23, ఫిబ్రవరి 2017, గురువారం

సమస్య - 2291 (బీరతీఁగకుఁ గాచెను...)

కవి మిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
.
"బీరతీఁగకుఁ గాచెను బెండకాయ" 
లేదా...
"బీరతీఁగకుఁ గాచె మెండుగ బెండకాయలు చూడుమా"

98 కామెంట్‌లు:

  1. మేత గాడిద కొసగుచు మేలు మేలు,
    గోవు బితుకగ నిచ్చునె లావు పాలు?
    నీరు వోయగ నేరీతి నిండు గాను
    బీరతీఁగకుఁ; గాచెను బెండకాయ?



    లావు = అధికము

    రిప్లయితొలగించండి
  2. ఆకు నాకున చూడుమా రేకు విప్పి
    తోట వికసించె పచ్చగా, దోస మరియు
    బీర తీఁగకుఁగాచెను- బెండకాయ
    లెండి పోయను చిత్రమై, పండుగెట్లు?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రసాద రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      పోయను - పోయెను..

      తొలగించండి
  3. వింత యుగమిది జగతికి సొంత మవగ
    మాయ మంత్రము లెన్నియొ మహిమ లంట
    అణువు నణువుకు దెలుసట యవని కెపుడు
    బీర తీఁగకుఁ గాచెను బెండ కాయ

    రిప్లయితొలగించండి
  4. సమస్య
    బీరతీగకుఁగాచె మెండుగ బెండకాయలు చూడుమా
    పూరణ
    బీరతీగకుఁగాచె మెండుగ, బెండకాయలు చూడుమా
    ఎండిపోయెను--విత్తనంబుల కేను తెచ్చితి నప్పులన్
    ఏది నాకిక దిక్కటంచు ననేక రీతుల క్రుంగి, రై
    తన్న యేడ్చెను గోడుగోడున- ధాత చేత లవేమిటో!

    రిప్లయితొలగించండి


  5. సాఫ్టు వేరున కమరకోశమును జేర్చి
    యోర కల్లు యెస్క్యూయెలు కొర్రి వేసి
    తేట గీతిని పద్యము తెలుపు మనగ
    బీరతీఁగకుఁ గాచెను బెండకాయ !

    సావేజిత
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది.
      రెండవ పాదంలో యతి తప్పింది. సవరించండి.

      తొలగించండి
  6. బీరతీగకుఁగాచె మెండుగ బెండకాయలు చూడుమా - ఏ వృత్తమవుతుందండీ!

    రిప్లయితొలగించండి
  7. బీరతీగకుఁగాచె మెండుగ బెండకాయలు చూడుమా - ఏ వృత్తమవుతుందండీ!

    రిప్లయితొలగించండి
  8. చింత చెట్టుకు గనగ చేమంతి బూయు
    నేలమునగకు వేతురు నిచ్చెనలను
    బీర తీగకు గాచెను బెండ కాయ
    కలి యుగమ్మున వింతలు గలవు కొన్ని!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శిష్ట్లా శర్మ గారూ,
      కలియుగ వింతలతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  9. డా.పిట్టా సత్యనారాయణ
    ఆడ మగ యని గుర్తించ నలవికాని
    డ్యూటిచందు క్రీడలమేటి యోని నాడ(యోనిన్-ఆడ)
    చాలగను తనుమగనను సత్యముగను
    బీర తీగకు గాచెను బెండకాయ!

    రిప్లయితొలగించండి
  10. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !


    శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వచించిన కాలఙ్ఞానం :

    01)
    ____________________________

    బీరతీగకు గాచె మెండుగ - బెండకాయలు చూడుమా
    పాఱునీటిని వెల్గు దీపము - భావి యందున తథ్యమే
    క్రూరులందరు మంత్రులౌదురు - కోరి రొక్కము బొక్కగన్
    వీరబెమ్మము చెప్పె నెన్నడొ - వింత కాలపు పోకడల్
    ____________________________

    02)
    ____________________________

    వేరు వేరుగ నుండు వారలె - వీరె నేడగు సోదరుల్
    వారకాంతలు నేడు చూడగ - పాడు మంగళ హారతుల్
    వీరులౌదురు వింతవింతగ - భీరు లందరు నిక్కువమ్
    సూరుడుండడు మంత్రులుందురు - చూడ నేలగ రాజ్యమున్
    వీరబెమ్మము చెప్పె నెన్నడొ - వింత కాలపు పోకడల్
    ____________________________
    సూరుడు = రాజు

