3, ఫిబ్రవరి 2017, శుక్రవారం

సమస్య - 2272 (దూరముగాఁ జరింపకుఁడు...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"దూరముగాఁ జరింపకుఁడు ధూర్తున కుత్తములన్ ద్యజింపుమా"
లేదా...
"ధూర్తునితో మైత్రి చేసి తొలఁగుఁడు సుజనున్"

37 కామెంట్‌లు: 1. ఆర్తిని గొన్నటి కథలన
  మూర్తీ, మా "రాధ" కిష్ట ముండదు వేయన్,
  వార్తలు కావలె నన్నన్,
  ధూర్తునితో మైత్రి చేసి తొలఁగుఁడు సుజనున్ !

  జిలేబి
  (కొంపలు మునుగుతాయేమో గోవిందా రాధా క్షమించేయ్ :))

  రిప్లయితొలగించండి
 2. అందరికీ శుభోదయం!


  వార్తల కెక్కుచు మిక్కిలి
  కీర్తింగొను కోర్కె మీర గెలువగ పదవుల్
  యార్తిని సచివుల యండను
  ధూర్తునితో మైత్రి జేసి తొలగుడు సుజనున్!


  త్వరలో జరుగబోయే యెన్నికల సందర్భంగా!

  రిప్లయితొలగించండి
 3. ఉత్తర ప్రత్యుత్తరములు
  తత్తర లేకనె జిలేబి తాలిమి తోడన్
  యుత్తమమగు పద్యతతుల
  చిత్తమలర జేయునుగద ఛీర్సు నెనరులన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. సీతా దేవికి నమనము
   యేతా వాతా జిలేబి యేదో వ్రాయన్
   మాతా, సహృదయు లగుచున్
   చైతన్యము జేర్చిరోయి చక్కగ నేర్వన్ !


   సావేజిత
   జిలేబి

   తొలగించండి


  2. బాగుందీ, యభినందన
   లౌ, గురువుల భుజము తట్టి లౌక్యపు మెరుగుల్,
   క్రీగంట సవరణల చే
   ర్పౌ, గాడిని బెట్టు శంకరాభరణమ్మూ !

   జిలేబి

   తొలగించండి
 4. ఆర్తుల రక్షణ కొఱకు త్రి
  మూర్తుల నెదురించ బూని మోక్షము నొసగెన్
  కర్తవ్యము బంధింపగ
  ధూర్తునితో మైత్రి చేసి తొలఁగుఁడు సుజనున్

  "Whoever saves one life saves the world entire." 

  ...Schindler's List

  రిప్లయితొలగించండి
 5. ఆర్తిగ సన్నిధి జేరిన
  ధూర్తునితో మైత్రి చేసి తొలఁగుడు సుజనున్
  చిత్తము మార్చగ నాతని
  వార్తా వహుడని బుధులు పలుకుచు నుండన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వరి సోదరిగారికి నమస్సులు:
   మూడవ పాదములో ప్రాస...

   తొలగించండి
  2. అవునుగదా !ధన్య వాదములు
   ------------------------------
   ఆర్తిగ సన్నిధి జేరిన
   ధూర్తునితో మైత్రి చేసి తొలఁగుఁడు సుజనున్
   కీర్తిని పెంచగ నాతని
   వార్తలు వినిపించు నంట పలు రీతులనన్

   తొలగించండి
 6. డా.పిట్టా సత్యనారాయణ
  స్ఫూర్తియె రావణ వాజ్ఞ్ముఖ?
  "మార్తిని బ్రార్థనల కలన నరయక పగలన్
  బూర్తిగ భగవద్వేషిగ
  ధూర్తునితో మైత్రి(నెరపి)జేసి తొలగుడు సుజనున్!"
  క్రూరపు చే(జే)ష్ట నెన్నుకొన గూటమి గావలె నాశయార్భటాల్
  బూరణ గాగ హింసలను బొల్పుగ కీడును మూడ జూడ నా
  మారణ కాండ లాడెను*సమానుడు జేసెడి బోధ యిట్టిదౌ
  "దూరముగా జరింపకుడు ధూర్తున కుత్తములన్ త్యజింపుమా!"
  (*ఒసామా బిన్ లాడెన్ టెర్రరిస్ట్)ఇణ్గ దొరుకలేదు.

  రిప్లయితొలగించండి
 7. గుర్తించక పొరబాటున
  ధూర్తునితో మైత్రి చేసి,తొలఁగుడు, సుజనున్
  కర్తవ్య బోధకున్నను
  వర్తించిన గీతఁ జెప్పి పార్థుని జేయున్

  రిప్లయితొలగించండి
 8. పూర్తిగ చెడిపోదురుగా
  ధూర్తునితో మైత్రిచేసి---తొలగుడు---సుజనున్
  ఆర్తిని చేరుము, పొందుము,
  కీర్తియు, సచ్ఛీలతలును, క్షేమ సుఖంబుల్

  రిప్లయితొలగించండి
 9. మూర్తీ ! యేమని యంటివి
  ధూర్తుని తో మైత్రి జేసి తొలగుడు సుజనున్
  ధూర్తుని వోలెను నీవును
  గర్తవ్యపు బోధనమ్ము గావించితివా ?

  రిప్లయితొలగించండి
 10. నేరక యన్యు వస్త్రములు నీటను ముంచినఁ దాప మొందుచుం
  బారగ నేమి లాభము సభద్ర మనమ్మున శాంతుఁ జేయగా
  గోరిన యార్ద్ర వస్త్రములఁ గోపము నందున నున్న వానికిన్
  దూరముగాఁ జరింపకుఁడు ధూర్తున కుత్తములం ద్యజింపుడీ

  [ఉత్తములు = ఆర్ద్రములు; ధూర్తునకు + ఉత్తములు = ధూర్తున కుత్తములు : ధూర్తునకు తడిసినవి]


  వర్తిలిచు నెల్ల వేళల
  ధూర్తపుఁ గార్యములఁ బల్కుదు రసురు లిట్లున్
  నర్తన విభవుం డభవుడు
  ధూర్తునితో మైత్రి చేసి తొలఁగుఁడు సుజనున్

  [ధూర్తుఁడు = శివుడు (సూక్ష్ముడు)]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పూజ్యులు !సుకవీంద్రులు ! శ్రీ పోచిరాజు కామేశ్వరరావు గారికి నమస్కారములతో శిష్యుని విన్నపము!
   దయచేసి నా పద్యమును చూడగలరు🙏🏻🙏🏻
   కీర్తిని బెంచెడి రణముల
   నార్తినెరింగిన దయార్దృ నాయక విభుడున్
   స్మార్తముగ సంధి గోరెడి
   ధూర్తునితో మైత్రి చేసి తొలఁగుఁడు సుజనున్

   తొలగించండి
  2. సునీల్ బాబు గారు మీ భావమవగతము కాలేదు నాకు. దయార్ద్ర సాధువు. నాయకుడు విభుడు ఇంచుమించు సమానార్థకములు. "స్మార్తముగ" ఏ భావము తో వాడారు?

   తొలగించండి
  3. 🙏🏻🙏🏻🙏🏻
   ధర్మశాస్త్ర ప్రకారమని నా భావన.
   తప్పయిన మన్నించ మనవి🙏🏻

   తొలగించండి
  4. ధర్మశాస్త్రము ప్రకారము సంధి కోరువానిని ధూర్తుడనము కదా. దయార్ద్ర హృదయుడు / దయార్ద్ర దృష్టి అనవచ్చును గాని దయార్ద్ర నాయకుడు/ దయార్ద్ర విభుడు అనడము సరి కాదు. భావము లో మరింత స్పష్టత వచ్చు నట్లుగ సవరణ చేసిన మంచిది.

   తొలగించండి
  5. గురువు గారికి కృతజ్ఞతాభివందనములు🙏🏻🙏🏻🙏🏻🙏🏻

   తొలగించండి
  6. ధూర్తుని పంచన జేరక
   ధూర్తుని గోరిక నెరపక ,దుస్థితి యందున్
   ధూర్తుని సిరినాశించక
   ధూర్తునితో మైత్రి చేసి తొలఁగుఁడు సుజనున్

   తొలగించండి
  7. సుజనుడని వ్యంగ్యార్థముతో ధూర్తుని మిత్రత్వమున తొలగుమన్న మీపూరణ మద్భుతముగా నున్నది.

   తొలగించండి
 11. దూరముగా జరింపకుడు ధూర్తున కుత్తముల న్ ద్యజింపుమా
  పౌరులు నీదు మాటలను బూర్తిగ నమ్మరు కారణంబునా న్
  దూరముగా జరింపవలె ధూర్తునకు త్తము లౌను వారిని
  నార్తిని గుండెకున్నునిచి యాదర మొప్పగ జూడ టొప్ప గున్

  రిప్లయితొలగించండి
 12. కర్తవు,భర్తవు,నీవని
  దూర్తులతో మైత్రి జేసి తొలగుడు.సుజనున్
  కీర్తించి ధర్మయుతముగ
  వర్తించుట తగు నటంచు వాకొనిరి బుధుల్

