4, ఫిబ్రవరి 2017, శనివారం

సమస్య - 2273 (శంకరుఁ డవతరించి...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"శంకరుఁ డవతరించి దాశరథి యయ్యె"
లేదా...
"ఈశుఁడు శంకరుం డవతరించెను రాముఁడుగా ధరాస్థలిన్"

72 కామెంట్‌లు: 1. ఏమి టంటిరి కవివర యెటుల నాది
  శంకరుఁ డవతరించి దాశరథి యయ్యె?
  శంక రుడు శంకరుండు దాశరథి దాశ
  రథి గద నటులనగ సరి రాదు‌ సుమ్మ !

  బిలేజి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   నిజానికి ఈ పద్ధతిలో పూరణలు చెప్పడంలో పోచిరాజు సుబ్బారావు గారు దిట్ట!

   తొలగించండి
  2. 'బిలేజి', 'జిలేబి'ల విలోమానులోమం బాగుంది! ��

   తొలగించండి

  3. భళి! మురళీధర రావుల్
   జిలేబి బీలేజి మధ్య చిత్త విలోమం
   బులగనిరి లతాంగి ! నమ
   స్సులు యేల్చూరి కవివర్య ! సోహం హంసో !

   జిలేబి

   తొలగించండి
 2. ...ధర్మసంస్థాపనార్ధాయ సంభవామి యుగేయుగే...


  "శం" కరు డనగ నిడువాడు శాంతి సుఖము
  కృష్ణ భగవానుడు నుడివె గీత యందు
  తానె ధర్మము క్షీణుంచు తరుణ మందు
  శంకరుఁ డవతరించి దాశరథి యయ్యె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   శంకర శబ్దానికి వ్యుత్పత్త్యర్థంతో పూరణ చేయడం బాగుంది. అభినందనలు.
   మూడు, నాలుగు పాదాలకు అన్వయం కుదరడం లేదు. మూడవ పాదాన్ని "తానె ధర్మము క్షీణింపఁ దరలుదు ననె" అంటే కుదురుతుందేమో?

   తొలగించండి
  2. రెండవ పాదంలో నుడివె అన్నారు కదా! "...దరలుదునని" అనండి.

   తొలగించండి
 3. వంక లేకను దైవము బింక ముగను
  జంకు జూపక జగతికి సంత సమున
  మంచి చేయగ నేతెంచి మౌని వలెను
  శంకరుఁ డవతరించి దాశరధి యయ్యె

  రిప్లయితొలగించండి
 4. నాశముఁజేయ దానవుల,నాతిని సీతనుగూడి దివ్య సం
  దేశము నివ్వ,లంకవిభు తేకువఁజూపి వధింప,పేర్మి నా
  వేశము పొంగిపొర్ల నరివీర భయంకరుడౌచు రుద్రుడై
  ఈశుఁడు శంకరుండవతరించెను రాముఁడుగా ధరాస్థలినన్

  రిప్లయితొలగించండి
 5. పాశము లందుచిక్కు కొని పాపపు చింతన వీడిమై కము
  న్నాశ ల గాధమున్ మునిగి నాలుగు దిక్కుల కౄరకర్మ లున్
  క్లేశము చెందగా మదిని క్లిష్టత మెండుగ బాధబె ట్టగా
  ఈశుఁడు శంకరుం డవతరించెను రాముఁడుగా ధరాస్దలిన్

  రిప్లయితొలగించండి
 6. డా.పిట్టా సత్యనారాయణ
  ఘూర్జరనబుట్టి గాంధిగా ఘోష బెంచి
  ఖద్దరును రాటమున దీయు ఘనుడె యనగ
  దేశ పరిపాలనము జేయు దీక్ష బూని
  శంకరుని బోలు దీప్తిని సాగదీసి

  ఘడియకొక వేశమున మోది గానరాగ
  శంకరుడవతరించి దాశరథి యయ్యె!☺

  రిప్లయితొలగించండి
 7. ధర్మసంస్థాప నార్థము ధరణి పైన
  దునిమి వేయగ దుష్టుల హనుమయౌచు
  శంకరుఁ డవతరించి, దాశరధియయ్యె
  శ్రీహరి యని దెలిసి తాను చేయి కలిపె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'హనుమ యగుచు' అనండి.

