చక్కని పద్యాలతో అలరించిన కవిమిత్రులు... పండిత నేమాని వారికి, సుబ్బారావు గారికి, గుండు మధుసూదన్ గారికి, లక్ష్మీదేవి గారికి, గోలి హనుమచ్ఛాస్త్రి గారికి, శైలజ గారికి, కెంబాయి తిమ్మాజీ రావు గారికి, రాజేశ్వరి అక్కయ్యకు అభినందనలు, ధన్యవాదాలు. * శైలజ గారూ, రెండవ, చివరి పాదాలలో గణదోషం. ‘బ్రహ్మ మొదలగు దేవతల్ వచ్చినారు’ అని రెండవ పాదానికి, ‘ఆదిశక్తియె కరుణించె నా మునులను’ అని నాల్గవ పాదానికి నా సవరణలు. ‘వాటిక యందున’ అనండి. * తిమ్మాజీ రావు గారూ, ‘ధన్యమ్మవన్’ను ‘ధన్యమ్ముగాన్’ అనండి.
అరవిందాసన ముఖ్య దేవతలు గాయత్రిన్ మహాదేవునిన్
రిప్లయితొలగించండిస్థిరచిత్తంబున నిల్పి సాదరముగా జేయన్ మహాయజ్ఞమున్
బరితోషంబున సర్వశక్తిమయి తద్వహ్నిప్రభాజాతయై
కరమొప్పారగ నాదిశక్తికి నుతుల్ కావించి రత్యాదృతిన్
రిప్లయితొలగించండియజ్ఞవాటిక జూడగ హర్షమయ్యె
బ్రహ్మ మొదలగు దేవతల ర్హు డౌ,ను
మాపతినినిశ్చలముగనుమదిని నిల్పి
చేయుచుండిరి యజ్ఞము చిత్రమందు
బలమున దున్నరక్కసుని బల్లెపుఁ బోటునఁ జంపఁగాను బ్రా
రిప్లయితొలగించండిబలుకుల కల్కి నల్వయును, బన్నుగఁ జేరిన బేసి తాపసుల్
గలసియు జన్నముం దనరఁగా నటఁ జేయఁగ, నంత మెచ్చి, య
మ్మలకును బెద్దయమ్మ కడు మన్ననతో దిగి వచ్చెఁ గావఁగన్!!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగాయత్రీ స్థిత యజ్ఞవాటి గనియెన్ గానామృతాంభోధినిన్
రిప్లయితొలగించండిసాయంబొల్లక మున్గె నారదుడహా! సౌశీల్యురమ్మౌనులున్
ధ్యేయమ్మా చతురాననుండన మహా ధీశాలురై సల్పగా
నా యాగంబులు రక్షజేయు జనులన్నౌదార్యతన్- తథ్యమౌ.
రిప్లయితొలగించండిఆగమనునది నాపగా నసుర వధకు
ఆగమమ్ముల కాధార మైనవారు
యాగమన్నది చేయగా సాగుచుండె
విశ్వమంతయు సుఖశాంతి వెల్లి విరియ.
నారదాదులు వచ్చిరి నయముగాను
రిప్లయితొలగించండిబ్రహ్మా ధిదేవతలువచ్చిరి బాగ్యముగను
యజ్ఞ వాటిక నందున హర్షముగను
ఆది శక్తియె మునులను యనుగ్రహించె
అక్టోబర్ 03, 2013 10:20 AM
తొలగించు
పూజ్యగురుదేవులు శ౦కరయ్య గారికి వందనములు
రిప్లయితొలగించండిమునులు యాగమ్ము సాగి౦చిరనిశముగను
వేదమాతవిధాతయు వేల్పుదొరలు
నారదాదులు వేంచేసినారు హరిని
కలుగుమనుచును దండింప కలిని నేడు
వినుమోంకారము వేదవేత్తలు ఋషుల్ విశ్వాత్ముడౌ శ్రీహరిన్
ప్రణుతి౦పన్ హవనమ్ములో ఘ్రుతమునోం స్వాహాయటంచున్ వ్రేల్చ నా
వినువీధిన్ ధ్వనిసేయ చూడుమదిగో వేదాలకున్ మూలమౌ
జననిన్ వేల్పుల సూర్యచంద్రులను నీజన్మమ్ము ధన్యమ్మవన్
కొలువు దీరిన దివిజులు బలిమి గాను
రిప్లయితొలగించండికలియుగ మ్మున జనులకు కలత బాప
యజ్ఞ యాగము లొనరించ నలరు గాన
సభను శపధము జేసిరి సంత సమున
చక్కని పద్యాలతో అలరించిన కవిమిత్రులు...
రిప్లయితొలగించండిపండిత నేమాని వారికి,
సుబ్బారావు గారికి,
గుండు మధుసూదన్ గారికి,
లక్ష్మీదేవి గారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
శైలజ గారికి,
కెంబాయి తిమ్మాజీ రావు గారికి,
రాజేశ్వరి అక్కయ్యకు
అభినందనలు, ధన్యవాదాలు.
*
శైలజ గారూ,
రెండవ, చివరి పాదాలలో గణదోషం. ‘బ్రహ్మ మొదలగు దేవతల్ వచ్చినారు’ అని రెండవ పాదానికి, ‘ఆదిశక్తియె కరుణించె నా మునులను’ అని నాల్గవ పాదానికి నా సవరణలు. ‘వాటిక యందున’ అనండి.
*
తిమ్మాజీ రావు గారూ,
‘ధన్యమ్మవన్’ను ‘ధన్యమ్ముగాన్’ అనండి.