5, అక్టోబర్ 2013, శనివారం

సమస్యాపూరణం – 1195 (రాము నోడించె వాలి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
రాము నోడించె వాలి సంగ్రామమందు.
ఈ సమస్యను పంపిన సంపత్ కుమార్ శాస్త్రి గారికి ధన్యవాదములు.

28 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించ నున్నవి !

    రాముని శక్తిని సందేహిస్తున్న వాలి దుస్వప్నం :

    01)
    ___________________________________

    వాలి మిక్కిలి బలశాలి - వానినెటుల
    జంప గలుగును ? రాముడే - జచ్చునేమొ ?
    యనెడి శంకయె మదినుండ - హంసు సుతుడు
    తానె తలపోసి తప్పుగా - తనదు మదిని
    స్వప్న లోకాన విహరించు - సమయమందు

    రాము నోడించె వాలి సం - గ్రామమందు
    పిదప ననుగూడ జంపును - పీక నులిమి
    యేమి జేయుదు నెది దారి - నెటకు బోదు
    నెవరు రక్షించు నన్నంచు - నాత్మ దలచి
    నిదుర మేల్కాంచి పరికించి - నెమ్మదించె !
    ___________________________________

    రిప్లయితొలగించండి
  2. అయ్యా యిది "అప్పుతచ్చు " ! దీనిని "అచ్చుతప్పు" గా జదువుకొనుడు !

    02)
    ___________________________________

    "రాము నోడించె వాలి సం - గ్రామమందు "
    పాఠమందున తప్పుగా - పడెను, గనుక
    చదువు కొనుడయ్య జనులార - సవర ణిదియె
    "రాము డోడించె వాలి, సం - గ్రామమందు"
    ___________________________________

    రిప్లయితొలగించండి
  3. వాలి సుగ్రీవు లిరువురి రణము నందు
    వాలి యెవ్వరో యెరుగక వార లందు
    భాణ మేయగ జడిసెను రాము డపుడు
    రాము నోడించె వాలి సం గ్రామమందు

    రిప్లయితొలగించండి
  4. వరబలము ఛేత గర్వించి, సురల గెల్చి,
    యష్టదిక్పాలకుల నోర్చి, యైంద్రి నపుడుఁ
    గ్రేణి సేయరాన్; మండోదరీ మనోஉభి
    రాము నోడించె వాలి సంగ్రామ మందు!

    రిప్లయితొలగించండి

  5. కిశోర్జీ ! దుస్వప్నము గనేట్లు చేశారు గానీ ! అది వాలి కాకుండా సుగ్రీవుడు కనాలనుకుంటా !

    రిప్లయితొలగించండి
  6. సంధ్యకర్ఘ్యములిడుచున్న సమయమందు
    వాలిఁదిట్టుచు పిలిచెరావణుఁడతడిని
    కయ్యమునకు; తుదకు దశకంఠునసురా
    రామునోడించె వాలి సంగ్రామమందు |

    రిప్లయితొలగించండి
  7. శాస్త్రీజీ ! ధన్యవాదములు !

    రాముని శక్తిని సందేహిస్తున్న సుగ్రీవుని దుస్వప్నం :

    01అ)
    ___________________________________

    వాలి మిక్కిలి బలశాలి - వానినెటుల
    జంప గలుగును ? రాముడే - జచ్చునేమొ ?
    యనెడి శంకయె మదినుండ - హంసు సుతుడు
    తానె తలపోసి తప్పుగా - తనదు మదిని
    స్వప్న లోకాన విహరించు - సమయమందు

    రాము నోడించె వాలి సం - గ్రామమందు
    పిదప ననుగూడ జంపును - పీక నులిమి
    యేమి జేయుదు నెది దారి - నెటకు బోదు
    నెవరు రక్షించు నన్నంచు - నాత్మ దలచి
    నిదుర మేల్కాంచి పరికించి - నెమ్మదించె !
    ___________________________________

    రిప్లయితొలగించండి
  8. చాప మెక్కుపెట్టి తొలి దాశరథి పరశు
    రాము నోడించె ; వాలి సంగ్రామమందు
    మడసె రామబాణము చేత ; మరణ మొందె
    రావణుడు గూడ లంకలో రణము నందు.


    రిప్లయితొలగించండి
  9. మొదటి విడతన నిర్వురి ముఖము లొక్క
    రూపు నుండగ వదలక తూపు నప్డు
    మరలి రాగ కపి యొకటి మదిని దలచె
    రాము నోడించె వాలి సంగ్రామ మందు.

    రిప్లయితొలగించండి
  10. శ్రీగురుభ్యోనమ:

    కలత నిదురన తా కన్న కలలలోన
    రాము నోడించె వాలి సంగ్రామమందు
    బెదరి మేల్గాంచె సుగ్రీవు నిదుర నుండి
    రామబాణము తాకగ వాలి కూలె.

