5, అక్టోబర్ 2013, శనివారం

పద్య రచన – 485 (తాళము)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము...
“తాళము”

20 కామెంట్‌లు:

  1. కంటికి కాటుక యందము
    చంటికి యింపైన కురులు జాజులు తురుమన్
    యింటికి తాళము పదిలము
    వంటికి రైకంద మంట వనితల కెపుడున్

    రిప్లయితొలగించండి
  2. యింటికి తాళము వేయగ
    కంటికి కళ్లెము నువేయ కలుగును మేలున్
    మింటిని తారలు గోరగ
    వంటికి మంచిది గాదే వనితల కెపుడున్

    రిప్లయితొలగించండి
  3. మిత్రులు మిస్సన్నగారికి నమస్కారములు. నిన్న
    "శ్రీ గుండు మధుసూదన్ గారి 4, 5 పద్యములలో పరస్పర విరుద్ధ భావములు తోచుచున్నవి"యని మీ రంటిరి. కాని విరుద్ధ భావమేదో చెప్పలేదు. తల్లిదండ్రులు బ్రతికియున్నప్పుడే తగు విధముగఁ దృప్తులనుగాఁ జేయవలె ననియే నా భావన. అటులఁ బ్రతిదినము చేయలేని పక్షమున, నెలకొక్కమాఱైన (సజీవులైన "వారిని") నమావాస్య దినమునఁ దృప్తుల నొనరింప ఫలిత మొదవునని నా భావన. మరణించిన పిదప చేయు శ్రాద్ధము లర్థములేనివని నా యుద్దేశ్యము.

    రిప్లయితొలగించండి
  4. శ్రీగురుభ్యోనమ:

    తాళము మూలమై నిలచి ధాత్రిన విద్యలు విస్తరించెగా
    తాళము రాగముల్ మధుర ధారలు పంచును ప్రాణికోటికిన్
    తాళము గూర్చు భద్రతను తాళము తత్వము నేర్చినంత పా
    తాళమదైననేమి మన దారికి వచ్చును, రాక మానునే?

    తాళము = 1.తాళపత్రము. 2.సంగీతమునందు తాళము, 3.బీగము 4.పై 3

    రిప్లయితొలగించండి
  5. రాజేశ్వరి అక్కయ్యా,
    చక్కని పద్యాన్ని వ్రాసారు. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    వివిధ తాళములను గురించిన మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. నాట్యము నేర్పించు గురువు తన శిష్యునికి పెట్టెలోనున్న తాళ పత్ర గ్రంధమును త్వరగా తెమ్మని చెప్పుట...

    తాళము మీదను వ్రాసితి
    తాళమునెటు వేయవలెనొ తకతయ్యంటూ
    తాళము తీసిటు తెమ్ముర
    తాళము నాలస్యమింక త్వరగా రారా !

    రిప్లయితొలగించండి
  7. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ ‘తాళ’ వృత్తంతం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. తాళము వేయుట మఱువకు
    తాళములేరక్ష మఱిని తలిరుల సిరికిన్
    తాళములు బెక్కు రకములు
    తాళము గాడ్రేజు మిన్న తలిరుల బోడీ!

    రిప్లయితొలగించండి
  9. మిత్రులందరికీ దసరా నవరాత్రుల మొదటి రోజు పండుగ సందర్భంగా దసరా శుభాకాంక్షలు. (ఒక మార్పు కోసం) పెద్దలూ, మిత్రులు కోపగించుకోకుంటే ఈ రోజు అందరి పద్యాలనూ పరిశీలించాలని ప్రయత్నిస్తున్నా.
    నా దుస్సాహసాన్ని సహృదయతతో మన్నించగలరు.

    అక్కయ్యా,
    కాటుకె యందము అనాలనుకుంటున్నాను.
    చంటి = పాప అని మీ భావనా? "చంటికినింపైన కురుల "అనాలనుకుంటున్నాను.
    *
    శైలజగారూ,
    "కలిగిన మేలౌ" అనాలనుకుంటున్నాను.
    చివరి పాదములో గణదోషం . " వంటికి మంచిదది గాదు " అనాలనుకుంటున్నాను.
    *
    శ్రీపతిశాస్త్రి గారూ,
    ధాత్రిని అనాలనుకుంటున్నాను.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    అంటూ కు బదులు " యంచున్" అనాలనుకుంటున్నాను.
    *
    సుబ్బారావు గారూ,
    మఱిని అర్థము కాలేదు.
    *
    గురువు గారూ,
    నేను చేసినది తప్పైతే మన్నించ మనవి.
    మళ్ళీ దాంట్లో కూడా తప్పు సవరణలు సూచించి ఉంటే తెలుపగలరు.
    ఇదీ ఒక అభ్యాసమౌతుందని ఆశపడుతున్నాను.