    03)
    ____________________________

    సారె సారెకు మల్లె పందిరి - సన్న జాజుల బూయురా
    పారిపోదురు పుణ్యమూర్తులు - పాపమంతట హెచ్చగన్
    చేరుకొందురు కొండ గుట్టల - చేతలేమియొ తెల్వకన్
    వీరబెమ్మము చెప్పె నెన్నడొ - వింత కాలపు పోకడల్
    ____________________________

    04)
    ____________________________

    చుండమందున గాచు కాయలు - చూత సంతతి నిశ్చయమ్
    రండలౌదురు మంత్రి వర్యులు - రాజ పీఠము నెక్కగన్
    ముండలందరు తారలౌదురు - మొక్కుటన్ జన మబ్బరమ్
    శుండకుండులు రాజ్యమేలును - చూరపుచ్చిన సొత్తులన్
    ____________________________
    చుండము = చింతచెట్టు
    చూతము = మామిడి
    రండ = విధవ
    ముండ = వేశ్య
    అబ్బరము = మిక్కుటము
    శుండఁకుడు = మద్యముఅమ్మువాడు
    చూఱపుచ్చు = కొల్లగొట్టు

    05)
    ____________________________

    కృష్ణవార్ధియె ముంచు కీలము - క్షేమ నత్తును తాకగా
    విష్ణుభక్తులు చేపలమ్మెడి - వృత్తి జేతురు భుక్తికై
    జిష్ణువైనను నాపలేడులె - చిద్విలాసుని చింతలన్
    విష్ణురూపుడు వీరబెమ్మము - వింతలెన్నడొ జెప్పెరా
    ____________________________
    క్షేమ = పార్వతి, దుర్గ
    కీలము = ఇంద్రకీలపర్వతము
    జిష్ణువు = ఇంద్రుఁడు

    06)
    ____________________________

    పంది పొట్టను పుట్టు సింధువు - పాపమంతట రేగుటన్
    నంది లేచియె రంకె వేయును - నాకమే విని భీతిలన్
    వందిమాగధు లందరొక్కటి -ప్రస్తుతింతురు పాపులన్
    సింధువంతయు భూమి మీదకు - సిద్ధమౌ మరి పొంగగాన్
    ____________________________
    సింధువు = ఏనుఁగు;సముద్రము;

    07)
    ____________________________

    బోరనెత్తుక దుండగీడులు - భూమి పందిరిపెట్టినన్
    ఘోరపాలన పెచ్చరిల్లగ - ఘోషనే ప్రజ పెట్టగన్
    క్రూరులందరు కూడినంతట - క్షోణి రక్షణ సేయగన్
    వీరభోగ వసంతరాయల - పేరునే నిట కొచ్చెదన్
    ____________________________
    పందిరిపెట్టు = ఆక్రమించు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వసంత కిశోర్ గారూ,
      సమస్యా పూరణ వ్యాజంతో బ్రహ్మం గారి కాలజ్ఞానాన్ని చక్కని పద్యాలలో వివరించారు. అభినందనలు.
      నేను సూచించిన వాట్సప్ సవరణలను గమనించారు కదా!

      తొలగించండి
  11. డా.పిట్టా సత్యనారాయణ
    "ఓరి!చిత్రము వంగడంబిది కోరి పొట్టిగనుండురా
    చేరెనిచ్చట బీరతీగను చిన్నికాయలు బెండలే!
    కోరియో మరి కోరకో యివి గూర్చుకున్నవి బంధమున్
    బీర తీగకు గాచె మెండుగ బెండకాయలు చూడుమా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిట్టా వారూ,
      మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. డా.పిట్టా
      ఆర్యా,ఆద్యంతము సామాజిక సమస్యా పూరణమునకై ప్రయత్నం చేస్తున్నాను.మీ మన్నన కు నాకృతజ్ఞతలు

      తొలగించండి
  12. డా.పిట్టా
    "వంగడంబిదిరోరి"గా చదువగలరు..మొదటిపాదములో,ఆర్యా

    రిప్లయితొలగించండి


  13. సేరిగాడిటువచ్చు తీరుగ సేద్యముల్గన రయ్యనన్,
    దోరగించి శుభాంగి చూడక దోచుకొమ్మ జిలేబి, నే
    డే రసమ్ము లతాంగి గాంచెను రెండుకాయల కూడికై
    బీరతీగకుఁగాచె మెండుగ బెండకాయలు చూడుమా !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  14. చింత చెట్టుకు గనగ చేమంతి బూయు
    నేలమునగకు వేతురు నిచ్చెనలను
    బీర తీగకు గాచెను బెండ కాయ
    కలి యుగమ్మున వింతలు గలవు కొన్ని!

    రిప్లయితొలగించండి
  15. సారవంతపు భూమిపై సరసమ్ముగా పెరుగంగనా
    కూరలన్ కనువిందు జేసిన కోసివండగ వింతయౌ
    బీరతీఁగకుఁ గాచె మెండుగ బెండకాయలు చూడుమా
    మారిపో యెనెకా లమింతగ మాయజాలపు లోకమై

    రిప్లయితొలగించండి
  16. మత్తకోకిల కోసము మొదటిసారిగా ప్రయత్నము చేస్తున్నాను గానీ పద్యము అంత బాగా రావటములేదు. తప్పులను దయచేసి సవరించండి.

    సారమైన పొలమ్ములో వ్యవసాయదారులు చక్కగా
    పైరు జేయగ పాదులన్నియు పాకె మొక్కల పైకి యా
    తీరు కాయలు మత్రమే మరి తిగలే కనిపించగా
    బీరతీఁగకుఁ గాచె మెండుగ బెండకాయలు చూడుమా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నేమాని రామకృష్ణ గారూ,
      మీ మొదటి ప్రయత్నంలో విజయం సాధించారు. పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  17. కలి యుగంబిది వింతలు కలిగె ననుట
    సహజమే గద యిందేల సందియంబు
    దోమ కుత్తుక దూరెను సామజంబు
    బీర తీగకు గాచెను బెండకాయ.

    నేర మించుక కాదు మిత్రమ! నీ వసత్యము బల్కినన్
    కారణం బిది కాల ధర్మము గాన రమ్మిదె యిచ్చటన్
    కూరగాయల తోటలోపల గున్న మామిడి చెట్టునన్
    బీరతీగకు గాచె మెండుగ బెండకాయలు చూడుమా.
    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి


  18. కంది వారికి, గుండు మధుసూధన్ వారికి చీర్సు సహిత !



    గురువుల్ చెంత నుండ పొత్తము లేల ? అంకోలంబు లేల !

    మెత్తగానిట మెత్తగానిట మేలురీతిని గాంచితీ !
    పొత్తమేలర పొద్దుగూకుల పొత్తుగానుర మంచిదీ !
    చిత్తరీతిని రాయరాయగ చేర్పుగూర్తురు కోవిదుల్ !
    మత్తకోకిల మత్తకోకిల మత్తకోకిలయే సుమా



    జిలేబి
    (మా మాత, సరస్వతీ వాలు, నన్ను మలింత తెలుగు నేల్చుకొనుటకు మీ శంకలాభలనము కొలువుకి నన్ను పంపినాలు :))





    చీర్స్
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ...
      బాగుంది పద్యం... 'గాంచితిన్... మంచిదే' అనండి.
      కుండలీకరణంలోని వాక్యాన్ని మీ రాంపడు వ్రాసాడా?

      తొలగించండి
    2. జిలేబీ గారు:

      ఉచిత సలహా!

      మిమ్మల్ని మీరు మరచిపోవాలనుకుంటే "శంకరాభరణం వ్హాట్సప్ సమూహం"లో చేరండి..

      తొలగించండి

    3. వ్హాట్సప్ అన గా నేమి ?


      జిలేబి

      తొలగించండి

    4. వాత్సాయనుడు జిలేబీ
      వాత్సాపై వచ్చెనోయి " వాగేశ్వరు" లా
      దిత్సుల దీర్చన్, వలదే
      వత్సల! మనకసలు వలదు వాత్సాపు సుమా !

      జిలేబి

      తొలగించండి
  19. బుల్లిపిందెలువచ్చెనుభువన!చూడు
    బీరతీగకు,గాచెనుబెండకాయ
    పెరటిలోపలమొలిచినబెండమొక్క
    కాపుకాయుటమొదలిడెనేపుగాను

    రిప్లయితొలగించండి
  20. ఇంటి తోట పెరిగె మొక్క లింపుగాను
    బీర తీగయె యెగబ్రాక బెండ మొక్క
    బాలుడొకడు దానిని గని పలికె గదర !
    "బీరతీఁగకుఁ గాచెను బెండకాయ"

    రిప్లయితొలగించండి
  21. ఇంటి తోటను కూరగాయల నింపుమీరగ బెంచితిన్
    బీర తీగయె ప్రేమ మీరగ బెండ చెట్టుకు నల్లగా
    బాలుడొక్కడు గాంచి దానిని పల్కెగా ముదమారగన్
    "బీరతీఁగకుఁ గాచె మెండుగ బెండకాయలు చూడుమా"

    రిప్లయితొలగించండి
  22. పోషక విలువలను బెంచు స్ఫూర్తి తోడ
    సంకరము జేయ నేర్చిరి సాగు లోన
    జన్యు శాస్త్రమే నూతన జన్మ మందె!
    బీర తీగకు గాచెను బెండ కాయ!

