కవి మిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"భయపడఁగ వీరుఁడని జనుల్ ప్రస్తుతింత్రు"
లేదా....
"భయపడినంత వీరుఁడని పల్కుచు మెచ్చిరి లోకులెల్లరున్"
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"భయపడఁగ వీరుఁడని జనుల్ ప్రస్తుతింత్రు"
లేదా....
"భయపడినంత వీరుఁడని పల్కుచు మెచ్చిరి లోకులెల్లరున్"
"స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః"
రిప్లయితొలగించండి.....భగవద్గీత - 3.35
మొరగ లేదు శునకమని మ్రోగి నట్టి
గార్ధబమ్ము వోలె తనది గాని పనిని
వృత్తి ధర్మమ్ము లెంచక నెత్తి కెత్త
భయపడఁగ వీరుఁడని జనుల్ ప్రస్తుతింత్రు
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండికత్తి బట్టుచు నడివీధి కదన మాడ
జనులు బెంబేలనుచు భీతి జావ గారి
భయపడఁగ, వీరుఁడని జనుల్ ప్రస్తుతింత్రు
నతని తమమేలు కోరియన తెలియగను
జిలేబి
రిప్లయితొలగించండిపయిదలి యాన గాను తన భాగ్యము వీడెను సెల్వమయ్యటన్,
జయజయహే యటంచు తన జావళి మార్చి, సమాధిగాంచి,ని
ర్భయపడినంత, వీరుఁడని పల్కుచు మెచ్చిరి లోకులెల్లరున్,
భయదము వీడె పోరు గన బాధ్యత గాంచెను నల్లతంబియై:)
జిలేబి
రొంబ సెరి
తొలగించండిజిలేబీ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణలు 'ప్రస్తుతింత్రు+అతని' అన్నపుడు నుగామమం రాదు. చివరిపాదం కొంత గందరగోళంగా ఉంది.
రెండవ పూరణ విషయంలో శాస్త్రి గారితో ఏకీభవిస్తున్నాను.
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండితెగబడియు ద్రుంచు వాడెపో ధీరుడనగ
రణమునకు నుండు నీతి నిరస్త్రు నెదుర
దగిన సందర్భమున తాను ధర్మమునకు
భయపడగ వీరుడని జనుల్ ప్రస్తుతింత్రు
క్షయమగు గీర్తియంచనక సామము జూపెను తాను కృష్ణుడై
రయమున రాక్షసాధము పరాకుని దూషణలందె, వంద సం
చయమునకందగా పగతు క్ష్మాతలి గూల్చెను మాటదప్పగా
భయపడినంత వీరుడని పల్కుచు మెచ్చిరి లోకులెల్లరున్!
డా. పిట్టా సత్యనారాయణ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
డా.పిట్టా నుండి,ఆర్యా,పురస్కార విశేషాలకై ప్రతీక్ష.మీకు మాహృదయ పూర్వక అభినందనలు
తొలగించండిప్రక్క దారుల త్రొక్కెడు బిక్కవాని
రిప్లయితొలగించండిసుతునిఁగాంచిన తండ్రియు క్షోభఁజెంది
పలుకులకు,చేతలకు తాను కలతచెంది
భయపడగ వీరుడని జనుల్ ప్రస్తుతింత్రు
ప్రసాద రావు గారూ,
తొలగించండిమీ పద్యం బాగుంది. భావమే కొంత సందేహాస్పదంగా ఉంది. 'బిక్కవాని'...?
