కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
సతికి నమస్కరించి విలసద్గతిఁ గాంచిరి పెద్ద లెందఱో.
ఈ సమస్యను పంపిన గూడ రఘురామ్ గారికి ధన్యవాదములు.
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
సతికి నమస్కరించి విలసద్గతిఁ గాంచిరి పెద్ద లెందఱో.
ఈ సమస్యను పంపిన గూడ రఘురామ్ గారికి ధన్యవాదములు.
మిత్రులందరికీ వందనములు !
రిప్లయితొలగించండిమిత్రు లందరి పూరణలూ మురిపించ నున్నవి !
జై రఘు రాం ! జై జానకి రాం ! జై సీతారాం ! అన్నచో విలసద్గతే గదా :
01)
__________________________________________________
సతతము రామ రామ యని , - సత్యము బల్కుచు; ధర్మ వర్తన
న్నతులిత మానవేంద్రుడును - యాశ్రిత వత్సలు , దుష్టశిక్షకున్
రతనము వంటివాని , రఘు - రాముని ,తోడుత , సాధ్వి జానకీ
సతికి నమస్కరించి విల - సద్గతి గాంచిరి పెద్దలెందరో !
__________________________________________________
పతి నెడబాసి రావణుని బారిన రక్కసి మూక లందునన్
రిప్లయితొలగించండిమతి జెడి పోయి దు:ఖ మున మానవ కాంత యనంగ నిక్కమౌ
గతము దలంచు చున్ వగచి గాసిలి నొందుచు రామ నామమౌ
సతికి నమస్కరించి విలస ద్గతి గాంచిరి పెద్ద లెందఱో
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిపతినెడబాయకుండ సగభాగముతానయి నిల్చి సృష్టినన్
హితమును గూర్చు నెల్లరకు హేమలతాంగి శుభమ్ము గూర్చుచున్
యతులగు వారు మాన్యు లసహాయులు వేల్పులు పండితోత్తముల్
సతికి నమస్కరించి విలసద్గతిఁ గాంచిరి పెద్ద లెందఱో
సతికిని సింహవాహనికి,స్కందుని తల్లికి ప్రేమ మూర్తి, పా
రిప్లయితొలగించండిర్వతికిని, దుష్ట నాశినికి, వాసవికిన్ మదనాశికిన్, కళా
వతికిని,యర్ధబాగమున వర్ధిలు చుండెడి శూలి మెచ్చు యా
సతికి నమస్కరించి విలస ద్గతి గాంచిరి పెద్ద లెందఱో
పతి సేవ నొనర్చి, మాన్యయై(నక్షత్రమై)న యరుంధతీసతిని పెండ్లిండ్లలో వధూవరులకుఁ జూపించుట మన యాచారము కదా!
రిప్లయితొలగించండినుత గుణ మాన్యయై, పతికి నొప్పిదమైన విశిష్ట సేవలన్
సతతముఁ జేసి, మించి, విలసన్మతి భక్తిని నిల్పి, భర్త కా
మితమును దీర్చి, ఋక్షమయె! మెప్పుగఁ బెండ్లిని నా యరుంధతీ
సతికి నమస్కరించి, విలసద్గతిఁ గాంచిరి పెద్దలెందఱో!
(ఋక్షము=నక్షత్రము)
గూడ రఘురామ్ గారి తాతగారు కీ.శే. గూడ శ్రీరాములు గారి పూరణ....
రిప్లయితొలగించండిసతి కనసూయ కర్చ లిడి సన్నుతి గాంచెను క్ష్మాజ; యిందరా
సతికి నమస్కరించి ఘనసంపద యక్షవిభుండు నొందె; వా
క్సతికి నమస్కరించి కవిసంఘము కావ్యము లల్లె; నంబికా
సతికి నమస్కరించి విలసద్గతిఁ గాంచిరి పెద్ద లెందరో.
శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో..
రిప్లయితొలగించండిసరదాగా
సీరియళ్ళ లో ఆడవారిని ఎక్కువ జేసి జూపుటను, హరి తన భక్తులకు సిరిని వరములడుగమని దెలుపగ
=========*===========
హరి కనులతో దెలుపగ బిర
బిర సతికి నమస్కరించి విలసద్గతిఁ గాం
చిరి పెద్ద లెందరో యని
వర ప్రసాదు సిరి కొరకు పద్యము వ్రాసెన్ !
