28, ఫిబ్రవరి 2017, మంగళవారం

సమస్య - 2295 (మాన్య యయ్యెఁ బతివ్రత...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....

"మాన్య యయ్యెఁ బతివ్రత మగని రోసి"
లేదా...
"మగనిన్ రోసి పతివ్రతామణి కడున్ మాన్యత్వముం బొందెరా"

61 కామెంట్‌లు:

  1. నిప్పుతో నాడకురయని చెప్పి చెప్పి
    మగని మనసు రంజించక వగచి వగచి
    మగువ మండోదరి మదిని దిగులు జెంది
    మాన్య యయ్యెఁ బతివ్రత మగని రోసి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాస్త్రి గారు లాటానుప్రాసాలంకారముతో చక్కగనున్నది మీ పూరణ. అభినందనలు.
      "మగువ మండోదరి మదినిఁ బొగిలి పొగిలి" ఇంకా బాగుంటుంది.

      తొలగించండి
    2. అయ్యా! నాకే యనుప్రాసలూ తెలియవు. ఏదో నోటికి వచ్చినవి వ్రాస్తూ ఉంటాను. మీరు, శ్రీమాన్ శంకరయ్య గారు, కవి మిత్రులు నా వ్రాతలు చదవడమే మహాభాగ్యము. రామాయణము, భాగవతము, భారతము చదవలేదు. వ్యాకరణం రాదు. పద సంపద లేదు. సరదాగా వ్రాస్తుంటాను. ఆ! కొంచెం గీత లోను, ఉపనిషత్తులలోను ముఖపరిచయం మాత్రమే. నమస్సులు!!!

      తొలగించండి
    3. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. పోచిరాజు వారి మెప్పును పొందిన మీరు అదృష్ణవంతులు. అభినందనలు.

      తొలగించండి
  2. వింత వర్తన తోడుత వంత లొంది
    చింత నొందిన ఫలమిసుమంత లేక
    కొంత శాంతిని గోరుచు గుడిని జేరి
    దేవదేవుని సన్నిధి సేవ నిడుచు
    మాన్యయయ్యె బతివ్రత మగని రోసి!

    రిప్లయితొలగించండి







  3. జన్మ సార్థకతను గాంచె జవ్వని తన
    మగడి సేవన తరియించి, మాలిమి గని
    మాన్య యయ్యెఁ బతివ్రత, మగని రోసి
    మగువ నరకమునకు బోయె మదము మీర!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. సతము భర్తను సేవించి సంఘమందు
    మాన్య యయ్యె బతివ్రత, మగని రోసి
    యన్య యొక్కతె జీవితమందు మిగుల
    కష్టములు గాంచె సతత మేకాకి యగుచు.

    మిగులం గాంచిన దొక్క సుందరి కటా! మీనాక్షి కష్టంబులన్
    మగనిన్ రోసి, పతివ్రతామణి కడున్ మాన్యత్వముం బొందెరా
    తగురీతిన్ దన ప్రాణనాథుని యెడన్ తల్లగ్నచేతంబుతో
    నిగమోక్తంబుగ సేవజేసి భువిలో నిష్ఠన్ బ్రవర్తించుచున్.
    హ.వేం.స.నా.మూర్తి

    రిప్లయితొలగించండి
  5. డా.పిట్టా సత్యనారాయణ
    గౌతముని నెట్టినట్టులె ఘన యహల్య
    ఇంద్రునిన్ బొందె, శాపమునంది రాము
    పాదధూళిని గని లేచె పతితయయ్యు
    మాన్య యయ్యె బతివ్రత మగని రోసి!
    తగునమ్మాయని శాసనాల బలిమిన్ దండప్రహారాల వే
    లగుసంఖ్యన్ యువతీ శిరోమణులు బల్ లాస్యాలనున్ మన్పి చి
    త్తగుటన్ జూడమె బంధనాలు మషలై దట్టించసత్పూరుషున్
    మగనిన్ రోసి పతివ్రతా మణి కడున్ మాన్యత్వముంబొందెరా!

    రిప్లయితొలగించండి
  6. డా.పిట్టా
    "మన్పి" కి బదులు "మన్ప"గా చదువ ప్రార్థితుడను.