    రిప్లయితొలగించండి
  10. శ్రీపతిశాస్త్రి గారి పద్యమ్ చాలా బాగుంది.


    తాళమగు మూడు రీతులు ధరణిలోన
    తలుపులకు భద్రతకు వేయు తాళ మొకటి
    వివిధ సంగీత రాగాలఁ వేయు నొకటి
    వేగమే నేత మెప్పుకై వేయు నొకటి.

    రిప్లయితొలగించండి
  11. మాస్టరు గారూ ! ధన్యవాదములు.
    లక్ష్మీదేవి గారూ ! నిజమే ..మీరు చెప్పినదానికి నేను తాళము వేయుచున్నాను. ధన్యవాదములు.

    తాళము మీదను వ్రాసితి
    తాళమునెటు వేయవలెనొ తకతయ్యనుచున్
    తాళము తీసిటు తెమ్ముర
    తాళము నాలస్యమింక త్వరగా రారా !

    రిప్లయితొలగించండి
  12. తగని చోట మేలు తాళము నోటికి
    తాళముంచ మేలు తలుపు మూయ
    పాట పాడు వేళ నీటైన తాళము
    హాయిఁ గొల్పు మదికి ననుసరించ!

    రిప్లయితొలగించండి
  13. తాళము వేయుచు గొళ్ళెము
    వేళాకోళమున కైన వేయ మరచినన్
    తాళక చౌర్యము జేతురు
    తాళము వేయని గృహమున తస్కరులెల్లన్

    రిప్లయితొలగించండి
  14. గురువర్యులకు వందనములు! దోషములున్నచో సవరించ మనవి.
    నోటికి తాళము లేకయు
    ధాటిగ కోతలనుకోయు దాపరి జనులన్
    తాటన జేసియు వారల
    నోటికి తాళమ్మువేసి నులిబెట్టవలెన్.

    రిప్లయితొలగించండి
  15. తాళ మనగ నింటికి వేయు తాళ మొకటి
    మల్లబంధ విశేషము మరియు నొకటి
    తాటిచెట్టు నందురు గద తాళ మనుచు
    తనరు సంగీతమున నుండు తాళ మెపుడు

    రిప్లయితొలగించండి
  16. పూజ్యులు శంకరయ్యగారికి వందనములు

    వీటికి తాళము భద్రము
    నోటికి తాళమ్ము మేలు నొక్కొక్క తరిన్
    పాటకు లయగా తాళము
    దాట౦గను చిన్నవంక తాళ ద్రుమమే

    రిప్లయితొలగించండి
  17. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో...
    రాజకీయనాయకులు వారికి సహాయపడిన వారిని లంచములతో ముంచును, లేక యున్న వారిని శంకర గిరిమాన్యములకు పంపును
    ======*========
    తాళము వేసిన వారికి
    తాళము వేయును కలియుగ తంత్రుల తోడన్
    తాళము వేయని వారిని
    తాళములను జేయు నడవి దాపల దరిలో!
    ( కలియుగ తంత్రులు = లంచములు,తాళములను= చెట్లను,దాపల= ఎడమ భాగము(పనిరాని చోట))

    రిప్లయితొలగించండి
  18. లక్ష్మీదేవి గారూ,
    చాలా సంతోషం. మీ చర్యను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. వృద్ధాప్యం వల్లను, కొన్ని చీకాకుల వల్లను పూరణలను పైపైన చూసి వ్యాఖ్యానిస్తున్నాను. నా దృష్టికి రానివీ, వచ్చినా (ఔత్సాహికులను నిరుత్సాహపరచకుండా) ఉపేక్షించినవి తప్పక ఉంటాయి. శిష్యవాత్సల్యంతో పండిత నేమాని వారు అందరి రచనలను పరామర్శిస్తున్నారు. మీరు నాకు కొంత శ్రమ తగ్గించినవా రవుతున్నారు. సంతోషంగా కొనసాగించండి. ధన్యవాదాలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘మఱిని’కి బదులు ‘మఱియు’ అనండి.
    ‘తలిరుల సిరికి తాళములు’...?
    *
    మిస్సన్న గారూ,
    మూడు విధాల తాళాలను గురించిన మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    హనుమచ్ఛాస్త్రి గారూ,
    లక్ష్మీదేవి గారి అభిప్రాయాన్ని మన్నించినందుకు ధన్యవాదాలు.
    *
    సహదేవుడు గారూ,
    మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
    *
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    కుసుమ సుదర్శన్ గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    ‘తాటను దీసియు’ అంటే బాగుంటుందేమో?
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. గురువుగారికి,లక్ష్మిదేవిగారికి కృతజ్ఞతాభివందనములు. మిస్సన్నగారూ ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి