10, ఫిబ్రవరి 2017, శుక్రవారం

సమస్య - 2279 (పితృవాక్పాలనమె...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..

"పితృవాక్పాలనమె సుతుని వృషలుం జేయున్"
లేదా...
"వర పితృవాక్య పాలనమె పాపులఁ జేయును పుత్రసంఘమున్"

78 కామెంట్‌లు:

 1. దురితము నంటగట్టు నతిదోష భయానక హేయ కార్య స
  త్వర పితృవాక్య పాలనమె పాపులఁజేయును పుత్రసంఘమున్--
  పరమ దయాంతరంగులగు పావనపితృ సువాక్య పాలనం
  బరయగ ముక్తిమార్గమగు నమృతతుల్యములట్టి వాగ్విధుల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రసాద రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వాఙ్నిధుల్' అంటే ఇంకా బాగుంటుందేమో?

   తొలగించండి
 2. రిప్లయిలు
  1. శతృవు హరియేర నిజముగ
   మిత్రులసురులని దెలియంగ మేలౌననుచున్ 
   పుత్రుప్రహ్లాదునికి దెలుపు
   పితృవాక్పాలనమె సుతుని వృషలుం జేయున్!

   తొలగించండి
  2. "ప్రయత్నము ప్రశంసనీయము" అనండి సార్!

   తొలగించండి
  3. సాధారణముగా కన్పించే యసాధారణ దుష్కర ప్రాస వచ్చిన దీ రోజు!

   తొలగించండి
  4. అతి తేలికయైన పద్ధతి యేమిటంటే నాలుగు పాదాలు "పితృ" తో ప్రారంభించుట! ఉదాహరణ:

   పితృ సంకాశులు లేరిల
   పితృ పాదమ్ములను శరణు వేడుము భక్తిన్
   పితృ గృహమునఁ జలుపనిచో
   పితృవాక్పాలనమె సుతుని వృషలుం జేయున్


   తొలగించండి
  5. ఇంకో విశేషమేమిటంటే త గుణింతములో ఏదైనా వాడవచ్చుప్రాసగా.

   తొలగించండి
  6. My mistake...sorry!:


   వట్రుసుడితో కూడిన హల్లులు (కృ,,,గృ,,,తృ,,పృ మృ)రేఫముతో కూడిన హల్లులు( క్రుమ్మురు ..క్రూరము,,,మొ) ఇవి సమానమైనఉచ్చారణ కలిగి ఉన్నవి,,ఉచ్చారణాలో సామ్యమున్నప్పటికి వ్రాయుటయందు భేదమున్నందున వీటి మద్య ప్రాస పొసగదు,,,


   https://www.google.co.in/url?sa=t&source=web&rct=j&url=http://kattupalliprasad.blogspot.com/2015/06/blog-post_25.html%3Fm%3D1&ved=0ahUKEwiEspGLhIXSAhXLvI8KHeyPB8UQFggcMAE&usg=AFQjCNG0xml9ZshEqRDS6j2KXXw0XSqiMA&sig2=FrgDwQIKPuquM4GtDo4Bpw

   తొలగించండి
  7. వాటికి యతి మైత్రి ఉంటుంది.
   ఋత్వసామ్యయతి:- ఋకారంతో కూడిన భిన్నహల్లులు పరస్పరం యతి చెల్లడం.

   తొలగించండి
  8. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ పూరణలో ప్రాస తప్పింది అనడంలో విప్రతిపత్తి ఏమీ లేదు. అది చెల్లదు.

   తొలగించండి


 3. పితృ మరీ యింత దుష్కరం గా ఉన్నా డేమిటండీ బాబు !:)


  పితృగణము లెడ వలయు భ
  క్తి, తృణత వలదైనను, విను కీడును జేయన్
  పితృడటు నుత్సాహముగొన,
  పితృవాక్పాలనమె సుతుని వృషలుం జేయున్


  సావేజిత
  జిలేబి

  రిప్లయితొలగించండి


 4. వరము జిలేబి యేది ? పరి వారము మేలుగ నన్, శుభంబులన్
  సరగున గాన జేయ వలె సాధ్యము నింటన నోర్మి గాంచుచున్
  వర పితృవాక్య పాలనమె; పాపులఁ జేయును పుత్రసంఘమున్
  గురువుల కీడు మాటలును గుచ్చెడి నాస్తిక వాద మెల్లెడన్ !