    రిప్లయితొలగించండి
  23. చూసి ' మాయాబజారు' ను శుంఠ యొకడు
    కోరి బారెడు బీరను, బోరు ప్రక్క
    బెండ విత్తును నాటెను దండిగాను
    బీరతీఁగకుఁ గాచెను బెండకాయ

    సారవంతపు భూమి కాదని సాగు చేయక వీడగా
    నూరనూర సిమెంటు మేడలె యుద్భవించెను వింతగా
    వీర యత్నమొనర్చి బెండను బీర విత్తని నాటగా
    బీరతీఁగకుఁ గాచె మెండుగ బెండకాయలు చూడుమా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాగవతుల కృష్ణారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  24. పెరటి మొక్కల తీరును పెరుగుదలను
    చూచి వచ్చిన భర్తకు సుదతి తెలిపె
    పొట్ల మొగ్గ తొడిగె నండి, పురుగు పట్టె
    బీర తీగకు, కాచెను బెండకాయ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  25. చూడు నేటి రైతుల తీరు తోడు లేక
    మాడు బ్రతుకులు దైవము రాడు వేడ
    వేల కొలది వ్యయము జేసి పెట్టె కాపు
    బీరతీఁగకుఁ, గాచెను బెండకాయ

    [కాచెను+పెండ; పెండ = పేడ; పెండకాయ = వ్యర్థపు కాయ (పుచ్చిన బీరకాయ)]


    వీర మొప్పగ దైత్య వైరిని వెఱ్ఱి వానిగఁ దల్చుచుం
    జేరగన్నభ మందుఁ జంద్రుని చిత్ర రీతిని మంగళు
    న్నారయన్నిల శాస్త్ర వేత్త ల యద్భుతమ్ములు శోధనల్
    బీరతీఁగకుఁ గాచె మెండుగ బెండకాయలు చూడుమా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వర గోపుచ్ఛము సింహికాత్త నిజ తత్వం బెంచి సంరంభియై
      విరివిం జేసెను వేగఁ గాయమును బ్రావృట్కాల మేఘక్రియన్
      గురు దేహుండు కపీంద్రుఁ గాంచి జనితాక్రోశంబునన్ వక్త్రముం
      ద్వరమా నోగ్ర విరూప పెంచె వడి పాతాలాంత రాభమ్ముగన్

      తొలగించండి
    2. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు (అందులో మొదటిది వైవిధ్యంగా) ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
      మూడవ పద్యం సందర్భం?

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
      అది నా శ్రీమదాంధ్ర సుందర కాండ లోనిది. యీ రోజు దైవ ప్రస్తావన వచ్చింది కదా. మీరు చూస్తారని వేసాను.

      తొలగించండి
    4. సుందరమైన పద్యం. 'ఉగ్రవిరూప పెంచె'... దీని అన్వయం అర్థం కాలేదు.

      తొలగించండి
    5. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు.
      త్వరమానము, ఉగ్రము, యైన విరూపి సింహిక యని నా భావము. ముందు విరూపి యని వ్రాసితిని.
      విరూప పుం నపుంసములలో “అ”కారాంతము. స్త్రీలింగములో “ఆ”కారాంతము. తత్సమయినపుడు “విరూప”
      అని యట్లు మార్చితిని. సాధువేనా తెలుప గోర్తాను.

      తొలగించండి
  26. బీర బెండ పాదుల నాట పెరటిలోన
    బెండ కాయలు కాసెను దండిగాను
    బీరతీగెలు కప్పగా బెండచెట్టుఁ
    జూచి బాలకుడొకడనె చోద్యముగను
    “బీర తీగకు గాచెను బెండకాయ”

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  27. బీర బెండల విత్తులు వేయునపుడు
    కలసి పోవగ నేలలో తెలియకుండ
    చూడగానవి బెరుగగ చోద్యముగను
    బీరతీగకు గాచెను బెండకాయ
    జరిగె నిటులనె నిజముగ జగతి లోన
    కాకరకు గాచెనట బీర కాయలంట!!!


    మల్లె తీగకు బూచె చేమంతి పూలు
    పందికిన్ బుట్టె జక్కని పాడి యావు
    బీర తీగకు గాచెను బెండకాయ
    కనని వింతలు జరిగెడు కలిని గనరె!!!

    రిప్లయితొలగించండి
  28. బీర బెండల విత్తనమ్ములు వేరువేరుగ నాటినన్
    చేరువయ్యిన తీరుమారుచు చేవచూపును నొక్కటై
    బీరతీగకు గాచె మెండుగ బెండకాయలు చూడుమా
    సారెసారెకు నిట్లు చేసిన సంకరంబగు జాతియే!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'అయ్యిన'..? 'చేరువైననె' అనండి.

      తొలగించండి
  29. కూరగాయల పాదులన్నియుకోరినాటి స్వయమ్ముగా
    నీరుఁబోయుచు ప్రోదిచేసెనునిష్ఠతోడుత భార్యతా,
    చీరిభర్తను “పంది రొక్కటి చిన్నదైనను వేయు మా
    బీరతీగకు, గాచె మెండుగ బెండకాయలు చూడుమా!
    కూరవండెద కొన్నికాయలకోసితెమ్మిక శీఘ్రమే’”

    రిప్లయితొలగించండి
  30. బీర కన్నియ కౌగిలి బెండ చిక్క
    బెండ ప్రేమించి పెండ్లాడ బీరనంత
    కలి యుగమ్మున బీజ సంకర్షణమున
    బీరతీగకు కాచెను బెండ కాయ.

    రిప్లయితొలగించండి
  31. ఆంగ్ల విద్దెలో పట్టాలు మెండుగాను
    పొంది మతివీగు స్థితినింక పొందినోడు
    తెనుగు పొదరింట కాలెట్ట తికమకయ్యి
    బీరతీఁగకుఁ గాచెను బెండకాయ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మద్దూరి ఆదిత్య గారూ,
      మీ పూరణ బాగుంది.
      మొదటి పాదంలో యతి తప్పింది. 'పట్టాల నధికముగను' అనండి. 'పొందినోడు, కాలెట్ట' అనడం వ్యావహారికం. 'పొందు నరుడు... కాల్బెట్ట' అనండి.

      తొలగించండి
    2. I have used the tool
      http://chandam.apphb.com/?chandam
      modati padam Yati correct ani chupinchindi :-( andi
      I will correct these mistakes _/\_
      'పొందినోడు, కాలెట్ట' అనడం వ్యావహారికం. '
      పొందు నరుడు... కాల్బెట్ట' అనండి.

      తొలగించండి
  32. బీర పాదున తీగ ప్రాకుచు బెండ మొక్కల జేరగా
    బీర కన్నుల కన్య చుట్టెను బెండ మొక్కల కౌగిలిన్
    చేరి బెండకు కాయ లేర్పడ చెప్పిరెల్లరు చిత్రమౌ
    బీర తీగకు కాచె మెండుగ బెండ కాయలు చూడుమా

    రిప్లయితొలగించండి
  33. పిలిచె రెడ్డయ్య పందిరి వేయమంచు
    బీరతీగకు, కాచెను బెండకాయ
    లచట మూరడేసిపొడుగు నబ్బురముగ
    ఫలిత మదియెసంకరజాతి వంగడమ్ము.

    చేరబిల్చెను కూలివాడిని సేద్యగాడొక రోజునన్
    కోరెనాతని పందిరొక్కటి కూర్చమంటును తోటలో
    బీరతీగకు, గాచెమెండుగ బెండకాయలు చూడుమా
    భూరిలావున మూరడంతగ భూమియందున వింతగా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'కూర్చమంచును' అనండి.

      తొలగించండి
  34. బీరతీగకుగాచెమెండుగబెండకాయలుచూడుమా
    బీరతీగకుగాచెనాయటబెండకాయలు?సామి!యీ
    దారుణమ్మునుజూడగావలెధారుణీతలమందునన్
    మీరలందరిరాకగోరుచుమేమువేతుమురండిసూ

    రిప్లయితొలగించండి
  35. రెండు నెలలకే కాయలు నిండుగాను

    బీర తీఁగకుఁ గాచెను, బెండకాయ

    చెట్టు కింకను పిందెలు పుట్టలేదు

    కాల పరిమితి కావలె గాపుకైన

    రిప్లయితొలగించండి
  36. వేఱు వేఱుగ పోషకమ్మగు విత్తనాలను కూర్చగన్
    కోరి సంకర సాగు తోడుత కూట్లు నింపగ నేర్చిరే!
    నేరమౌ నెటు , జన్యు శాస్త్రపు నీతియే నిది నేడిలన్
    బీర తీగకు గాచె మెండుగ బెండ కాయలు చూడుమా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీధర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కోట్లు..కూట్లు...?

      తొలగించండి
  37. బీర బెండ విత్తనములు సార వంత
    మైన భూమిలో కలిపి నాటేనుగాన
    బీరతీఁగకుఁ గాచెను బెండకాయ
    అబ్బురపరచెగావున ఆదరాన

    రిప్లయితొలగించండి
  38. క్రొవ్విడి వెంకట రాజారావు:

    పెరడు లోని బీర లతిక పెంపు నొంది
    ప్రాపుకై బెండ మొక్కపై ప్రాకి దాని
    కసురు నంటి యుంటను చూచు గతిని తట్టె
    బీర తీగకు కాచెను బెండకాయ

    రిప్లయితొలగించండి
  39. వ్హాట్సప్ పూరణలు:


    రోజు తిట్టుచు తెగడుచు భాజపాను
    మోడి నడుగగ నివ్వడె మొట్టి కాయ?
    నీరు వోయగ నేరీతి నిండు గాను 
    బీరతీఁగకుఁ; గాచెను బెండకాయ?


    *************************


    ఝాన్సీ రాణి లక్ష్మీబాయి సుతుడు:

    https://en.m.wikipedia.org/wiki/Rani_of_Jhansi



    నోరు దెరచిన పలుకును బోరు వాక్కు
    తీరు తెన్నులు తెలియక మీరు హద్దు
    వీర మాతకు జన్మించె వెఱ్ఱి సుతుడు
    బీరతీఁగకుఁ గాచెను బెండకాయ!

    రిప్లయితొలగించండి
  40. గురువు గారికి నమస్కారములు.
    1.‘కూటు’ అనే ప్రయోగించాను. కూటు అంటే ధాన్యాన్ని నిలువ యుంచుకునే గిడ్డంగిగా మా చిన్న తనంలో ఈ పదం వాడే వారము. "కూట్లో వడ్లు నింపే వారము".
    2.సంకర సాగు అనేది సరియగునో కాదో అని సందేహిస్తూ ఈ సమాసాన్ని సవరించాను, దయ చేసి పరిశీలించండి. ధన్యవాదములు.
    వేఱు వేఱుగ పోషకమ్మగు విత్తనాలను కూర్చగన్
    కోరి సాగును మేళవించుచు కూట్లు నింపగ నేర్చిరే!
    నేరమౌ నెటు , జన్యు శాస్త్రపు నీతియే నిది నేడిలన్
    బీర తీగకు గాచె మెండుగ బెండ కాయలు చూడుమా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కూటు అనే పదానికి మీరన్నట్టుగా గరిసె అనే అర్థం ఉన్నది. అలాగే తెలంగాణలో కూటమి అనే అర్థంలో గుంపు, సమూహం అనే అర్థం ఉన్నది.

      గరిసె అనే అర్థానికి....
      "తగుఁ గుసూలాభిధ గాదె యనంగను గరిసె యనఁగఁ. గీ. దద్విశేషమాఖ్యలు దనరుచుండుఁ, గొట్టు కూటు పొడక కుమి బొట్టయనఁగ" [ఆం.భా.2.240] అనే ఉదాహరణను గమనించగలరు.

      తొలగించండి
    2. కవివర్యులు గుండు మధుసూదన్ గారికి వందనములు. వివరంగా తెలిపినందులకు ధన్యవాదములు.

      తొలగించండి
  41. బీరతీగకు కాచెను బెండకాయ
    చూడమనుచు పిలువపతి చోద్యమనుచు
    సతియు నేతెంచి కాంచుచు సంబరాన
    నిరుగు పొరుగు వారలకెల్ల నింతి చూపె.

    విత్తనములను చల్లంగ విశ్వమందు
    మొలకలెత్తెను గనుమట మొదట పూసె
    పూవు పూసెను గనుమట ముందుగానె
    బీరతీగకు,కాచెను బెండ కాయ
    లచట పడతులు గనిరట యచ్చెరువున.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి