29, జులై 2026, బుధవారం

సమస్య - 5543

30-7-2026 (గురువారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“శుంభద్భానుప్రభలు రజోరస మొసఁగెన్”

(లేదా...)

“శుంభద్భానుమయూఖకోటి వితతాస్తోకాంధకారం బిడెన్”

(న.చ. సాహిత్ అర్ధశతావధానంలో చిటితోటి విజయకుమార్ గారి సమస్య)

31 కామెంట్‌లు:

  1. జంభారిప్రతిమానదివ్యవిభవస్థానాంతరావాసి యా
    రంభానంతవిరోధిసంహననకార్యప్రాభవుండయ్యు దా
    దంభోక్తుల్ వినిపించు దీనుఁ డడుగన్ దానంబునుం జేయఁడే
    శుంభద్భానుమయూఖకోటి వితతాస్తోకాంధకారం బిడెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రంభామోహితుఁడై నిరంతరము నిద్రాహారముల్ మాని సం
      రంభుండై నలకూబరుండు నిశిపై రక్తిన్ ప్రదర్శించఁగా
      నంభోరాశి నతిక్రమించి గ్రహరా జస్తాద్రినిన్ దాటఁగా
      శుంభద్భానుమయూఖకోటి వితతాస్తోకాంధకారం బిడెన్.

      తొలగించండి
  2. కుంభిని పయిన మనుజునకు
    శుంభద్భానుప్రభలు రజోరస మొసఁగెన్
    రంభా ఫలము భుజించుచు
    కుంభములకొలది జలమును కుడిచిన బోవున్

    రిప్లయితొలగించండి
  3. అంభోనిధి యుప్పొంగెను
    స్తంభించెను క్రీడి యెడద తనయుని మృతితో
    అంభోదము లలముకొనెను
    శుంభద్భానుప్రభలు రజోరస మొసఁగెన్

    రిప్లయితొలగించండి
  4. కందం
    సంభావించుచు ధర్మజుఁ
    గుంభిన్నేలు యువరాజుఁ గోరఁగ సంధిన్
    జృంభించి హరిని వినెనే?
    శుంభద్భానుప్రభలు రజోరస మొసఁగెన్!


    శార్దూలవిక్రీడితము
    సంభావించుచు ధర్మరాజు వినతిన్ సంధిన్ బ్రయత్నింపగన్
    గుంభిన్నేలెడు రాజరాజుకడకున్ గోవిందుఁడున్ దూత యా
    రంభింపన్ హితవాక్యముల్ దెలిసె నే యంతంబు యుద్ధంబునన్?
    శుంభద్భానుమయూఖకోటి వితతాస్తోకాంధకారం బిడెన్!

    రిప్లయితొలగించండి
  5. గాంభీ ర్య మ్ము గ మబ్బులు
    సంభవ మై గగన మందు సాగుచు నిండన్
    కుంభిని జనులకు దో చె ను
    శుంభ ద్భా ను ప్రభలు రజో రస మొ స గె న్

    రిప్లయితొలగించండి
  6. -
    భంభం తకిటత ధిమి ధీం
    శుంభద్భానుప్రభలు రజోరస మొసఁగెన్
    రంభాదుల నాట్యపు సం
    రంభమ్మును జూడ యిచ్ఛ రగిలె మనసులో


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "..జూడ నిచ్ఛ రగిలెను మదిలో" అనండి.

      తొలగించండి
  7. శ్రీ కంది శంకరయ్య గారికి
    మీ పూరణ దేవుడు లేడు లేడని ....
    ఇచ్చట గాన రూపములో వినవచ్చును
    స్వరకల్పన జిలేబీయము


    https://m.youtube.com/watch?v=r-n1YU0NP5o&pp=iggUQAFKEEE5a1Z1TlNxSFpsaVY3VFE%3D

    రిప్లయితొలగించండి

  8. గంభీరుడు రాముడనిని
    యంభోధిని బోలునట్టి యసురుల సేనన్
    స్తంభింప జేసి యోర్చగ
    శుంభద్భానుప్రభలు రజోరస మొసఁగెన్.


    అంభోరాశిని బోలినట్టి మన సైన్యంబా నరున్ ధాటికే
    స్తంభింపన్ విజయమ్ము దక్కనచటన్ సంతోష మున్ బొందిరే
    దంభంబియ్యది కాదటంచు సతి సంతాపమ్ము తో పల్కె నే
    శుంభద్భానుమయూఖకోటి వితతాస్తోకాంధకారం బిడెన్.

    రిప్లయితొలగించండి
  9. సంభగ్నమొనర్చెనుగద
    గంభీరపు మొగ్గరమును కవ్వడి సుతుడే
    సంభవమయ్యె మరణమే
    శుంభద్భానుప్రభలు రజోరస మొసఁగెన్

    అంభస్సారమువోలె చొక్కమని వ్యాఖ్యానించిరా నాడు క్షీ
    రాంభోరాశి జనించినట్టి శశినా రాకేందుబింబాననున్
    సంభావింపగ కామవల్లభుడహో జాబిల్లి జన్మించగా
    శుంభద్భానుమయూఖకోటి వితతాస్తోకాంధకారం బిడెన్

    రిప్లయితొలగించండి
  10. రంభన్ బోలిన ధర్మబాగిని రమన్ రాకించుచున్ మూఢుడై
    శుంబన్ బట్టుక తిర్గుచున్ సతతమున్ సొమ్మంత పాడ్జేసి భో
    గంబుల్ పొందుచు నెల్లవేళల కడున్ కామాంధుడౌ వానికిన్
    శుంభద్భాను మయూఖకోటి వితతాస్తోకాంధకారంబిడెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "శుంభన్.." అని ఉండాలి కదా?

      తొలగించండి
    2. నమస్కారమండి ఇక్కడ నేను శుండ అనగా వేశ్య అను అర్థమును తీసుకొని వ్రాయడము జరిగింది శుంబ బదులుగా శుండన్ అని వ్రాయవలసి ఉండేది ధన్యవాదములు మీకు

      తొలగించండి

  11. శ్రీ పోచిరాజు కామేశ్వరరావు గారికి ,

    మీ పూరణ దేవుడు లేడు లేడని ....
    ఇచ్చట గాన రూపములో వినవచ్చును
    స్వరకల్పన జిలేబీయము

    https://youtu.be/BGXQKjTRKcI?is=28-QruBHPY9ql6Hk



    రిప్లయితొలగించండి
  12. శ్రీ శిష్ట్లా శర్మగారికి

    మీ పూరణ దేవుడు లేడు లేడని ....
    ఇచ్చట గాన రూపములో వినవచ్చును
    స్వరకల్పన జిలేబీయము

    https://youtu.be/7XLWoPgaZ7U?is=W0b5wpiH5gHgOhgq

    రిప్లయితొలగించండి
  13. శా॥ అంభోరాశి విధమ్ము వ్యోమముననున్ వ్యాపించు నక్షత్రముల్
    సంభావించఁగ నీలి రంధ్రములటన్ సారించఁగానెన్నియో
    స్తంభించంగను గాంతి చీకటులు విస్తారమ్మునౌ నచ్చటన్
    శుంభద్భాను మయూఖకోటి వితతాస్తోకాంధరంబిడెన్

    (ఇది పూర్తిగా సైన్సు ఆధారంగా పూరించాను కనుక చిన్న వివరణ అండి. నేల మీద అమావాస్య రోజున చూస్తే ఆకాశములో తెల్లని సముద్రం వలె నక్షత్రాలు కనిపిస్తాయండి వాటి మధ్య దూరమెంత ఉన్నా. వాటి మధ్యలో బ్లాక్ హోల్స్ కూడా చాలా ఉన్నాయండి. అక్కడికి చేరిన కాంతి (కాంతి కూడ శక్తి రూపం) ఆ చీకటిలో కలిసి పోతుంది ఇక వెనక్కి రాదు. మయూఖ కోటి యైన మరింత ఎక్కువైన అక్కడ అంధకారమేనండి. బ్లాక్ హోల్ కు ముందుగా కొంత కాంతి ఉంటుంది)