    రిప్లయితొలగించండి
  7. మగని సేవించి తరియించు మహిళ కనగ
    మోక్ష మొసగును దైవము రక్ష జేయు
    మాన్య యయ్యెఁ బతివ్రత , మగని రోసి
    భక్తి వీడిన చాలును శక్తి గలిగి

    రిప్లయితొలగించండి
  8. యముని నెదిరించి సావిత్రి విమలమతిని
    భర్తఁగాపాడె పతిభక్తి పాలనమున-
    మాన్యయయ్యెఁ బ్రతివ్రత-మగని రోసి,
    కైక చింతించె భరతు దమగ్బాంతిఁజూసి

    రిప్లయితొలగించండి
  9. భర్త తోసహగమనంబు భాగ్యమనుచు
    నాటి పెద్దల బలుకగ నాతి వణకి
    కన్న బిడ్డల గతియేమి? కాంచు మనుచు
    మాన్య యయ్యెఁ బతివ్రత మగని రోసి

    (భర్త అకాల మరణానికి రోసి (మండిపడి) ఒక నారీ శిరోమణి బిడ్డలకొరకు ఆ ఆచారాన్ని కాదని పతివ్రత అయినదని చెప్పడం)

    రిప్లయితొలగించండి
  10. తగురీతిన్దనపట్లదూకుడుగనేదానుంటచేనట్లుండెసూ
    మగనిన్రోసిపతివ్రతామణికడున్మాన్యత్వమున్బొందెరా
    మిగులన్సేవలుజేసిరేవగలుమామీనాక్షియెల్లప్పుడున్
    నిగమోక్తంబుగరీతిగాదనరిదానిష్ఠన్బ్రవర్తించుగా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదం చివర గణదోషం. "దానుంట నట్లుండె సూ" అనండి.

      తొలగించండి
  11. భర్త కోరిక మన్నించి భార మనక
    నెత్తి మీదకు గంపలో నెత్తి మగని
    వార కాంత గృహమునకు జేరి సుమతి
    మాన్య యయ్యెఁ బతివ్రత మగని రోసి

    http://kandishankaraiah.blogspot.in/2011/01/195.html?m=1

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      అయితే.. ఇది గతంలో ఇచ్చిన సమస్యేనా? గుర్తు చేసినందుకు ధన్యవాదాలు!

      తొలగించండి
    2. vasant.kishoreజనవరి 13, 2011 6:28 AM


      *సీ*
      కష్ట సుఖము లందు - కలనైన నిలనైన ,
      తక్క పతిని , నన్యు - దలప దామె !
      పతి పాద సేవయె - పరమ భాగ్యంబని
      నెన్నడు దలపోయు - నెలత యామె !
      పణముల గణములు - తృణమని యెంచుచు
      మగని ముదము గోరు - మగువ యామె !
      సాటి సతుల లోన - సరిసాటి లేనట్టి
      సొగసు సొంపుల మేటి - సుదతి ! సుమతి !
      *తేగీ*
      గాలి హోరెత్తు , వర్షంపు - కాళ రాత్రి
      పతిని , వెలయాలి చెంతకు - పంపు కతన
      ముదము గంపను మోసెడి - ముదిత గనరె !
      స్వర్ణ సింహాస నమ్మున - శ్వాన మమరె !

      తొలగించండి
    3. వసంత కిషోర్ గారిది:

      అన్య సమస్యకు గతంలోని పూరణ

      తొలగించండి
  12. ఎన్న ధనము కన్న గుణము మిన్న యంచు
    నెంచి యంచిత మెల్లడ సంచరించి
    వనిత యంతట సద్గుణ వంతు డైన,
    మాన్య యయ్యెఁ బతివ్రత, మగని రోసి

    [రోయు = వెదకు]



    అగ మాధిక్య శరీర ఘోర మతి లంకై కాధిపత్యప్రభా
    జగదాక్రందన కారకుం డనగఁ దుచ్ఛంబైన జల్పంబుల
    డ్డుగఁ దా నొక్క తృణమ్ము నుంచి దశకంఠున్ దైత్య దుష్కోటికిన్
    మగనిన్ రోసి పతివ్రతామణి కడున్ మాన్యత్వముం బొందెరా

    [మగఁడు = రాజు]

    రిప్లయితొలగించండి
  13. ప్రాణసమముగ ప్రేమించి పతిని యిలను
    మాన్యయయ్యెఁ బతివ్రత,మగని రోసి
    ఎండమావుల నీటికై నేగి కడకు
    కష్టములవలలోచిక్కె కాంత యొకతె!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పతిని నిలను / భర్త నిలను' అనండి. అక్కడ యడాగమం రాదు.

      తొలగించండి
  14. ………………………………….................
    గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


    వగలాడీ ! నిను బొ౦ద నట్టి బ్రతుకే

    ………… వ్యర్థమ్ము | చూపి౦తు నా

    బిగి యౌ స౦దిట స్వర్గ సౌఖ్యమును ,

    …………… రావే య౦చు భాషి౦చు నా


    మగనిన్ రోసి పతివ్రతా మణి కడున్

    …………… మాన్యత్వమున్ బొ౦దెరా |

    మగనిన్ గాదని సాధ్వి యన్యుని

    ……… ముఖ౦బైన౦ గనన్ జాలునే



    { మగడు = భర్త , పురుషుడు

    నాల్గవ పాద౦లో తప్పనిస్థితిలో అ ఖ ౦ డ
    _______________________________________
    య తి వేశాను . క్షమి౦చ౦డి
    __________________________________

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      అఖండయతి సర్వ సామాన్యమయింది. దోషం లేదు.

      తొలగించండి
  15. శాపకారణమున తన రూపుమారి
    ప్రభువు కడ వంటసాలలో బ్రతుకుచుండ
    భర్తజాడను తా నాలవాలుపట్టి
    మాన్య యయ్యె బతివ్రత, మగని రోసి

    రిప్లయితొలగించండి
  16. భర్తసేవయేయికపరమార్ధమనుచు
    సాధ్విసుమతిదాశిరముపైసరగుమోసి
    మాన్యయయ్యెబతివ్రత,మగనిరోసి
    పర్వువెట్టెనుబుట్టింటిపథమువైపు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది.
      మొదటి పాదంలో ప్రాసయతి తప్పింది. 'మగని సేవయే పరమార్థ మనుచు నెంచి' అందామా?

      తొలగించండి
    2. 'మగని సేవయే పరమార్థముగ దలంచి' అని కూడ అనవచ్చు.

      తొలగించండి
  17. భర్త ననుసరించు భార్యయే మహిని సా
    మాన్య యయ్యె! బతివ్రత మగని రోసి
    కించ బరచ బోదు, వంచన సేయదు!
    అంతరముల వీడ నఱయుచుండు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సమస్య తేటగీతిలో ఉంటే మీరు ఆటవెలది వ్రాశారు. నా సవరణ....

      భర్త నెప్పు డనుసరించి భార్య భువిని
      మాన్య యయ్యె! బతివ్రత మగని రోసి
      కించ బరచదు సేయదు వంచనమ్ము
      నంతరమ్ముల వీడగ నరయుచుండు.

      తొలగించండి
    2. గురువు గారికి వందనములు. సరిగా గమనించక పొరబడ్డాను, మన్నించండి. మీ సవరణ అద్భుతం.
      ధన్యవాదములు.

      తొలగించండి
  18. వ్యసన పరుడైన భర్తున్న బాధపడక
    పతిని సతతమ్ము సేవించి వసుధ యందు
    మాన్యమయ్యె బతివ్రత, మగని రోసి
    యెరుగదాయింతి, మార్చెనా పురుషు నామె
    యనునయమగు మాటలతోడ నద్భుతమ్ము.

    ప్రగతే శూన్యమనందురే సతియె యాహ్వానించునే నిందలన్
    భగవంతుండును మెచ్చడందురిల సంపాదించునే కష్టముల్
    మగనిన్ రోసి, పతివ్రతామణి కడున్ మాన్యత్వముం బోందెరా
    జగతిన్ సీతకు రామనామమదె గా సాధించెనా కీర్తినే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో 'భర్త+ఉన్న=భర్తయున్న' అవుతుంది. అక్కడ 'మగడున్' అనండి.
      రెండవ పూరణలో 'ప్రగతి+ఏ, అని+అందురే' అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. 'ప్రగతిన్ బొందరటందురే' అనండి.