అనునయించెనుమానాన్నతననుజూచి
రిప్లయితొలగించండిభయపడగ.వీరుడనిజనుల్ బ్రస్తుతింత్రు
సాహసంబునరిపులనుసంహరించ
సాహసంబులుగలచోటజయములుండు
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అతిరధుడు మహారధుడని యంది ఖ్యాతి
రిప్లయితొలగించండివెన్నుపోటున నరి గూల్చ నెన్నుకొనుచు
ధర్మయుద్ధము వీడి యధర్మ గతికి
భయపడఁగ వీరుఁడని జనుల్ ప్రస్తుతింత్రు
నిన్నటి సమస్యకు నా పూరణలు
శవ జాగరమున కలగని
యవగతమయె నాకటంచు ననెనొకడు ఋజన్
భవ దురితమె కర్ణుని యా
యువు చెల్లఁగ గెలిచెనట సుయోధనుఁ డనిలోన్
రవి సుతుడు గూలె నెటు? పా
ర్థివు డోడెన యుద్ధమందు ? రిపులకు బలియై
శవమెవడయె ? కర్ణుని యా
యువు చెల్లఁగ/ గెలిచెనట/ సుయోధనుఁ డనిలోన్
భాగవతుల కృష్ణారావు గారూ,
తొలగించండిమీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
భయపడినంతవీరుడనిపల్కుచుమెచ్చిరిలోకులెల్లరున్
రిప్లయితొలగించండిభయపడినంతభీరుడనిబల్కగనొప్పునుగాదెయిధ్ధరన్
రయమునసాగుముందునకురాజసమొప్పగవీరుడెప్పుడున్
జయమునుబల్కగాదగునుసాయుధవంతునకేగదాయికన్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వెఱపు లేకయె నిజమైన వీరుని వలె
రిప్లయితొలగించండిచెలగు రణమున నాతడు చిచ్చు వోలె
యాతని పరాక్రమమునకు నరులు బెదరి
భయపడఁగ వీరుఁడని జనుల్ ప్రస్తుతింత్రు
గుఱ్ఱం జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'..వోలె నాతని...' అనండి.
జయములు సర్వకార్యముల చక్కగ నందుచు,శత్రువర్గమున్
రిప్లయితొలగించండిక్షయ మొనరించు శౌర్యమును, సర్వ జనావన శక్తి గల్గియున్
వయసున బెద్దయౌ నతడు పండితులం గని నమ్ర దేహుడై
భయపడినంత వీరుడని పల్కుచు మెచ్చిరి లోకు లెల్లరున్.
విజయ దీప్తియు, సర్వత్ర విస్తరించు
యశము, శౌర్యంబులును గల్గి, నిశలు బవలు
సాధు జనులకు,గురులకు సతుల కవని
భయపడఁగ వీరుఁడని జనుల్ ప్రస్తుతింత్రు.
హ.వేం.స.నా.మూర్తి
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
అరి గణ హరి భూపాలుని హస్త పాద
రిప్లయితొలగించండిచిత్ర చలనమ్ము లెల్ల సూచి రణరంగ
జైత్ర ఖడ్గలావణ్యము శత్రు సేన
భయపడఁగ వీరుఁడని జనుల్ ప్రస్తుతింత్రు
రయమున లాగి యా ధనువు లాఘవ మొప్పగ నెక్కుపెట్ట నే
భయమును లేక రాఘవుడు వైష్ణవ తేజుఁడు జామదగ్నియే
భయపడినంత వీరుఁడని పల్కుచు మెచ్చిరి లోకులెల్లరున్
నయమున నేగె భార్గవుడు నమ్రత నంత మహేంద్రశైలమున్
పోచిరాజు కామేశ్వర రావు గారికి,
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
'నయమునఁ జేరె... మహేంద్రశైలమున్' అంటే బాగుంటుందేమో?
లేదా 'నయమున నేగె... మహేంద్రశృంగికిన్' ?
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ సవరణ తో నన్వయ లోపము తొలగినది. ధన్యవాదములు.
తొలగించండి“నయమున నేగె భార్గవుడు నమ్రత నంత మహేంద్ర శృంగికిన్” గా సవరణ చేయు చున్నాను.
ప్రణామములు గురువుగారు...
రిప్లయితొలగించండిబీరుడని యంద్రు పోరున బిక్కచచ్చి
భయపడఁగ, వీరుఁడనిజనుల్ ప్రస్తుతింత్రు
వెన్ను జూపని శౌర్యంపు వేడితోడ
విజయలక్ష్మిని వరియించు విజయు గనుచు!!!
శైలజ గారూ,
తొలగించండిబహుకాల దర్శనం... సంతోషం!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సైన్యమునఁ జేరి కరమగు శక్తితోడ
రిప్లయితొలగించండిపోరుఁ జల్పుచు నున్నట్టి పుత్రుఁ గాంచి
తల్లిదండ్రులు బంధువుల్ తల్లడించి
భయపడఁగ, వీరుఁడని జనుల్ ప్రస్తుతింత్రు
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నిన్న మీతోను, రామమోహన్ రావు గారితోను గడపడం సంతోషాన్నిచ్చింది. గుండు మధుసూదన్ గారు కూడా మీకు ధన్యవాదాలు తెలియజేయమన్నారు.
……………………….......................
రిప్లయితొలగించండిగు రు మూ ర్తి ఆ చా రి
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
ఎదుటి వాని గొ౦తుకను ఖ౦డి౦చు వాని
వీరు డని య౦దురే ? కాదు , క్రూరు డ౦ద్రు
ధర్మ సత్య మార్గములకు తా నొకి౦త
భయపడగ , వీరు డని జనుల్ ప్రస్తుతి౦త్రు
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నియమముతోననీకమున నిల్చిసతమ్ము మనీషఁ జూపుచున్
రిప్లయితొలగించండిరయమున సాగు యుద్ధమున రంజిలుచుండగ యుద్ధభూమిలో
జయమును పొందపుత్రునికిసాధ్యమయంచు కృశించు తండ్రితా
భయపడినంత, వీరుఁడని పల్కుచు మెచ్చిరి లోకులెల్లరున్
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
అనీకము, మనీష వంటి పదప్రయోగం ప్రశంసనీయం.
గురువర్యులకు ధన్యవాదములు.
తొలగించండిపాండవులు,కౌరవుల్ రాజ్యభాగమందు
రిప్లయితొలగించండియుద్ధమన్నచొ?ధర్మజ యోధుడచట
భయపడగ|”వీరుడని జనుల్ ప్రస్తు తింత్రు
పంచపాండవ మధ్యుని బలముగాంచి|”
2.దయగల గాంధితాత తనదక్షతవిల్లున తెల్లజాతనే
భయమును మాన్పె|మాటలనుబాణములేయుచు మార్పు జేయగా?
జయము వరించెనాడు మనజాతి పురోగతి యందుమోసమే
భయపడినంత|వీరుడనిపల్కుచు మెచ్చిరి లోకు లెల్లరున్|
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
టైపాట్లున్నవి.
కవిమిత్రులారా,
రిప్లయితొలగించండినిన్న హైదరాబాదు వెళ్ళి ఈరోజు ఇల్లు చేరాను. అందువల్ల నిన్నటి పూరణలను సమీక్షించలేకపోయాను. మన్నించండి.
నిన్న బషీర్‍బాగ్ ప్రెస్‍క్లబ్‍లో 'గురజాడ ఫౌండేషన్, అమెరికా' వారి 'గురజాడ జాతీయ విశిష్ట సాహిత్య పురస్కారం - 2017'ను అందుకున్నాను. ఎందరో కవిమిత్రులు కలిసారు.
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు, వారి మిత్రులు రామమోహన్ రావు గారు ఆత్మీయంగా వచ్చి కలిసారు. శిష్ట్లా శర్మ గారు మాకు తాజ్‍మహల్ హోటల్లో విందు ఇచ్చారు. రాత్రి నేను, గుండు మధుసూదన్ రావు గారు రామమోహన్ గారి ఇంట్లోనే పడుకొని ఉదయం వారి ఆతిథ్యాన్ని అందుకొని బయలుదేరి వరంగల్ చేరుకున్నాను. అన్నపరెడ్డి వారికి, రామమోహన్ గారికి, శిష్ట్లా వారికి ధన్యవాదాలు.
నయమున మంచి మార్గమున నల్గురు మెచ్చిన తీరు గాక ని
రిప్లయితొలగించండిర్దయగొని తోటి వారలను దాసులుగా గను వాని చర్యలన్
రయమున మార్చు వాడొకడు రక్కసుఁడై బెదిరించ, దుష్టుడున్
భయపడినంత, వీరుఁడని పల్కుచు మెచ్చిరి లోకులెల్లరున్.
గండూరి లక్ష్మినారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శంకరయ్య గారికి నమస్కారం బిక్కచచ్చివ అనేది వాడుకలోని మాండలకమనే ఉద్దేశ్యంతో వ్రాశాను.మన్నింప ప్రార్ధన
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినీతి లేని వానికిజాతి నిలుచునండ
రిప్లయితొలగించండివింతయేమియిందు జనులు విలువ లిడువ
పిచ్చి వానిచేతిలొ రాతి పిడిని చూచి
భయపడఁగ వీరుఁడని జనుల్ ప్రస్తుతింత్రు
నయమున వ్రాయరా భడవ! నానుడి చెప్పెద నిట్టులన్గ నే:
రిప్లయితొలగించండి"భయపడినంత వీరుఁడని పల్కుచు మెచ్చిరి లోకులెల్లరున్"
రయమున వ్రాసె బంగలున రచ్చను జేసెడి బాలుడిట్టులన్:
"భయపడినంత భీరుఁడని పల్కుచు మెచ్చిరి లోకులెల్లరున్"
వంగభూమి = బంగభూమి