కవిమిత్రులారా!
(సమస్యలను ఇవ్వడంలో 'ఛందోనిగూఢం' అన్న పద్ధతి ఒకటి ఉంది. సాధారణంగా సమస్యను ఒక పద్యపాదంగా ఇవ్వడం సంప్రదాయం. కాని పృచ్చకుడు పాదంలోని కొన్ని అక్షరాలను వదిలి కాని, పాదానికి కొన్ని అక్షరాలు కలిపి కాని సమస్యను ఇవ్వవచ్చు. అది ఏ పద్యపాదమో వెంటనే స్ఫురించకుండా అవధానిని తికమక పెట్టడం పృచ్ఛకుని ఉద్దేశం. అవధాని దానిని మననం చేసికొని అది ఏ పద్యపాదమో తెలిసికొని అక్షరాలను కలుపుకొని పూరణ చేస్తాడు. ఈరోజు ఇచ్చిన సమస్య రెండు విధాలుగా ఉంది. గమనించి పూరించండి)
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..
"కర్ణుని యాయువు చెల్లఁగ గెలిచెనట సుయోధనుఁ డనిలోన్"
లేదా...
"కర్ణుఁడు చచ్చుటన్ విజయలక్ష్మిన్ బొందె రారా జనిన్"
ఈ సమస్యను పంపిన వైద్యం వేంకటేశ్వరాచార్యులు గారికి ధన్యవాదాలు.