6, అక్టోబర్ 2013, ఆదివారం

సమస్యాపూరణం – 1196 (త్ర్యంబకసంభవుడు మఱఁది)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
త్ర్యంబకసంభవుడు మఱఁది యగు శ్రీపతికిన్.
ఈ సమస్యను పంపిన గుండా సత్యనారాయణ గారికి ధన్యవాదములు.

20 కామెంట్‌లు:

 1. లంబోదరుడు గజాస్యుడు
  త్ర్యంబక సంభవుడు, మరది యగు శ్రీపతికిన్
  సంబరమిడు తుహినాంశుం
  డంబుజ భవ తేజ! శంకరార్యా! సుకవీ!

  రిప్లయితొలగించండి
 2. అంబర వీధుల దిరిగెడు
  త్ర్యంబక సంభవుడు మఱిది యగు శ్రీపతికిన్
  సంబర మునగని దివిజులు
  యంబుధి పై కొలువు దీరె యాదర మొప్పన్

  రిప్లయితొలగించండి
 3. శ్రీగురుభ్యోనమ:

  అంబకు ముద్దుల పట్టియు
  లంబోదర నామధేయ రత్నంబెవరో?
  అంబరమందున చంద్రుడు?
  త్ర్యంబకసంభవుడు, మఱఁది యగు శ్రీపతికిన్.

  రిప్లయితొలగించండి
 4. పండిత నేమాని వారూ,
  విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణలో భావం అర్థం కాకుండా ఉంది. అన్వయలోపం ఉన్నట్టుంది.
  *
  శ్రీపతి శాస్త్రి గారూ,
  ప్రశ్నోత్తర రూపమైన మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘అంబర శశి తా నెవ్వడు?’ అంటే బాగుంటుందేమో?

  రిప్లయితొలగించండి
 5. పూజ్యు లు శంకరయ్యగారికి వందనములు

  క౦బన! స్కందు౦డెవ్వడు ?
  సంబ౦ధమ్మేమి సీత సౌమిత్రికి? క్షీ
  రా౦బుదిసుత సతి యేరికి ?
  త్ర్య౦బక సంభవుడు ;మరది యగు ;శ్రీపతికిన్

  రిప్లయితొలగించండి
 6. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 7. నాగరాజు రవీందర్ గారి పూరణ..........
  అంబ స్నుషయైన సిద్ధికి
  త్ర్యంబక సంభవుడు మఱది ; యగు శ్రీపతికి
  న్నంబుధి నందనుడు మఱది ,
  యంబుజ గర్భుడు కొడుకగు నటులే - జూడన్ !

  - వినాయకుని భార్య సిద్ధికి కుమార స్వామి మరది. సముద్రుడి కొడుకు, లక్ష్మీదేవికి సోదరుడైన చంద్రుడు శ్రీహరికి బావమరది. అలాగే బ్రహ్మకు కన్నతండ్రి కూడ మహావిష్ణువే !

  రిప్లయితొలగించండి
 8. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  క్రమాలంకార పద్ధతిలో మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ బంధుత్వాల పూరణ చాలా బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 9. అంబకు ముద్దుల తనయుడు
  త్ర్యంబకసంభవుడు, మఱఁది యగు శ్రీపతికిన్
  అంబరమందున వెలుగుచు
  సంబరములఁబంచు నిండు చంద్రుఁడు కాడే.

  రిప్లయితొలగించండి
 10. గురువుగారికి మరియునితర కవిమిత్రులకు నమస్సులు.

  ఈ సమస్యను శ్రీ శ్రీపతి త్ర్యంబక రావు గారు తాను 9, 10, సెప్టెంబరు 1939 లో గావించిన శతావధానములో పూరించినది. వీరు "ఆశుకవికేశరి " "అవధానదురంధ" రేత్యాది బిరుదాంకితులు.

  వారిపూరణ ఈ క్రింది పద్యము.

  అంబికకే జన్మించెనొ?
  సాంబుని దయగన్నవాడొ? అల గణపతి క్షీ
  రాంబుధి బొడమిన చంద్రుడు
  త్ర్యంబకసంభవుడు, మఱఁది యగు శ్రీపతికిన్.

  రిప్లయితొలగించండి
 11. అంబిక సుతుండు స్కంధుడు
  త్ర్యంబక సంభవుడు; మఱది యగు శ్రీపతికి
  న్నంబుజుడు, వెన్నెలనిడుచు
  సంబర మొందింప జేయు జనులకు పృథ్విన్.

  రిప్లయితొలగించండి
 12. సాంబుని యానతిఁ గదలెను
  త్ర్యంబకసంభవుడు "మఱఁది యగు శ్రీపతికిన్
  సంబరమున మ్రొక్క"మనగ-.
  పంబు గొనగ వేడుకలవి పర్వతమందున్.

  రిప్లయితొలగించండి
 13. మాన్యులు శ్రీ శంకరయ్య గారికి
  నమస్కృతులతో,

  పంబి జగంబుల నోమెడు
  నంబెరుమాళ్లకు సుధాబ్ధినందన సుత; నా
  భ్యంబుజభవుఁడు కొడుకు; న
  త్ర్యంబకసంభవుఁడు మఱఁది యగు శ్రీపతికిన్.

  సప్రశ్రయంగా,
  ఏల్చూరి మురళీధరరావు

  రిప్లయితొలగించండి
 14. లంబోదరుడగు గణపతి
  త్ర్యoబక సంభవుడు, మఱదియగు శ్రీపతికిన్
  బింబానన! కుంతిసుతుడు
  అంబుధిశయనునకినిడుదు నంజలి యెపుడున్

  రిప్లయితొలగించండి
 15. సంబరమాయెను వినగా
  లంబోదరుడుగణపతికి లక్ష్మీపతికిన్
  సంబంధమిదియని తెలిసెన్
  త్య్రంబక సంభవుడు మరదియగు శ్రీపతికిన్

  రిప్లయితొలగించండి
 16. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  విరుపుతో చక్కని పూరణను చెప్పారు. అభినందనలు.
  క్రమాలంకార పద్దతిలో అవధాని శ్రీ శ్రీపతి త్ర్యంబక రావు గారు చేసిన మంచి పూరణను అందించినందుకు ధన్యవాదాలు.
  *
  బొడ్డు శంకరయ్య గారూ,
  విరుపుతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  లక్ష్మీదేవి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  ఏల్చూరి మురళీధర రావు గారూ,
  ఉత్తమమైన పూరణ నందించారు. అభినందనలు, ధన్యవాదాలు.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘కుంతీసుతుడు’ అనాలి కదా. చివరి రెండు పాదాలను ఇలా మార్చండి....
  బింబానన! కుంతీసుతు
  డంబుధిశయనునకు నిడుదు నంజలి నెపుడున్.
  *
  శైలజ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 17. అంబకు పుత్రుడు నగు హే
  రంబుని యనుజుండునెవరు ? రమకే తమ్ముం
  డంబరమేలెడు చంద్రుడు ?
  త్య్రంబక సంభవుడు - మరదియగు శ్రీపతికిన్.

  రిప్లయితొలగించండి
 18. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  ప్రశ్నోత్తర రూపంలో మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  రాజేశ్వరక్కయ్యా,
  మరేం చేద్దామంటారు?

  రిప్లయితొలగించండి