పండిత నేమాని వారూ, మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు. * రాజేశ్వరి అక్కయ్యా, చక్కని పద్యం చెప్పారు. అభినందనలు. నేమాని వారి సూచనను గమనించారు కదా! * శైలజ గారూ, మీ రెండు పద్యాలు కొన్ని లోపాలున్నా మీ ప్రయత్నం ప్రశంసనీయం. మొదటి పద్యంలో సవరణలు చేయవలసి ఉన్నది. రెండవ పాదంలో గణదోషం. నాల్గవ పాదంలో ‘ఒదిన’ అనడం దోషం. రెండవ పద్యం నాల్గవ పాదంలో గణదోషం. * శ్రీపతి శాస్త్రి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.
సంపత్ కుమార్ శాస్త్రి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. * కుసుమ సుదర్శన్ గారూ, మంచి పద్యాన్ని వ్రాసారు. అభినందనలు. మూడవ పాదంలో గణదోషం. కొన్ని లోపాలకు నా సవరణతో మీ పద్యం.... పల్లె సీమలో నాటలు పలు రకమ్ము లాడు చుందురు హాయిగా నాడువారు చూడ ముచ్చటగా నుండు చోద్యముగను గోముగా నాడ నోమన గుంట లాట. * కెంబాయి తిమ్మాజీ రావు గారూ, ఓమనగుంటల గురించి విపులంగా వర్ణిస్తూ చక్కని వృత్తం వ్రాసారు. అభినందనలు. ‘పీఠమున నుండును’, ‘పేర్చుచు నాడి’, ‘కర్చును చేసి పిల్లలా/ యామని...’ అనండి. * శైలజ గారూ, మీ తాజా పద్యాలు బాగున్నవి. అభినందనలు. మొదటి పద్యం చివరి పాదంలో టైపాటు వల్ల ఒక ‘మూ’ ఎక్కువైంది. ‘తెలుసున్’ అన్నదానిని ‘తెలియున్’ అనండి. రెండవ పద్యం నాల్గవ పాదంలో గణదోషం. ‘సరదాగ నాటలాడు/ కున్న యోమనగుంటలీ యుర్వి లేవు’ అందాం. * లక్ష్మీదేవి గారూ, బాగుంది మీ పద్యం. అభినందనలు. చాలావరకు మన సంప్రదాయ క్రీడలు పుస్తకాల్లో నామావశిష్టాలై ఉన్నాయి. * బొడ్డు శంకరయ్య గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, టి.వి. మన ఆటల నెన్నింటినో మింగేసింది. మీ పద్యాలు చాలా బాగున్నవి. అభినందనలు.
ఓమన కాయల బేర్చుచు
రిప్లయితొలగించండినోమన పీటపయి మిగుల నుత్సాహముతో
గోముగ బాలిక లాడెడు
నోమన గుంటలను మెచ్చి యోహో యనరే?
ఏమని జెప్పుదు నేడిల
రిప్లయితొలగించండినోమన గుంట లనగ న్యూనత నొందున్
సీమల యాటగు బ్రాంతిని
భామలు చులకనగ నెంచి పరిహాస మిడన్
ఓమన గుంటల నాటలు
రిప్లయితొలగించండిఏమని చెప్పుదు గరుతులు ఏగిన బాల్యమున్
మోమున విరిసెడి నవ్వుల
ఓమన గుంటలు నాడే ఒదినల తోడన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపల్లె సీమల నాడెడి పాత యాట
రిప్లయితొలగించండికాల గతిలోన గానక కదలి పోయె
అతివ లందరు సరదాగ యాడుకున్న
ఓమ నగుంట లులేవు ఉర్వి జూడ
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిఈ మే నెల సెలవులలో
మా మామయు నేను గలసి మాపటి వేళన్
వోమనగుంతల నాడగ
నా మది పులకించె నయ్య నాదే జయమౌ
శ్రీమతి రాజేశ్వరి గారికి శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యము బాగుగ నున్నది. 2వ పాదములో టైపు పొరఫాటు కావచ్చు. "నోమన గుంటాటలనగ" అని ఉండాలి. స్వస్తి.
ఆమనిఋతు దినములలో
రిప్లయితొలగించండిగోముగ నట నాడెవారుగుంపుగ బాలల్
ఓమన గుంటలనాటను
ప్రేమను మఱి యొకరికొకరుప్రియములు గలుగన్
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
చక్కని పద్యం చెప్పారు. అభినందనలు.
నేమాని వారి సూచనను గమనించారు కదా!
*
శైలజ గారూ,
మీ రెండు పద్యాలు కొన్ని లోపాలున్నా మీ ప్రయత్నం ప్రశంసనీయం.
మొదటి పద్యంలో సవరణలు చేయవలసి ఉన్నది. రెండవ పాదంలో గణదోషం. నాల్గవ పాదంలో ‘ఒదిన’ అనడం దోషం.