   తొలగించండి
  2. గురుదేవులకు ధన్యవాదములు సవరించిన పూరణ:

   ధర్మసంస్థాప నార్థము ధరణి పైన
   దునిమి వేయగ దుష్టుల హనుమ యగుచు
   శంకరుఁ డవతరించి, దాశరధియయ్యె
   శ్రీహరి యని దెలిసి తాను చేయి కలిపె

   తొలగించండి
 8. డా.పిట్టా సత్యనారాయణ
  కోశము విప్పి జూచితిని కోర్కెలు దీర్చి సుఖంబుగూర్చి సం
  కాశము, సత్వసంపదల గాచియు బ్రోచు జనంబునీశుడే
  వేశముదాల్చుటన్నభినివేశము గల్గిన విష్ణుడొక్కడే
  ఈశుడు(రాజు)శంకరుం(సుఖము కలుగజేయువాడు)డవతరించెను రాముడుగా ధరాస్థలిన్!!

  రిప్లయితొలగించండి
 9. …………………………………………………………

  గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


  వైష్ణవి జనక పుత్రియై ప్రభవ మ౦దె |

  నా హరి , మదా౦ధ దనుజేభహరి , సుజన వ

  శ౦కరు డవతరి౦చి దాశరథి యయ్యె |

  నాదిశేషుడు సౌమిత్రి యగుచు బుట్టె |

  నీశ్వరా౦శము న౦దు జని౦చె నపుడు

  మారుతి ఘన తేజస్వియై క్ష్మాతలాన |

  " రామ చరితమున రథ చక్రములు వీరు "

  రిప్లయితొలగించండి
 10. రావణాదుల జంపగా రామునిగను
  తానుబుట్టెదనని హరి ధరణిలోన
  హనుమగా పుర హరుని రమ్మన సరియన
  శంకరుఁ డవతరించి దాశరధియయ్యె.

  రిప్లయితొలగించండి
 11. ధర్మరక్షణగావించెధరణినాది
  శంకరుడవతరించి,దాశరధియయ్యె
  దశరధునిగొమరుడుగనుదాజననమ
  గుటన.మంచిపాలననిచ్చెగువలయమున

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. హమ్మయ్య !

   వారి శైలి లో వేసేస్తే విలక్షణం గా అద్భుతం గా రాస్తారన్న మాట సుబ్బా రావు గారు. కిటుకు కనబెట్టేసా :)   జిలేబి

   తొలగించండి
  2. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మీ సాధారణంగా చేసే పద్ధతిలో కాకుండా విరుపుతో మీ పూరణ. బాగున్నది. అభినందనలు.
   *****
   జిలేబీ గారూ,
   ఇది కాదు వారి పద్ధతి. ఇచ్చిన సమస్యను పేర్కొని 'ఇంతమాట అనడం న్యాయమేనా? ఇలా అనడం అబద్ధం కదా!' అనేవిధంగా పూరణలు చేస్తుంటారు. సమస్యాపూరణంలో ఇది కూడా ఒక పద్ధతి. కాని ఎక్కువగా ఈ పద్ధతిని అనుసరించడం అంత మంచిది కాదని నా సూచన!

   తొలగించండి
 12. రిప్లయిలు
  1. అబ్జజ కుల పౌలస్త్య వధాభిలాష
   నలినజ ముఖామర వర గణాధిప ముని
   వర సమాశ్రిత మధువైరి భక్త జన వ
   శంకరుఁ డవతరించి దాశరథి యయ్యె


   ఈశ వరాన్వితాసుర వరేణ్యులు పాపులు ఘోర గోత్ర సం
   కాశులు బ్రహ్మదత్త వర గర్వులు రావణ కుంభకర్ణ కీ
   నాశుల నాశనార్థమున నందిత వాక్పతి దానవాంత కై
   కేశుఁడు శంకరుం డవతరించెను రాముఁడుగా ధరాస్థలిన్

   [శంకరుఁడు = సుఖమును గలుగఁజేయువాఁడు]

   తొలగించండి
  2. పూజ్యులు బహుభాషా ప్రవీణులు కామేశ్వర రావుగారిని మరొకసారి మనసారా నవ్వించ ప్రయత్నమిదియె:


   చిన్నారి పొన్నారి చిరుత కూకటి నాడు...
   అందుకొంటిని ప్రైజు లాంగ్ల మందు

   నూనూగు మీసాల నూత్న యవ్వనమున...
   అందుకొంటిని ప్రైజు లాంగ్ల మందు

   నిండు జవ్వనమందు రెండుచేతుల తోడ...
   అందుకొంటిని ప్రైజు లాంగ్ల మందు

   ప్రౌఢ నిర్భర వయఃపరిపాకమునఁ గొని...
   అందుకొంటిని ప్రైజు లాంగ్ల మందు


   ముసలి తనమందు మూర్ఖపు మొండి జేసి
   శంకరాభరణమ్మున జంకు వీడి
   ఆంగ్ల పదములు వాడగ నంద మైన
   తిట్లు తింటిని తెలుగులో తీర తనివి ;)

   తొలగించండి
  3. అందుకొంటిని మెప్పు నాంగ్ల మందు! చక్కని సీసము వ్రాసారు!

