4, అక్టోబర్ 2013, శుక్రవారం

పద్య రచన – 484 (పిత్రమావాస్య)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము...
“పిత్రమావాస్య”

16 కామెంట్‌లు:

  1. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో..
    శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో...
    కర్ణాటకలో పిత్రుపక్షమును మహాలయ అమావస్యని పిలుచుదురు. ఈ రోజు మాకు సెలవు దినము. ఇక్కడ పెద్దలకు పిండములు ( స్వర్గీయ శ్రీ విశ్వేశ్వరయ్యకు కూడా) పెట్టి పూజింతురు.
    స్వర్గమునందు కర్ణునకు దినుటకు అన్నము పెట్టక స్వర్ణము బెట్టగ
    ========*==========
    స్వర్గమందు కర్ణునకిడ స్వర్ణమెల్ల
    నేమి పాప కర్మలు జేస్తి, నెరుకలేక
    దెలుప వలయు ననుచు వేడ, దెలిపిరంత
    పెద్దలకు పెట్టకుంటివి పిండములన.

    వాసవుని వేడి,మరలెను వసుధపైకి
    పెద్దలను బిల్చి బెట్టగ పిండములను
    తృప్తి జెందిన పెద్దలు దీవెనలిడ
    పిత్రు పక్షమని జనులు పిలుచు చుండె!

    రిప్లయితొలగించండి
  2. పూజ్య గురుదేవులకు ప్రణమిల్లుతూ,.

    పొత్త రాలిచ్చి పిత్రులకు భోజ్య మిడును
    మాళ యమవస్య రోజున మహిని జనులు
    సద్గతులుగల్గి సతతము స్వర్గ మందు
    పితరు లెల్లరు యుందురు ప్రీతిగాను

    రిప్లయితొలగించండి


  3. పిత్రమావాస్య దినమునపెద్దలకిల
    పిండముల నిత్తురందఱు పేర్మితోడ
    సంతసించుచు పెద్దలుసకల శుభము
    లుగలి గింతురు నిజమిది లోకనాధ!

    రిప్లయితొలగించండి
  4. మనసు నిల్పి పిత్ర మావాస్య రోజున
    స్వర్గ మందు నున్న జనకు నకును
    కన్న ఋణము దీర్చ కరుణతో పిండాలు
    పెట్టు చుందు రయ్య పేర్మితోడ

    రిప్లయితొలగించండి
  5. పెద్దవారఁ దలచుకొనగ ప్రేమ నేడు చూపుచున్
    చద్దిమూట వారి పలుకు శ్రద్ధతోడ నెప్పుడున్
    రద్దు చేయకుండ నాచరణము చేయుచున్ సదా
    ముద్దులొలుకు తీరు ముందు తరము తీర్చుమా!

    రిప్లయితొలగించండి
  6. మరణ మందిన పెద్దలన్ మానసమున
    స్మరణఁ జేసియు, వారికి శ్రద్ధతోడ
    పిండములఁ బెట్టి, మ్రొక్కియుఁ బితరులకును
    సద్గతులఁ గోరు దివసమ్ము సాఁగి వచ్చె!! (1)

    మరణ మందిన వారికి మాన్యత నిడు
    శ్రాద్ధ మిదికాదు! బ్రతికున్న క్రమములోన
    శ్రద్ధతో నన్నపానముల్ సరిగ నిడియుఁ
    బ్రేమతోడుతఁ జూచుట శ్రేయమగును! (2)

    బ్రతికి యున్నప్డు తిట్టి కొట్టి, తనువు విడి
    న తఱి, “నలుగు రేమందురో న”న్నటంచు
    భక్తి నటియించి, పిండముల్ వారి కెపుడు
    పెట్టు వారలే యిటఁ గనిపించు చుంద్రు! (3)

    బ్రతికి యున్నప్డు ప్రేమతో, భక్తితోడ,
    శ్రద్ధతోఁ జేయు సేవయే శ్రాద్ధ మగును!
    మరణ మందిన తఱి, వారు మఱలి వచ్చి,
    పిండములఁ దిందురే? నీదు పిచ్చి గాని! (4)

    బ్రతికి యుండిన పితర సేవనముఁ జేసి,
    తృప్తి నందించుటే, పితృ దీవనలకుఁ
    బాత్ర మగుటయే మనుజ సంభావ్య కృతము!
    లేనిచో నమావాస్య దినాన వారిఁ
    దృప్తులనుఁ జేయ ఫలితమ్ము విఱివి గాను
    నీకుఁ దక్కఁగల దిదియ నిక్క మయ్య!! (5)

    రిప్లయితొలగించండి
  7. బ్రతికి యుండిన పితరులు భార మనుచు
    భార్య గుప్పిట దాసుడై బ్రమను బ్రతుక
    కన్న వారిని కాదని కరుణ లేక
    పిండ మిడి నంత నమవాస్య ప్రీతి యగునె ?

    రిప్లయితొలగించండి
  8. బ్రతికి యుండగ తలిదండ్రి వెతలు దీర్చి
    సంతసమ్ము నిడు కొడుకు సద్గుణుండు
    మరణ మొందిన తండ్రికి మరవ కుండ
    పిత్రమావాస్య నా డిడు పిండములను

    రిప్లయితొలగించండి
  9. అపవర్గ తృషితు లెల్లరు
    నపరాహ్ణమునన్ మహాలయామావాస్యన్
    కృపతో గొని తిలతర్పణ
    పుపచారము లాత్మజులకు నుందురు తోడై.

    పితృసురల కన్న దగ్గరి వేల్పు లెవరు
    ప్రతి యమావాస్య వారికి పర్వ మగును
    తిలలతో తర్పణము లీయ తృప్తి నొంది
    స్వర్గమున నుండి రక్షింత్రు సంతు నెపుడు

    రిప్లయితొలగించండి
  10. శ్రీ గుండు మధుసూదన్ గారి 4, 5 పద్యములలో పరస్పర విరుద్ధ భావములు తోచుచున్నవి.

    రిప్లయితొలగించండి
  11. పిత్రమావాస్య రోజున ప్రేమతోడ
    జన్మ నిచ్చిన తండ్రికి స్వర్గమందు
    ఆత్మశాంతియు చేకూరి హాయిగుండ
    కన్నసుతులు పిండమిడు కరుణతోడ.

    రిప్లయితొలగించండి
  12. మిత్రులు మిస్సన్నగారికి,
    "శ్రీ గుండు మధుసూదన్ గారి 4, 5 పద్యములలో పరస్పర విరుద్ధ భావములు తోచుచున్నవి"యని మీ రనుచుంటిరి కాని విరుద్ధ భావమేదో చెప్పలేదు. తల్లిదండ్రులు బ్రతికియున్నప్పుడే తగు విధముగఁ దృప్తులనుగాఁ జేయవలె ననియే నా భావన. అటులఁ బ్రతిదినము చేయలేని పక్షమున నెలకొక్కమాఱైన (సజీవులైన "వారిని") నమావాస్య దినమునఁ దృప్తుల నొనరింప ఫలిత మొదవునని నా భావన. మరణించిన పిదప చేయు శ్రాద్ధము లర్థములేనివని నా యుద్దేశ్యము.

    రిప్లయితొలగించండి
  13. మహాలయ అమావాస్యపై చక్కని పద్యములను వ్రాసిన కవిమిత్రులు....
    వరప్రసాద్ గారికి,
    శైలజ గారికి,
    సుబ్బారావు గారికి,
    కుసుమ సుదర్శన్ గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    గుండు మధుసూదన్ గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు,
    బొడ్డు శంకరయ్య గారికి,
    మిస్సన్న గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  14. పూజ్యులు శంకరయ్యగారికి వందనములు

    హిందుధర్మమ్ము నందున సందడి గను
    జరుగు పండుగు లన్నియు సాంఘికములు
    దైవమునకు నర్చన నివేదనము నిడుట
    భక్తి మీర ప్రసాదసేవనముసేయ
    అవ్విధమ్ముననె మహాలయంపు పక్ష
    మున పితరులకు తర్పణముల నిడుటయు
    మతములన్నిట వేర్వేరు వితములుగను
    తలచి పితరులకెల్ల జోతల నిడెదరు

    బ్రతికినన్నాళ్లు మాతయు పితరులును
    సంతునకు సేవజేయంగ అంతికమున
    సుతుల కెల్లను పితరుల గతుల కొరకు
    శ్రాద్ధ కర్మల జేయకర్తవ్యమవదె

    వంశకర్త లేనిది నీదు బ్రతుకులేదు
    తల్లితండ్రులు తాత ముత్తాతలకును
    యేటికొకసారి తర్పణ లిచ్చినంత
    వారి దీవెనల౦దుచు వర్ధిలెదరు

    రిప్లయితొలగించండి
  15. కవి మిత్రులు మధుసూదన్ గార్కి మీ వివరణతో నా సందేహము తీరినది. 5వ పద్యంలో మీరు గతించిన తల్లిదండ్రులను ప్రస్తావించారని పొరబడ్డాను. కాని, మీరు వెలిబుచ్చిన అభిప్రాయం ప్రకారము తల్లిదండ్రుల మీద గౌరవం అంతంత మాత్రంగా ఉన్న సంతానం నెలకో రోజు అమావాస్య నాడు ఇద్దరికీ అన్నం పెడితే సరిపోతుంది, బాధ్యత తీరి పోతుందనుకొనే ప్రమాదం ఉందేమో అని పిస్తోంది. ఇక శ్రాద్ధ కర్మల గురించిన మీ అభిప్రాయము మీది.

    రిప్లయితొలగించండి