండౌ”
(లేదా...)
“ఉన్మత్తుండగు రాజు పాలనములో నుద్దండుఁడై వెల్గెనే”
(న.చ. సాహిత్ అర్ధశతావధానంలో వేదాల గాయత్రి గారి సమస్య)
జన్మము నొందిన మొదలుగ చిన్మయుని స్మరణ తోడ చిత్తము నందున్ తన్మయుడై యున్న కతనఉన్మత్తుండైన నృపతి యుద్దండుండౌ
హమ్మయ్య!మానడు మంచిని గోరు, గుణానుక్రమముగ విభుడు జనహితోన్మత్తుండైన నృపతి యుద్దండుండౌ నడచ బరిణెపురుగుల రౌద్రమ్మునయోజిలేబీయము
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
ఉన్మాదియైన ప్రభువుకుసన్మార్గము జూపునట్టి సచివుల వలనన్జన్మించినచో జ్ఞానము యున్మత్తుండైన నృపతి యుద్దండుండౌజన్మస్థానము నజ్జగించి చనియెన్ సామాన్యుడే భీరువైతన్మాత్రంబగు శక్తియున్న ప్రభువున్ దాజేరి సేవించగాసన్మార్గమ్మును వీడినట్టి తులువే సైన్యానికధ్యక్షుడైయున్మత్తుండగు రాజు పాలనములో నుద్దండుఁడై వెల్గెనే
సన్మార్గము జరియించు జ గన్మోహన రూపు గల్గి కల్పంబున తా నున్మాదు లైన వారికి నున్మత్తుండైన నృపతి యుద్దండుండౌ”*జన్మంబియ్యది శిష్ట సుమ్నమను విశ్వాసమ్ము తో నిత్యమున్ సన్మార్గమ్ము జరించు నట్టి జనులన్ సచ్చీలురౌ వారికిన్ సన్మానమ్ములు జేయువాడట దురాచారుండ్ర చిత్తమ్ములో నున్మత్తుండగు రాజు పాలనములో నుద్దండుఁడై వెల్గెనే.
జన్మము నొందిన మొదలుగ
రిప్లయితొలగించండిచిన్మయుని స్మరణ తోడ చిత్తము నందున్
తన్మయుడై యున్న కతన
ఉన్మత్తుండైన నృపతి యుద్దండుండౌ
హమ్మయ్య!
రిప్లయితొలగించండిమానడు మంచిని గోరు, గు
ణానుక్రమముగ విభుడు జనహితోన్మత్తుం
డైన నృపతి యుద్దండుం
డౌ నడచ బరిణెపురుగుల రౌద్రమ్మునయో
జిలేబీయము
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఉన్మాదియైన ప్రభువుకు
రిప్లయితొలగించండిసన్మార్గము జూపునట్టి సచివుల వలనన్
జన్మించినచో జ్ఞానము
యున్మత్తుండైన నృపతి యుద్దండుండౌ
జన్మస్థానము నజ్జగించి చనియెన్ సామాన్యుడే భీరువై
తన్మాత్రంబగు శక్తియున్న ప్రభువున్ దాజేరి సేవించగా
సన్మార్గమ్మును వీడినట్టి తులువే సైన్యానికధ్యక్షుడై
యున్మత్తుండగు రాజు పాలనములో నుద్దండుఁడై వెల్గెనే
రిప్లయితొలగించండిసన్మార్గము జరియించు జ
గన్మోహన రూపు గల్గి కల్పంబున తా
నున్మాదు లైన వారికి
నున్మత్తుండైన నృపతి యుద్దండుండౌ”*
జన్మంబియ్యది శిష్ట సుమ్నమను విశ్వాసమ్ము తో నిత్యమున్
సన్మార్గమ్ము జరించు నట్టి జనులన్ సచ్చీలురౌ వారికిన్
సన్మానమ్ములు జేయువాడట దురాచారుండ్ర చిత్తమ్ములో
నున్మత్తుండగు రాజు పాలనములో నుద్దండుఁడై వెల్గెనే.