   తొలగించండి
  4. మీ పట్టు మీరు వదలరుగా! ఈసారి పద్యములో "బ్లాగు" వాడెదను...

   తొలగించండి
  5. రావణాదుల పరిమార్చ బ్రహ్మ,సురలు,
   మునులు ప్రార్ధింప భూభారము తొలగించ
   అక్షరుండగు విష్ణువు ఆర్తజనవ
   శంకరుండవతరించి దాశరథి యయ్యె

   తొలగించండి
  6. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు మనోహరంగా ఉన్నవి. అభినందనలు.
   *****
   ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ పద్యం హాస్యరస స్ఫోరకంగా ఉంది. కాని మనసారా నవ్వుకొనే 'మూడ్' లేదు. మొన్న రెండవ తేదీన ఏటియంకు వెళ్ళి పదివేల రూపాయలు డ్రాచేయబోయాను. చాలాసేపు 'prossesing' అని చివరికి 'Timed out' అని వచ్చింది. డబ్బు రాలేదు కాని నా ఫోనుకు పదివేలు డెబిట్ అయినట్టు మెసేజ్ వచ్చింది. అప్పటినుండి నాకు మొదలయింది ఆంధోళన. వెంటనే బ్యాంకుకు వెళ్ళి అడిగితే "24 గంటల్లో మీ అకౌంటులో డబ్బు చేరుతుంది. అలా చేరకుంటే వచ్చి ఫిర్యాదు పత్రం నింపి ఇవ్వండి" అన్నారు. నిన్న మధ్యాహ్నం దాకా చూసి, బ్యాంకుకు వెళ్ళాను. "ఫిర్యాదు తీసుకునే మేడం లీవు పెట్టారు. రేపు రండి" అన్నారు. ఈరోజు వెళ్ళి ఫిర్యాదు పత్రంలో వివరాలు వ్రాసి ఇస్తే పాపం.. ఆ మేడం చాలా సేపు కంప్యూటర్లో ఏవేవో తెరచి చూసి, ఎవరికో ఫోన్ చేసి అడిగింది. రెండవ తేదీన ఆ ఏటియంలో ఎలాంటి డబ్బుల తేడా రాలేదన్నాడట! మరికొంచెం సేపు నెట్‍లో ఏవేవో వెదకి చివరికి "అంతా సరిగానే ఉంది. ఎక్కడా తేడా లేదు. మూడు, నాలుగు రోజుల తర్వాత రండి. చూద్దాం" అన్నారు. కాని ఆమె గొంతులో నిరాశ స్పష్టంగా తెలిసింది. ఏం చేయాలో తోచడం లేదు. నాకు అది చాలా పెద్ద మొత్తం! మనస్సులో తగ్గని అలజడి.
   *****
   కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  7. పూజ్యులు శ్రీ శంకరయ్య గారు:
   మీరు గాభరా పడకండి. ఇలాటి తికమకలు సామాన్యంగా జరుగుతూ ఉంటాయి. కొద్ది రోజులలో సవరణ జరుగవచ్చు. లేకపోయినచో చిట్టచివరి ప్రయత్నంగా RTI ప్రశ్న వేయ వచ్చును. క్రింద లింకును వాడవచ్చును:

   https://www.rtionline.gov.in/request/request.php

   తొలగించండి
  8. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

   మీరు కంగారు పడనవసరము లేదు. మీ A/c లో చూడండి ముందు.
   time out అని slip వచ్చియుంటే దాని copy తో complaint ఇవ్వండి. Customer No. కి కూడ complaint ఇవ్వండి.

   తొలగించండి
  9. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
  10. మాస్టరుగారూ! చింతించకండి...నాకూ ఒకసారి ఇలాగేజరిగింది...కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నాలుగు రోజులకు తిరిగి నా అక్కౌంట్ లో జమ అయ్యాయి.

   తొలగించండి
 13. బంధ పాశాల ద్రుంచగ బదరి యందు
  నవతరించెను విష్ణువు, భవుడవనిని
  గూడె కాశీ సుక్షేత్రాన కొలువు దీరి,
  బరగ నద్వైత గాంగ సంభావనా వ
  శంకరుఁ డవతరించి, దా శరథి యయ్యె!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శిష్ట్లా శర్మ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'సుక్షేత్రాన' అన్నపుడు 'సు' గురువై గణదోషం.

