24, ఫిబ్రవరి 2017, శుక్రవారం

సమస్య - 2292 (క్రైస్తవుల పండుగయె...)

కవి మిత్రులారా!
మహాశివరాత్రి శుభాకాంక్షలు!

ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"క్రైస్తవుల పండుగయె శివరాత్రి యనఁగ" 
లేదా...
"క్రైస్తవు లెల్ల భక్తి శివరాత్రికిఁ జేతురు శంభుపూజలన్"

65 కామెంట్‌లు:

 1. క్రైస్తు పుట్టిన దినమది వాస్తవముగ
  క్రైస్తవుల పండుగయె; శివరాత్రి యనఁగ
  శివుని పూజజేయు దినము శివ!శివ!యని,
  మతములు పలువిధము లైన మనసులొకటె!

  రిప్లయితొలగించండి

 2. హరహర శంభో శంకర !


  మండలము దినముల లోన మంచి గాను
  శుక్ర వారము యదియౌను శుభము లిడుచు
  క్రైస్తవుల పండుగయె, శివరాత్రి యనఁగ
  నేడు, నమనము నీకిది నీలకంఠ !

  జిలేబి

  ఈశాన! శంభు ! ఆనం
  దా! శంకర! శివ ! మహేశ! దహనాంబక! దే
  వేశ! దిగంబర ! ధూర్జటి !
  కాశీనాథా! కపర్ది ! ఖట్వాంగధరా !

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కంద లొదల లేరు తమరు
   కంది గురువు నొదల లేరు కచ్చితముగహా!
   వందలు వందలు వ్రాయగ
   చిందర వందరలు గావె చింతలు జిలెబీ!

   తొలగించండి
  2. జిలేబీ గారూ,
   మీ పూరణ, దాని ననుసరించి చేసిన శివస్తుతి బాగున్నవి. అభినందనలు.
   *****
   శాస్త్రి గారూ,
   'వదలు'ను 'ఒదలు' అన్నారు. 'కచ్చితముగ(న్)+అహా = కచ్చితముగ నహా' అవుతుంది.

   తొలగించండి


  3. కందము డెందపు చందము
   చందన గంధము జిలేబి సారము లద్దన్
   నందన వనమున పద్యము
   కెందమ్మియతావి గూడి కెంపులు జేర్చున్ :)

   జిలేబి

   తొలగించండి
 3. లింగ రూపము దాల్చెను జంగ మయ్య
  ప్రమధ గణములలో నొకడు ప్రభువు యేసు
  మతము వేరైన దేవుని మతము వొకటె
  క్రైస్తవుల పండుగయె శివరాత్రి యనఁగ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాగుంది మీ పూరణ (అనక తప్పలేదు).
   రెండవ పాదంలో గణదోషం. 'ప్రమథ గణముల నొక్కడు' అనండి. 'ఒకటి'ని 'వొకటి' అనరాదు. 'మత మొకటె కద' అనండి.

   తొలగించండి
  2. లింగ రూపము దాల్చెను జంగ మయ్య
   ప్రమద గణముల నొక్కడు ప్రభువు యేసు
   మతము వేరైన దేవుని మతమొక టెగ
   క్రైస్తవుల పండుగయె శివరాత్రి యనగ

   తొలగించండి
 4. డా.పిట్టా సత్యనారాయణ
  ప్రాణవట్టము పైనున్న ప్రకటలింగ
  మింక క్రిందికి జారెనే మించి గద్దె
  చిహ్నమే నిరీశ్వర తత్త్వ చింతనలకు
  క్రైస్తవుల పండుగయె శివరాత్రి యనగ!

  రిప్లయితొలగించండి
 5. డా.పిట్టా సత్యనారాయణ
  సుస్తవమెన్న యోగులట జూచిరి చుక్కను రాత్రివేళనే
  మస్తకమందు యేసు నుతి"మాగి"యనంబడు దాస పంక్తికిన్
  విస్తర శంభు బుట్టుకయు వే నడిరాత్రియె గాదె జీవులై
  క్రైస్తవులెల్ల భక్తి శివరాత్రికి జేతురు శంభు పూజలన్!

  రిప్లయితొలగించండి
 6. డా.పిట్టాసత్యనారాయణ
  Magi॥the wise men from the East who brought gifts to the infant Christ(Matt.2:1)మాగి అనుపదమునకు వివరణ.

  రిప్లయితొలగించండి
 7. రిప్లయిలు
  1. స్వస్తిని కోరి సర్వమత సారమునొక్కటిగా నెరుంగుచున్
   నిస్తుల దైవ తత్వమును నేర్చి చెలంగు మహాత్ములైన యా
   వాస్తవమైన హిందువులు బౌధ్ధుల తోడ మహమ్మదీయులున్
   క్రైస్తవు లెల్ల భక్తి శివరాత్రికిఁ జేతురు శంభుపూజలన్

   తొలగించండి
 8. భక్తి యుతులౌచు హిందువుల్ పరమశివున
  కవని నభిషేకములు సేతు రహము నిశయు
  తన్మయత్వాన నీనాడు చిన్మయునకు
  క్రైస్తవుల పండుగయె శివరాత్రి యనగ?

  వాస్తవ మైన దియ్యదియ భాగ్యము గోరుచు నెల్లహిందువుల్
  మా స్తుతులంది నీవిపు డుమాపతి శంకర! మమ్ము గావవే
  యస్తు శుభంబు మీకనవె యంచును బ్రార్థన జేతు, రెక్క డే
  క్రైస్తవు లెల్ల భక్తి శివరాత్రికి జేతురు శంభుపూజలన్?

  హ.వేం.స.నా.మూర్తి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రశ్నార్థకంగా మార్చిన మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 9. క్రీస్తు జన్మదినంబగు క్రిస్మసుయన
  క్రైస్తవుల పండుగయె,శివరాత్రియనగ
  శివున కభిషేకమొనరించి చిన్మయముగ
  నిసిని జాగారముందురువసుధజనులు!!!

  వందనములు పరమేశ్వర
  వందనములు వైద్యనాధ బాలేందుధరా
  వందనములు గంగాధర
  వందనములు గౌరినాధ వందనశతముల్!!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ, దాని ననుసరించిన శివస్తుతి బాగున్నవి. అభినందనలు.
   'క్రిస్మసు+అన' అన్నపుడు యడాగమం రాదు. 'క్రిస్మ సనగ' అనండి.

   తొలగించండి
 10. ఓం నమశ్శివాయ

  శివానుగ్రహ ప్రాప్తిరస్తు.

  కందము:
  వట్టి దిగంబరుడనగా
  బట్టలులేవంచునీకు పలుకుదురు హరా!
  గట్టిగగన కుదురుగనే
  బట్టబయలు దిశలమధ్య భవ! నీరూపే.

  కందము:
  లయకారుడ వీవంచును
  భయమును బొందేరు జనులు, పరికించినచో
  లయబద్ధముగా జగతిని
  స్వయముగనాడింతువీవు భవ! నటరాజా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాగున్నవి మీ రెండు పద్యాలు. అభినందనలు.
   'భయమును బొందెదరు...' అనండి.

   తొలగించండి
 11. క్రీస్తు పుట్టిన దినమున గృహము లందు
  క్రైస్తవుల పండుగయె, శివ! రాత్రి యనగ
  మేరి గర్భాన జనియించి చేరి కొలచు
  వారిని పునీతులన్ జేసి దారిఁ జూపు

  రిప్లయితొలగించండి
 12. క్రిస్మ సన రక్షణన్ఁగూర్చి క్షేమమిడెడు
  క్రైస్తవుల పండుగయె--శివరాత్రి యనగ
  శైవ మహిమల హిందూత్వ భావగరిమ
  భక్తులభిషేకముల్ సల్పు వైభవంబు

  రిప్లయితొలగించండి
 13. మహాశివరాత్రి పర్వదినాన అందరికి
  శుభాకాంక్షాపూర్వక నమస్కారములతో,

  “క్రైస్తవ” మన్న శంభునుతిగాఁ బదకోశములెల్లఁ జెప్పు; లో
  కస్తవనీయనాథుఁ డగుఁ “గ్రా”క్షర, “మై” పదవాచ్యుఁ డీశుఁడున్
  నిస్తులభంగిఁ గొల్చిన ననిష్టములన్ హరియించు నంచుఁ - ద
  త్క్రైస్తవులెల్ల భక్తి శివరాత్రికిఁ జేతురు శంభుపూజలన్.

  “క్రః కరః శరభః వ్యాఘ్రో నాథః” - సౌభరికృతమైన ద్వ్యక్షరకాండము.
  “ఐకారః స్యా న్మహేశ్వరః” - మహాక్షపణకుని ఏకాక్షరకోశము.
  క్రై (క్ర+ఐ) స్తవులు – సర్వేశ్వరుడైన పరమేశ్వరుని సన్నుతించువారు.