  సరసీ
  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   రెండవ పూరణ రెండవ పాదంలో 'గాన'కు అన్వయం?

   తొలగించండి
 5. పితృని పరిపాలనమున
  పితృని జవదాట కుండ పేరిమి తోడన్
  పితృని భక్తిగ కొలిచిన
  పితృవాక్పాలనమె సుతుని వృషలుం జేయన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్య గారు మంచి పద్ధతి నెన్నుకున్నారు. కానీ పితృ, మాతృ, భాతృ మొదలైన పదములు తత్సమములైనపుడు పితరుఁడు లేక పిత, మాత, భ్రాత లాగ మారుతాయి.
   అందుచేత పితృ తో మరియొక సంస్కృత పదముతో సమాసము చేసి వాడవలెను. ఉదాహరణకు:
   పితృపదములు, పితృకృప, పితృదయ, పితృసేవ, పితృభక్తి ఇత్యాదులు.

   తొలగించండి
  2. అక్కయ్యా,
   మీ ప్రయత్నం ప్రశంసనీయం.
   'పితృని' అనరాదు. 'పితరుని' సాధురూపం.
   పితృ అన్నపుడు 'పి' గురువు కాదు, లఘువే ఆ విధంగా మీ మూడుపాదాలలోను గణదోషం.

   తొలగించండి
  3. నమస్కారములు
   నాకు తెలియలేదు .కామేశ్వర రావుగారికి గురువు గారికీ ధన్య వాదములు

   తొలగించండి
 6. డా.పిట్టా సత్యనారాయణ
  శతృవన నెటనో యుండడు
  పితృవశమౌ దీన దశయు పేర్కొన యశమున్
  మితృడను భావము నెంచని
  పితృవాక్పాలనమె సుతుని వృషలుం జేయున్!
  ఒరవడి దండ్రి పండితుడు నోచిన యంతయె గల్గు పుత్రుకున్
  ధరనొక యోగ్యతాగరిమ దానను బెంపు వహింప నేర్పడే?!
  బరువడి నింజనీరవగ భావన బెంచిన బ్రజ్ఞ లేమినిన్
  వరపితృవాక్యపాలనమె పాపుల జేయును పుత్ర సంఘమున్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. పిట్టా సత్యనారాయణ గారూ,
   మీ మొదటి పూరణలో శత్రువు, మిత్రుడు శబ్దాలను శతృవు, మితృడు అని వ్రాశారు.
   మీ రెండవ పూరణ బాగున్నది. పుత్రునకున్ అనడం సాధువు. అక్కడ 'సూతికిన్' అనండి.

   తొలగించండి
 7. కితవులచెలిమియు, వేశ్యల
  జతగూడి యధర్మరతుల సహచర్యముతో
  బ్రతుకగ శాసించిన యా
  పితృవాక్పాలనము సుతుని వృషలుని జేయున్

  రిప్లయితొలగించండి
 8. చిదిమినపాల్గారు చెక్కుటద్దములపై, జిలిబిలి చిరునవ్వులొలయువాడు...ఈపద్యం ఏ గ్రంథమలోనిది? గ్రంథకర్త ఎవరు? తెలిసిన కవి మిత్రులెవరైనా తెలియజేయగలరు. మొత్తం పద్యం ఉంటే పోస్టు చేయగలరని ప్రార్ధన.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చంద్రశేఖర్ గారూ,
   ఇది పరిచితమైన పద్యపాదమే. కాని ఎంత ప్రయత్నించినా గుర్తుకు రాలేదు. గూగుల్‍లోనూ దొరకలేదు. సాధ్యమైనంత తొందరగా తెలుసుకొని చెప్తాను.

   తొలగించండి
  2. చిదిమిన పాల్గారు చేక్కుటద్దములపై జిలిబిలి (పద్యం) - మాధవపెద్ది - రచన: పానుగంటి

   చిత్రం: సంపూర్ణ రామాయణం 1972

   తొలగించండి
  3. చిదిమిన పాల్గరు చెక్కుటద్దముల పై -->(బిళహరి రాగం, అద్దంకి శ్రీరామమూర్తి)

   పాదుకా పట్టాభిషేకం (1945 సినిమా)

   తొలగించండి
  4. The full movie can be viewed or downloaded at the above site and you can listen to the padyam of Late Sri Panuganti Lakshmi Narasimha Rao
   ..

   తొలగించండి
 9. పితృ సద్వచన చయ మనో
  వితృప్త సంతప్త చిత్త వివశాత్మ కృతా
  వితృహీనునిం దృణీకృత
  పితృవాక్పాలనమె సుతుని వృషలుం జేయున్

  [అవితృప్తుడు = తృప్తి లేని వాడు; అవితృహీనుడు = రక్షకుడు లేని వాడు]


  నిరతము పూజనీయులు వినిర్మల మానస చిద్విలాసులుం
  బరము లభించు సత్యము దివౌకసు లిద్ధర ప్రేమ తోయధిం
  గరగుచుఁ దల్లి దండ్రులను గావగ నేరిన, విస్మరించినన్
  వర పితృవాక్య పాలనమె పాపులఁ జేయును పుత్రసంఘమున్

  రిప్లయితొలగించండి


 10. అతృణా దమ్ముల కడతే
  ర్చ, తృణజలూకంబుల యడచన విధృతిగనన్,
  పితృని పలుకుల చరించెడి
  పితృవాక్పాలనమె సుతుని వృషలుం జేయున్!

  రిప్లయితొలగించండి

 11. పిన్నక నాగేశ్వరరావు.

  సతతము హితమున్ గూర్చును

  పితృ వాక్పాలనమె ; సుతుని వృషలుం
  జేయున్
  పితరుల దుర్భాషలతో

  వెత నొందగజేసి గృహము వెడలన్ జేయన్.

  **********************************

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. వామ్మి :) యిదన్న మాట కిటుకు ! త తృ !

   చాలా బాగుందండీ పిన్నాక గారు

   చీర్స్
   జిలేబి

   తొలగించండి
  2. పిన్నక నాగేశ్వర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 12. శతృవు హరియేర నిజముగ
  నతనిని పొగడంగ రాదు నాకడ నెపుడున్
  సుతుడా! ప్రహ్లాద! యనెడి
  పితృవాక్పాలనమె సుతుని వృషలుం జేయున్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   'శత్రువు'ను 'శతృవు' అన్నారు. "హితదూరుడు హరి నిజముగ" అందామా?

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి, కామేశ్వర రావు గారికి, సహదేవుడి గారికి ధన్యవాదములు. 14 గంటలు తప్పులు తడకలు చేసి ప్రహ్లాదుని కాళ్ళు జలగలా పట్టుకొని గట్టెక్కితిని. కానీ చాలా విషయాలు తెలుసుకున్నాను. నమస్సులు.

   తొలగించండి


  3. ప్రహ్లాదుని దయ చేత
   న్నా హ్లాదము శాస్త్రివర్య ; నాడి గనిరిటన్ :)

   ज़िलेबी

   తొలగించండి
  4. దహ్లాకోరుని గూగుల్
   పహ్లావానునిగ నేను ప్రతిభాశాలిన్!

   __/\__

   తొలగించండి
  5. అన్నయ్యా!గూగుల్ శోధనలో నీ ప్రతిభ యనన్యము!
   🙏🙏🙏🙏🙏🙏

   తొలగించండి
 13. అతిమధురమైన ప్రేమను
  సతతమ్మునుజూపి పెంచ, స్వార్థము తోడన్
  సతిమాటలనువిని విడచు
  పితృవాక్పాలనమె సుతుని వృషలుం జేయున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 14. పితృదేవుని తృప్తి కొఱకు
  పితృూణమది దీర్చగాను పెండిలి యాడన్
  పితృభక్తి పణము గైకొన
  పితృవాక్పాలనమె సుతుని వృషలుం జేయున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పణము=ధనమని నా భావన! పణము తెలుగు పదము కానిచో ధనమని స్వీకరించ ప్రార్ధన!

   తొలగించండి
  2. గుఱ్ఱం సీతాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 15. పితృవరులు గూ ళులగు నెడ
  పితృ వాక్పాలనమె సుతుని వృ షభుo జేయున్
  పితృ వాక్పాలన మనునది
  పితృని దే బాధ్యతదియ వేంకట రమణా !

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   చివరిపాదంలో 'పితరునిదే' అనండి.