    రిప్లయితొలగించండి
  11. వసంత కిశోర్ గారూ,
    సుగ్రీవుని మనోగతాన్ని చక్కగా చిత్రించిన మొదటి పూరణ, అచ్చుతప్పుతో రెండవ పూరణ చాలా బాగున్నవి. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మొదటి ప్రయత్నంలో ఎవరెవరో పోల్చుకోలేని రాముడు విఫలుడై వాలి చేతిలో ఓడినట్లే. బాగుంది మీ పూరణ. అభినందనలు.
    మూడవ పాదంలో యతి తప్పింది. ‘శరము వేయఁగ రాముఁడు జడిసె నపుడు’ అనండి.
    *
    గుండు మధూసూదన్ గారూ,
    వాలి రావణునకు గర్వభంగం చేసిన సంఘటనను పూరణకు సమర్థంగా వినియోగించుకున్నారు. బాగుంది. అభినందనలు.
    *
    గూడ రఘురామ్ గారూ,
    మీ ప్రయత్నం ప్రశంసింప దగినది.
    కాని మూడవ పాదం చివర గణదోషం. పూరణను సవరించండి. ‘దశగళుని సుర వి/రాము’ అంటే ఎలా ఉంటుంది?
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘బెదరి లేచె సుగ్రీవుడు నిదురనుండి’ అనండి.

    రిప్లయితొలగించండి
  12. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో..

    సరదాగా

    శిష్యులు కొన్నిమార్లు తప్పుడు సమాదానము జెప్పి, అదియే సరి యని వివరణనిచ్చుచు వాదింతురు. ఆ విషయము పై
    ==========&==========
    తడబడిన శిష్యుడు బలికె తప్పు గాను
    రాము నోడించె వాలి సంగ్రామమందు
    ననుచు,నవ్విన గురువును గని సరగున
    బలికె వాలి సుగ్రీవుల తొలి సమరము

    నందు సుగ్రీవు నోడించి యన్న వాలి
    రాము నోడించె!మలి సమరమున రాము
    వాలి నోడించ,ముదమాయె వానరులకు!
    తప్పు జెప్పిన మన్నించి,తమరు వేగ
    దెలుప వలయు సవరణను దీనునకును!

    రిప్లయితొలగించండి
  13. వరప్రసాద్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘రాము’ అని ప్రత్యయం లేకుండా ప్రయోగించారు. అక్కడ ‘సమరమున నతడు’ అనండి.

    రిప్లయితొలగించండి
  14. కలనుగంటిని రాతిరి కల్ల కాదు
    రాము నోడించె వాలి సంగ్రామమందు
    అనుచు,వెఱగంది,లేచితి హర్షమొదవె
    రాముడోడించెననితెల్సి రణమునందు

    రిప్లయితొలగించండి
  15. పాత్ర మారిన మదిలోని చిత్ర మందు
    ముందు నేర్చిన విషయమ్మె ముచ్చటవ్వ
    నాటకంబున తడబడ నటులుమిగుల
    రాము నోడించె వాలి సంగ్రామ మందు

    రిప్లయితొలగించండి
  16. మిత్రులందరికీ దసరా నవరాత్రుల మొదటి రోజు పండుగ సందర్భంగా దసరా శుభాకాంక్షలు. (ఒక మార్పు కోసం) పెద్దలూ, మిత్రులు కోపగించుకోకుంటే ఈ రోజు అందరి పద్యాలనూ పరిశీలించాలని ప్రయత్నిస్తున్నా.
    నా దుస్సాహసాన్ని సహృదయతతో మన్నించగలరు.

    వసంత కిశోర్ గారూ,
    దారి నెటకు కాకుండా దారి యెటకు అనవలెననుకుంటున్నాను.
    "ఎవరు " "ఆత్మ" ఇందులో యతి కుదరలేదనుకుంటున్నాను.
    *
    శైలజ గారూ,
    మొదటి పాదములో యతి కుదరలేదనుకుంటున్నాను.
    " వాలి సుగ్రీవుల నడుమ పోలిక గని" అనవచ్చుననుకుంటున్నాను.
    *
    గుండు మధూసూదన్ గారూ,
    చేత లో "ఛే" టైపాటు గలదు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    చివరి పాదము లో యతి కుదరలేదనుకుంటున్నాను.
    రామ బాణము వాలిని రాల్చెనపుడు " అనవచ్చనుకుంటున్నాను.
    *
    సహదేవుడుగారూ,
    ముచ్చటవగ " అనాలనుకుంటున్నాను.
    *
    బొడ్డు శంకరయ్య గారూ,
    రెండవపాదములో యతి తప్పినట్టున్నది.

    రిప్లయితొలగించండి
  17. గురువు గారూ,
    నేను చేసినది తప్పైతే మన్నించ మనవి.
    మళ్ళీ దాంట్లో కూడా తప్పు సవరణలు సూచించి ఉంటే తెలుపగలరు.
    ఇదీ ఒక అభ్యాసమౌతుందని ఆశపడుతున్నాను.

    రిప్లయితొలగించండి
  18. అన్న యోడింప సుగ్రీవు డనియె నిట్లు
    నవ్వుబాటాయె నేడహో! నమ్మినాను
    రాము, నోడించె వాలి సంగ్రామమందు
    నేడు, రాగల ముప్పును నేరనైతి.