మనుజుల మదిలో నిలచిన
ఘన రూపివి మాత!ఖలుల గావగ స్థిరమున్!
దన భక్తుల వ్యధలను గని
విని విమల చరితుని మనము విక్షత మయ్యెన్!
(విక్షతము = గాయము )
వెతలనుఁ దీర్చమంచు ననుఁ బ్రేమను గాచుట కేగుదెంచుమా
రిప్లయితొలగించండిసతతము నిన్ను నమ్మితిని సత్కృపఁ జూపుమటంచు వేడరే?
శ్రుతులును గొల్చు తల్లియగు శోభన మూర్తిగ దేవి పార్వతీ
సతికి నమస్కరించి విలసద్గతిఁ గాంచిరి పెద్ద లెందఱో.
సతికినిఏకదంతుడునుషణ్ముఖమాతనుగూర్మి గొల్వగన్
రిప్లయితొలగించండిశృతిగతినిచ్చునామెఘనశూలికిరాణియుచండియంబికన్
సతతముగౌరిదేవియుమశాంభవియమ్మలగన్నయమ్మకున్
సతికినమస్కరించివిలసద్గతిగాంచిరిపెద్దలెందరో.
కవి మిత్రులందరి పూరణలూ భక్తిరస భరితంగా అలరారుతున్నాయి.
రిప్లయితొలగించండిశైలజగారి ప్రయత్నం ప్రశంసనీయంగా ఉంది.
హనుమంతుడు రావణునితో:
రిప్లయితొలగించండిమతి చెడెనేమొ పంక్తిగళ! మాన్యను, సీతను పొంద నెంచ దు-
ర్గతి యగు, నీకు నామె నరకాంతగ దోచెనె? రామపత్ని శ్రీ
సతి! కమలాసనాంగనయు! శాంభవి! ముజ్జగమేలు జానకీ
సతికి నమస్కరించి విలసద్గతిఁ గాంచిరి పెద్ద లెందఱో.
పూజ్యులు శంకరయ్యగారికి వందనములు
రిప్లయితొలగించండిప్రతి వరువాత మేల్కొనును పాలను దెచ్చును పిల్లపాపలన్
జతపడిస్కూలుకంపును సత్వరమిడ్లియు యోగిరమ్ములున్
పతికిడి తాను ఆఫిసుకు పర్విడిబోవుచు సేవచేయు నా
సతికి నమస్కరించి విలసద్గతి గాంచిరి పెద్దలెందరో
సతతము భక్త కోటి కిల సౌఖ్యము లిచ్చెడు శంభునాథునిన్
రిప్లయితొలగించండిపతిగను బొంది సేవలను భర్తకు జేయుచు నుండినట్టి యా
యతులిత శక్తి రూపినికి హారతు లిచ్చుచు నాది శక్తి యౌ
సతికి నమస్కరించి విలసద్గతి గాంచిరి పెద్ద లెందరో.
అతులిత భక్తిభావములునార్ద్రతపొంగెడు శ్రావ్యకీర్తనా
రిప్లయితొలగించండియుతముగ మానసంబున సమున్నతరీతి విశేషనార్చనా
కృతసహితంబుగా, జగతికిన్ శుభమిచ్చెడు, గౌరి,ధూర్జటీ
సతికి నమస్కరించి విలసద్గతిఁ గాంచిరి పెద్ద లెందఱో
గురుదేవుల సాహిత్య సేవకు నా పాదాభివందనములు మరియు సత్కవులు నిత్యమూ పద్యము వ్రాసి సాహిత్య సేవ జేయుచున్నారు వారికి, ఎందరో సాహిత్యాభిమానులు బ్లాగును జూచి సంతోషపడుచున్నారు వారందరికీ నా పాదాభివందనములు.
రిప్లయితొలగించండిశ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో...
======*=======
ఉద్యమమ్మొనరించు చుండిరి యుత్తమోత్తములౌ కవుల్
పద్యరాశుల వెల్గజేయుచు, ప్రస్తుతింపగ సజ్జనుల్,
హృద్యమౌ కవితావనమ్మున నిమ్ముగా విహరింపుడీ
వద్యమమ్మిదె యత్నమూనుచు భద్రముల్ కనుడీ హితుల్!