    రిప్లయితొలగించండి
  14. కం:స్తంభించగ హేమంతవి
    జృంభణమున కార్య రాశి, ఇపుడే రవి యా
    రంభించె ధాటి జూపగ
    శుంభద్భానుప్రభలు రజోరస మొసఁగెన్”
    (హేమంతప్రభావం తో కార్యశీలత పోగా ఇప్పుడు రవి తన ధాటి చూపి రజోగుణం కలిగించాడు.తమోగుణం అంటే స్తబ్ధత. రజోగుణ మంటే కార్యశీలత. )

    రిప్లయితొలగించండి
  15. శా:స్తంభాద్రిన్ రగిలించు వేసవి మరిన్ శైత్యమ్ము తా నెంతయో
    జృంభించున్ గద రాతి నేల యగుటన్! హేమంత మీ నాడె యా
    రంభమ్మయ్యెను గాని యింతటనె ఘోరంబౌచు బద్ధమ్ము గాన్
    శుంభద్భానుమయూఖకోటి వితతాస్తోకాంధకారం బిడెన్”
    (స్తంభాద్రి అంటే ఖమ్మం.రాతి నేల కనుక యెండ,చలి రెండూ ఎక్కువే. నిన్నటి దాకా ఎండ ఎక్కువ ఉండి ఇప్పుడే సూర్యకిరణాలు బంధించ బడి మంచు తో అంథకారం వచ్చింది. )


    రిప్లయితొలగించండి
  16. గంభీరమ్ముగఁ గ్రమ్మఁగ
    నంభోధర సంచయమ్ము లాకాశమునన్
    జృంభిత మేఘ కృశీకృత
    శుంభద్భానుప్రభలు రజోరస మొసఁగెన్


    అంభోజాక్షున కైన నెన్నఁగ నలంఘ్యమ్ముల్ సతీవాక్కులే
    యంభోజాక్షి యొసంగ శాపమును రోషాక్రాంత మాయా మహా
    స్తంభం బుద్భవ మంది యడ్డముగ విస్తారమ్ముగా నిల్వఁగా
    శుంభద్భాను మయూఖ కోటి విత తాస్తో కాంధకారం బిడెన్

    రిప్లయితొలగించండి
  17. డంభమ్మూని సుయోధనుండు హరి త్రాటన్గట్టగా నెంచుచున్
    సంభావించక చుట్టగా హితులతో, చక్రాయుధుండుగ్రుడై
    శుంభద్రీతిని విశ్వ రూపమును తా జూపించ, నాదీప్తికిన్
    శుంభద్భానుమయూఖకోటి వితతాస్తోకాంధకారం బిడెన్

    రిప్లయితొలగించండి
  18. అంభోనిధి నీరంబులు
    జృంభితముగఁ బైకిమిగుల యెగిరెగిరిపడన్
    గంభీరరవళియుతమై
    శుంభద్భానుప్రభలు రజోరస మొసఁగెన్”ఖ

    రిప్లయితొలగించండి
  19. రంభాయూర్వశి మేనకాదులశిరో రత్నంబుఁదోపింపనై -
    శుంభద్భానుమయూఖకోటి వితతాస్తోకాంధకారం బిడెన్
    గంభీరంబుగఁగాంతిఁజిందుచు మహాకాయంబుఁగాన్పించెగా
    సంభావించగ నీశు దృష్టులు దగన్ సారించ ప్రార్ధించెదన్

    రిప్లయితొలగించండి