    రిప్లయితొలగించండి
  19. పూజ్యులు శంకరయ్యగారికి వందనములు

    రామునకు వాలి నడుమ సంగ్రామ మనుట
    సత్యదూరము రాముడు చాటునుండి
    బాణ మేయంగ జచ్చెను వాలి యెపుడు
    రామునోడి౦చె వాలి సంగ్రామ మందు?

    మరియొకపూరణ

    అంబ జేపట్టకున్నచో ననినొనర్తు
    ననిన వ్రతబద్ధుడగు భీష్ము డనిని పరశు
    రామునోడించె వాలి సంగ్రామమందు
    ననుజు సుగ్రీవు నోడి౦చె నతి రయమున

    రిప్లయితొలగించండి
  20. పూజ్యులు శంకరయ్యగారికి వందనములు

    రామునకు వాలి నడుమ సంగ్రామ మనుట
    సత్యదూరము రాముడు చాటునుండి
    బాణ మేయంగ జచ్చెను వాలి యెపుడు
    రామునోడి౦చె వాలి సంగ్రామ మందు?

    మరియొకపూరణ

    అంబ జేపట్టకున్నచో ననినొనర్తు
    ననిన వ్రతబద్ధుడగు భీష్ము డనిని పరశు
    రామునోడించె వాలి సంగ్రామమందు
    ననుజు సుగ్రీవు నోడి౦చె నతి రయమున

    రిప్లయితొలగించండి
  21. శ్రీ కంది శంకరయ్య గురుదేవులకు నమస్కారములు, యతి దోషము గుర్తించనందులకు ధన్యవాదములు
    సవరణతో..........

    మాటుగా నుండి వాలిని మట్టుబెట్ట
    రామ చంద్రుడు సమరంపు నీమములను
    విడచె, విడక నీమము యుద్ధ విలువలందు
    రాము నోడించె వాలి సంగ్రామమందు.

    రిప్లయితొలగించండి
  22. లక్ష్మీదేవి గారూ,
    చాలా సంతోషం. మీ చర్యను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. వృద్ధాప్యం వల్లను, కొన్ని చీకాకుల వల్లను పూరణలను పైపైన చూసి వ్యాఖ్యానిస్తున్నాను. నా దృష్టికి రానివీ, వచ్చినా (ఔత్సాహికులను నిరుత్సాహపరచకుండా) ఉపేక్షించినవి తప్పక ఉంటాయి. శిష్యవాత్సల్యంతో పండిత నేమాని వారు అందరి రచనలను పరామర్శిస్తున్నారు. మీరు నాకు కొంత శ్రమ తగ్గించినవా రవుతున్నారు. సంతోషంగా కొనసాగించండి. ధన్యవాదాలు.
    *
    సుబ్బారావు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నవి .అభినందనలు.
    *
    బొడ్డు శంకరయ్య గారూ,
    యతిదోషాన్ని గుర్తించని వారికి కాదు గుర్తించిన వారికే ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే మనం మరోసారి అటువంటి దోషం చేయకుండా హెచ్చరించినందుకు.

    రిప్లయితొలగించండి
  23. లక్ష్మీదేవి గారికి నమస్కారములు,
    మీరు చేసిన వ్యాఖ్యలని గమనించ లేదు
    యతి దోషము గుర్తించినందులకు ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  24. లక్ష్మీదేవి గారికి ధన్యవాదములతో :

    రాముని శక్తిని సందేహిస్తున్న సుగ్రీవుని దుస్వప్నం :

    01ఆ)
    ___________________________________

    వాలి మిక్కిలి బలశాలి - వానినెటుల
    జంప గలుగును ? రాముడే - జచ్చునేమొ ?
    యనెడి శంకయె మదినుండ - హంసు సుతుడు
    తానె తలపోసి తప్పుగా - తనదు మదిని
    స్వప్న లోకాన విహరించు - సమయమందు

    రాము నోడించె వాలి సం - గ్రామమందు
    పిదప ననుగూడ జంపును - పీక నులిమి
    యేమి జేయుదు నెది దారి - నెటకు బోదు
    నెవరు రక్షించు నన్నంచు - నెంచు తరిని
    నిదుర మేల్కాంచి పరికించి - నెమ్మదించె !
    ___________________________________

    రిప్లయితొలగించండి
  25. గురువుగారికి,లక్ష్మిదేవిగారికి కృతజ్ఞతాభివందనములు.
    చివరిపాదములోయతిని సవరించుచున్నాను.

    కలత నిదురన తా కన్న కలలలోన
    రాము నోడించె వాలి సంగ్రామమందు
    బెదరి లేచె సుగ్రీవుడు నిదుర నుండి
    రామబాణము తాకగ వ్రాలె వాలి

    రిప్లయితొలగించండి
  26. గురువర్యులకు మరియు లక్ష్మి దేవి గారికి ధన్యవాదములు. లక్ష్మిదేవి గారి సూచిత సవరణ 'ముచ్చటవగ' సమ్మతమే.

    రిప్లయితొలగించండి