      తొలగించండి
  19. ప్రాణములు భర్త గోల్పోవ పట్టు విడక
    మగని బ్రతికించ యమునితో తగవు లాడి
    మాన్య యయ్యెఁ బతివ్రత ; మగని రోసి
    యుసురు వీడిరి యెందరో విసుగు జెంది

    రిప్లయితొలగించండి
  20. డా.పిట్టా
    "మన్పి" కి బదులు "మన్ప"గా చదువ ప్రార్థితుడను.

    రిప్లయితొలగించండి
  21. కౌరవ సభలో ద్రౌపది:

    నేడు తన్నోడి నన్నోడి నిల్చె ననిరొ?
    యొప్పి నన్నోడి తన్నోడె నో పలుకరె?
    యనుచు పెద్దల నిలదీసి వినుతి కెక్కి
    మాన్య యయ్యెఁ బతివ్రత మగని రోసి

    రిప్లయితొలగించండి
  22. గురువుగారికి నమస్కారములు. క్రింది పూరణలను పరిశీలించండి:
    26-02-2017:
    రసిక కీచకాధముని పేరడచ నెంచి
    జోరుగా యముని దరికి జేరు నట్లు
    నతనితో తులువా! పురినందు నిన్ను
    నిలుప కాపుండు వారేరి? పిలువ మనుచు
    గుద్దులను గుద్ది భీముడు గూల్చె వాని
    27-02-2017:
    వ్రాలెను తుంటరి కంసుడు
    బాలుర బరిమార్చిన;శిశుపాలుడనఘుడౌ;
    పాలించిన ధర్మములకు
    వాలకమగు ఫలితములవి వఱలగ నుండున్
    28-02-2017:
    పొందికైనట్టి రీతిని పొసగు చుండి
    నిచ్చలు పతిని సేవించు నియమమొంది
    మాన్య యయ్యె బతివ్రత; మగని రోసి
    పతిత యయ్యెను నెఱిలేని పడతి నెంచ

    రిప్లయితొలగించండి
  23. గురువుగారికి నమస్కారములు. క్రింది పూరణలను పరిశీలించండి:
    26-02-2017:
    రసిక కీచకాధముని పేరడచ నెంచి
    జోరుగా యముని దరికి జేరు నట్లు
    నతనితో తులువా! పురినందు నిన్ను
    నిలుప కాపుండు వారేరి? పిలువ మనుచు
    గుద్దులను గుద్ది భీముడు గూల్చె వాని
    27-02-2017:
    వ్రాలెను తుంటరి కంసుడు
    బాలుర బరిమార్చిన;శిశుపాలుడనఘుడౌ;
    పాలించిన ధర్మములకు
    వాలకమగు ఫలితములవి వఱలగ నుండున్
    28-02-2017:
    పొందికైనట్టి రీతిని పొసగు చుండి
    నిచ్చలు పతిని సేవించు నియమమొంది
    మాన్య యయ్యె బతివ్రత; మగని రోసి
    పతిత యయ్యెను నెఱిలేని పడతి నెంచ

    రిప్లయితొలగించండి
  24. నిన్నటి పూరణ:

    బాలుర సంక్షేమ గదిన్
    తేలొకటి రయమున దూరి తిరుగుటఁ గనియున్
    జాలిపడి నిలువరించుచు
    బాలురఁ, బరిమార్చి శిశుపాలుఁడనఘుడౌ

    శిశుపాలుడు = Hostel warden

    రిప్లయితొలగించండి
  25. గురువు గారికి వందనములు. సవరించిన నా పూరణను చూడ గోరుతాను. ధన్యవాదములు.
    భర్త ననుసరించి నడచు భార్య భువిని
    మాన్య యయ్యె! బతివ్రత మగని రోసి
    కించ బఱచగనిట సాహసించ బోదు!
    భేదముల వీడు దారుల వెదకు నెపుడు!

    రిప్లయితొలగించండి
  26. కలియుగ మండోదరి:👇

    తగవున్ బెట్టుచు పోరగా మగనితో ధైర్యమ్ము లేకుండగా
    తగునా నీకిది దొంగవేషమున సీతామాతనున్ దెచ్చుటన్
    నగుబాటాయెను లంకలో వినగనున్ నావల్ల కాదంచుచున్
    మగనిన్ రోసి పతివ్రతామణి కడున్ మాన్యత్వముం బొందెరా!

    రిప్లయితొలగించండి