కవి మిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"రాముఁడు వియ్యమందె బలరామునితో రవిచంద్రసాక్షిగాన్"
లేదా...
"రాముఁడు వియ్యంకుఁడు బలరామునకుఁ గదా"
ఈ సమస్యను పంపిన వైద్యం వేంకటేశ్వరాచార్యులు గారికి ధన్యవాదాలు.
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"రాముఁడు వియ్యమందె బలరామునితో రవిచంద్రసాక్షిగాన్"
లేదా...
"రాముఁడు వియ్యంకుఁడు బలరామునకుఁ గదా"
ఈ సమస్యను పంపిన వైద్యం వేంకటేశ్వరాచార్యులు గారికి ధన్యవాదాలు.
దోమలు కుట్టగ గ్రామపు
రిప్లయితొలగించండివాముల డేరాల లోన పాముల మధ్య
న్నేమి గురుతుండె? తారక
రాముఁడు వియ్యంకుఁడు బలరామునకుఁ గదా!
1950 లలో ముత్తుకూరు గ్రామములో టూరింగ్ టాకీసులో అగ్గిరాముడు, దొంగరాముడు, భలేరాముడు ఇత్యాది...తదనంతరం తెలుగు సినిమాలు చూసే అదృష్టం లేకపోయె!
శశిరేఖా పరిణయం వ్యాస మహాభారతంలో లేదని విన్నాను...
తొలగించండి
రిప్లయితొలగించండిఆ మైథిలికి మగండౌ
రాముఁడు, వియ్యంకుఁడు బలరామునకుఁ గదా
శ్రీమహి మాన్వితమగు కుం
తీ మహరాణి తనయుండు తీరుగ జూడన్ !
జిలేబి
సోముని వెన్నెల వెలుగుల
రిప్లయితొలగించండిభామల నృత్యంపు సొగసు పరవశమందున్
ఏమని జెప్పుదు మైకము
రాముఁడు వియ్యంకుఁడు బలరామునకుఁ గదా
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిరామయ్యలు వరుగులగన
బాములబడ పారుడొకడు బలికెన్ "భళిరా!
సామమె సరి పులి, శునకాల్
రాముడు వియ్యంకుడు బలరామునకు గదా!"
(రాముడు.చిత్తా౩వపాదం పులివరుగు.బలరాముడు.మూలా నక్షత్రం౩వపాదం.శునకం వరుగు.పులికి,ఆవుకు వైరం.శునకం జింకకు వైరం కాని పులిశునకాలకు వరుగులు కలుస్తాయి.జ్యో.చంద్రిక)
డా.పిట్టా
రిప్లయితొలగించండిబాములె రత్నగర్భయగు భారత దేశము కన్ని దిక్కులన్
క్షేమములేక సఖ్యపరిశీలన తోడుత వియ్యమంది స
ద్ధీమతి బోరగా యవన దీధితినిన్ జెరపంగ రాజులై
రాముడు వియ్యమందె "బల"రామునితో రవి చంద్ర సాక్షిగా
ఏమిది వింతయై జెలగె నిద్ధరి నాదొక స్వప్న లోకమా!
(రామ బలరాములు రాజులకు ప్రతీకలుగా..భారత చరిత్రలో ఇలా జరిగిఉంటే బాగుండేదనే భావనతో)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమిత్రులందఱకు నమస్సులు మఱియు అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవ శుభాకాంక్షలు!
రిప్లయితొలగించండిప్రేమను దగ్గఱైరి శశిరేఖయుఁ బార్థసుతుండు; వారికిం
బ్రేమనుఁ బెండ్లి సేయఁ దరలించెను కృష్ణుఁడు పాండవేయ స
ద్ధామ వనాంతరమ్మునకు; దంపతులై చన, ద్రౌపదీ మనో
రాముఁడు వియ్యమందె బలరామునితో రవిచంద్ర సాక్షిగాన్!
కవిమిత్రులకు నమస్సులు!
రిప్లయితొలగించండినేనీరోజు సంగారెడ్డిలో జరుగనున్న సాహిత్య కార్యక్రమానికి వెళ్తున్నాను. కనుక మీ పూరణలపై వెంట వెంటనే స్పందించలేను. దయచేసి పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.
