కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
గడ్డి మేయు జనుల కెల్లఁ గలుఁగు సుఖము.
ఈ సమస్యను పంపిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదములు.
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
గడ్డి మేయు జనుల కెల్లఁ గలుఁగు సుఖము.
ఈ సమస్యను పంపిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదములు.
ధనము జగతికి మూలము దాస్య మనగ
రిప్లయితొలగించండినీతి నియమము లందున భీతి లేని
కోటి పడగల రాయుడు మేటి యనుచు
గడ్డి మేయు జనుల కెల్లఁ గలుఁ గు సుఖము
పాల నిడఁగనుఁ బశువులు పఱఁగఁ బచ్చి
రిప్లయితొలగించండిగడ్డి మేయు; జనుల కెల్లఁ గలుగు సుఖము
పాలుఁ ద్రావి దేహమునకు స్వాస్థ్యమిడఁగ;
గడ్డి లేక పాలేవి? సుఖమ్ము లేవి?
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
‘దాస్య మనగ’ అన్నదానికి అన్వయం కుదరనట్టుంది.
*
గుండు మధుసూదన్ గారూ,
విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
పశువుల గడ్డి మేసిన లాలూ 17 సంవత్సరములనుండీ
హాయిగా ఉన్నాడు గదా తర తరాలకూ తరగనంత ఆస్తితో !
ఇప్పుడు జైలుకెళ్ళినంత మాత్రం చేత యేమి నష్టం యేమి కష్టం:
01)
________________________________
ఉత్సాహ:
అడ్డు అదుపు లేని లాలు - హద్దు లన్ని దాటెరా
చెడ్డ పేరు పడిన నేమి? - చేతి నిండ డబ్బురా !
బిడ్డ , బిడ్డ , బిడ్డ , బిడ్డ , - బిడ్డ , బిడ్డ , వరకురా
గడ్డి మేయు జనుల కెల్లఁ - గలుఁగు సుఖము నిజమురా !
________________________________
రిప్లయితొలగించండికిశోర్జీ ! ఉత్సాహవంతమైన పద్యం చెప్పారు.. బాగుంది.
మధుసూదన్ గారూ ! గడ్డి మేయు జనులను చక్కగా విరిచారు...
దేశం లోని మంత్రులు తినేదంతా గడ్డే గదా !
రిప్లయితొలగించండిచిక్కినంతా మెక్కి సుఖ భోగాలనుభవిస్తున్నారు !
ఎక్కడో ఒకడూ అరా తప్ప !
అరె భయ్ !
బహుత్ చోర్ హై యె సాలె !
నా కైతె సమఝైత లేదు
ఈ గలీజు గాండ్ల నేం జెయ్యాల్నొ
మీరైన జర జెప్ప రాదె !
02)
________________________________
ఉత్సాహ:
గడ్డి మేయు జనుల కెల్లఁ - గలుఁగు సుఖము నిజమురా !
అడ్డు లేదు అదుపు లేదు - యంద రంద రందరే
చెడ్డ లేదు మంచి లేదు - చిక్కి నంత దోచులే
దొడ్డ మంత్రి వర్యు లంత - దోషులు గద వీరినే
గుడ్డ లూడ దీసి దన్న - కోరిక మది గలుగులే
________________________________
పాలుపేడయు మరియును పంచితమ్ము
రిప్లయితొలగించండిమంచిదందురె యావుల పెంచుడయ్య
కలిమి నిచ్చును, మనకవి కష్ట మిడక
గడ్డి మేయు, జనుల కెల్లఁ గలుఁ గు సుఖము
శాస్త్రీజీ బహుత్ బహుత్ షుక్రియా !
రిప్లయితొలగించండిఆప్ కా గీత్ భీ మన్ పసంద్ కర్ లియా !
శంకరార్యా ! హిందీలో పద్యాన్నేమంటారు ?
రిప్లయితొలగించండిశ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిపట్టు బడనంత కాలము ప్రజల లోన
ధర్మనిరతిని వీడిన దానవులకు,
పరుల సొమ్ముల నాశించు పామరులకు,
గడ్డి మేయు జనుల, కెల్లఁ గలుఁగు సుఖము.
