3, అక్టోబర్ 2013, గురువారం

సమస్యాపూరణం – 1193 (అన్నములేనివాఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
అన్నము లేనివాఁడు పరమాన్నముఁ బంచును వాడ వాడలన్.
ఈ సమస్యను పంపిన గుండా సత్యనారాయణ గారికి ధన్యవాదములు.

25 కామెంట్‌లు:

  1. పున్నమి చంద మామ సరి బోలిన మోమును గాంచి నంతనే
    చిన్నది ప్రేమ మీర తన చేరువ నుండిన భాగ్య మంచుతా
    సన్నగ పాట పాడుచును స్వామిని గొల్చుచు సంత సంబునన్
    అన్నము లేనివాఁడు పరమాన్నముఁ బంచును వాడ వాడలన్

    రిప్లయితొలగించండి
  2. అన్నము గైకొనండు పరమార్థ వివేక విశేష యోగ సం
    పన్ను డొకండు రామరస పాయసమున్ విరచించి యోగశ
    క్తిన్నయమార జేసె నొక దివ్య ప్రసాదము భౌతికమ్మునౌ
    యన్నము లేనివాడు పరమాన్నము పంచును వాడవాడలన్

    రిప్లయితొలగించండి
  3. మిత్రు లందరికీ వందనములు !
    మిత్రుల పూరణలు మురిపించు చున్నవి !

    విందులో మిగిలిన వంటకములను
    పారవేయకుండా తినదగు వారికి పంచుట మంచిదే గదా :

    01)
    __________________________________________

    మిన్నగ బెండ్లి సేసె , బహు - మిక్కిలి ప్రేమను సూన కొక్కడున్ !
    యెన్నియొ వంటకమ్ములట - నేర్పడ జేసెను పెండ్లి విందుకై !
    చెన్నుగ నందరున్ దినగ, - జీకగ , నాకగ , సర్వ భక్ష్యముల్ !
    అన్నము లుప్తమాయె ! పర - మాన్నము మాత్రమె యుండె , నందుచే
    నన్నము లేనివాఁడు పర - మాన్నముఁ బంచును వాడ వాడలన్
    బిన్నకు, బెద్దకున్ మిగుల - పేదరికమ్మున నున్న వారికిన్
    మిన్నగు క్షేమముల్ గలుగు - మీకని యెల్లరు దీవెనివ్వగన్ !
    __________________________________________
    సూన = కూతురు

    రిప్లయితొలగించండి
  4. శ్రీగురుభ్యొనమ:

    ఉన్నను లేకపోయినను యోచన జేయక నప్పు జేసి యా
    మన్నిక లేని విత్తులను మళ్ళను జల్లెను మోసపోవుచున్
    తిన్నను మానినన్ బదులు దీర్చెను పండిన కొద్ది పంటతో
    నన్నము లేనివాడు పరమాన్నము పంచెను వాడవాడలన్

    రిప్లయితొలగించండి
  5. ఎన్నఁగఁ ద్రావ నీర మది యేమియు లే దెటు పాయసమ్ముఁ దాఁ
    బన్నుగ నీఁ గలాఁడు పెఱవారికి? నిత్యముఁ గోరి యెట్లు తా
    నన్నము లేని వాఁడు పరమాన్నముఁ బంచును వాడ వాడలన్?
    జె న్నలరారఁగాఁ జపల చిత్తుఁడు స్థైర్యము నెట్లు తా నిడున్?

    రిప్లయితొలగించండి
  6. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో..

    కష్ట కడలి యందున్న వాని కష్టములు దీర్చగ
    ========*==============
    కన్నుల జూచి శ్రీధరుడు కష్టము దీర్చగ,భక్తి భావమున్
    సన్నిధి జేరి వేడి సుఖశాంతులు బొంది!పరితోష చంద్రికల్!
    పున్నమి హాయి!పొంకముగ పొందుచునుండెను భౌతికమ్ముగన్!
    అన్నము లేనివాఁడు పర మాన్నముఁ బంచును వాడ వాడలన్!

