15, ఫిబ్రవరి 2017, బుధవారం

సమస్య - 2283 (గద్వాల ప్రభవాగ్ని...)

కవి మిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....

"గద్వాల ప్రభవాగ్ని కాల్చెగద లంకాపట్టణంబున్ వడిన్"
లేదా...
"గద్వాలానలము గాల్చెగద లంక నయో"
ఈ సమస్యను అందించిన వైద్యం వేంకటేశ్వరాచార్యుల వారికి ధన్యవాదాలు.

42 కామెంట్‌లు:

 1. విద్వాంసులు నుడివిరిటుల
  "గద్వాల"యన హనుమాను "గద"యున్ "వాల";
  మ్మద్వైతమ్ముగ గూడిన
  గద్వాలానలము గాల్చెగద లంక నయో!
  "...పూడూరును చాళుక్యులు పరిపాలించగా, చాళుక్యులకు, పల్లవులకు మధ్య జరిగిన యుద్ధంలో పెదసోమభూపాలుడు గదను, వాలమును ప్రయోగించడము వలన ఈ కోటకు "గదవాల(గద్వాల)" అన పేరు వచ్చినదని చెబుతారు..."

  https://te.m.wikipedia.org/wiki/గద్వాల

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శాస్త్రి గారు నమస్సులు. గద్వాల అని ఒక పట్టణమని చేసిన పూరణ బాగానే ఉంది. కానీ సమస్య సమర్థనీయము గా సాధింప బడ లేదు.

   తొలగించండి
  2. కవివరులు విజ్ఞులు కామేశ్వర రావు గారు:

   చాలా రోజుల తరువాత మీ వ్యాఖ్యను చదివి చాలా సంతోషమైనది. గతంలో ఎన్నో విషయాలు మీ వద్ద నేర్చుకొనియుంటిని. ఇకపై కూడా మీరు నా పూరణలన్నిటినీ సమీక్షించ వలసినదిగా ప్రార్ధన. శంకరాభరణం నా దినచర్యగా మారినది. నేను నేర్చుకోలేక పోయినా ఆనందిస్తూ ఉంటాను. నమస్సులు.

   తొలగించండి


 2. విద్వన్మణీ! సభాభవ
  నాద్విలసిత ఢాంఢఢాంఢ నాదంబు హనూ
  మద్వాలప్రజ్వలనా
  గద్వాలానలము గాల్చెగద లంక నయో!

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. హనూమద్వాలమ్ముబోలుఘుమఘుమసమసమ్మిచ్చెబహుసంతసమ్ము!

   తొలగించండి

  2. హనూమద్వాలమ్ము బోలు సవరమ్మిచ్చె బహుసంతసమ్ము

   వృషభగతి రగడ :)

   చీర్స్
   జిలేబి

   తొలగించండి
  3. జిలేబి గారు నమస్సులు.
   సమాస సమీక్షణ సాహసోపేతమే.
   "సభాభవ నాద్విలసిత ఢాంఢఢాంఢ నాదంబు: పంచమీ తత్పురుషాలుక్సమాసము.
   భవనాత్ భవన పదమునకు పంచమీ విభక్తి. సాధారణముగా సమాసములు చేయునపుడు విభక్తిని వదలి చేస్తారు. అలాకాక విభక్తి సహితముగా చేసిన యది అలుక్సమాసము.
   భవనము నుండి లేక భవనము వలన అను అర్థమునకు తగిన పదములు వాడవలెను . వెడలిన లేక అడ్డుపడిన అను అర్థములు గల పదములు రావాలి. భవనాద్వినిర్గత, భవనాద్విసర్జిత, భవనాదాగత ఇత్యాదులు. విలసిత అని విశేషణము వాడారు.
   “ఢాంఢఢాంఢ” ధ్వన్యనుకరణ పదము కాబట్టి సమసింప వచ్చును.
   హనుమద్వాల సాధువు. “నూ” అని దీర్ఘముండదు.
   ప్రజ్వలనా గద్వాలానలము: ఆగత్ అని మీ యుద్దేశ్యమైతే ఆగతవాలానలము సాధువు. ప్రజ్వలనము అనుకుంటే “ప్రజ్వలన” సాధువు. “గద్వాల” పదమున కర్థము లేదు. (ఒక ఊరుగా కాకపోతే).
   ఇది నాకు తెలిసిన విషయము.

   తొలగించండి

  4. పోచిరాజు వారు

   నమో నమః అర్థమయిందని చెప్పడానికి సాహసించను :) అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను

   నెనరులు
   జిలేబి

   తొలగించండి
 3. అద్వంద్వారంభుఁడు శ్రీ
  మద్వాతాత్మజుఁ డసురులు మంటల నిడ సం
  గద్విపదాశంకా రం
  గద్వాలానలము గాల్చెఁ గద లంక నయో!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. అత్యద్భుతమైన పూరణ నందించితిరి. అభినందనలు.
   సంగత్, రంగత్ పదము లలోనే నాకు సందేహమున్నది. అవి “అ” కారాంత పదములు కదా. అనురంగత్ పదము కలదు. వివరించ గోర్తాను.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. రంగత్ నకు దృష్టాంతాము లభించినది.

   కనియెన్ గోపకుమారుఁడు రంగత్ఫుల్లరాజీవ కో
   కోనదోత్తుంగ... ... భాగ. 10. ఉ. 449

   తొలగించండి
 4. విద్వాంసులుసెప్పిరియిటు
  గద్వాలానలముననగఖడ్గముగదయున్
  విద్వత్తేజుడుకపితా
  గద్వాలానలముగాల్చెగదలంకనయో

  రిప్లయితొలగించండి
 5. కవి మిత్రులకు నమస్సులు.
  రేపు మా మేనల్లుని పెళ్ళి. నేటినుండి మూడు రోజుల పాటు వ్యస్తుడనై ఉంటాను. మీ పూరణలను సమీక్షించే అవకాశం లేదు. దయచేసి పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.

  రిప్లయితొలగించండి
 6. ఉద్వేగంబున రావణుండు ఘన కోపోద్రిక్త చిత్తంబునన్
  హృద్వేగుండు కపీశు వాలమును నంటింపన్ వరంబయ్యె శుం
  భద్వామామణి దర్శనద్యుతి సుసంభావ్యేద్ధ భీ మానురం
  గద్వాలప్రభవాగ్ని కాల్చెగద లంకాపట్టణంబున్ వడిన్

  [అనురంగత్+ వాలము = అనురంగద్వాలము: ప్రకాశించుచున్న తోక]


  తద్వాలముఁ గాల్చినఁ బర
  మోద్వేగి దశాననుండు మూర్ఖుండై శుం
  భద్వీరుడు కపివరుని జ
  గద్వాలానలము గాల్చెగద లంక నయో

  [జగత్ + వాలము = జగద్వాలము: తిరుగుచున్న తోక]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పూజ్యులు కామేశ్వరరావు గారు:

   సరదాగా ఒక రాయి వేసి చూశాను తగులుతుందేమో చూద్దామని. శుధ్ధ తప్పని అనుమానం. ఒక కన్ను వేసి తెలపండి సార్!

   తొలగించండి


  2. ఓ కన్ను వేసి తెలుపుడు
   మా కందంబమరెనో సమాసము సరియో !
   శ్రీ కామేశ్వర రావుల్
   మాకున్ తెలుపుదురుగాక మా విన్నతియౌ!

   జిలేబి

   తొలగించండి
  3. కొశ్చిను పేపరు టఫ్ఫుగా నుండుట వలన గ్రేసు మార్కులు వేయగోరెదను.

   తొలగించండి
  4. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
 7. -------------------------------------------------------------------------989679681 వైద్యంవేంకటేశ్వరాచార్యులు గారి పూరణ.....

  సద్వంశంబున బుట్టినందుకయినన్ సద్బుద్ధి జూపించు , నీ
  విద్వేషంబునుమాను, దాశరధినిన్ పృథ్వీసుతన్ గూర్చుమా!
  విద్వాంసుండవు రావణా!మరచితే! వీరాంజనేయాంగ రం
  గద్వాల ప్రభవాగ్ని కాల్చుగదె! లంకాపట్టణంబున్ వడిన్.
  (అంగదుడు రావణాసురునితో అన్నమాటలు)

  రిప్లయితొలగించండి
 8. సద్వాక్య ప్రతిపాద్య హృద్య వచనా సంపద్వరేణ్యుండు,భా
  స్వద్వాగీశ,సురేశ సన్నుతమహాశక్తిప్రభావుండు,హ
  న్మద్వాగ్వైభవు,మారుతిన్నవనిజా మాంగల్య రక్షార్ద్ధు,సం
  గద్వాల ప్రభవాగ్నికాల్తెగద లంకాపట్టణంబున్ వడిన్