గడ్డి మేసిపాలనుయిచ్చు గంగిగోవు
రిప్లయితొలగించండిపాలు ద్రాగిన మనుజులు పరక మేయు
పాల దోషమే దోభగ వంతు డెరుగు
గడ్డి మేయు జనులకెల్ల గలుగు సుఖము
గడ్డిమేయు జనులకెల్ల గడ్డపెరుగు లేలరా
రిప్లయితొలగించండిఅడ్డదిడ్డ మన్నిమెక్కు అంతయాశ లేలరా
దొడ్డిదారి దొంగదూరు దోషులెవరు సోదరా
గడ్డిమేయు జనులకెల్ల గలుగు సుఖము చూడురా
వసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిఉత్సాహంగా సాగిన మీ రెండు పూరణలు మనోరంజనాన్ని కలిగించాయి. అభినందనలు.
రెండవ పద్యంలో ‘అడ్డు లేదు + అదుపు లేదు + అందరు..’ అని విసంధిగా వ్రాశారు. అక్కడ ‘అడ్డు లేదె యదుపు లేదె యందరు...’ అందామా?
పద్యాన్ని హిందీలోనూ ‘పద్య్’ (पद्य) అంటారు. రచన, ఛంద్ అని కూడా అంటారు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
*
శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
శైలజ గారూ,
మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
‘పాలను + ఇచ్చు’ అన్నప్పుడు సంధి నిత్యం. యడాగమం రాదు. ‘పాల నొసంగు’ అంటే సరి.
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ రెండవ పూరణ ఉత్సాహంగా ఉరుకులు పెట్టింది. సంతోషం. అభినందనలు.
‘మెక్కు + అంత’ అన్నారు. పద్యంలో అచ్చులు రాకూడదు. అవసరమైన సంధి, యడాగమ, నుగాగమాలు చేయాలి. మీరు ‘మెక్క నంత’ అంటే బాగుంటుంది.
మిత్రులారా! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిఈనాటి సమస్య మరియు వర్ణనాంశము చాల బాగుగ నున్నవి. ఆలాగుననే మిత్రులు రచించిన పద్యములు కూడా చాల బాగుగ నున్నవి. మిగిలిన మిత్రులు కూడా తమ కవితలను అందముగా విలసిల్ల జేస్తారని ఎదురు చూద్దాము. మన శ్రీ కంది శంకరయ్య గారికి వారి సామర్థ్యమును గురించి ఎవరో ఒకరు గుర్తు చేస్తూ ఉండాలి. అప్పుడు గానీ వారి పద్య రత్నములను వెల్వరించరు. స్వస్తి.
పూజ్యులు పండిత నేమానివారికి, మిత్రులు కంది శంకరయ్యగారికి, కవి పండిత మిత్రులందఱికిని గాంధీ జయంతి పర్వదిన శుభాకాంక్షలు!
రిప్లయితొలగించండిమిత్రులు హనుమచ్ఛాస్త్రిగారూ, గడ్డిమేయు జనులనుండి గడ్డిని,జనులను విడదీయక తప్పలేదు. ధన్యవాదములతో...
ఆవుదూడలు గేదెలు నావు లార్య!
రిప్లయితొలగించండిగడ్డిమేయు, జనులకెల్లసుఖము
రామరాజ్యముపగిదిని రాజ్యమొదవ
పిల్లపాపలతోడన చల్ల గుండ్రు
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు. ప్రయత్నిస్తాను.
*
సుబ్బారావు గారూ,
బాగుంది మీ పద్యం. అభినందనలు.
రెండవ పాదంలో ‘గలుగు’ తప్పిపోయింది.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగడ్డి మేయు జనులకెల్ల కలుగు సుఖము
రిప్లయితొలగించండిలాది , జైలు సౌఖ్యము గూడ ననుభవించు
న్యాయ దేవత కను పట్టి బాయునపుడు,
దొంగ లందర దొరలేను దొరకు వరకు .
రిప్లయితొలగించండిAlfalfa ఒకరమైన గడ్డి మొక్క. హోమియోపతి వైద్యములో దీనితో చేసిన మందును జీర్ణ కోశపు స్వస్థతకు వాడతారు. దానిని దృష్టిలో పెట్టుకుని చేసిన పూరణ.
హోమియోపతి వైద్యుని, "ఏమి దారి?