అందరికీ అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవ శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిభామ శశిరేఖ తలపునఁ
బ్రేమ రగుల్చ నభిమన్యుఁ బెండ్లాడన్ గా
రాముగ, సుభద్ర హృదయా
రాముఁడు వియ్యంకుడు బలరామునకు గదా
రాముడుమరిబలరాములు
రిప్లయితొలగించండిసోముడ!యికజెప్పునీవుచుట్టములేనా?
యేమీసందియమేలకొ?
రాముడువియ్యంకుడుబలరామునకుగదా
శ్యామల కోమలాంగుని, ప్రసన్న గుణోజ్జ్వలు, కృష్ణు చెల్మితో
రిప్లయితొలగించండిభామను రాముపుత్రి,శుభవర్తిని యా శశిరేఖ కోడలౌ
ప్రేమను పొందె,నర్జునుడు ప్రీతి వహించెను-పాండురాణ్మనో
రాముడు వియ్యమందె బలరామునితో రవిచంద్ర సాక్షిగన్
రాము పుత్రి-బలరాముని కుమార్తె
………………………………………………………
రిప్లయితొలగించండిగు రు మూ ర్తి ఆ చా రి
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
{ పోలిస్ అధికారు లైన రాముడు ,
బలరాముడు వియ్య౦కు లైరి ; ఐన
కట్నము మరచిపోలేదు . }
రాముడు కన్యనిచ్చె - బలరాముని
…………… పుత్రకు డైన శౌరికిన్ |
హేమక వస్తుస౦పదయు నెన్మిది లక్షల
…………… సొమ్ము నిచ్చుచున్ ,
రాముడు వియ్య మ౦దె బలరాముని తో
………………… రవిచ౦ద్ర సాక్షిగా |
నేమొనరి౦చి చట్టముల నెన్నియు
………….... జేసిన మాసిపోవునే
భూమిని కట్న మన్న పెనుభూతము |
…………… రక్షక శాఖ య౦దునన్
దా మధికారు లయ్యు గలదా యుపయోగము
……………… నీతి వీడినన్ ! ! !
( హేమకము = హేమము )
ఏమి విచిత్రమో తరమ యేరికిఁ జెప్పగ నిశ్చయంబుగ
రిప్లయితొలగించండిన్నా మధుసూదనప్రభవు డాతనిఁ గోరుచు రుక్మిపుత్రి భా
మామణి ధీర రుక్మవతి మానుగ భార్యగ నయ్యె వైరభృ
ద్రాముఁడు వియ్యమందె బలరామునితో రవిచంద్రసాక్షిగాన్
ఏమని చెప్పుదు దుర్విధి
నామని రుక్మి యొనరించె నఱ నెత్తమునన్
భీమావమానము పరవి
రాముఁడు వియ్యంకుఁడు బలరామునకుఁ గదా
[అఱ = వంచన; ఆమని = అధికము]
ఆర్యా: మీ కంద పద్యానికి ప్రతిపదార్ధము, భావము, నాకు అర్ధమయెలా వివరించ ప్రార్ధన. ముఖ్యంగా శశిరేఖనెత్తుకున్నారా లేదా తెలియజేయుడు. నమస్సులు...
తొలగించండిశాస్త్రి గారు నమస్సులు. శశిరేఖాపరిణయము మన చలనచిత్ర ప్రతిభావంతుల భావ కల్పన యనుకుంటాను.
తొలగించండినాపూరణ లో ప్రస్తావించినది రుక్మి విదర్భరాజసూనుని గురించి. ప్రద్యుమ్నుఁ డు రుక్మవతిని వివాహమాడెను. యీ బంధుత్వము పైన వృత్త పూరణలో వివరించితిని.
పాచికలాటలో రుక్మి బలరాముని, వియ్యంకుని, పరవిరాముని ఘోరముగా పరాభ వించెను గదా! అని భావము.
అప్పుడు బలరాముఁ డతనిని కోపములో వధించెను. పరవిరాముఁ డన శత్రువులను సంహరించు వాడు.