  రిప్లయితొలగించండి
 9. అధ్వానమైన లంకకు
  విద్వాంసుండైన హనుమ వేగముఁ జని తా
  విధ్వంసముఁ జేయుచు రం
  గద్వాలానలము గాల్చెగద లంక నయో

  రిప్లయితొలగించండి
 10. అధ్వానమ్మగు లంకకేగి కరమౌనాప్యాయతన్ జూపుచున్
  సాధ్వీరత్నముసీతపైన, ధృతితో సాగించె నచ్చోట వే
  విధ్వంసమ్మును నాంజనేయుడుకడున్ భీభత్సుడై తాను రం
  గద్వాల ప్రభవాగ్ని కాల్చెగద లంకా పట్టణంబున్ వడిన్
  అధ్వానముః అమార్గము, దారిలేమి

  రిప్లయితొలగించండి
 11. సద్వచనమ్ముల రఘుకుల
  సాద్విని, జానకిని విడువఁ జాలక చెలఁగన్
  దద్విధి వశ హనుమ ధగ ధ
  గద్వాలానలము కాల్చె గద లంకనయో?

  రిప్లయితొలగించండి
 12. అద్వైతాద్భుత గ్రంధము
  విద్వాంసులు మెచ్చి గ్రంథ వివరణ నిడుచున్
  విద్వన్మణులని రెపుడో
  గద్వాలానలము గాల్చెగద లంక నయో

  రిప్లయితొలగించండి
 13. సద్వాదనతో చెప్పిన
  సద్వీరుని తోక కగ్ని శౌటీర్యముతో
  సద్వర్తన హీనుడిడగ
  గద్వాలానలము గాల్చెగద లంక నయో

  రిప్లయితొలగించండి
 14. ప్రద్విషు రాముని తరుపగ,
  తద్వానర దూత తోక దహియించంగన్
  విద్వేషముతో నుత్తుం
  గద్వాలానలము గాల్చె గద లంక నయో

  రిప్లయితొలగించండి
 15. ఉద్వేగమునన్ హనుమే
  తద్వారపులంకదాటి తడబాటందున్
  విద్వేషంబున విధిగా
  గద్వాలానలము గాల్చెగద లంక నయో|
  2.విద్వేషంబును మాని జానకిని సర్వేశాజ్ఞగా నెంచుచున్
  విద్వాంసుల్ నిను మెచ్చగావిడువ|ప్రావీణ్యంబు మీకబ్బు|లే
  కద్వాన్నంబగు, ఆంజనేయుడట వీరావేశమున్ దావాగ్నిరం
  గద్వాల ప్రభావాగ్ని కాల్చెగద|లంకా పట్టణంబున్ వడిన్.

  రిప్లయితొలగించండి
 16. మిత్రులందఱకు నమస్సులు!

  ఉద్వేగోర్జితరో్షబోధితవిగర్వోక్తిన్నిశాటేశుఁడే
  "మద్వైరిప్రతిహస్తకుండిటులరాన్ మ్రందింప వాలాగ్రవేల్లత్సుసం
  విద్వస్త్రమ్ములఁ గాల్చుఁడో" యనఁ బరిప్రేష్యుల్ దదుక్తింజనన్
  దద్వాతాత్మజుఁడల్గి, యెక్కొలుప, సందహ్యార్పితోచ్ఛక్త రం
  గ ద్వాలప్రభవాగ్ని కాల్చెఁగద లంకా పట్టణంబున్ వడిన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సవరణతో...

   ఉద్వేగోర్జితరోషబోధితవిగర్వోక్తిన్నిశాటేశుఁడే
   "మద్వైరిప్రతిహస్తకుండిటులరాన్ మ్రందింప వాలాగ్రసం
   విద్వస్త్రమ్ములఁ గాల్చుఁడో" యనఁ బరిప్రేష్యుల్ దదుక్తింజనన్
   దద్వాతాత్మజుఁడల్గి, యెక్కొలుప, సందహ్యార్పితోచ్ఛక్త రం
   గ ద్వాలప్రభవాగ్ని కాల్చెఁగద లంకా పట్టణంబున్ వడిన్!

   తొలగించండి
  2. మఱొక్క చిన్న సవరణతో...

   ఉద్వేగోర్జితరోషబోధితవిగర్వోక్తిన్నిశాటేశుఁడే
   "మద్వైరిప్రతిహస్తకుం డితనినిన్ మ్రందింప వాలాగ్రసం
   విద్వస్త్రమ్ములఁ గాల్చుఁడో" యనఁ బరిప్రేష్యుల్ దదుక్తింజనన్
   దద్వాతాత్మజుఁడల్గి, యెక్కొలుప, సందహ్యార్పితోచ్ఛక్త రం
   గ ద్వాలప్రభవాగ్ని కాల్చెఁ గద లంకా పట్టణంబున్ వడిన్!

   తొలగించండి
  3. మఱొక్క చిన్న సవరణతో...

   ఉద్వేగోర్జితరోషబోధితవిగర్వోక్తిన్నిశాటేశుఁడే
   "మద్వైరిప్రతిహస్తకుం డితనినిన్ మ్రందింప వాలాగ్రసం
   విద్వస్త్రమ్ములఁ గాల్చుఁడో" యనఁ బరిప్రేష్యుల్ దదుక్తింజనన్
   దద్వాతాత్మజుఁడల్గి, యెక్కొలుప, సందహ్యార్పితోచ్ఛక్త రం
   గ ద్వాలప్రభవాగ్ని కాల్చెఁ గద లంకా పట్టణంబున్ వడిన్!

   తొలగించండి
 17. క్రొవ్విడి వెంకట రాజారావు:

  సద్వాక్కుల విడబుచ్చుచు
  నుద్వేగుండౌ దశాననుని భంగించన్
  విద్వత్తేజుడు నానిలి
  గద్వాలానలము గాల్చెగద లంక నయో

  రిప్లయితొలగించండి
 18. డా.పిట్టా సత్యనారాయణ
  తద్ద్వౌజిహ్వల బాసలు
  విద్వద్వచనంబులనుచు విడ్వడగను నాం
  ధ్రాద్వారము జూపగ మా
  గద్వాలలనమ్ము గాల్చెగద లంక నయో!

  ఈద్వారంబిటులేగ నెన్నికల మీ కిప్పింతు బంగారపున్
  విద్వత్తుం బని వైద్యసాయమనుచున్ వేవేగ నమ్మించి యీ
  షద్వీకన్ గని వోట్లు దండుకొను వాక్చాతుర్యమే గ్రాల మా
  గద్వాల ప్రభవాగ్ని కాల్చెగద లంకా పట్టణంబున్ వడిన్

  రిప్లయితొలగించండి
 19. డా.పిట్టా నుండి
  మొదటి పూరణములో"గద్వాలానలము"గా చదువగలరు.
  గద్వాల తెలంగాణకు ప్రతీకగా నా పూరణలు సాగినవి.ఒక చిన్న చోట చెలరేగిన జ్వాల లంకా పట్టణాణ్ణి సైతం కాల్చడం విశేషం.

  రిప్లయితొలగించండి
 20. విధ్వంసము సృష్టింపగ
  నుద్వేగిల్లిన యసురులు యుద్దాముడు శ్రీ
  మద్వాతాత్మజు గాల్చ జ
  గద్వాలానలము గల్చెగదలంక నయో!

  సద్వృత్తంచు దలంచి రామసతియౌ సాధ్వీమణిన్ తెస్తివో
  విద్వాంసుండవు రావణా మరచినావే ధర్మమున్నంచు శ్రీ
  మద్వాతాత్మజుడాసభన్ బలుకె క్షేమంగోరుచున్ చెప్పగ
  న్నుద్వేగమ్మున తోకగాల్చమనితానుత్తర్వు లివ్వన్ ప్లవం
  గద్వాల ప్రభవాగ్ని కాల్చెగద లంకాపట్టణంబున్ వడిన్

  రిప్లయితొలగించండి
 21. సందిత బెంగుళూరు

  గద్వాలవైద్య పండితు
  డుద్వాసనపలికెపూరణోత్సుకతకహో
  విద్వాంసులగుండెలదర
  *గద్వాలానలము గాల్చెఁ గద లంక నయో!*

  (గద్వాల విద్యార్థి వెంకటేశ్వరులపండితులు అర్థాలంకార శబ్దాలంకారాలతో అలంకరణ మైన కవుల హృదయాలనే లంక లను మండించారు అయినా అది ఆయన జన్మభూమి కావున స్వర్గాదపి గరీ యసీ ఆయనకు సులభం మనకు సంరంభం🙏🙏🙏🙏🙏

  రిప్లయితొలగించండి