    ( పరమాన్నముఁ= భక్తి విద్యను)

    రిప్లయితొలగించండి
  7. పూజ్యగురుదేవులు శ౦కరయ్య గారికి వందనములు

    అన్నము కల్గియున్నొరుల కన్నము పెట్టని లోభి యొక్కడై
    అన్నము వండియున్ తిన విషాన్నమగున్ మధుమేహరోగికై
    అన్నముపంటకై కృషి యొనర్చుచు ఆకలిదీర్చు వాడు రై
    తన్నము లేనివాడు పరమాన్నము పంచును వాడవాడలన్

    రిప్లయితొలగించండి
  8. అన్నముతో క్షుధార్తినిల నంతట దీర్చ దలంచి నిష్ఠతో
    పున్నెమటంచు స్వార్థమది పుట్టక; వేరగు ధ్యాసనున్, నెపం
    బెన్నక రేపవళ్ళు నొక యిష్టినిఁ బోలగఁ జేయు; సుష్టుగా
    నన్నము లేనివాఁడు పరమాన్నముఁ బంచును వాడ వాడలన్.

    రిప్లయితొలగించండి

  9. ఆన్నియు సన్యసించి మది నాశలులేకను భక్తు డొక్కడున్
    సన్నుతి జేయుచుండె మది శంకర సన్నుతి జేయు కీర్తనల్
    చెన్నుగ బాడుచుండు నవి చేరగ చూచెడు వారు మెచ్చగా
    నన్నము లేనివాఁడు పరమాన్నముఁ బంచును వాడ వాడలన్.

    రిప్లయితొలగించండి
  10. సన్నని చిన్నవాడు బహు సద్గుణ వంతుడు భుక్తి కోసమై
    తిన్నగ నన్ని కార్యములు దీర్చుచు నుండెను దైవ సన్నిధిన్
    సన్నుతి జేసి దేవుని ప్రసాదము నెల్లర కీయ నెంచియున్
    అన్నము లేని వాఁడు పరమాన్నము బంచును వాడ వాడలన్

    రిప్లయితొలగించండి
  11. ఎన్నడు బొజ్జ నిండ తిని యెర్గని లోభికి భాగ్యమున్న తా

    నన్నము లేనివాడు; పరమాన్నము పంచును వాడ వాడలన్

    మన్నన యున్నవాడు పది మందికి ప్రేమను బంచువాడు, సం

    పన్నులలోదయాళువులు వాస్తవ మిప్పటి కున్నరీధరన్.

    రిప్లయితొలగించండి
  12. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ మీ పూరణ బాగుంది.

    ఆన్నియు సన్యసించి మది నాశలులేకను భక్తు డొక్కడున్
    సన్నుతి జేయుచుండె మది శంకర సన్నుతి జేయు కీర్తనల్

    రిప్లయితొలగించండి
  13. జొన్నలు, మొక్కజొన్నలు, మసూరులు మున్నగు పంటలన్ని రై
    తన్నయె దీసి లోకులకు నన్నము పెట్టును కష్ట జీవి తా
    నెన్నడు నన్నమున్ దినక నింపుగ జొన్నల కూడు బుక్కు స
    న్నన్నము లేని వాడు పరమాన్నము బంచును వాడ వాడలన్

    రిప్లయితొలగించండి
  14. అన్నమనాయుఁ డొక్క దిన మందు ముదంబున సత్యదేవు నా
    పన్నశరణ్యు నమ్ముకొని భక్తిమెయిన్ వ్రత మాచరించియున్
    జెన్నుగ బంధుమిత్రులను జీరియు తా నుపవాసదీక్షలో
    నన్నము లేనివాఁడు పరమాన్నముఁ బంచెను వాడవాడలన్.

    రిప్లయితొలగించండి
  15. ఏమి నా భాగ్యము! ఇద్దరు శంకరుల నుండి, శ్రీపతి శాస్త్రి గారి నుండి, హనుమచ్ఛాస్త్రి గారి నుండీ చక్కటి శ్రవణానంద మైన పూరణలు.