రెండవ పద్యం నాల్గవ పాదంలో గణదోషం.
*
శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
‘బాలల్ + ఓమన’ అని విసంధిగా వ్రాయరాదు కదా.
ఓమనగుంటల యాటలు
రిప్లయితొలగించండిప్రేమను సఖ్యతను బెంచు, విద్వన్ముఖులై
యీ మాయాజగతిన తా
నేమారక నుండగలుగనిచ్చును కంటే.
పల్లె సీమలో నాటలు పలు రకాలు
రిప్లయితొలగించండిఆడు చుందురు హాయిగా నాడు వారు
చూడ ముచ్చట జెంద్రు చూసి జనులు
గోముగా నాడె డోమన గుంట లాట.
పూజ్య గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
రిప్లయితొలగించండిఓమనగుoట పీఠమున యుండును గుంతలు, చింత పిక్కలన్
నీమముతోడ జట్టులయి నేర్పుగ పేర్చుచు యాడి గెల్వగా
ప్రేమగ నొడ్డు రొక్కమును వేడుక ఖర్చునుచేసి బాలికల్
ఆమని ముచ్చటల్ జరుపు హాయిని మాటల దెల్పసాధ్యమే!
వామన గుంటల నాటల
రిప్లయితొలగించండిప్రేమగ చెప్పిన కబురుల పెరిగిన చెలిమిన్
మోమున విరిసిన నవ్వులు
ఏమూమూలకుపోయెనేమొ ఎవరికి తెలుసున్
పల్లె సీమల నాడెడి పాత యాట
కాల గతిలోన గానక కదలి పోయె
అతివ లందరు సరదాగ యాడుకున్న
వోమ నగుంటల యాటలు ఉర్వి లేవు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఓమనగుంటలనగనది
రిప్లయితొలగించండియేమో యెఱుకయునులేదె; యేనెచ్చోటన్
భామల నాడన్ గననిక
నేమని వ్రాసెద సమస్య నెటు పూరింతున్?
ఆమనిఋతు దినములలో
రిప్లయితొలగించండిగోముగ నట నాడెవారుగుంపుగపడతు
ల్వోమన గుంటలలనాటను
ప్రేమను మఱి యొకరికొకరుప్రియములు గలుగన్
ధామము దాటుట నెరుగని
రిప్లయితొలగించండిగ్రామీణుల కన్యలంత కౌశల్యముతో
నోమన గుంటల నాడుచు
ప్రేమమ్మున మెలగు చుంద్రు వీడక చెలిమిన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగుంటలవారుగ నుండును
రిప్లయితొలగించండికంటిరె యిరువైపులందు కాయలు పిక్కెల్
గుంటలవేయుచు నోమన
గుంటాటలనాడు నాడు గుర్తున్ గలదే ?
గ్రామము లందానాడుల
నోమనగుంటాట నతివలుత్సాహముతో
ఓ ! మరి పిల్లలతో హో
హో ! మనసుప్పొంగ నాడయో నేడేదీ ?
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
*
కుసుమ సుదర్శన్ గారూ,
మంచి పద్యాన్ని వ్రాసారు. అభినందనలు.
మూడవ పాదంలో గణదోషం. కొన్ని లోపాలకు నా సవరణతో మీ పద్యం....
పల్లె సీమలో నాటలు పలు రకమ్ము
లాడు చుందురు హాయిగా నాడువారు
చూడ ముచ్చటగా నుండు చోద్యముగను
గోముగా నాడ నోమన గుంట లాట.
*
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
ఓమనగుంటల గురించి విపులంగా వర్ణిస్తూ చక్కని వృత్తం వ్రాసారు. అభినందనలు.
‘పీఠమున నుండును’, ‘పేర్చుచు నాడి’, ‘కర్చును చేసి పిల్లలా/ యామని...’ అనండి.
*
శైలజ గారూ,
మీ తాజా పద్యాలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పద్యం చివరి పాదంలో టైపాటు వల్ల ఒక ‘మూ’ ఎక్కువైంది. ‘తెలుసున్’ అన్నదానిని ‘తెలియున్’ అనండి.
రెండవ పద్యం నాల్గవ పాదంలో గణదోషం. ‘సరదాగ నాటలాడు/ కున్న యోమనగుంటలీ యుర్వి లేవు’ అందాం.
*
లక్ష్మీదేవి గారూ,
బాగుంది మీ పద్యం. అభినందనలు.
చాలావరకు మన సంప్రదాయ క్రీడలు పుస్తకాల్లో నామావశిష్టాలై ఉన్నాయి.
*
బొడ్డు శంకరయ్య గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
టి.వి. మన ఆటల నెన్నింటినో మింగేసింది.
మీ పద్యాలు చాలా బాగున్నవి. అభినందనలు.