జీర్ణ కోశపు బాధకుఁ జెప్పు" మనిన
పలికె వైద్యుడు "వినర, ఆల్ఫాల్ఫ యనెడి
గడ్డి మేయు జనులకెల్ల గలుగు సుఖము! "
ఇక్కడ అమెరికా కొట్లలో ఈ అల్ఫాల్ఫ గడ్డి దొరుకుతుంది. సాండ్విచ్చి లో పెట్టుకుని తింటాముకూడా.
పూజ్యగురుదేవులు శంకరయ్యగారికి కవులందరికీ నమస్కారములు
రిప్లయితొలగించండిగడ్డి మేసెడి పశువుల కసిమసంగి
మాంసము౦ దినువారు తామసము నొంద
ఆకుకూరలు లేజిగు రౌషధముల
గడ్డిమేయు జనులకెల్ల కలుగు సుఖము
ఒక చిన్న ప్రయత్నము:
రిప్లయితొలగించండితేటగీతి, ఉత్సాహ గర్భిత మధ్యాక్కర:
అడ్డుకొమ్ము ధరణి నెల్ల యక్రమముల శంకరార్య!
చెడ్డ తీరు విడువ గల్గు శ్రేయము లిల వేడ్క తోడ
నడ్డ దిడ్డములగు ద్రోవలందు నెటుల నుందు వోయి!
గడ్డి మేయు జనులకెల్ల గలుగు సుఖము లేల నోయి!
గండూరి లక్ష్మినారాయణ గారూ,
రిప్లయితొలగించండిబాగుంది మీ పూరణ. అభినందనలు.
*
'పుష్యం' గారూ,
బహుకాల దర్శనం. చాలా సంతోషం.
మీ అల్ఫాల్ఫా పూరణ చాలా బాగుంది. అభినందనలు.
*
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
పండిత నేమాని వారూ,
మీ ప్రయోగం మాకు మార్గదర్శకం. మీ గర్భకవిత్వాంచిత పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు, ధన్యవాదాలు.
శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో..
రిప్లయితొలగించండిముందుగా శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో...
మంచి పద్యములతో సమస్యను పూరించిన శ్రీ రాజేశ్వరి అక్కయ్య గారికి,చక్కని విరుపుతో మంచి పద్యము వ్రాసిన శ్రీ మధుసూదన్ గారికి,మంచి పద్యము వ్రాసిన శ్రీ వసంత కిశోర్ గారికి, శ్రీ గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,శ్రీ శ్రీపతి శాస్త్రి గారికి,శ్రీ శైలజ గారికి,శ్రీ సుబ్బారావు గారికి,శ్రీ లక్ష్మీనారాయణ గారికి, బ్లాగునకు గురుదేవుల తరపున శ్రీ పుష్యం గారికి స్వాగతము పలుకుచు,శ్రీ తిమ్మాజీ రావు గారికి ధన్యవాదములతో...
శ్రీ నేమాని గురుదేవులు తేటగీతి, ఉత్సాహ గర్భిత మధ్యాక్కర ఒక్క పద్యములో వ్రాసినారు.నేను వేరు వేరుగా వ్రాసితిని.
లాలు ప్రసాదు శిష్యులకు హితబోధ చెరసాలకు బోవక మునపు!
=========*=========
ఉడ్డకేలు వేలుపు మన యూరి వాడు శిష్యుడా!
రడ్డు నందు రెడ్డి వారు లడ్డులిచ్చు చుండె రా!
వడ్డి వారమనుచు నీవు పరుగు బెట్టక మన యీ
గడ్డి మేయు జనులు కెల్ల గలుగు సుఖము శిష్యుడా!
(ఉడ్డకేలు వేలుపు = ప్రదాన మంత్రి, రడ్డు= రాజ్యము, వడ్డి వారము = (శని)చెడ్డ రోజు)
చెరసాలకు బోవుచు దర్పము తగ్గించ వలదని శిష్యులకు హితబోధ
రిప్లయితొలగించండి======*===========
ఉడ్డ మోము వేలుపు మన యూరివాడు
శిష్యుడా! సడ్డు సేయక శిక్షలన్ను
జిడ్డు కడలియందు గలిపి దొడ్డి కాళ్ళు
జూపరా!రడ్డు నందున సొగసుగాను
గడ్డి మేయు జనులు కెల్ల గలుగు సుఖము
శిష్యుడా! దొడ్డ మనమున జెప్పు చుంటి
వడ్డి వారమనుచు నీవు గుడ్డి వాడ
వైన బిడ్డ లెల్లరు నిల్చు వగవునందు!