పూజ్యులు శంకరయ్యగారికి వందనములు
రిప్లయితొలగించండిసతికిడి పాదమర్దనము సన్నుతి జేసెను యాదవుండుమా
పతి సగ దేహమిచ్చి,తల పావన గంగను దాల్చ స
మ్మతిహరి రొమ్మునందు రమ మాలిమి జేయుట గాంచినంత యా
సతికి నమస్కరించి విలసద్గతి గాంచిరి పెద్దలందరున్
బ్రతుకుటయెట్లొనేర్పుఁ రసరాజ్యపుభోగములందజేయు శా
రిప్లయితొలగించండిశ్వతశివసన్నిధానమును సాధనజేయగదారిఁజూపదే
సతతముసజ్జనావళికి సంతసముద్ధతిజేయుసాహితీ
సతికి నమస్కరించివిలసద్గతిఁగాంచిరిపెద్దలెందరో ||
కవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండినిన్నంతా పండుగ హడావుడి. పైగా రెండు ఊళ్ళు తిరిగిరావడం వల్ల బ్లాగును వీక్షించలేకపోయాను. మన్నించండి.
*
వసంత కిశోర్ గారూ,
జానకీసతిని ప్రస్తావించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘గాసిలి యొందిన యట్టి జానకీ/సతికి...’ అంటే బాగుంటుందేమో?
*
శ్రీపతి శాస్త్రి గారూ,
‘సతీదేవి’పై మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘సృష్టినన్’ అన్నదాన్ని ‘సృష్టిలో’ అంటే బాగుంటుందనుకుంటాను.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘సతి’ శబ్దం ద్విరుక్తమయింది.
*
గుండు మధుసూదన్ గారూ,
‘అరుంధతీసతి’పై మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
*
గూడ రఘురామ్ గారూ,
మీ తాతగారి మనోహరమైన పూరణను మాకు అందించినందుకు ధన్యవాదాలు.
*
వరప్రసాద్ గారూ,
కందంలో స్వార్థంగా వ్రాసిన మీ పూరణ చాలా బాగుంది. దానిని అనుసరించిన పద్యమూ బాగుంది. అభినందనలు.
పూరణ మొదటి పాదంలో గణదోషం. ‘హరి కన్నులఁ దెలుపఁగ బిర...’ అనండి.
బ్లాగును ప్రాశస్త్యాన్ని వర్ణించిన మీ పద్యం బాగుంది. ధన్యవాదాలు.
*
లక్ష్మీదేవి గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
*
శైలజ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘సతికి’ శబ్దాన్ని రెండు సార్లు ప్రయోగించారు.
*
మిస్సన్న గారూ,
హనుమద్వాక్యంగా మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
‘సగదేహం’ అనరాదు కదా. ‘తను వర్ధ మిచ్చి’ అందామా?
*
బొడ్డు శంకరయ్య గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
శ్రీ నేమాని పండితులు మెయిలు ద్వారా చేసిన సూచన ననుసరించి ముజ్జగమేలు అన్న పదానికి బదులుగా లోకములేలు అనే పదంతో పూరణను సంస్కరించాను.
రిప్లయితొలగించండిమతి చెడెనేమొ పంక్తిగళ! మాన్యను, సీతను పొంద నెంచ దు-
ర్గతి యగు, నీకు నామె నరకాంతగ దోచెనె? రామపత్ని శ్రీ
సతి! కమలాసనాంగనయు! శాంభవి! లోకములేలు జానకీ
సతికి నమస్కరించి విలసద్గతిఁ గాంచిరి పెద్ద లెందఱో.
స్తుతమగు రోము వీడుచును సుందర మందిర హస్తినమ్మునన్
రిప్లయితొలగించండిచతికిల జేరి హాయిగను చక్కని జంటకు తల్లియై విధిన్
పతినిట కోలు పోవగను పట్టపు రాణిగ నేలుచుండు నా
సతికి నమస్కరించి విలసద్గతిఁ గాంచిరి పెద్ద లెందఱో