   తొలగించండి
  2. సవరణతో......

   బంధ పాశాల ద్రుంచగ బదరి యందు
   నవతరించెను విష్ణువు, భవుడవనిని
   గూడె వారణాశిని జేరి కొలువు దీరి,
   బరగ నద్వైత గాంగ సంభావనా వ
   శంకరుఁ డవతరించి, దా శరథి యయ్యె!

   తొలగించండి
 14. హింస రాజ్యము నేలగ హీన దైత్యు
  డతివలను బట్టె బంధించి యనుభవింప,
  దివికి వలెభువి, నీతి వర్ధిల్లు టకు వ
  శంకరుఁ డవతరించి దాశరథి యయ్యె

  నిన్నటి సమస్యకు నా పూరణ

  కర్తవ్య విముఖుల మనుచు
  ధూర్తునితో మైత్రి చేసి తొలఁగుఁడు; సుజనున్
  కీర్తించుచు ధర్మ నిరతి
  వర్తించుచు ధర్మజువలె బరగుట మేలౌ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. భాగవతుల కృష్ణారావు గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 15. ఆశలుదీర్చగాబ్రజకునాదిభవుండునుబార్వతీప్రియుం
  డీశుడుశంకరుండవతరించెను,రాముడుగాధరాస్ధలి
  న్నాశముజేయరాక్షసులనాకముభూమినిరక్షసేయగన్
  దాశరధిపేరనునికదాజనియించెనునేర్వుమాయిదిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది.
   నాల్గవ పాదం ప్రారంభంలో గణదోషం. సవరించండి.

   తొలగించండి
  2. ఆశలుదీర్చగాబ్రజకునాదిభవుండునుబార్వతీప్రియుం
   డీశుడుశంకరుండవతరించెను,రాముడుగాధరాస్ధలి
   న్నాశముజేయరాక్షసులనాకముభూమినిరక్షసేయగన్
   దాశరణీయగానిలకుదాశరధింగనుజన్మనొందెసూ

   తొలగించండి
 16. శైవ వైష్ణవ వాదుల శంక దీర్చి
  నూత్న మతముల నన్నింటి నుగ్గు జేసి
  సకల సిద్ధాంత సారమ్ము సంగ్రహించి
  శంకరు డవతరించి దా, శరధి యయ్యె!


  నదీనాం సాగరో గచ్ఛతి! యన్ని మతముల సారము అద్వైతమే గదా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుఱ్ఱం సీతాదేవి గారూ,
   వైవిధ్యంగా పూరించే ప్రయత్నం చేశారు. అభినందనలు.
   కాని 'దాశరథి'కి 'శరధి'కి తేడా (థ-ధ) ఉంది.

   తొలగించండి
 17. భూమి భారమ్ము తీరిచి కామితముల
  ప్రజలకునొసంగ నిచ్చతో భక్తజన వ
  శంకరుఁ డవతరించి దాశరథి యయ్యె
  నవనిజగ కలిమిచెలి తా నవతరించె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 18. ధరణి ధర్మమ్ము నెలకొల్ప దనుజులైన
  రావణాదుల హతమార్చ రవికులమున
  పద్మనాభుండు శ్రీహరి భక్తజనవ
  శంకరుడవతరించె దాశరథియయ్యె

  రిప్లయితొలగించండి
 19. ఈశువరమ్ములన్ బడసి హేయపు దైత్యులు ప్రజ్వరిల్లి యా
  కాశమె హద్దుగా చెలగి కాఱియ పెట్ట జనమ్మునిత్యమున్
  కేశవుడాలకించి భువి క్లేశములన్ హరియించు కోర్కెతో
  నీశుఁడు శంకరుం డవతరించెను రాముఁడుగా ధరాస్థలిన్

  రిప్లయితొలగించండి
 20. గురువర్యులు శ్రీ శంకరయ్య గారు:

  మేము చిన్నప్పుడు చదువుకున్న అన్ని వృత్తముల పాదములు గురువుల తోనే అంతమయ్యేవి. దీనికి కారణ మేమై యుండునో?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శాస్త్రి గారూ,
   సంస్కృత చ్ఛందశ్శాస్త్రంలో నాకంతగా ప్రవేశం లేదు. నా దగ్గర ఉన్న 'ఛందః పదకోశం'లో వెదికాను. ఆ వివరాలు తెలియలేదు. కొద్దిగా సమయ మివ్వండి. తెలిసికొని చెప్తాను.