(ఉడ్డ మోము వేలుపు = శిక్షలు వేయు వాడు, దొడ్డి కాళ్ళు = అడిగినవానికి దొరవలె ఫోజు,గుడ్డి=వెలివేయ బడిన )
======*========
దొరకునంత ముందు దోచుకొనడు,వారు
మిగిలి యున్న గడ్డి మేయు,జనులు
కెల్ల గలుగు సుఖము నెంగిలి పంచిన,
తెలివి గలిగి నేను దెలుపు చుంటి!
(వారు = శిక్షలు వేయు వారు )
అడ్డ మైనవి దిని కష్టములు పడు వారిపై
రిప్లయితొలగించండి==========*========
జీడ్డు నందున మాగియున్న చిందులు వేయుచు నేడు
నడ్డ గాడిద వలె మార్గ మందు దొరకు నడ్డ మైన
గడ్డి మేయు జనులు కెల్ల గలుగు సుఖము దినుచుండ!
దుడ్డులు దొర్లుచు నుండు దుమ్మువలెను,వారి మీద
బడ్డ దురిత యమ పాశ పరుసవేదిని ద్రుంచి వేయ!
శ్రీ నేమాని గురుదేవుల చిన్న ప్రయత్నములో చాలా చాలా పెద్ద అర్థమున్నది.
రిప్లయితొలగించండినా ఆలస్యమునకు మన్నించి నా పిచ్చి ప్రయత్నముల యందు సవరణలను తెలుపగలరు.
రాచి ఱంపాన బెట్టును రాచపుండు
రిప్లయితొలగించండిరక్తమును ద్రావి వేధించు రాక్షసి యది
మందు గోధుమ గడ్డియౌ నందురు గద
గడ్డి మేయు జనుల కెల్లఁ గలుఁగు సుఖము
మంచి పద్యముతో సమస్య పూరించిన శ్రీ మిస్సన్న గారికి ధన్యవాదములతో...
రిప్లయితొలగించండిఅవును మిస్సన్న గారు గోధుమ గడ్డి రక్తహీనతకు, అల్ఫాల్ఫ గడ్డి మరియు అల్ఫాల్ఫ గింజలు ఆరోగ్యమునకు మంచి మందులట..
శ్రీ మిస్సన్న గారూ!
రిప్లయితొలగించండిమీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
3వ పాదము చివరలో నందురు గదకి బదులుగా "నందు రట్టి" అంటే అన్వయము బాగుగ నుండును. స్వస్తి.
శ్రీ వరప్రసాద్ గారూ!
రిప్లయితొలగించండిమీ పద్యములు బాగుగ నున్నవి. అభినందనలు. కొన్ని సవరణలు:
"వైన బిడ్డలెల్లరు నిల్వు వగవు నందు" -- అన్వయము బాగుగ లేదు.
వారు మిగిలియున్న గడ్డి మేయు -- వాక్యము బాగుగ లేదు.
జనులు కెల్లకి బదులుగా జనుల కెల్ల అంటె సరిపోవును.
స్వస్తి.
ఓట్ల కోసము ప్రజలకు నోట్లు పంచి
రిప్లయితొలగించండిపైక మార్జింప నెంచియు పదవి నొంది
రాజ్య మేలుచు నెగబడి లంచ మనెడి
గడ్డి మేయు జనుల కెల్ల గలుగు సుఖము.
స్టాంపు పేపర్ల దినువాడు డబ్బునొందె
నినుప ఖనిజమ్ము దినువాడు ధనము నొందె
బొగ్గు దినుచు పైకంబును బొందిరి గద
గడ్డి మేయు జనుల కెల్ల గలుగు సుఖము.
శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో...
రిప్లయితొలగించండిసవరణతో
నా అన్ని పద్యములందున (జనులు= జనుల), తప్పు టైపు జేసితిని మన్నించ ప్రార్థన!
లాలు ప్రసాదు శిష్యులకు హితబోధ చెరసాలకు బోవక మునపు!