  రిప్లయితొలగించండి
 13. భారత దేశగౌరవము భగ్నమొనర్చవినీతిశక్తి పై
  పోరును సల్పగావలెను మూలముతో పెకిలింపగావలెన్
  నేరచరిత్రతో చెలగు నేతలనైనను వీడబోకుడీ
  దూరముగాఁ జరింపకుఁడు ధూర్తున కుత్తములన్ ద్యజింపుమా

  రిప్లయితొలగించండి
 14. వర్తన పాడై పోవును
  ధూర్తనితో మైత్రి చేసి తొలగడు,సుజను
  న్నర్తించిన సన్మార్గము,
  కర్తవ్యము బోధ జేసి కాపాడునిలన్

  రిప్లయితొలగించండి
 15. వర్తన పాడైపోవును
  ధూర్తునితో మైత్రి చేసి తొలగుడు, సుజను
  న్నర్తించిన సన్మార్గము,
  కర్తవ్యము బోధ జేసి కాపాడు నిలన్.

  రిప్లయితొలగించండి
 16. కోరెద నాదు మిత్రులను కూరిమితోడ సదా మెలంగుచున్
  నేరుపు సద్గుణమ్ములను నేరక తప్పులు జేయువారికిన్
  దూరముగా జరింపకుడు ధూర్తునకుత్తములన్ , ద్యజింపుమా
  మీరిక వ్యక్తిదూషణము మేలునొనర్పుము సాటివారికిన్

  వ్యర్థుడని తలవబోకుడు
  ధూర్తుని తోమైత్రి చేసి తొలగుడు సజ్జనున్
  స్ఫూర్తిగ గైకొనుచునికను
  స్వార్థము కొంతైనవీడ వచ్చును గాదే.

  రిప్లయితొలగించండి
 17. కవిమిత్రులారా,
  ఈనాటి సమస్యకు చక్కని పూరణలందించిన అందరికీ అభినందనలు, ధన్యవాదాలు.
  ఉదయం నుండి విబేధాలు విపరీతంగా తలనొప్పి... జ్వరం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
  ఈరోజు మీ పూరణలను సమీక్షించలేను. మన్నించండి.
  దయచేసి పరస్పర గుణ దోష విచారణ చేసికొన వలసిందిగా మనవి.

  రిప్లయితొలగించండి
 18. . ప్రేరణ,లాశ దోషములు పెంపొన గూర్చగ మోస పాశముల్
  ధార,నధర్మ మార్గమున దత్తత గైకొను|”మంచి పెంపుకై
  దూరముగా జరింపకుడు ధూర్తున కుత్తములన్ ద్యజింపుమా
  నేరము లంటజేయకుము నిత్యసుఖాలకు నింద లేయకన్.
  2.కర్తవ్యంబున ధర్మమ?
  ధూర్తునతో మైత్రి చేసితొలగుడు|”సుజనున్
  మూర్తిగ నెంచుచు తానో
  స్పూర్తిగ ధర్మంబునిలుపు సూచన లందున్”|


  రిప్లయితొలగించండి

 19. పిన్నక నాగేశ్వరరావు.

  ధూర్త గుణ మెఱిగిన పిదప

  ధూర్తునితో మైత్రి చేసి తొలగుడు; సుజనున్

  వర్తన మెప్పుడు హితులకు

  స్ఫూర్తిని కలిగించి సకల శుభములొసంగున్

  **********************************

  రిప్లయితొలగించండి
 20. ​​ధా​రు​​ణి యందు మానవులు ధర్మము దప్పి చరించుండి యే
  నేరములైన జేయుచును నిత్యము ​బాధల వెట్టుచుండగా
  వారలు వెట్టు బాధలను బాయగ నెంచిన లోకు​ ​లెల్లరున్
  ​​దూరముగాఁ జరింపకుఁడు ధూర్తున కుత్తములన్ ద్యజింపుమా​!

  కోరెద మిమ్ము నెప్పుడును ఘోరముగా పరుషమ్ములాడుచు
  న్నూరక నిందజేయుచు నయోమయమున్ గలిగించు దుష్టు లు
  న్నారిల దూరముండుటయె న్యాయము వేరొక దిక్కు లేనిచో
  ​​​దూరముగాఁ జరింపకుఁడు ధూర్తున కుత్తములన్ ద్యజింపుమా​!

  రిప్లయితొలగించండి
 21. గారవ మిచ్చుచుండెడిది క్లర్కుగ నౌకరి కాలదన్నుచున్
  తీరిక మెండునుండెడిది తియ్యని టీచరు జాబు వద్దనన్
  పోరుచు తల్లిదండ్రులను పోలిసు వృత్తిని స్వీకరింపగా
  దూరముగాఁ జరింపకుఁడు ధూర్తున కుత్తములన్ ద్యజింపుమా!

  రిప్లయితొలగించండి