  సప్రశ్రయంగా,
  ఏల్చూరి మురళీధరరావు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. 'క్రైస్తవు'లంటే అబ్బురపడే అర్థాన్నిచ్చి మనోజ్ఞమైన పూరణ చెప్పారు. మీరు ఇక్కడికి తరచుగా రారు. వచ్చారంటే ఏదో విశేషం తప్పక ఉంటుంది. ధన్యవాదాలు.

   ఏమని నుతియింతును మీ
   సామర్థ్యము; నూతన పదసంపన్నత; మా
   కైమోడ్పు లందుకొనుఁడు;భ
   లే మురళీధర! త్వదీయ లేఖినికి నతుల్.

   తొలగించండి

  2. ఏల్చూరి వారా మజాకా మరి

   నమో నమః

   మీ పద్యం చదివితే ఆర్థడాక్స్ క్రైస్తవ సాంప్రదాయం లో రాబోయే మండే - clean Monday ఎలా వచ్చి ఉంటుందో -( అదిన్నూ శివరాత్రి తరువాయే వస్తూంది ) అన్న ఆలోచన వస్తోంది


   చీర్స్
   జిలేబి

   తొలగించండి
  3. క్రైస్తవ పదానికి అత్యద్భుతమైన వ్యుత్పత్త్యర్థమును ప్రసాదించిన శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారికి నమశ్శతములు.

   తొలగించండి
  4. మాన్యులు శ్రీ శంకరయ్య గారికి,
   జిలేబి గారికి,
   హరి వేంకట సత్యనారాయణమూర్తి గారికి

   మీ ప్రోత్సాహానికి హృదయపూర్వక ధన్యవాదాలు!

   తొలగించండి
 14. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. పండుగయె లోని “అయెను” పద ప్రయోగ విషయమై “ బెదరి పలాయితుం డయెను పృచ్ఛకులం గనఁగన్ వధానియే”
  సమస్య రోజున కూడ ప్రస్తావించితిని (19/2/2017).
  పరిశీలించి సందేహ నివృత్తి చేయ గోర్తాను.
  క్రియా. 100.
  అగునకు వక్రంబు గూడుచో దీర్ఘం బగు.
  వక్ష్యమాణంబు ద్విత్వంబు.
  ఆయెను - అయ్యెను, ఆయెడును - అయ్యెడును.
  అయి, అయిరి లు సాధువులు. వక్రము (ఎ) లేక పోవుటచే దీర్ఘము లేక ద్విత్వము రాదు.


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మిత్రులు కామేశ్వర రావు గారికి,
   శివరాత్రి సందర్భంగా దేవాలయ దర్శనంలో వ్యస్తుణ్ణై ఉండికూడా మీ సందేహం విషయంలో వెంటనే స్పందించవలసి వచ్చింది.
   మీరన్నట్టు 'పండుగ+అయె' అనుకుంటే అక్కడ సంధి లేదు. యడాగమం వస్తుంది. ('అయె' అనడం అసాధువని మొన్ననే మీ వ్యాఖ్యవల్ల గుర్తుకు తెచ్చుకున్నాను కూడా!)
   కాని నేనిక్కడ 'పండుగ+ఎ(ఏ)' అనే ఏవార్థాన్ని ప్రయోగించాను. గమనించ ప్రార్థన.

   తొలగించండి
  2. 'శివరాత్రి అంటే క్రైస్తవుల పండుగే' అని నా భావం!

   తొలగించండి
  3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. మీకు శ్రమ కలిగించి నందులకు క్షంతవ్యున్ని.

   తొలగించండి
 15. క్రైస్తవులపండగయెశివరాత్రియనగ
  క్రైస్తవులుమరిబౌధ్ధులుముస్లిములును
  శివునివేడుచుపండుగజేసికొనగ
  దగును,శంభుడందరివాడెతరచిచూడ

  రిప్లయితొలగించండి
 16. శివ రాత్రి పర్వ దినమున
  శివ శివ యని పలుకు నంత శివ సాయుజ్యం
  బవ లీలగ లభియించును
  భవ భవ యని పలుక రాదె భాగ్యము కొరకై

  శివరాత్రిపర్వదినమున
  పవలంతయుబూజజేసిభర్గునిభక్తిన్
  చివరనయభిషేకమ్మును
  సవినయముగజేయునెడలసంతసమొందున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ, దాని ననుసరించి శివరాత్రి ప్రాముఖ్యతను తెలిపే పద్యాలు బాగున్నవి. అభినందనలు.
   'చివరకు నభిషేకమ్మును' అనండి.