   తొలగించండి

 21. పిన్నక నాగేశ్వరరావు.

  అసురు లాగడాలు పెరిగె యవని యందు

  కావుమనుచు ముని గణంబు కైమొగిడ్చి

  హరిని వేడ వరమొసంగి యార్తజన వ

  శంకరు డవతరించి దాశరథి యయ్యె.

  **********************************

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పిన్నక నాగేశ్వర రావు గారూ,
   బాగున్నది మీ పూరణ. అభినందనలు.
   వాట్సప్‍లో చెప్పినట్టు మొదటి పాదాన్ని "అసురు డాగడమ్ములఁ జేసి రవనియందు" అనండి.

   తొలగించండి
 22. శ్రీ కేంబాయి తిమ్మాజీరావు గారి పూరణ
  పాశుపతమ్మునిచ్చెను తపమ్మును సేయగ సవ్య సాచికిన్
  ఈశుడు|శంకరుండవత రించెను.రాముడిగా ధరాస్థలిన్
  నాశ మొనర్చిరావణు సనాతన ధర్మము,శాంతి నిల్ప|-,లో
  కేశుడు|శేషసాయి| కమలేశుడు|శ్రీహరివేడగన్సురుల్.

  రిప్లయితొలగించండి
 23. కింకరుల బాధ దీర్చెడి వంకచేత
  శంకరు డవతరించి|”దాశరథియయ్యె|
  రావణాసుర దర్పంబురయముజేయు
  దైవ లీలలుగమనించు?భావమొసగు|
  ఈశుని యాజ్ఞ లేక ,పరమేశ్వరి శక్తియు యుక్తి లేక ఆ
  దేశములేవి సాగవిల దీనుల గావగ రక్షణార్థమే
  ఈశుడు| శంకరుండవత రించెను|”రాముడిగా ధరాస్థలిన్
  దాసుల కోర్కె దీర్చుటకె|ధర్మము నిల్పగ దైవ లీలగా|

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కె. ఈశ్వరప్ప గారూ,
   మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మొదటి పూరణలో 'సవ్యసాచికిన్+ఈశుడు = సవ్యసాచికి నీశుడు' అవుతుంది.

   తొలగించండి
 24. శ్రీ కె౦బాయి తిమ్మాజీరావు గారి పూరణ
  పాశుపతమ్మునిచ్చెను తపమ్మును సేయగ సవ్య సాచికిన్
  ఈశుడుశంకరుండ,వతరించెను రాముడిగా ధరాస్థలిన్
  నాశ మొనర్చి రావణు, సనాతన ధర్మము,శాంతి నిల్ప|-,లో
  కేశుడు|శేషసాయి| కమలేశుడు|శ్రీహరి,వేడగన్ సురల్

  రిప్లయితొలగించండి
 25. ఆశలుదీర్చగాబ్రజకునాదిభవుండునుబార్వతీప్రియుం
  డీశుడుశంకరుండవతరించెను,రాముడుగాధరాస్ధలి
  న్నాశముజేయరాక్షసులనాకముభూమినిరక్షసేయగన్
  దాశరణీయగానిలకుదాశరధింగనుజన్మనొందెసూ

  రిప్లయితొలగించండి
 26. చింతబడకుడుమీడబ్బుచేరుమిమ్ము
  వ్యవధిపట్టునుదిరిగిరాయార్య!యదియ
  నాకుపట్టెనునొకసారినాల్గుపగలు
  జరుగుచుండునునిట్టివిజగమునందు

  రిప్లయితొలగించండి
 27. ౹దుష్ట సంహారము చేయ తోషమంది
  యవతరింతురు భువియందునమరు లెల్ల
  త్రిపురముల నేలు నసురుల తిగియనచట
  శంకరుడవతరించి..దాశరథియయ్యె
  హరియు దునుమాడ దైత్యుల నవని యందు.

  రిప్లయితొలగించండి
 28. ఆశలు దీర్చుచున్ ప్రజల హైదర బాదున గుంట్లు పూడ్చుచున్
  నాశము జేయుచున్ మశక నాథుల రాజ్యము జూబ్లిహిల్సులో
  కోశము నింపుచున్ మిగుల కూరిమి తోడను వోట్లకోసమై...
  ఈశుఁడు శంకరుం డవతరించెను రాముఁడుగా ధరాస్థలిన్

  రాముడు = కల్వకుంట్ల తారక రామారావు (Minister for Municipal Administration)

  రిప్లయితొలగించండి