చెరసాలకు బోవుచు దర్పము తగ్గించ వలదని శిష్యులకు హితబోధ
=======*=======
ఉడ్డ మోము వేలుపు మన యూరివాడు
శిష్యుడా! సడ్డు సేయక శిక్షలన్ను
జిడ్డు కడలియందు గలిపి దొడ్డి కాళ్ళు
జూపరా! రడ్డు నందున సొగసుగాను
గడ్డి మేయు జనుల కెల్ల గలుగు సుఖము
శిష్యుడా! దొడ్డ మనమున జెప్పు చుంటి
వడ్డి వారమనుచు నీవు గుడ్డి వాడ
వైన,సుతులు జేరును వైరి పక్షమందు!
(ఉడ్డ మోము వేలుపు = శిక్షలు వేయు వాడు, దొడ్డి కాళ్ళు = అడిగినవానికి దొరవలె ఫోజు గుడ్డి=వెలివేయ బడిన)
వరప్రసాద్ గారూ,
రిప్లయితొలగించండిముందుగా బ్లాగు మిత్రుల నందరినీ పేరు పేరునా పలుకరించినందుకు సంతోషం. ధన్యవాదాలు.
మీ పూరణలన్నీ బాగున్నవి. నేమాని వారి సూచనల ప్రకారం సరిచేశారు. అభినందనలు. పదప్రయోగంలో మీరు నా చేత నిఘంటువును చూచేట్లు చేస్తున్నారు. క్రొత్త క్రొత్త పదాల పరిచయం లభిస్తున్నది. ధన్యవాదాలు.
*
బొడ్డు శంకరయ్య గారూ,
మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
*
పండిత నేమాని వారూ,
మిత్రుల పూరణ గుణదోషములను సమీక్షిస్తూ నాకు శ్రమను తగ్గిస్తున్నారు. హృదయపూర్వక కృతజ్ఞతాంజలి.
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిగోధుమ గడ్డిని గురించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
అవయంబుల బదునాల్గు భువనములను
రిప్లయితొలగించండిదాల్చియున్నట్టి గోమాత ధరణిలోన
గడ్డి మేయు, జనులకెల్ల కలుగు సుఖము
నిత్య మద్దాని సేవించ నిలుతురేని.
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో...
రిప్లయితొలగించండిమన్నించాలి గురుదేవులు శ్రీ సత్యనారాయణ మూర్తి గారి పద్యపు మొదటి పాదంలో "అవయ వంబుల " అని యుండవలెను గదండి.
ఆర్యా!
రిప్లయితొలగించండివర ప్రసాదుగారూ!
టైపు పొరపాటును తెలియజేసిన మీకు ధన్యవాదాలు.
సరిచేస్తున్నాను.
"అవయవంబుల బదునాల్గు భువనములను"
గురువుగారూ,
రిప్లయితొలగించండిఉత్సాహ వృత్తము లో 7 సూర్యగణములలో ఆరు హ గణములు, ఒక నగణము, గురువు ఉంటాయనుకొని ప్రయత్నించినాను. ఈ నియమములు సరికానిచో చెప్పవలసినది.
చెడ్డవారి తోడనేల స్నేహమనుచు శ్రద్ధతో
బిడ్డలన్ సహిష్ణులౌచు ప్రేమగలిగి గాచగా
దొడ్డబుద్ధి గల్గి యుంద్రు; దుష్ట బుద్ధి పెరుగుచో
గడ్డి మేయు జనులకెల్ల గలుగు సుఖము లిహమునన్.
వరప్రసాద్ గారూ,
రిప్లయితొలగించండినిజమే. నేను గమనించలేదు. ధన్యవాదాలు.
*
లక్ష్మీదేవి గారూ,
మీ ఉత్సాహం సలక్షణంగా చక్కగా ఉంది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅవును పండితార్యా! మీరన్నయట్టిది నిజము.
రిప్లయితొలగించండివైద్య సీట్ల వితరణిచ్చు వైభవమ్ము!
రిప్లయితొలగించండిగనులు ద్రవ్విన బంగరు గద్దెలందు!
భూములర్పింప భవనాలఁ బొంద వచ్చు!
గడ్డి మేయ జనుల కెల్ల గలుఁగు సుఖము!