   తొలగించండి
 17. క్రీస్తునినే ధర న్నొగిని గేలును మోడ్చుచు బూజ సేతురే
  క్రైస్తవు లెల్ల భక్తి, శివరాత్రికి జేతురు శంభు పూజలన్
  వాస్తవ మొప్పగా బ్రజలు భక్తియు రక్తియు దోడు గల్గగా
  నిస్తులు డైన శంకరుని నిక్కపు పుట్టిన రోజు గావుతన్

  రిప్లయితొలగించండి
 18. భూజనుల పాప మణచగ భూతలమున
  మేరి మాతకు నింపుగ మేలు గూర్చ
  క్రీస్తు పుట్టిన దర్థ రాత్రి యగుట నల
  క్రైస్తవుల పండుగయె శివరాత్రి యనఁగ

  [శివరాత్రి = శుభరాత్రి]


  మస్తక మందు చంద్రుని త్రిమార్గను గౌరిని నుంచ మేను నం
  బ్రస్తుత కాల మెల్లరును భారత దేశము నందు, వీడగన్
  నాస్తికు లైన వారల వినాశన బుద్ధులు నా మతేతరుల్
  క్రైస్తవు లెల్ల, భక్తి శివరాత్రికిఁ జేతురు శంభుపూజలన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆకాశ గంగకు హద్దులు సూపించి నడినెత్తి నుంచిన జడల ఱేడు
   నగరాజ కన్యకు సగభాగ మిచ్చిన యర్ధ నారీశ్వరుం డంద గాడు
   గజ దైత్యు కోరిక కరుణించి తీర్చిన జగ దభి నుత గజ చర్మ ధారి
   శరణాగతుండు శశాంకు గాచిన మేటి సౌజన్య మూర్తి యా చంద్రమౌళి


   గరళమును మ్రింగి జగములఁ గరుణఁ గాచె
   హద్దు లవి లేవు వరముల పద్దు లందు
   దుష్టు డైనఁ గాచు పొగడ్త నిష్టు డైన
   హరుని గుణముల నెంచగ దరమె జగతి

   ఇల్లరికపు టల్లుడు మరి
   మల్లుం డట వల్లకాటి మదనాంతకుడే
   విల్లంది పురత్రయముం
   దల్లడిల మరల్చె యమసదన మొక్కసెలన్

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు, వాటిని అనుసరించిన శివమాహాత్మ్యం తెలిపే పద్యాలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  3. ఆర్యా!
   మీ శివమాహాత్మ్యం చాలా బాగున్నది. ప్రణామములు.

   తొలగించండి
  4. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
   ఆర్యా మూర్తి గారు ధన్యవాదములు. చిరకాల దర్శనము. సంతోషము.

   తొలగించండి
 19. క్రొవ్విడి వెంకట రాజారావు:

  పరమేశ్వర శశిభూషణ
  గిరికార్ముక ఫాలనేత్ర గిరిజారమణా!
  సురసన్నుత విషమేక్షణ
  కరుణాకర నన్నెలమిని గావుము హరుడా!

  నిరతము నీ నామమ్మును
  సరవిని పాడుచు భజించి సాగెడి నన్నున్
  దురితవిమోచను జేయుచు
  పరినిర్వృత్తిని కదించి వఱలుము హరుడా!

  సమస్యాపూరణ పద్యం:

  సుకృతియౌ క్రీస్తు వెలసిన సుదిన మదియ
  క్రైస్తవుల పండుగయె; శివరాత్రి యనగ
  లింగమూర్తి యుద్భవమొంది రీతిగూడి
  భక్తుల నరయ నేతెంచు భవ్య దివమె

  రిప్లయితొలగించండి
 20. వ్హాట్సప్ పూరణ:

  "మంచి శుక్ర వార" మని పూజించబడెడి
  శిలువ వేసిన రోజేది విలువ తోడ?
  వరములిడు శివుడే రోజు గరళముగొనె?
  క్రైస్తవుల పండుగయె; శివరాత్రి యనఁగ;


  "మంచి శుక్రవారము" = Good Friday

  రెండూ మంచి రోజులే! అంతా మన మంచికే!!!