   తొలగించండి
 16. క్షితిపై ధర్మము నిల్ప న
  వతరించి యసురులఁ గూల్చి వనవాసమునన్
  హితమిడఁగ రఘుపతి, యెటుల
  పితృవాక్పాలనమె సుతుని వృషలుం జేయున్?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 17. పితరుని కోరిక దీర్చగ
  హతమొనరించియు రయమున యమ్మను మహిలో
  బ్రతికించ భార్గవు డెటుల
  పితృ వాక్పాలనమె సుతుని వృషలుం జేయున్!

  రిప్లయితొలగించండి
 18. పితరుని లలితపు టుదితము
  లతి నుతములు గణితము లరయగ నియతములున్
  వెతల విరతిఁ బతిత మయిన
  పితృవాక్పాలనమె సుతుని వృషలుం జేయున్

  రిప్లయితొలగించండి
 19. ప్రతిహతమౌ నరకమునకు
  పితృవాక్పాలనమె, సుతుని వృషలుంజేయున్
  సతిపలు కులువిని వృద్ధుల
  వెతలకు గురిచేయ వారు వేదన చెందన్


  నరకము తప్పిపోవునట నాకపు ద్వారముతీసి పిల్చునే
  నిరతము భక్తితోడ జననీ జనకుండ్రను గొల్చువారి స
  త్వర పితృవాక్యపాలనమె, పాపులజేయును పుత్రసంఘమున్
  భరమని సౌఖ్యకాముకులు వారిని యాశ్రమమందు చేర్చుటే.

  రిప్లయితొలగించండి
 20. సతతము చౌర్యము జేయుచు
  హితమెంచక తన కొమరుని యిమ్ముగ దనతో
  జత గూడమంచు గోరిన
  పితృ వాక్పాలనమె సుతుని వృషలుం జేయున్!

  రిప్లయితొలగించండి
 21. అతి మోదం బిడు పథమగు
  పితృవాక్పాలనమె; సుతుని వృషలున్ జేయున్
  హితమొసగు తల్లి దండ్రుల
  వ్యతిరిక్తిని తొలుగ వారి వార్ధక్యమునన్!

  రిప్లయితొలగించండి
 22. క్రొవ్విడి వెంకట రాజారావు:

  సుతికి ప్రజాతికి నిచ్చలు
  వెతలు బఱచి వితములేక వెలయాలులతో
  జతగట్టు దండ్రిదౌ యా
  పితృవాక్పాలనమె సుతుని వృషలుంజేయున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 23. అతృణత సుకృతఫల మొసగు
  పితృవాక్పాలనమె ; సుతుని వృషలుం జేయు
  న్నతృషితు, డయ్యును దుష్కృత
  ముతృణముననె జేయు వాడు మూర్ఖుడె యగుచో

  అతృణత = తృణ భావము లేక
  అతృషితుడు = ఇఛ్ఛలేని వాడు

  రిప్లయితొలగించండి
 24. అరయగసాధుశీలునిగనార్తులరక్షణజేయనిచ్చెడున్
  వరపితృవాక్యపాలనమె,పాపులజేయునుపుత్రసంఘమున్
  దురితముదానుజేయుచునుదోహదపర్చినమీదుమిక్కిలిన్
  బరమయుదాత్తుగైవడినిభారముదైవముపైనవేయుమా

  రిప్లయితొలగించండి
 25. .కరుణయులేని తండ్రియని కల్పన లందున బాల్యమందు యే
  మరచియుచిన్ని భారవి విమర్శలు జేయుచుసంచరించగా?
  వరపితృవాక్యపాలనమె “పాపులజేయును| పుత్ర సంఘమున్
  తరచువిమర్శజేయుటయె తండ్రిది తప్పనినెంచబూనుటే|

  రిప్లయితొలగించండి
 26. అరయగ విష్ణు నామమును హాయిగ పాడుచు త్రుళ్ళుచుంటివే!
  మరచుచు తండ్రి లాలన కుమారుడ నిన్నిక సైచలేనురా!
  సిరిగల వాడు నేనెగద చింతన జేయుము నాదు వాక్కనన్
  వర పితృవాక్య పాలనమె పాపులఁ జేయును పుత్రసంఘమున్

  రిప్లయితొలగించండి