గురువులకు నమస్కారములు
రిప్లయితొలగించండిడబ్బుకు లోకం దాసోహం ...అంటారు కదా అందుకని జగతికి మూలమైన డబ్బుకి అన్నీ విడచి దాస్యం చేస్తారు అని అలా వ్రాసాను అదన్న మాట అసల్ సంగతి పొరబాటైతే ఏముంది ? మన్నించడమే మరి
అమ్మా లక్ష్మీ దేవి గారూ!శుభాశీస్సులు.
రిప్లయితొలగించండి3 వృత్తములను గురించి వివరించు చున్నాను:
1. సుగంధి: 7 హ గణములు + 1 గురువు
(ఉదా: ఏడు హమ్ములున్ గమున్ వడెన్మిదిన్ సుగంధికిన్)
2. ఉత్సాహ: 7 సూర్య గణములు + 1 గురువు
(ఉదా: సాహచర్య పద్మమిత్ర సప్తకంబు గురుడు నున్)
ప్రాస నియమమును పాటించుచు ఏ సూర్య గణమునైనా ఒక క్రమము లేకుండా వాడవచ్చును)
3. తరలి : భ స న జ న ర గణములు
(ఉదా: చారు భసన భూరి జనర సాంద్ర గణములందుగా)
లయ (నడక) 3 పద్యములకు ఒకే రీతిలో నుండును.
స్వస్తి.
సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
‘వితరణ + ఇచ్చు’ సంధి లేదు. ‘వితరణతో వైభవమ్ము’ అవండి.
శ్రీ శంకరయ్య గురుదేవులకుధన్యవాదములతో...
రిప్లయితొలగించండి===========*=============
ఇష్ట మైన రుచుల తోడ తిష్టవేయ
రొగతతులు దేహమునందు,రోజుకు పలు
మార్లు విషము సేవింపక,మందు వలెను(మంచిదనుచు)
గడ్డి మేయు జనుల కెల్ల గలుగు సుఖము!
=======*=========
దొరల వలెను నేడు దొడ్డి దారులయందు
మేదిని పయి గడ్డి మేయు జనుల
కెల్ల గలుగు సుఖము లిమ్ముగ? శ్రీధర!
వీడు యోగ నిద్ర వేడ్కతోడ !
గురువులిరువురకూ ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిసుగంధి, ఉత్సాహ, తరలి మూడింటికి నడక ఒకే విధముగా ఉంటుందన్నది ముఖ్యమైన విషయము తెలిపినందుకు ధన్యవాదములు..
సుగంధి, తరలికి కూడా ప్రాసనియమము ఉత్సాహ మాదిరే అనుకుంటున్నాను.
తరలము అని ఒక వృత్తము ప్రత్యేకంగా ఉన్నదని
పేరులో పోలిక ఉన్నా అది వృత్తమై నభరసజజగ అనేగణాలతో, ప్రాసనియమముతో, 12 వ అక్షరము యతితో ఉండవలెనని చదివినాను.
అమ్మా లక్ష్మీ దేవి గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండితరలము గురించి మీరు వ్రాసిన లక్షణములు సరియైనవే. దాని గమనము మత్తకోకిల వలె నుండును. సుగంధి, ఉత్సాహ, తరలి అను 3 వృత్తములకు ప్రాస మరియు యతి నియమములు కలవు. స్వస్తి.
వరప్రసాద్ గారూ,
రిప్లయితొలగించండిమీ తాజా రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
సంతోషమండి.
రిప్లయితొలగించండిధర్మము నడుచు గుంటిగా దారిలోన,
రిప్లయితొలగించండినీతి నీలిగి చచ్చిన నీడలోన
పుట్ట గొడుగుగా యవినీతి పుట్టు జాగ
గడ్డి మేయు జనులకెల్ల గలుగు సుఖము
నాయుడు గారి జయన్న గారూ,
రిప్లయితొలగించండి‘శంకరాభరణం’ బ్లాగు మీకు ఆనందంగా స్వాగతం పలులుతున్నది.
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘గొడుగుగా నవినీతి’ అనండి.
‘జాగ’ ఏ అర్థంలో ప్రయోగించారు? ‘చోటు’ అనే అర్థంలో అన్యదేశ్యమా? అలాగైతే ‘పుట్టు చోట’ అనవచ్చు కదా!
ధన్యవాదాలు సార్! మీ సూచనలు పాటిస్తాను.
రిప్లయితొలగించండి