    రిప్లయితొలగించండి
  16. మిన్నగ సంపదల్ గలుగ మేలు! సుఖింతువు! కాని పెంచునే
    మన్నన దానధర్మములు, మాలిమి సంఘము పట్ల లేనిచో?
    నెన్న యుదార బుద్ధులకు నేల ధనమ్మును, కల్మి? చూడమే
    యన్నము లేనివాఁడు పరమాన్నముఁ బంచును వాడ వాడలన్!

    రిప్లయితొలగించండి
  17. రాజేశ్వరి అక్కయ్యా,
    చెలి మోమును చూడటం తోనే కడుపు నిండిన ప్రేమికుడు తాను అన్నం తినకున్నా తన ప్రేమ సఫలమైనందుకు అందరికీ పరమాన్నం పంచాడని అర్థం చేసుకోవాలా?
    బాగుంది. మంచి పూరణ. ముఖ్యంగా వృత్తాన్ని కూడా సలక్షణంగా వ్రాయడం అలవడింది. సంతోషం. అభినందనలు.
    ‘సంతసంబుతో/ నన్నము లేనివాడు....’ అనండి.
    *
    పండిత నేమాని వారూ,
    రామరస పాయసమును విరంచిన యోగసంపన్నులలో ఒకరుగా చేరిన భాగ్యం మీది. అద్భుతమైన పద్యాన్ని రచించి ఆనందాన్ని కలిగించారు. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ మంచి భావంతో అలరారుతున్నది. అభినందనలు.
    ‘బహు మిక్కిలి’ అనరాదు కదా. ‘పెండ్లి సేసేనట’ అనండి. ‘సూనునకు’ అనవలసింది. ‘ఒక్కడున్ + ఎన్నియొ’ ఇక్కడ యడాగమం రాదు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    సమస్యను ప్రశ్నార్థకంగా పూరించిన మీ నైపుణ్యం ప్రశంసింపదగినది. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘పరితోష’ అన్నచోట గణభంగం. దానికి బదులు ‘ప్రమోద’ అనండి.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    అన్నము లేని రైతును గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణను ఇప్పుడే చదివాను. ముందే చదివి ఉంటే నా పూరణను పోస్ట్ చేయకుండా ఉండేవాడిని.
    మొదటి పూరణ, సన్నన్నము లేని రైతును గురించిన మీ రెండవ పూరణ చాలా బాగున్నవి. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    లక్కరాజు వారూ,
    బహుకాల దర్శనం. సంతోషం... ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  18. మిస్సన్న గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. శ్రీ కంది శంకరయ్య్ గురుదేవులకు నమస్కారములు,
    పద్యములను ప్రశంసించినందులకు కృతజ్ఞతలు,
    మీ పద్యములే మాకు స్ఫూర్తి నిస్తాయి.

    రిప్లయితొలగించండి
  20. నమస్కారములు
    నేను రాయ గలుగు తున్నాను అంటే గురువు గారి దయ .ఓర్పుగా నేర్పుగా నేర్పు తున్నందులకు గురువులకు కృతజ్ఞతా పూర్వక శిరశాభి వందనములు

    రిప్లయితొలగించండి
  21. మాన్యశ్రీ గురువుగారికి కృతజ్ఞతాభివందనములు.
    శ్రీ లక్కరాజుగారు ధన్యవాదములు.
    శ్రీ బొడ్డు శంకరయ్య గారి 2వ పద్యము చాలా చాలా బాగున్నది.అభినందనలు.

    రిప్లయితొలగించండి
  22. శ్రీ లక్కరాజు గారికి మరియు శ్రీపతి శాస్త్రి గారికి కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  23. తన్నుకు చచ్చుచున్ చదివి దండిగ పైకము లంచమిచ్చుచున్
    చిన్నది డిగ్రి పొందగను జీతము పింఛను కోరి చేరుచున్
    పన్నుగ నొజ్జ వృత్తి కడు పండుగ జేయగనిట్లు తోచదే:👇
    "అన్నము లేనివాఁడు పరమాన్నముఁ బంచును వాడ వాడలన్"?

    రిప్లయితొలగించండి