  రిప్లయితొలగించండి
 21. జీససవతరించిన మార్గ శీర్ష రాత్రి
  క్రైస్తవుల పండుగయె,శివ రాత్రి యనగ
  సకల శుభముల నిచ్చెడి సాంబశివుడు
  లింగ రూపాన సాక్షాత్క రించు రాత్రి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. క్రైస్తవులు హిందువులు ఎవరైనఒకటె
   ఎ ట్లు పిలచిన దైవమొకటే ఎవ్వ రైన
   ఏపవిత్ర మైనదినము ఏది అయిన
   క్రైస్తవుల పండుగయె శివరాత్రి యనఁగ

   తొలగించండి
  2. vadduri వారూ,
   మీ ప్రయత్నం ప్రశంసార్హం.
   'హిందువులు+ఎవరు, దినము+ఏది' అన్నపుడు సంధి నిత్యం, విసంధిగా వ్రాయరాదు. రెండవ పాదంలో గణదోషం. మరోసారి ప్రయత్నించండి.

   తొలగించండి
 22. గురువులు శ్రీకంది శంకరయ్య గారికి మరియి నితర కవిమిత్రులకు శ్రీమహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు.

  శ్రీరామార్చిత పాదపద్మయుగళశ్రీమంత సంశోభితా
  గౌరీసేవిత విశ్వరక్షణకళా కారుణ్య విభ్రాజితా
  ప్రారబ్ధాద్యఘనాశకా మహిత విప్రశ్రేణి సంపూజితా
  నోరారన్ నుతియింతు గావుముమిదెయెందున్ భక్తరక్షాగ్రణీ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మంచి స్తోత్రపద్యం. అభినందనలు.
   'గావు(ము)మిదె' ... ము అదనంగా టైపయింది.

   తొలగించండి
 23. .వినుము పరమేశు నందున గనగఏసు
  శుక్రవారము గావున చూడగాను
  చర్చి లందున ప్రార్థనల్ జరుగు చుండ?
  క్రైస్తవుల పండుగయె|శివరాత్రి యనగ| {శుక్రవారముగానక్రైస్తవులు,శివరాత్రిగాన హిందువులుపండుగే|}
  2.వాస్తవ మైన సత్యమిది భక్తిగ చర్చిన శుక్రవారమున్
  పస్తులు యున్న హిందువులభావనలే పరమేశు తత్వమే
  క్రైస్తవులెల్ల యీదినము గానము నందున యేసునెంచగా?
  క్రైస్తవులెల్ల భక్తి శివరాత్రికిజేతురు శంభు పూజలున్| {పరమేశులోయేసుహిందువులకు,క్రైస్తవులకుపండుగే}

  రిప్లయితొలగించండి
 24. బాలయేసు పుట్టినరోజె వసుధయందు
  క్రైస్తవుల పండుగయె శివరాత్రి యనగ
  జాగరమును చేయుచు ప్రజ జగతి లోన
  భవుని సతముకొలుచునట్టి పండుగయ్యె.

  జనవరి మొదటి దినమది జగతి యందు
  క్రైస్తవుల పండుగయె శివరాత్రి యనగ
  భక్తి శ్రద్ధలతోడను భరత జాతి
  పూజలొనరించు చుండును పుడమి యందు.

  బీరతీగకు కాచెను బెండకాయ
  చూడమనుచు పిలువపతి చోద్యమనుచు
  సతియు నేతెంచి కాంచుచు సంబరాన
  నిరుగు పొరుగు వారలకెల్ల నింతి చూపె.

  విత్తనములను చల్లంగ విశ్వమందు
  పూవు పూసెను గనుమట ముందుగానె
  బీరతీగకు,కాచెను బెండ కాయ
  లచట పడతులు గనిరట యచ్చెరువున

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 25. కాస్తయొ కూస్తయో తినుచు కమ్మని కేకులు కోడి మాంసమున్
  మస్తుగ నాడుచుండెదరు మందులు గొట్టుచు క్రిస్మసందునన్
  క్రైస్తవు లెల్ల;...భక్తి శివరాత్రికిఁ జేతురు శంభుపూజలన్
  పస్తులు మాడుచున్ సతులు భారిగ మేయగ భర్తలెల్లరున్

  రిప్లయితొలగించండి