పూజ్యులు కామేశ్వర రావు గారు:
తొలగించండిశత సహస్ర వందనములు! మీకు మీరే సాటి!!!
నాకు మాత్రం "మాయా బజార్" సాటిలేని చలన చిత్రం సుమా!
తొలగించండినాకు కూడ.
తొలగించండిసారూ:
తొలగించండితప్పులు మన్నించి దిద్దవలసినది:
నీమము లేనీ జగమున
రాముఁడు వియ్యంకుఁడు బలరామునకుఁ గదా!
కామేశ్వరరావీ మహి
భీమసమస్యా నియంత భీకర రాజౌ!
కోమలి శశిరేఖను గని
రిప్లయితొలగించండిప్రేముడితోడను వరించ విజయు సుతుడు సు
త్రాము సుతుడు కృష్ణ మనో
రాముడు వియ్యంకుడు బలరామునకు గదా
మామ బలరాము కూతును
రిప్లయితొలగించండిప్రేముడి నర్జునసుతుండు పెండ్లాడంగన్
శ్యామ సుభద్ర సుహృదయా
రాముడువియ్యంకుడుబలరామునకుగదా
బాములనెన్నియోబడెనుభార్యయుదానునునావనిన్దగన్
రిప్లయితొలగించండిరాముడు,వియ్యమందెనుబలరామునితోరవిచంద్రసాక్షిగా
న్నామహితాత్ముడానరుడుహర్షముతోశశిరేఖనున్మరిన్
కోమలియైనయామెనికకోడలుగామదినెంచెనప్పుడున్
సోమునితోడ యుద్ధమున శూరత పాశుపదమ్ముఁబొంది, సు
రిప్లయితొలగించండిత్రాముడొసంగ దీవెనలు తద్దయు ప్రీతిని పొంది, పుత్రుడా
లేమ సుమధ్యయైన శశి రేఖను పొందగ, ద్రౌపదీ మనో
రాముడు వియ్యమందె, బలరామునితో రవిచంద్ర సాక్షిగా
పాశుపతమ్ము - టైపు తప్పు
రిప్లయితొలగించండిభూమిజ భర్త యెవరు? తన
రిప్లయితొలగించండికేమగు కుశుఁ మామగారు? కృష్ణుడు తమ్ముం
డిమ్మహినెవరికగుననిన
రాముఁడు ,వియ్యంకుఁడు, బలరామునకుఁ గదా
"రాముడు వియ్యమందె బలరామునితో రవిచంద్రసాక్షిగాన్"
రిప్లయితొలగించండి"సోముని కాంతిరేఖలవి సూర్యుని వెల్గగ జేయు"నంచు , మీ
రేమిటి వ్రాసియుంటిరిది యెవ్వరు నేర్పిరటంచు శిష్యులన్
ధీమహితుండునౌ గురువు దిట్టెను దిద్ది జవాబు పత్రముల్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండినిన్నటి పూరణ:
పలురంగులలో విరిసిన
యలరుల గొలకల చెలువము నానందమునన్
తిలకించుచు రోజా రే
కులటం గని పిలిచి సీత కురు లల్ల మనెన్
నేటి పూరణ:
భూమి సుతకు పతియెవ్వరు?
నామె పితకు తన పురుషుని నాయన డేమౌ?
యామురరిపు వెవరికనుజు?
రాముఁడు ,వియ్యంకుఁడు, బలరామునకుఁ గదా
దామోదరుడు వరమొసగ
రిప్లయితొలగించండిప్రేముడి అభిమన్యుని శశిరేఖ వరింపన్
భీమానుజుడు శుభద్రా
రాముఁడు వియ్యంకుఁడు బలరామునకుఁ గదా
ఆమురళీధరుని సఖుడు
రిప్లయితొలగించండినీమము దప్పక చరించు నింద్రతనయుడౌ
కోమలి సుభద్ర హృదయా
రాముఁడు వియ్యంకుఁడు బలరామునకుగదా!!!
కవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండిఈరోజు మంచి ఎండలో దాదాపు ఐదు కిలోమీటర్లు నడవడంతో పూర్తిగా అలసిపోయాను. మీ పూరణలను సమీక్షించలేను. మన్నించండి.