6, అక్టోబర్ 2013, ఆదివారం

ఆశీర్నవరత్నములు


శ్రీ గన్నవరపు వరాహ నరసింహ మూర్తి, నాగమణి దంపతుల జ్యేష్ఠ కుమారుఁడు
చి|| భార్గవ నారాయణ మూర్తి
శ్రీ పరిగె వెంకట లక్ష్మీనరసింహ సుధాకర్, సుందరి లక్ష్మి దంపతుల కుమార్తె
చి||||సౌ|| హారిక
శుభ వివాహ మహోత్సవము
ది. ౧౨-౧౦-౨౦౧౩ (శనివారం) నాడు జరుగుచున్న సందర్భమున సమర్పించిన
ఆశీర్నవరత్నములు

శ్రీసుదతీలలామ నెదఁ జేర్చి జనావళిఁ గాచు శౌరి; గౌ
రీ సతికిన్ సగంబుగ శరీరము నిచ్చిన శంభుఁడున్; మనో
ల్లాసముగాఁ జతుర్ముఖములన్ శుభవాణినిఁ దాల్చు ధాత మీ
కీ సమయంబునన్ శుభము లెన్నియొ కూర్తు రొసంగి దీవెనల్.

గన్నవరపువంశాబ్ధి రాకావిధుఁడు
రాహ నరసింహ మూర్తిసార సుగుణఖని
యతని సతి నాగమణిసాధ్వి హిత గుణాఢ్య
యలరి రాదర్శదంపతులై నిరతము.

వారల తనయుఁడు భార్గవ
నారాయణ మూర్తిసద్గుణవ్రాత శుభా
కారుండై మోదం బే
పారఁగ కళ్యాణకళల వరుఁడై నెగడెన్.

పరిగెసదన్వయ ముఖ్యుఁడు
పెరిమ గలిగి కీర్తిఁగన్న వెంకట లక్ష్మీ
నరసింహ సుధాకర్, సుం
దరి లక్ష్మీదంపతుల తనయ హారికయే.

కవి పండిత జన సందో
హ వరాశీస్సుల మహిమను హారికతో భా
ర్గవ నారాయణ మూర్తి శు
భ వివాహపు వేడ్క కనుల పండుగ జేయున్.

కంటి కింపగు కళ్యాణ మంటపమున
హితులు బంధువుల్ మంగళాక్షతలఁ జల్లి
శుభ సుఖంబుల జీవన శోభ నంద
దీవెనల నీయ మీ జంట దీప్తినందు.

కలకాలము మీ రిద్దరు
కలసి మెలసి జీవితమును గడుపుచు పతి ప
త్నులు మిత్రులుగా కష్టం
బుల సుఖములఁ దోడయి శుభముల నందవలెన్.

ఎల్లప్పుడు మీ జంటకు
నెల్లలు లేనట్టి సుఖ సహిత విభవంబుల్
కొల్లలుగ నందవలెనని
యుల్లంబునఁ గోరుకొందు నొప్పుగ నెపుడున్.

సరిలేని శుభ సుఖంబుల
సిరు లన్యోన్యతను పొంది చిరకాలము సు
స్థిర దాంపత్యముతో మీ
రిరువురు సత్కీర్తి నంది హిత మందవలెన్.

సమర్పణ
శంకరాభరణం
కంది శంకరయ్య

సమస్యాపూరణం – 1196 (త్ర్యంబకసంభవుడు మఱఁది)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
త్ర్యంబకసంభవుడు మఱఁది యగు శ్రీపతికిన్.
ఈ సమస్యను పంపిన గుండా సత్యనారాయణ గారికి ధన్యవాదములు.

పద్య రచన – 486 (ఓమనగుంటలు)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము...
“ఓమనగుంటలు”

5, అక్టోబర్ 2013, శనివారం

సమస్యాపూరణం – 1195 (రాము నోడించె వాలి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
రాము నోడించె వాలి సంగ్రామమందు.
ఈ సమస్యను పంపిన సంపత్ కుమార్ శాస్త్రి గారికి ధన్యవాదములు.

పద్య రచన – 485 (తాళము)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము...
“తాళము”

4, అక్టోబర్ 2013, శుక్రవారం

సమస్యాపూరణం – 1194 (సతికి నమస్కరించి విలసద్గతి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
సతికి నమస్కరించి విలసద్గతిఁ గాంచిరి పెద్ద లెందఱో.
ఈ సమస్యను పంపిన గూడ రఘురామ్ గారికి ధన్యవాదములు.

పద్య రచన – 484 (పిత్రమావాస్య)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము...
“పిత్రమావాస్య”

3, అక్టోబర్ 2013, గురువారం

సమస్యాపూరణం – 1193 (అన్నములేనివాఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
అన్నము లేనివాఁడు పరమాన్నముఁ బంచును వాడ వాడలన్.
ఈ సమస్యను పంపిన గుండా సత్యనారాయణ గారికి ధన్యవాదములు.

పద్య రచన – 483

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

2, అక్టోబర్ 2013, బుధవారం

సమస్యాపూరణం – 1192 (గడ్డి మేయు జనులకు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
గడ్డి మేయు జనుల కెల్లఁ గలుఁగు సుఖము.
ఈ సమస్యను పంపిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదములు.